నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 2 90

సిద్ధు : రేయ్ ఏమీ చెయ్యబోతున్నావు రేయ్ చెప్పు అంటూ అరుస్తూ ఉన్నాడు కానీ అవతలి నుండి ఏమీ రెస్పాన్స్ లేదు

ఆ తరువాత సిద్ధు బయటికి వచ్చాడు అప్పుడు తన ఎదురుగా రమణ వచ్చాడూ ఏమీ జరిగింది అని అడిగాడు దాంతో సిద్ధు అంతా చెప్పాడు కానీ సిద్ధు కీ ఒక విషయం అర్థం అయ్యింది ఇంత చీకటి లో అక్కడ పని చేస్తున్న వాళ్లే పొరపాటు గా టేబుల్ కీ కొట్టుకుంటూ ఉన్నారు కానీ వాడు మాత్రం చిటికెలో తప్పించుకోని వెళ్లాడు కచ్చితంగా వాడికి గుడ్డి వాడు అన్న విషయం సిద్ధు కీ అర్థం అయ్యింది అప్పుడే ఆశ్వథ్థామా మెట్లు మీద నుంచి కిందకు దిగుతు తన కాలి తో తరువాత వస్తూన్న మెట్టు నీ కొలుస్తూ దిగుతు వెళ్లిపోయాడు.

సిద్ధు మాట్లాడేది మొత్తం విన్న ఆశ్వథ్థామా వెంటనే తన Bluetooth నుంచి రమణ కీ ఫోన్ చేసాడు దాంతో రమణ తన ఫోన్ స్పీకర్ లో పెట్టాడు “మై ఫ్రెండ్స్ మీరు ఇద్దరు నను తాజ్ హోటల్ కి ఫాలో అవ్వదు మళ్లీ రిస్క్ లో పడతారు” అని ఫోన్ పెట్టేసాడు దాంతో సిద్ధు హడావిడి గా తన కార్ దెగ్గర కీ పరుగులు తీశాడు దాంతో రమణ కూడా వెనుక వచ్చాడు ఆ హడావిడి లో
ఆశ్వథ్థామా వచ్చి రమణ జేబులో ఒక కార్డ్ పెట్టి జనం లో మాయం అయ్యాడు సిద్ధు తన కార్ కీ ఒక 10 అడుగుల దూరంలో ఉండగా ఆశ్వథ్థామా రిమోట్ తో కార్ నీ బాంబ్ తో పేల్చాడు దాంతో సిద్ధు ఎగిరి పడ్డాడు వెనకు రమణ వచ్చి సిద్ధు నీ తీసుకొని పైకి లేప్పాడు అప్పుడే ఆశ్వథ్థామా అక్కడ ఉన్న ఒక కాబ్ ఎక్కి తాజ్ హోటల్ కీ ప్రయాణం అయ్యాడు, కానీ సిద్ధు ఆశ్చర్యంగా చూశాడు ఒక కళ్లు లేని వాడు అంత perfect గా తనకు ఏమీ కాకుండా ఎలా బాంబ్ పేల్చాడు అప్పుడు రమణ చెప్పడం మొదలు పెట్టాడు “మనం ఉన్నది 5 వ అంతస్తు లో లిఫ్ట్ నుంచి 5th floor అన్న announcement వాడు విన్నాడు దాంతో మనం లిఫ్ట్ ద్వారా కిందకి వస్తాం అని వాడు ముందే మన ప్రతి అడుగు నీ లేక వేసి పెట్టుకున్నాడు పైగా వాడు నీ ఆవేశం నీ బాగా అంచనా వేశాడు దాంతో నీ ఆవేశం కీ పార్కింగ్ లో ఉన్న నీ కార్ వైపు వెళ్లే సమయానికి బాంబ్ పేల్చి మనల్ని ఆపి వాడు తీరికగా తాజ్ హోటల్ కి బయలుదేరాడు” అని ఆశ్వథ్థామా తమ కన్న ఒక అడుగు ఎలా ముందు ఉన్నాడు అని చెప్పాడు.

