నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 2 90

మరుసటి రోజు ఎయిర్ పోర్ట్ లో రమణ అశ్వత్థామ తన ప్లాన్ లో ఇరుకున్నాడో లేదో చెక్ చేసుకోవాలి అని చూశాడు ఆ తర్వాత అశ్వత్థామ కాబ్ నుంచి కిందకు దిగడం చూసి తను ఫ్లయిట్ ఎక్కే వరకు ఎదురు చూశాడు ఆ తర్వాత తను కూడా అదే ఫ్లయిట్ లో చెన్నై వెళ్లాడు రమణ పక్క సీట్ లో ఒక పెద్ద మనిషి రెండు కిడ్నీ ఫెయిల్ అవ్వడం తో ఆయనకి ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంచారు, ఆ తర్వాత రోజు ఉదయం అశ్వత్థామ తో కలిసి ఫ్లయిట్ దిగిన రమణ అదే అశ్వత్థామ నీ నీడ లా వెంటాడుతు ఉన్నాడు కానీ బయటికి వెళ్లగానే తన ఫ్రెండ్స్ వచ్చే సరికి అద్దాలు తీసి అందరినీ పలకరించడం మొదలు పెట్టాడు ఆకాశ్ రమణ అది చూసి షాక్ అయ్యాడు కానీ రమణ కీ తెలియని విషయం ఏంటి అంటే తన పక్కన కూర్చుని ఇంత సేపు చెన్నై వరకు వచ్చిన వ్యక్తే అశ్వత్థామ.

రమణ ఎందుకైన మంచిది అని ఆకాశ్ నీ ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు దాంతో కాబ్ లో ఆకాశ్ వెళ్లుతున్న కార్ నీ వెంబడిస్తూ వెళ్తుండగా అశ్వత్థామ మాత్రం సంగీత తో కలిసి వేరే కార్ లో రామేశ్వరం బయలుదేరాడు ఆకాశ్ నీ ఫాలో అవుతున్న రమణ ఆలోచన లో పడ్డాడు అసలు తను వేసిన స్కెచ్ లో అశ్వత్థామ చిక్కుకోవడానికి 90 శాతం అవకాశం ఉంది కానీ ఎలా తప్పించుకున్నాడు తెల్లవారు జామున చెన్నై కీ ఉన్నది ఒకే ఒక్క ఫ్లయిట్ అయినా కూడా అశ్వత్థామ ఎలా తప్పించుకున్నాడో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు రమణ అసలు ఏమీ జరిగింది అంటే.

సంగీత ఎప్పుడైతే ఆకాశ్ గురించి చెప్పిందో అశ్వత్థామ కీ అర్థం అయ్యింది అది కూడా సుమా సోషల్ మీడియా అకౌంట్ నుంచి దాంతో రమణ తన కోసం ఏదో పథకం వేశాడు అని దాంతో రమణ తను అనుకున్నటే అంతా జరుగుతుంది అని బ్రమ పడేలా రాజ తంత్రం చేశాడు అశ్వత్థామ చెన్నై కీ ఏ ఫ్లయిట్ లో ఆకాశ్ వెళ్లుతున్నాడో తెలుసుకోవడం కోసం ఆకాశ్ నెంబర్ ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని దానికి ఒక వైరస్ ఉన్న మెసేజ్ పంపింది సంగీత ఆ తర్వాత ఆకాశ్ ఆ మెసేజ్ తెరవగానే వెంటనే తన ఫ్రెండ్స్ కీ సంబంధించిన మెసేజ్ లు రేపు తను వేళ్లబోయే ఫ్లయిట్ టికెట్ కీ సంబంధించిన అని వివరాలు వచ్చాయి, దాంతో రమణ వెళ్లుతున్న వివరాలు అని అతని మెయిల్ ఆధారం గా తెలుసుకున్నారు ఆ తర్వాత సంగీత నీ రమణ పక్క సీట్ లో తనకు “అన్వరుద్దీన్” అనే పేరు తో టికెట్ బుక్ చేయమని చెప్పాడు ఆ తర్వాత సంగీత నీ ఆసియా పేరు తో తన సీటు కు పక్క వరుస క్రమంలో బుక్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఆకాశ్ నెంబర్ కీ ఫోన్ చేసాడు అశ్వత్థామ తన గొంతు మార్చాడు, పేరు మార్చాడు.

ఆకాశ్ : హలో ఎవరూ

అశ్వత్థామ : హలో నా పేరు అన్వరుద్దీన్ నేను చెన్నై లోని ఒక University ప్రొఫెసర్ నీ నేను తెలుగు వాడినే

ఆకాశ్ : చెప్పండి సార్ నాతో ఏంటి పని

అశ్వత్థామ : బాబు మొన్న మీరు చేసిన ఒక నాటకం మేము యుట్యూబ్ లో చూశాను మా కాలేజీ లో మీరు వచ్చి ఏమైనా షో చేయగలరా

ఆకాశ్ : వావ్ నా టాలెంట్ పక్క రాష్ట్రం కీ కూడా పాకింది కానీ మా బాబు కళ్లకు కనపడలేదు సరే సార్ వస్తాను ఎలాగో రేపు నేను చెన్నై వస్తున్న

అశ్వత్థామ : అవునా మంచిది బాబు మీరు కథ ఏమైనా లేదా కారెక్టర్ గురించి తెలుసుకుంటారా

ఆకాశ్ : హా చెప్పండి సార్ I am excited

అశ్వత్థామ : ఇది నేను స్వయంగా రాసిన కథ ఇందులో విలన్ హీరో అతనికి కళ్లు ఉండవు 60 సంవత్సరాల ముసలి వాడు కానీ చాలా తెలివైన వాడు అంటూ తన గురించి ఒక పాత్ర లాగా చెప్పాడు

ఆకాశ్ : వావ్ చాలా కొత్తగా చాలా ఛాలెంజింగ్ కారెక్టర్ నేను చేస్తాను నేను అలాంటి కారెక్టర్ ఏ రేపు చెన్నై లో చేయబోతున్న ఉదయం 9:30 కీ హోటల్ అశోక్ లో అదే గేట్ అప్ లో వస్తున్న మీరు వచ్చి చూడండి అని చెప్పాడు.

దాంతో అశ్వత్థామ ఫోన్ పెట్టేసి సంగీత తో “వీడు కచ్చితంగా గొప్ప నటుడు అవుతాడు వీడికి ఆ dedication ఉంది” అన్నాడు ఆ తరువాత సంగీత ఒక బురఖా వేసుకొని అశ్వత్థామ కీ ఒక విగ్గు పెట్టి ఒక దొంగ మెడికల్ రిపోర్ట్ తీసి రమణ ముందే వస్తాడు అని గ్రహించిన అశ్వత్థామ సంగీత తో కలిసి రమణ I’m ఇంటి ముందు తమ కార్ లో ఎదురు చూస్తున్నారు అప్పుడే రమణ విజయ తో కలిసి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు వాళ్ల ప్రతి అడుగులో అడుగు వేస్తూ వెళ్లారు ఆ తర్వాత రమణ ఒక కాఫీ షాప్ లో ఉన్న రమణ ఎంట్రీ వైపు చూస్తూ ఉన్నాడు తనని వెనక నుంచి సంగీత చూస్తూ ఉంది అప్పుడే అనుకున్నటు గా ఆకాశ్ అశ్వత్థామ లాగే వేషం వేసుకొని వచ్చాడు.

(ప్రస్తుతం)