మొదటి శృంగార యాత్ర – Part 5 86

కిందకి వచ్చిన సుజాతని చూసి సన్నీకి మతిపోయింది. ఒక్కక్షణం ఆమె అందం ముందు తను సరిపోతానా అనిపించింది అతనికి. దానికి తోడు ఆమె పలకరింపుగా నవ్వేసరికి, ఉన్న మతి కాస్తా పోయింది అతనికి. “హలో!” అని ఆమె పలకరించేసరికి, తేరుకొని, “హలో!” అని నవ్వుతూ తన చేతిని అందించాడు. మృదువుగా అందుకుంది ఆమె. పూలచెండుని అందుకున్న అనుభూతి కలిగింది అతనికి. అలాగే అపురూపంగా పట్టుకొని, నెమ్మదిగా బయటకి నడిచాడు. అంతవరకూ ఎప్పుడూ చూడనంత పెద్ద కారు ఉంది అక్కడ. ఆశ్చర్యంగా ఆమె దానిని చూస్తుంటే, అతను నవ్వుతూ డోర్ తెరిచాడు. ఆమె కార్ లోకి ఎక్కగానే, నెమ్మదిగా డోర్ ని మూసి, అవతల వైపుకి వచ్చి అతనూ ఎక్కి, ఆమె పక్కన కూర్చున్నాడు. నెమ్మదిగా కారు కదులుతూ ఉండగా గమనించింది ఆమె. వాళ్ళకీ, డ్రైవర్ కీ మధ్యలో ఒక గ్లాస్ బిగించబడి ఉంది. వన్ వే సీ త్రూ గ్లాస్ అది. వీళ్ళకి డ్రైవర్ కనబడతాడు, కానీ డ్రైవర్ కి వీళ్ళు కనిపించరు. కారు లోపల ఉన్నా, ఒక ఖరీదయిన గదిలో ఉన్నట్టుగానే ఉంది. ఆమె తన పరిశీలనలో ఉండగా, అతను చిన్నగా గొంతు సవరించుకున్నాడు. ఆమె తేరుకొని అతని వైపు చూసింది. అతను చిన్నగా నవ్వుతూ, “ఇండియాలో నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా!?” అని అడిగాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమె మౌనాన్ని మరో విధంగా అర్ధం చేసుకొని, “సారీ! ఇండియన్ గాళ్స్ ని అలా అడిగితే అఫెండ్ అవుతారుకదా.” అన్నాడు. సమాధానంగా తల దించుకొని చిన్నగా నవ్వింది. “వావ్!” అన్నాడతను. ఓరగా చూసింది అతని వైపు. “పేరిస్ లో ఎంతో మంది అందగత్తెలను చూసాను. యు నో, నిన్ను చూసాకా, మొదటిసారి ఒక ఆడదాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. నన్ను చూడడానికే మా నాన్న నిన్ను పంపాడని నాకు తెలుసు.” అని అతను అనగానే, షాక్ అయ్యింది ఆమె. ఆమె షాక్ ని చూడగానే, అతను నవ్వేస్తూ, “నా వేస్ నాకు ఉంటాయి కదా.” అని, “నాకు పెళ్ళిమీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నిన్ను చూసాకా ఆగడం లేదు. ఎలా అడగాలో అర్ధం కావడం లేదు. నాతో వన్ నైట్ స్టేండ్ ఓకేనా నీకూ!?” అన్నాడతను. చాలా నాజూకుగా ఒకరాత్రి తనతో గడపమంటున్న అతన్ని చూస్తే మతి పోతుంది ఆమెకు. “పారిస్ లో ఇదంతా మామూలే. ఇష్టమైతే అడిగేయడమే. నీకు ఇష్టం లేకపోతే, నిరభ్యంతరంగా నో చెప్పేయొచ్చు.” అన్నాడతను అంతే సింపుల్ గా. అతను ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదు ఆమె. మళ్ళీ అతనే “ఓకే! ఛిల్…నిన్ను ఇబ్బంది పెట్టను. ఎట్ లీస్ట్ వన్ కిస్. ఓకేనా!” అన్నాడు. అన్నీ అతనే మాట్లాడేస్తుంటే ఆమెకి ఏమనాలో అర్ధం కావడం లేదు. ఆమె ఆలోచనలతో సంబంధం లేనట్టు, ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా ముద్దుపెట్టాడు. ఒళ్ళు ఝల్లుమంది ఆమెకి.

1 Comment

Comments are closed.