దాంతో సిద్ధు రమణ ఆలోచన లో పడ్డారు తాజ్ హోటల్ లో వాడు హోటల్ లో ఎవరిని చంపబోతున్నాడు అని అప్పుడు గుర్తుకు వచ్చింది మీటింగ్ కీ వచ్చిన వాళ్లలో పాకిస్తాన్, చైనా, రష్యా మినిస్టర్ లు ఉన్నారు వాళ్లు తాజ్ హోటల్ లోనే ఉన్నారు అంటే వాడు ఇప్పుడు టార్గెట్ చేసింది వాళ్ల ముగ్గురి లో ఎవరిని అని దాంతో ఇద్దరు వెంటనే తాజ్ హోటల్ కీ బయలుదేరారు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఎంక్వయిరీ కోసం ఇద్దరిని ఆపేసారు ఇక్కడ ఆశ్వథ్థామా తాజ్ హోటల్ చేరుకున్నాడు అప్పుడే అక్కడ కొంత మంది బాగా దిగులుగా మాట్లాడు కొవ్వడం విన్నాడు ఆశ్వథ్థామా వెళ్లి వాళ్ళని కారణం అడిగాడు దానికి వాళ్ల లో ఒక్కతను “ఏమీ లేదు సార్ మేము అంతా కవ్వాలి కళాకారులం ఇక్కడ ఉన్న పాకిస్తాన్ మినిస్టర్ కోసం సాయంత్రం మేము కవ్వాలి ప్రోగ్రాం కోసం బుక్ చేశారు కాకపోతే మా గురువు గారు మెయిన్ సింగర్ ఆయన అనారోగ్యంతో రాలేనని చెప్పారు బారి పేమెంట్ మిస్ అవ్వుతాం అని బాధగా ఉంది” అని చెప్పాడు దాంతో ఆశ్వథ్థామా మెదడు లో తన చిన్ననాటి స్మృతులు పరిగెత్తుతూ ఉన్నాయి.

(1960 రామేశ్వరం తమిళనాడు)

పది సంవత్సరాల వయసు లో తన తండ్రి శంబూ మార్తాండన్ పర్యవేక్షణ లో రుద్ర శ్లోకం కంఠస్థం చేయడం లో నిమగ్నమై ఉన్నాడు అశ్విన్ అప్పుడే అక్కడికి వచ్చిన అబ్దుల్ బయటనే అరుగు పై కూర్చుని ఉన్నాడు లోపల ఉన్న అశ్విన్ కీ అబ్దుల్ పూసుకొని వచ్చిన అత్తరు వాసన ముక్కుకు గుప్పు మంటు తగిలింది దాంతో తన ఉచ్చరన శృతి తప్పడం తో ఆయన కోపం తో అశ్విన్ నీ తిట్టాడు ఆ తర్వాత బయట ఉన్న అబ్దుల్ నీ కూడా తిట్టడం కోసం లేచినప్పుడు ఆయన కూర్చున పీట వెనకు జరిగిన శబ్దం వినిపించింది అప్పుడు తన తండ్రి ఎక్కడ తన మిత్రుడిని కోపగించుకుంటాడు అని భయపడిన అశ్విన్ వెంటనే తన తండ్రి నీ ఆపాలని కాల భైరవ అష్టకం చదివి వినిపించాడు దాంతో శంబూ మార్తాండన్ అగ్గి నవ్వుకోని వెనకు తిరిగి “నీ స్నేహితుని పైన ఈగ కూడా రానివ్వవూ కదా వేళ్లు వెళ్లి తయారు అవ్వు స్కూల్ కీ” అని చెప్పి పంపాడు.

అప్పుడే వేరే ఉరి నుంచి వచ్చిన తన మేనమామ తన తండ్రి తో అశ్విన్ ఒక నిష్ఠమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ” తో అది కూడా చేపలు పట్టే వాడితో స్నేహం చేయడం పై వాళ్ల అయిష్టం తెలియజేసారు అప్పుడు అశ్విన్ వాళ్ల నాన్న వచ్చి” మన చేతికి ఉండే ఐదు వేలు సరిగా సమానంగా లేనప్పటికి వాటిని మనం వాటిని కోసుకొము అలాంటిది అలాంటిది బయట సమాజం లో ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లాలి చూపు లేని నా కొడుకుకి ఆ అబ్బాయి చూపుగా ఉన్నాడు వాళ్ల స్నేహం నాకూ తప్పు కాదు ఇద్దరు తెలివైన వాలు ఏదో ఒక రోజు ఇద్దరు ఈ దేశం పేరు నిలబెడ్డతారు ” అని చెప్పారు ఆ తర్వాత అశ్విన్ బయట ఉన్న అబ్దుల్ తో కలిసి స్కూల్ కీ బయలుదేరారు అబ్దుల్ రోజు స్కూల్ కీ వెళ్లే దారిలో ఒక మసీదు దెగ్గర ఫకీర్ తో సాంబ్రాణి వేయించుకుంటాడు అలా మసీదు బయట ఉన్న బిచ్చగాళ్లు కవ్వాలిలు పాడటం విని అశ్విన్ కీ అవి కంఠస్థం అయ్యి పోయాయి.

