నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 146

శ్యామ్ చనిపోవడం గురించి తెలుసుకున్న సిద్ధు వెంటనే ఆక్సిడేంట్ స్పాట్ కీ వెళ్లాడు శ్యామ్ చెవికి ఉన్న Bluetooth నీ చూసిన సిద్ధు వెంటనే శ్యామ్ కీ వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పాడు దాంతో అందరూ ఆ పని మీద ఉన్నారు తరువాత తన రూమ్ లోకి వెళ్లి టీ తాగుతూ ఉండగా అసలు శ్యామ్ బయటికి ఎందుకు వెళ్లాడు వెళితే వెళ్లాడు కానీ రోడ్డు మధ్య ఎందుకు నిలబడి ఉండి ఉంటాడు లేక పోతే అతని ఎవరైనా అలా చేసేలా ప్రేరేపించారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో సిద్ధు అక్కడికి వెళ్లాడు జరిగిన దాని గురించి కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నాడు సిద్ధు రాగానే

కమిషనర్ : ఏంటి సిద్ధార్థ ఇది ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అది కూడా ఒక సెక్యూరిటీ అధికారి స్టేషన్ ముందే

సిద్ధు : సార్ అదే మాకు అసలు అర్థం కావడం లేదు సార్ మేము దాని గురించి ఎంక్వయిరీ చేసే పనిలోనే ఉన్నాం

కమిషనర్ : ఏమీ చేస్తావో నాకూ తెలియదు అసలే మీడియా వాళ్లు న్యూస్ కవర్ చేస్తూంటే మన వాళ్ళు ఆపారు రెండు రోజుల లో external affairs మీటింగ్ జరగబోతుంది దాని గురించి కూడా ఆలోచించు

సిద్ధు : సార్ నేను అదే పని మీద ఉన్నాను మీరు పంపిన ఫోటో లోని ముసలాయన పైన నేను ఎంక్వయిరీ పెట్టాను రేపటికి అతని గురించి పూర్తి వివరాలు తో మీ ముందుకు వస్తాను

కమిషనర్ : ఆ ముసలాయన సంగతి పక్కన పెట్టు ముందు ఆ అమ్మాయి నీ పట్టుకో అని చెప్పాడు

సిద్ధు : ఏ అమ్మాయిని సార్

కమిషనర్ : అది ఏంటి అయ్యా ఆ ముసలాయన తో పాటు ఒక అమ్మాయి ఫోటో కూడా పంపించాం కదా

దాంతో సిద్ధు వెంటనే తన ఫోన్ తీసుకొని చూశాడు కాకపోతే ఫోన్ స్వీచ్ ఆఫ్ లో ఉంది సరే స్టేషన్ కీ వెళ్లి చూద్దాం అని స్టేషన్ వైపు బయలు దేరాడు కార్ లో చార్జర్ ఉంటే దానికి పెట్టాడు ఫోటో చూద్దాం అనుకుంటున్న టైమ్ లో సంగీత నుంచి మెసేజ్ వచ్చింది

సంగీత : ఏమైంది అలా వెళ్లి పోయావూ

సిద్ధు : ఏమీ లేదు చిన్న ప్రాబ్లమ్ వచ్చింది

సంగీత : అవునా ఏంటి

సిద్ధు : నా సబ్ ఆర్డినేట్ కీ ఆక్సిడేంట్ అయ్యింది

సంగీత : అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది

సిద్ధు : లేదు నేను మళ్లీ చేస్తా కొంచెం బిజీ లో ఉన్న అని ఫోన్ పెట్టేసాడు

ఇక్కడ ఇలా ఉంటే అక్కడ విజయ పరిస్థితి ఇంకోలా ఉంది ఏంటి అంటే విజయ ఆ రోజు స్కూల్ కీ వెళ్లేసరికి తన టేబుల్ మీద ఒక కవర్ ఉంది దాని పైన “విత్ లవ్ ఫ్రమ్ యువర్ పాస్ట్” అని రాసి ఉంది ఏంటి అని తెరిచి చూస్తే అందులో తన కాలేజీ రోజుల్లోని ఫోటో, తన పాత చెవి కమ్మ ఒకటి ఉంది అది చూడగానే ఒక్కసారిగా విజయ షాక్ అయ్యి అలాగే తన కుర్చీలో కూర్చుని ఉండిపోయింది, తను ముగిసి పోయింది అనుకున్న గతం తిరిగి తన ముందుకు వస్తుంది అని తను ఊహించ లేదు అదే కవర్ లో ఒక ప్రేమ ఉత్తరం తన కోసం ఎదురు చూస్తూ ఉంది అది తెరిచి చదవడం మొదలు పెట్టింది విజయ

“ప్రియాతి ప్రియమైన

విజయలక్ష్మి కీ నా అభివాదం చాలా సంవత్సరాల తర్వాత ఇలా నా నుంచి నీకు ఒక ప్రేమ లేఖ వస్తుంది అని నువ్వు ఊహించి ఉండవు రాస్తాను అని నేను కూడా ఊహించను లేదు మొన్న శుక్రవారం సాయంత్రం నిన్ను గుడి లో చూశాను ఆ తర్వాత నను నేనే ప్రశ్నించుకున్న అది నువ్వే నా కాదా అని తరువాత నువ్వు మరుసటి రోజు షాపింగ్ మాల్ లో మీ తమ్ముడు తో చూశాను చాలా ఎదిగి పోయాడు వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా ఏ మాట కు ఆ మాట చెప్పు కోవాలి అప్పటికి ఇప్పటికి నువ్వు ఏమీ మారలేదు నాకూ తెలిసి నేను అనుకోకుండా మాయం అయ్యి పోవడంతో నువ్వు నను మరిచి పోయి ఉంటావు అనుకుంటా కానీ నా కళ్ల ముందు నువ్వు మన ఊరి చెరువు గట్టు పై నుంచి వంతెన దాటుతు చేతిలో పుస్తకాలు పట్టుకుని నను దొంగ చూపులు చూస్తూ కాలేజీ బస్ ఎక్కడం ఇప్పటికీ నా మదిలో సజీవంగా ఉంది బహుశా సందర్భం తప్పు అయ్యి ఉండొచ్చు కానీ ఎందుకో నీతో ఒక్క సారి మాట్లాడాలని ఉంది ఇష్టం ఉంటే, కుదిరితే ఈ కింది అడ్రస్ కి ఒక సారి రా

ఇట్లు నీ రమణ ” అని రాసి ఉంది.

6 Comments

  1. What nonsense stories are posting like detective and most worst stories are posting

  2. Why discontinued

  3. Katha chala bagundi nenu oka story rasanu Ela submit cheyalo cheppandi

  4. Very worst stories are posting

    1. True Sony

  5. Updates pl

Comments are closed.