దూరంగా వెళ్ళడం – 2 235

” నువ్వే ఇలా ఒంటరిగా ఉంటే లేని పోనీ ఆలోచనలు వస్తాయి, వెళ్లి వంట పని అది చూస్కో. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది”

అత్తయ్య ఆలా అంది గాని మేనకా బాధ వెనక ఇంకేదో కారణం ఉంది అనుకుంది.. కానీ బయటకి ఎం మాట్లాడలేదు..

మేనక మెల్లిగా పెరడు లోకి వచ్చింది పెద్ద పెద్ద పొయ్యిలు అమర్చి ఇంట్లో బంధువులకి సర్వం సమకూరేలా వండేస్తున్నారు.. ఇదంతా ఇప్పుడు రంగయ్య చూస్తున్నాడు..

అడుగు లో అడుగు వేసుకుంటూ ఏమేమి వండుతున్నారు అని అన్ని చూస్తూ నడుస్తూ మేనక వెడుతుండగా, “తల్లి మీరెందుకు అమ్మ ఈ పొగలో ఇంత హడావిడిలో ఇలా వచ్చారు నేను చూసుకుంటాగా” అన్నాడు రంగయ్య..

“పర్లేదు ఇంట్లో చాలా ఒంటరిగా ఉంది రంగయ్య అందుకే ఇలా వచ్చాను.. ఇంతకీ ఎం వండుతున్నారు ఇవాళ భోజనానికి ” అంటూ అక్కడున్న కేరట్ ని తీసుకుని తన ఎర్రటి పేదల మధ్య తెల్లటి పళ్ళ మధ్య చిన్నగా కొరుక్కు తింటుంది..

” ఆ రెండు మాసం వంటకాలమ్మ ఇదిగో ఇక్కడ పప్పు మరియు సాంబారు అది ఆ మూలాన చట్నీ ఇంకా చారు ఇదిగో నీ ముందున ఈ మూడు వంకాయ ములక్కాయ ఆలుగడ్డ కూరలు..”
చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు రంగయ్య..

అంతలో అక్కడికి వచ్చిన నాని కంగారుగా మళ్ళి వెనక్కి వెళ్ళిపోయాడు..

” ఒరేయ్ నాని ఇలా రారా ఎప్పుడూ పని పని ” అంటూ పిలిచాడు

” వీడు బాగా చదువుకున్నాడు అమ్మ అబ్బాయిగారికి చెప్పి ఈ ఊర్లోనే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి.. నా మనవడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు ” అంటూ కాస్త గర్వంగా చెప్పాడు..

” అవునా ఇంగ్లీష్ కూడానా” అంటూ కాస్త కళ్ళు పెదవి చేసి వెక్కిరించినట్లుగా చూసింది మేనక నాని ని..

Hello Mr … My Self Menaka. What’s Your Name? Please Don’t Be Shy And Thanks For Being Kind And Not Letting Me Down In My Family.

“It’s My Duty to Protect the Beauty.. I Mean You .. Please You people Are Very Rich And we just earn peanuts and I Respect Woman.So I’ll Never Let You Down.”

రంగయ్య కి అర్ధం కాలేదు కానీ చాలా ఆనందం వేసింది..ఆలా చూస్తూ ఉండిపోయాడు..

“I Hope You Behave like a Normal person And Stop Being Shy With me..Please I Don’t Have a Friends here to talk”

“And not shying but Just Feeling Guilty ..”

“No need to feel guilty..You have not came there willingly it was like a sudden moment for us so leave it forget about it”

ఆలా మాట్లాడేసరికి నాని కి కాస్త ధైర్యం వచ్చేసి చిన్నగా నవ్వేసాడు..

“గుడ్ ఆలా నవ్వుతూ ఉండాలి”