(ప్రస్తుతం)

ఆ కవ్వాలి సభ్యుల దగ్గరికి వెళ్లి వాళ్ల తో “బాబు మీ గురువు గారి బదులు నేను మీకు ప్రోగ్రాం లో సహాయం చేస్తా నాకూ కవ్వాలిలు పాడటం వచ్చు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ల నాన్న గారి దెగ్గర నేర్చుకున్న నా చిన్నతనం లో పాడేవాడిని నను తీసుకొండి సహాయం గా ఉంటా” అని చెప్పాడు దాంతో వాళ్లు ఆలోచించకుండా ఆశ్వథ్థామా నీ తమతో పాటు తీసుకొని వెళ్లారు అక్కడ ముందు ఫంక్షన్ హాల్ మొత్తం నీ కొలిచి చూశాడు ఆ తర్వాత ఒక కిటికీ మాత్రం తెరిచి ఉంది ఆ కిటికీ నుంచి కింద ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నాడు కింద ఒక కార్ ఉంది అని తెలిసి దాని మీదకు తన జేబులో ఉన్న ఒక చిన్న ఉసిరికాయ వేశాడు అది కిందకు చేరుకున్నే సమయం నీ ఆ కార్ అలారం వచ్చిన సమయానికి కొలిచి చూశాడు ఒక 25 సెకండ్స్ ఆ తర్వాత తాము ఉన్నది 8 వ అంతస్తు అని అర్థం అయ్యింది వెంటనే తనకు ఒక గ్రీన్ టీ తీసుకొని రా అని తన పక్కన ఉన్న కుర్రాడికి చెప్పాడు దాంతో ఆ అబ్బాయి వెళ్లాడు తరువాత బయట ఉన్న సంగీత నీ లోపలికి రమ్మని చెప్పాడు తను రాగానే సెంట్రల్ ac రూమ్ టెంపరేచర్ ఉన్న రిమోట్ నీ బ్రేక్ చేసి లోపల ఉన్న కనెక్షన్ ద్వారా ఎంత టెంపరేచర్ లో మార్చిన అది మైనస్ పాయింట్ లోకి వెళ్లే లాగా మార్చారు ఆ తర్వాత సంగీత తెచ్చిన గ్రీన్ టీ బాగ్ లోని ఆకులు తీసి ac పైప్ లో వేసి ఉంచాడు ఆ తర్వాత కార్ నీ తీసుకొని వచ్చి ఆ కిటికీ కింద ఉంచమని చెప్పాడు అప్పుడు ఎవరో రావడంతో సంగీత వెళ్లిపోయింది తరువాత ఆశ్వథ్థామా కళాకారుల తో కలిసి సాయంత్రం ప్రోగ్రాం కీ తయారు అయ్యాడు అప్పుడు పాకిస్తాన్ మినిస్టర్ తన సెక్యూరిటీ తో వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఆశ్వథ్థామా తనకు బాగా ఇష్టమైన ఒక కవ్వాలి పాడాడు అది విన్న సెక్యూరిటీ చీఫ్ కల్నల్ ఖాన్ ఒకసారి ఆశ్వథ్థామా నీ సరిగ్గా చూశాడు అంతే తన శరీరం లో అణు అణువు గజ గజ వనికింది తన నుదుటి నుంచి చెమట కారుతుంది అంత చలిలో కూడా ఒకసారి తనకు ఆశ్వథ్థామా చేసిన మారణహోమం గుర్తుకు వచ్చింది ఒకడే వచ్చి పాకిస్తాన్ ISA ఏజెంట్లను ఊచకోత కోసిన సంఘటన తన కళ్ల ముందు మెదిలింది.