నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 2 90

(6 నెలల తరువాత)

హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో సిఐ గా ఉద్యోగం లో చేరాడు ఆకాశ్ అశ్వత్థామ లాంటి క్రిమినల్ నీ పట్టించినందుకు మెచ్చి గవర్నమెంట్ ఆకాశ్ కీ సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చారు దాంతో ఆకాశ్ వాళ్ల నాన్న హ్యాపీ కానీ ఆకాశ్ కీ మాత్రం ఆ ఉద్యోగం ఇష్టం లేదు అని ఆయనకి తెలుసు కానీ ఎందుకో తన కొడుకు ఉద్యోగం చక్కగా చేయడం ఆయనకు బాగా నచ్చింది ఆకాశ్ వేగం నచ్చి సిద్ధు అతని తన టీం లో వేసుకున్నాడు ఎందుకు అంటే అశ్వత్థామ నీ డైరెక్ట్ గా చూసింది తను ఒక్కడే చూసిన రమణ మూడు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కొమ్మాలో ఉన్నాడు దాంతో ఆకాశ్ తన టీం లో ఉంటే పట్టుకున్న వారం రోజుల్లో తప్పించుకున్న అశ్వత్థామ నీ మళ్లీ పట్టుకోవచ్చు అతను దొంగలించి తీసుకొని వెళ్లిన ఆ యురేనియం కూడా తిరిగి తీసుకొని రావచ్చు అని అనుకున్నాడు అశ్వత్థామ కోసం హైదరాబాద్ మాత్రమే కాదు, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇంటర్ పోల్, ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఉన్న అని దేశాల సెక్యూరిటీ ఆఫీసర్లు వెతుకుతూ ఉన్నారు తన దెగ్గర ఉన్న యురేనియం తో ఏ దేశం మీద బోక్క పెడతాడో అని అందరి భయం దాంతో అందరూ అశ్వత్థామ వెనుక పడ్డారు అతను ఏ దేశంలో ఉన్నాడు అని అందరూ వెతుకుతూ ఉన్నారు, ఒక రోజు ఆకాశ్ ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్లడం వాళ్ల నాన్న చూశాడు దాంతో ఆకాశ్ నీ ఫాలో అయ్యాడు.

ఆకాశ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాడు తన వెనుక వచ్చిన తన తండ్రి నీ చూసి షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ అబ్బ దొరికేసాను అని మనసులో అనుకున్నాడు దాంతో ఆకాశ్ చేతిలో ఉన్న బోర్డింగ్ పాస్ లాకుని చూశాడు ఆకాశ్ తండ్రి అందులో ముంబాయి అని ఉంది
“ముంబాయి ఎందుకు రా” అని అడిగాడు దాంతో ఇంక లాభం లేదు అనుకోని తన పర్స్ లో ఉన్న audition ఆఫర్ పేపర్ చూపించాడు దాంతో తన కొడుకు ఇంకా ఆక్టింగ్ వదలలేదు అని అర్థం అయ్యింది “శుభ్రంగా ఉద్యోగం చేసుకోక ఎందుకురా ఈ పిచ్చి పనులు” అన్నాడు దాంతో ఆకాశ్ “నేను audition కోసం వెళ్లడం లేదు అశ్వత్థామ అసిస్టెంట్ సంగీత ముంబాయి లో ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నా మీద నువ్వు అధికారం చెల్లాయిస్తే నచ్చదు ఆ సిద్ధు గాడు నా మీద అధికారం చూపిస్తే కడుపు మండిపోతుంది ఇక్కడ అందుకే తనని పట్టుకోవడానికి సీక్రెట్ గా వెళ్లుతున్న” అని చెప్పాడు, దాంతో నేను వస్తా నువ్వు audition కీ వెళ్లు నేను ఆ అమ్మాయిని పట్టుకుంటా అన్నాడు ఆకాశ్ కీ ఆ ఐడియా బాగా నచ్చింది వెంటనే తనకి ఒక టికెట్ తీసి ఇద్దరు ముంబాయి వెళ్లారు అప్పుడు ఆకాశ్ ఒక టాక్సీ లో “దాదా సాహెబ్ ఫిల్మ్ నగరి” స్టూడియో కీ వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత కమిషనర్ అక్కడ లోకల్ DCP తన బాచ్మేట్ అవ్వడం తో అతనికి ఫోన్ చేసి హెల్ప్ అడగాలి అనుకున్నాడు కానీ ఆకాశ్ వద్దు అన్నాడు పోలిసులకు తెలిస్తే తను alret అవుతుంది అని చెప్పాడు దానికి కమిషనర్ నిజమే అనుకోని ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత ఆకాశ్ స్టూడియో దెగ్గర దిగేసి వాళ్ల నాన్న కీ సంగీత అడ్రస్ చెప్పి తనని పంపాడు.

