నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 2 90

సిద్ధు : మరి ఏమీ చేయాలి వాడు ఎప్పుడు మన కంటే ఒక అడుగు ముందు ఉంటున్నాడు మన ప్రతి అడుగు నీ క్షుణ్ణంగా లేక వేసి మరీ దెబ్బ కొడుతూన్నాడు

రమణ : కానీ ఇది ఇంకా అవ్వలేదు మనకు ఏదో ఒక దారి ఉంటుంది ప్రయత్నం చేద్దాం

సిద్ధు : ఏమీ మిగిలి ఉంది ఒకటి మాత్రం నిజం వాడికి కళ్లు లేవు కానీ మనల్ని మాత్రం గుడ్డి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాడు

రమణ : వాడికి కళ్లు లేవు కానీ వాడికి ఎవరో ఒకరు తన చూపు వాడికి ఇస్తున్నట్లే కదా

సిద్ధు : అంటే ఏమీ చెప్పాలి అనుకుంటున్నావు

రమణ : వాడికి కళ్లు లా పని చేస్తున్న వ్యక్తి మన చుట్టూ పక్కలే ఉండొచ్చు కదా

సిద్ధు : అంటే నువ్వు చెప్పే దాని ప్రకారం వాడికి సహాయం చేసే మనిషి మనకు కూడా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు అంటావు

రమణ : కరెక్ట్ వాడు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి ఆడిస్తూన్నాడు అంటే దానికి కారణం వాడి ప్రశాంతం అయిన బుద్ధి బలం అంతేకాకుండా కోల్పోవడానికి వాడి దగ్గర ఏమీ అదే మన దగ్గర

సిద్ధు : ఫ్యామిలీ ప్రాణం గా ఇష్టపడే ఉద్యోగం వీటి కోసం మనం ఏమైనా చేస్తాం కానీ వాడికి ఇవ్వని చేస్తే ఏమీ ఉపయోగం ఉంది

రమణ : వాడు ఇది అంత డబ్బు కోసం లేదా పవర్ కోసం చేయడం లేదు

సిద్ధు : మరి దేన్ని కోసం

రమణ : “ధనం పై ఆశ లేని వాడు, చావు పుట్టక కోసం పాకులాడని వాడు, బ్రతుకు పై తీపి లేని వాడు, దైవంకి చట్టం కీ భయపడని వాడు, ఎటువంటి అధికారం కోసం దిగజారని వాడు తనని తాను జయిస్తాడు ప్రపంచాని కైవసం చేసుకుంటాడు”

సిద్ధు : కొంచెం అర్థం అయ్యేలా చెప్పు

రమణ : simple గా చెప్పాలి అంటే వాడు ఈ ప్రపంచం మొత్తం తగులబడుతున్న ఆ నిప్పు కణం ముందు కూర్చుని వేడుక చూసే రకం వాడికి చావు అంటే భయం లేదు వాడు అనుకున్నది చేస్తాడు తప్ప మరో ధ్యాస ఉండదు

సిద్ధ : అంటే వాడు ఒక సైకో లాంటి వాడు

రమణ : అంతకంటే ఎక్కువ వాడిని మనం తొందరగా పెట్టుకోవాలి

ఇక్కడ ఆశ్వథ్థామా తన ఫోన్ నీ స్పీకర్ కీ కనెక్ట్ చేసి ఒక తమిళ్ సినిమా పాట వింటూ ఉన్నాడు “తని ఒరువన్ నిలుతు విటాల్ ఇంద ఉల్లగమే తలవిటు ఇలైయి” అనే ఆ పాట నీ కచ్చితంగా రోజు వింటూ ఉంటాడు ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయి నీ లోపల కట్టేసిన వెంటనే సంగీత బయటికి వచ్చింది ఆశ్వథ్థామా దగ్గరికి వచ్చి

సంగీత : సార్ రోజు మీరు ఈ పాట ఎందుకు పదే పదే వింటూ ఉంటారు

ఆశ్వథ్థామా : చాలా మంచి ప్రశ్న ఈ పాట వింటుంటే ఇది నా కోసమే రాసినట్టు అనిపిస్తుంది

సంగీత : అంతలా ఆ పాట లో మిమ్మల్ని ఆకర్షించిన ఆ విషయం ఏంటి సార్

ఆశ్వథ్థామా : ఆ పాట లోని మొదటి రెండు లైన్ లు

సంగీత : మీ కంటే తమిళ్ వచ్చు సార్ నాకూ కొంచెం చెప్పండి

ఆశ్వథ్థామా : ఒకడు తన మెదస్సు నీ ఒక పని పై నిష్ఠగా తను అనుకున్నది చేయాలి అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం తనకు ఎదురు నిలిచిన వాడిని ఎవ్వరూ అప్పలేరు

సంగీత : నిజమే సార్ ఆ పాట మీ కోసమే రాసినట్టు ఉంది మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు