నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 2 90

ఆకాశ్ తన ఫ్రెండ్స్ తో తనకు వచ్చిన ఫోన్ గురించి చెప్పాడు దానికి తన ఫ్రెండ్స్ వాళ్లు ఎప్పుడు యుట్యూబ్ లో ఎలాంటి వీడియో పెట్టలేదు అని చెప్పారు దాంతో ఆకాశ్ మరి ఎవ్వరూ చేశారు అనుకున్నాడు కచ్చితంగా అది తన తండ్రి పని అనుకున్నాడు అప్పుడే హోటల్ వస్తే దిగాడు తన కార్ వెనుక వచ్చిన కార్ నుంచి దిగిన రమణ నీ చూసిన ఆకాశ్ ఇది తన తండ్రి పని లా ఉంది అని అనుకున్నాడు.

సిద్ధు చనిపోయాడు అని బాధ పడుతున్న విజయ కీ ఒక ఫోన్ వచ్చింది ఎత్తుతే అవతలి నుంచి సుమా ఫోన్ మాట్లాడింది వాళ్లు బ్రతికే ఉన్నారు అని చెప్పింది.

సుమా నుంచి ఫోన్ రాగానే విజయ లో ఆనందం కంటి నుంచి ఆనంద భాష్పాలు రాలాయి

విజయ : సుమా ఎక్కడ ఉన్నారు

సుమా : మేడమ్ మేము ఇప్పుడు బెంగళూరు హైవే పైన ఉన్నాము

విజయ : సిద్ధు ఎలా ఉన్నాడు

సుమా : తను బాగానే ఉన్నాడు కాకపోతే బుజం కీ బాగా దెబ్బ తగిలింది దాంతో ఈ రెండు రోజులు మేము ఒక చిన్న ఊరి లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాం

విజయ : అవునా మీరు కరెక్ట్ గా ఎక్కడ ఉన్నారు నేను వెంటనే బయలుదేరి వస్తా

సుమా : మేము ఇంకో గంట లో హైదరాబాద్ కీ వస్తాం మీరు సిటీ outskirts కీ వచ్చి రిసీవ్ చేసుకోండి

విజయ : సిద్ధు కీ ఫోన్ ఇవ్వు

సుమా : తను టాబ్లేట్ వేసుకొని నిద్ర పోతున్నాడు

విజయ : అవునా పర్లేదు నేను వస్తాను అని ఫోన్ పెట్టేసి దేవుడి రూమ్ లో దేవుడికి పూజ చేసి బయలుదేరింది

ఆ రోజు ఏమీ జరిగింది అంటే సిద్ధు సుమా దగ్గరికి వెళ్లే సమయం కి బాంబ్ లో కౌంట్ డౌన్ మొదలు అయ్యింది అది 30 సెకండ్లు మాత్రమే టైమ్ దాంతో సిద్ధు తనకు ఉన్న కొద్దిపాటి బాంబ్ జ్ఞానం తో ఫోన్ ట్రిగ్గర్ నీ ఫ్లయిట్ మోడ్ లో పెట్టాడు దాంతో సిగ్నల్ లేక ఫోన్ కొద్ది సేపు inactive మోడ్ లో ఉంది దాంతో వెంటనే సుమా కట్లు విప్పి తనని పక్కకు తోసి వెంటనే ఫ్లయిట్ మోడ్ నుంచి తీసి దాని దూరం గా విసిరాడు వెంటనే సుమా చేయి పట్టుకుని ఇద్దరు అక్కడ ఉన్న కిటికీ నుంచి బయటికి దూకారు అప్పుడు కిటికీ అద్దం ముక్క ఒకటి సిద్ధు బుజం లో పొడుచుకుంది అప్పుడే అట్టు వైపు వచ్చిన ఒక గూడ్స్ ట్రైన్ లోకి ఎక్కారు ఆ తర్వాత రక్తం పోవడంతో సిద్ధు స్పృహ కోల్పోయాడు సుమా కూడా ఆ షాక్ వల్ల కొంచెం నిరసించి నిద్రలోకి జారుకుంది అలా వాళ్లు ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామంలో దిగ్గి అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి ఒక లారీ ద్వారా హైదరాబాద్ బయలుదేరి ఆ లారీ డ్రైవర్ ఫోన్ నుంచి విజయ కీ ఫోన్ చేశారు, ఆ తర్వాత విజయ వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లి వాళ్లను తీసుకొని లారీ కీ డబ్బులు ఇచ్చి సిద్ధు నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ సిద్ధు కీ కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు.

ఇది ఇలా ఉంటే అక్కడ అశ్వత్థామ రామేశ్వరం కీ సంగీత తో కలిసి వెళ్లాడు అక్కడ రామేశ్వరం లోని శివుని గుడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్లమని చెప్పాడు అక్కడ ఒక హోటల్ నుంచి క్రాస్ అవుతు వెళుతుండగా తన ముక్కుకు వచ్చిన సువాసన కీ కార్ ఆప్పమని చెప్పి కార్ దిగాడు సంగీత కూడా కార్ దిగి

సంగీత : ఏమైంది సార్

అశ్వత్థామ : ఆ హోటల్ పేరు చదువు

సంగీత : సార్ అది తమిళ్ లో ఉంది

అశ్వత్థామ : ఈ హోటల్ కీ ఎదురుగా కొలను ఉందా

సంగీత : హా ఉంది సార్

అశ్వత్థామ : అయితే ఇదే హోటల్ రామన్ భోజనాలయం మొత్తం రామేశ్వరం లో ప్యూర్ వెజిటేరియన్ భోజనం ఇక్కడే దొరుకుతుంది

సంగీత : అవునా సార్ ఆకలి వేస్తుంది రండి వెళ్లదాం

అశ్వత్థామ లోపలికి అడుగు పెట్టగానే తనకు ఎంతో ఇష్టం అయిన వెన్న తో చేసిన వేడి వేడి పొంగల్ వాసన గుప్పు మంటు కొట్టింది ఆ వెంటనే అది రెండు ప్లేట్ లు తెప్పించి తినడం మొదలు పెట్టాడు అక్కడ కౌంటర్ లో ఉన్న హోటల్ ఓనర్ అశ్వత్థామ వైపు చూస్తూ ఉన్నాడు ఎందుకో తనకు అతని ఎప్పటి నుంచో చూసిన వాడిలా అనిపించింది వెంటనే లేచి వెళ్లి తన ముందు కూర్చుని “అశ్విన్” అని అడిగాడు అతని గొంతు గుర్తు పట్టిన అశ్వత్థామ వెంటనే “రామన్” అని అడిగాడు దాంతో రామన్ సంతోషం తో వచ్చి అశ్వత్థామ నీ గట్టిగా కౌగిలించుకున్నాడు అశ్వత్థామ కూడా రామన్ నీ గట్టిగా కౌగిలించుకున్ని ఉన్నాడు ఆ తర్వాత రామన్ అశ్వత్థామ గురించి తను ఏమీ చేస్తున్నాడు అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు అశ్వత్థామ తను బిజినెస్ చేస్తూన్నాను అని చెప్పాడు సంగీత వైపు చూసి నీ కూతురా అని అడిగాడు కాదు తన ఫ్రెండ్ కూతురు నాకూ కూతురు లాంటిది పైగా నా బిజినెస్ అంతా తనే చూస్తోంది అని చెప్పాడు, మరి తన పెళ్లి గురించి అడిగాడు తనకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పాడు అశ్వత్థామ దాంతో రామన్ గట్టిగా నవ్వుతూ “నువ్వు నీ ఫ్రెండ్ అబ్దుల్ ఇద్దరు ఇద్దరే వాడు కూడా పెళ్లి చేసుకోలేదు అయిన వాడి లాంటి మేధావి మళ్లీ పుట్టడు రా” అన్నాడు దానికి అశ్వత్థామ కంటి నుంచి నీరు కారింది అది చూసిన సంగీత చాలా ఆశ్చర్య పోయింది తనకు ఇన్ని రోజుల నుంచి సహాయం చేసిన తననే చంపడానికి వెనుకాడని వ్యక్తి కళ్లలో నీళ్లు రావడం తనకు షాక్ ఇచ్చింది.