మొదటి శృంగార యాత్ర – Part 5 86

అంతే, ఆరోజు సాయంత్రమే ఆమెని తమ ఊరుకి తీసుకుపోయారు. ఊరికి చేరిన రెండు రోజుల తరవాత పెళ్ళి వారు వచ్చారు పెళ్ళిచూపులకి. కాబోయే మావగారు సుజాతని చూసి మురిసిపోతూ “మా పెద్దబ్బాయీ కోడలూ చెబితే ఏమో అనుకున్నా. బంగారపు బొమ్మలా ఉంది.” అన్నాడు. పెళ్ళికొడుకు అయితే సరేసరి, ఊహల్లోకి పోయి డ్యూయెట్లు కూడా పాడేసుకున్నాడు. అతని పేరు సుధాకర్. అతని తమ్ముడు కూడా వచ్చాడు. అతని పేరు ప్రభాకర్. బెంగుళూర్ లో MBA చేస్తున్నాడు. సంబంధం కలవడానికి ముఖ్యకారణమైన పెద్దబ్బాయి, కోడలూ మాత్రం రాలేదు. ఏకంగా పెళ్ళికి వస్తామని అన్నారంట. మొత్తానికి పెద్దలందరూ మాట్లాడుకొని ముహూర్తాలు ఫిక్స్ చేసేసారు. ఆ హడావుడి నుండి సుజాత తేరుకొనే లోగానే, పెళ్ళి సమయం వచ్చేసింది. మండపంలో హడావుడీ, ముస్తాబులూ సుజాతని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. పీటలమీద ఉన్న సుజాతకు ఇదంతా కలా, నిజమా అనిపిస్తుంది. అంతలో పెళ్ళికొడుకు తండ్రి ఏదో హడావుడి పడుతున్నాడు. పెద్దకొడుకు రావలసిన ఫ్లైట్ కేన్సిల్ అయ్యిందంట. మరుసటి రోజుకి గానీ రారట. అదీ ఆ హడావుడికి కారణం. మొత్తానికి చాలా గ్రాండ్ గా జరిగిపోయింది పెళ్ళి. మరుసటి రోజే మొదటిరాత్రికి ముహూర్తం.
మరుసటి రోజు సుజాతకు ముహూర్తం దగ్గరయ్యే కొద్దీ ఏదోలా అనిపించసాగింది. సెక్స్ అలవాటే అయినా, అంతవరకూ జరిగినవి మూడో కంటికి తెలియకుండా రహస్యంగా జరిగాయి. ఇప్పుడు అలాకాదుగా. తామిద్దరూ లోపల ఉంటే, బయట చాలా మంది ఉంటారు. అందరికీ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. మర్నాడు వాళ్ళు గుచ్చిగుచ్చి చూస్తారు. అప్పుడెలా? ఈ విధంగా ఆలోచిస్తుంటేనే సుజాతకు సిగ్గు ముంచుకు వచ్చేస్తుంది. తన సిగ్గు తనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకేనేమో పెళ్ళి చేసుకోమంటారు అందరూ అనుకుంది నవ్వుకుంటూ. అంతలో ఎవరో వచ్చి, “పెళ్ళికొడుకు అన్న, వదిన వచ్చారు. నిన్ను చూస్తారంట.” అని చెప్పారు. సరే అన్నట్టు తల ఊపింది. ఐదు నిమిషాల తరవాత వచ్చారు వాళ్ళు. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి “మీరా!?” అంది ఆనందంగా.
“బావున్నావా!” అని అడిగింది ఆ జంట నవ్వుతూ. వచ్చింది మరెవరో కాదు. సుజాత జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఉన్నప్పుడు అక్కడ పరిచయమైన లెక్చరర్ లు మనోహర్, మాలతి. “మీరిద్దరూ పెళ్ళిచేసుకున్నారా!?” అంది సుజాత ఆశ్చర్యంగా. “అంతా నీ చలవే.” అన్నాడు మనోహర్. అర్ధం కానట్టు చూసింది సుజాత. “ఆ రోజు దగ్గరుండి నాకు కన్నెరికం చేయించావు కదా. దానితో నాకు మగాళ్ళంటే భయం పోయింది. మనోహర్ అంటే ప్రేమ వచ్చింది.” అంది మాలతి నవ్వుతూ. “తన ప్రేమ తట్టుకోలేక పెళ్ళి చేసేసుకున్నాను.” అన్నాడు మనోహర్ నవ్వుతూ. సుజాత ఆనందంగా ఇద్దరినీ కౌగిలించుకుంది. ఇద్దరూ ఆమెని ఆప్యాయంగా పట్టుకున్నారు. “తరవాత మేము స్టేట్స్ లో సెటిల్ అయ్యాం. నాలుగు నెల క్రితం ఇండియాకి వచ్చినప్పుడు, తమ్ముడికి సంబంధం వచ్చిందని నీ ఫోటో చూపించారు. ఇంత అందాలరాశిని బయటకి ఎందుకు పోనిస్తామూ! అందుకే సెట్ చేసేమన్నా. ఇంతకీ మా తమ్ముడు నీకు నచ్చాడా!?” అన్నాడు మనోహర్. సుజాత అందంగా సిగ్గుపడింది. మాలతి అది చూసి, నవ్వుతూ “మీరు వెళ్ళండి, మా చెల్లెలితో నేను పెర్సనల్ గా మాట్లాడాలి.” అంది. మనోహర్ కూడా నవ్వుతూ, “బాగా డీటైల్డ్ గా మాట్లాడుకో, కానీ ముహూర్తానికి వదిలేయ్. లేకపోతే మా తమ్ముడు ఇబ్బంది పడతాడు.” అన్నాడు. అంతలోనే కొంతమంది అమ్మలక్కలు అక్కడకి వచ్చి, “ముహార్తానికి టైం అవుతుంది. స్నానం చేయించాలి.” అన్నారు. మనోహర్ నవ్వి, మాలతితో “మళ్ళీ వాళ్ళెందుకూ? నీ చెల్లిని నువ్వే తయారుచెయ్.” అన్నాడు. అంతలోనే వచ్చిన వాళ్ళు సుజాతని బాత్ రూంకి తీసుకుపోయారు. “అలాగే, మీరు వెళ్ళండిక.” అంది మాలతి మనోహర్ తో.

1 Comment

Comments are closed.