ఆ తరువాత వేరే టాక్సీ లో కమిషనర్ నీ ఫాలో అవుతూ వెళ్లాడు ఆకాశ్ దారావి అనే slum ఏరియా లో దిగాడు కమిషనర్ ఆ తర్వాత ఆకాశ్ కూడా కమిషనర్ నీ 100 అడుగుల దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్లాడు అప్పుడు సంగీత ఉన్న ఇంటి దెగ్గర తలుపు కొడుతూ ఉన్నాడు ఆకాశ్ సడన్ గా వెనుక నుంచి వచ్చి తన మెడ పైన కమిషనర్ కీ ముత్తు ఇన్జేకట్ చేసి తన వెనుక ఉన్న ఇంటి లోకి లాకుని వెళ్లాడు ఆ తర్వాత సంగీత కమిషనర్ నీ కట్టేసి ఒక ఇన్జేక్షన్ తీసి మెల్లగ కమిషనర్ కీ ఇచ్చింది ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది అప్పుడు కమిషనర్ “రేయి ఆకాశ్ ఏమీ చేస్తున్నావు రా అసలు ఎక్కడ ఉన్నాం” అని అడిగాడు దానికి ఆకాశ్ “don’t worry commissioner ఇంకో గంట లో నిన్ను నీ కొడుకు ఆకాశ్ దగ్గరికి పంపుతాను నువ్వు ఓపికగా ఉంటే కనీసం గంట అయిన బ్రతుకుతావు లేదు అంటే అర గంట లో చనిపోతావు నీకు ఇచ్చింది most deadly atoms poison అది పోస్ట్ మార్టం చేసిన అది బయటకు రాదు” అని అన్నాడు, అది విన్న కమిషనర్ “నువ్వు నా కొడుకు కాదు అంటే నువ్వు ఎవ్వరూ నా కొడుకు ఎక్కడ” అని అడిగాడు.

అప్పుడు తన వెనుక ఉన్న కర్టెన్ తీసి దాని వెనుక ఉన్న ఒక మిసైల్ నీ తీసి చూపించాడు అది చూసిన కమిషనర్ ఒక సారిగా షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ వైపు చూసి “అంటే నువ్వు నువ్వు” అని అడిగాడు “అశ్వథ్థామ హతహ కుంజరహ ” అని నవ్వాడు అశ్వథ్థామ.

(6 నెలల క్రితం)

అశ్వథ్థామ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నాక తనని రామేశ్వరం నుంచి తరలిస్తున్నప్పుడు తన పక్కనే ఉన్న ఆకాశ్ తో మాటలు కలిపాడు అశ్వథ్థామ అప్పుడు ఆకాశ్ లో చిన్న భయం తెలుస్తోంది దాంతో మెల్లగ అతని ఆలోచనలు పసి గట్టడం మొదలు పెట్టాడు ఆకాశ్ తన నటన గురించి తనే అనుమానం పడుతూ ఉన్నాడు అదే అదునుగా అశ్వథ్థామ “నువ్వు చాలా బలహీనుడివి ఆకాశ్ నీలో ప్రతిభ లేదు ఎక్కడ నువ్వు ఒడిపోతావో నిన్ను నీ తండ్రి ఎక్కడ బలవంతంగా సెక్యూరిటీ అధికారి చేస్తాడు అని నీ భయం ఈ అవమానం నిస్సహాయం లో నిన్ను ఎవరూ కాపాడాలి అని అనుకోరు అందుకే నువ్వు ఉండి ఏమీ లాభం నీ ప్రాణం కీ విలువ లేదు” అన్నాడు దానికి ఆకాశ్ మనసులో నిజంగానే అభద్రతభావం మొదలు అయ్యి వెంటనే తన పక్కన ఉన్న సెక్యూరిటీ అధికారి గన్ తీసుకొని తనని తాను కాల్చుకొని చనిపోవడానికి చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు అప్పడానికి చూశారు ఆ టైమ్ లో గన్ పేలి డ్రైవర్ కీ తగిలి వాన్ బోల్తా పడింది ఆకాశ్ కీ రాడ్ తగిలి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు అప్పుడు సంగీత వచ్చి అశ్వథ్థామ నీ ఆకాశ్ నీ ఇద్దరిని కార్ లో తీసుకొని వెళ్లింది అప్పుడు దారిలో సంగీత తను ఆ రోజు పారిపోతూ ఆకాశ్ చేత్తిని కట్ చేసి అతని బ్లడ్ తీసుకొని వెళ్లి చేసిన టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది అందులో ఆకాశ్ బాడి హార్మోన్స్, ఐ అశ్వథ్థామ తో మ్యాచ్ అవుతాయి అని తెలుసుకున్నారు.

దాంతో ఆకాశ్ నీ తీసుకొని వెళ్లి అతని కళ్ళు బాడి లోని హార్మోన్స్ నీ తీసుకొని అశ్వథ్థామ కీ ఇచ్చారు దాంతో 3 నెలల్లో పూర్తిగా అశ్వథ్థామ లో ఆకాశ్ హార్మోన్స్ ఇచ్చి తన శరీరం లో వృద్ధత్వం పొయ్యి మెల్లగ యువకుడు లా మారడం మొదలు అయ్యాడు ఆ తర్వాత చెన్నై పోర్ట్ లో నిలువ ఉంచిన యురేనియం నీ కాజేసి ముంబాయి కీ తీసుకొని వచ్చాడు ఆకాశ్ నీ చంపేసి తనని సముద్రం లో పడేసి తనే ఆకాశ్ అయ్యాడు అశ్వథ్థామ.

Chapter 1 ends