నేను వదల్లేదు – Part 3 142

ఇంకొక 10నిమిషాల్లో మార్టేరు రోడ్ పక్కన పొలంలో ఉన్న బెంచీల మీద ఉన్నాం.
అక్కడ ఇంకా కొంత మంది వేరే ఊళ్ళ నుంచి వచ్చిన మా చుట్టాలలో మందుబాబులు ఉన్నారు. వాళ్ళని చూసాక కొంచెం ధైర్యం వచ్చింది.
మా బావ ” ఏం తాగుతావ్ రా?” అన్నాడు.
“నాకు అలవాటు లేదు. వద్దు బావా” అన్నాను లోపల కోరికను అణిచిపెట్టి.
“మేము ఏమన్నా తాగుబోతులమేంట్రా? బీర్ తెప్పిస్తా” అన్నాడు.
“వద్దు బావా ఎందుకులే” అన్నా వినిపించుకోకుండా స్ట్రాంగ్ తాగలేను అనుకుని RC లైట్ తీసుకువచ్చాడు.
నాకు తాగాలని ఉంది. మళ్ళీ వాళ్ళ ముందు బాగోదు అనిపిస్తుంది. ఇలాంటి అలవాట్లు చేసుకుని పాడైపోకూడదు అనిపిస్తుంది.
నాలో ఆ మూల గదిలో గోడ పక్కన ఉన్న మంచితనం బయటకి వచ్చి నాతో “నేను తాగను బావా. నాకు వద్దు” అనిపించింది.
“రేయ్ నానీ.. తెప్పించినప్పుడు తాగు. లేకపొతే పగలగొట్టేస్తాను” అన్నాడు కోపంగా.
మనసులో మిగిలిన ఆ మంచితనం కూడా బయటకి వచ్చేసాక ఇంకేంటి నా బొంద. తాగేద్దాం అని చెయ్యి ముందుకు చాపబోయాను.
ఇంతలో వాడి చిన్నాన్న “ఎందుకులేరా ఇబ్బంది పెడతావ్? నేను తాగేస్తాలే” అని బాటిల్ అందుకున్నాడు. నాకు ప్రాణం ఉసూరుమంది.
కానీ మా బావ “అక్కడ పెట్టండి చిన్నాన్న. మీకు కావాలంటే కొత్త బాటిల్ రప్పిస్తాను. అది అక్కడ పెట్టేయండి” అన్నాడు స్థిరంగా.
ఇంకా ఆలోచించిన ఆశాభంగం అని మీ కోసమే తాగుతున్నాను అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎత్తిన బీర్ దించకుండా లేపేసాను.
అందరూ అలా స్టన్ అయిపోయి చూసారు. నాకు పెద్దగా ఎక్కినట్టు అనిపించలేదు. అలాగే అక్కడి నుంచి వచ్చేసి మా ఇంటి ముందు వాటర్ ట్యాంక్ ఎక్కేసి నిద్రపోయాను. కానీ పొద్దున్నకి మంచి భలే ఉంది. సో మొదలుపెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయాను.
తర్వాత కొన్ని రోజులకి మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది రమ్మని పిలిచారు. గెంతుతూ వెళ్ళిపోయాను. రాత్రి మా హైస్కూల్ లోపలే 2 బీర్లని గుటకాయస్వాహా చేసేసాను. తాగేసాక మా వాళ్లు సిగరెట్ ముట్టించారు. అమ్మ దీనెమ్మా దీనితో నా బతుకు నాశనం అయిపోతుంది అని తాగనంటే తాగను అన్నాను.
ఏమీ కాదు అలా పీల్చి ఇలా వదిలేయ్ అని చేతికి సిగరెట్ అందించారు.
భయంగానే వాళ్లు చెప్పినట్టు చేశాను. కానీ మేము ఎవ్వరు నిజంగా కాల్చేవాళ్ళం కాదు. అది “mouth fagging”. కానీ మేము సిగరెట్లు కూడా కాలుస్తున్నాం అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాం.
రాజమండ్రి GIET లో ఇంజనీరింగ్ స్టూడెంట్ గా నా ప్రస్థానం మొదలయ్యింది. ఏదో తెలియని గుబులు, ఒక రకమైన ఉత్సుకతల కాలేజీలో అడుగు పెట్టాను.
క్లాస్ లో కూర్చున్న కొంత సేపటికి మా సీనియర్స్ క్లాస్ లో అడుగు పెట్టారు. అందరినీ పరిచయం చేసుకుంటున్నారు. సెల్యూట్ చేయమని, SD చెప్పమని రకరకాలుగా ఆడుకుంటున్నారు. నేను మొదటి రోజు అయినా T షర్ట్ లో వెళ్ళాను. నన్ను కూడా రకరకాల ప్రశ్నలు వేశారు. నచ్చిన వాటికి సమాధానం చెప్పాను. కొన్నిటికి మౌనమే నా సమాధానం అయ్యింది. కానీ నా చూపుల్లో చురుకు చూసి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ T షర్ట్ లో నుంచి పొంగుతున్న నా జబ్బలు చూసి అమ్మాయిలు నా చుట్టూ చేరి ప్రపోజ్ చేయమని, ఫోన్ నంబర్ కనుక్కోమని నానా విధాలుగా టీజ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఇష్టమైన పనులే అవ్వడం మూలంగా నేను కూడా వాళ్లతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను.
కానీ అక్కడే వచ్చింది చిక్కు..
వాళ్లేదో మా జూనియర్స్ ని పటాయిద్దామని వస్తే నేను సీనియర్స్ ని కెలకడం పాపం వాళ్ళకి నచ్చలేదు.
గుద్దల్లోంచి కాలిపోయిన వాసన వస్తుండగా మా సీనియర్స్ బ్యాచ్ నన్ను పిలిచింది.
అందులో ఒకడు, పేరు పవన్ అని.. “రేయ్ నీ పేరేంట్రా ?” అని అడిగాడు.
నేను “నరేష్..”
“లాస్ట్ లో సార్ ఏది రా?”
“అబ్బే.. లాస్ట్ లో సార్ లేదు. జస్ట్ నరేష్ అంతే” అన్నాను. ఆ మాటకి వెనకాల అమ్మాయిల గుంపు నుంచి కిసుక్కుమని నవ్వులు వచ్చాయి.
అంతే అక్కడ వాడికి ఇగో హర్ట్ అయ్యింది. సీరియస్ గా నా కాలర్ పట్టుకుని “పిచ్చి పిచ్చిగా ఉందా? నా కొడకా ర్యాగింగ్ బ్యాన్ చేసారు అనుకున్నావేమో? దారిలో వెళ్తుంటే ఎవడు చెయ్యి వేసాడో తెలిసే లోపు హాస్పిటల్ లో ఉంటావ్” అన్నాడు నన్ను దగ్గరికి గుంజి.
నేను వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ” ఏ? హాస్పిటల్ దగ్గరే కొడతారా ఏంటి?” అన్నాను వెటకారంగా.
వాడికి కోపం నషాళానికి ఎక్కి రెండు చేతులతో నా కాలర్ పట్టుకున్నాడు.
నేను కూల్ గా” బాసూ.. నన్ను చూసావు కదా? మీరందరూ నన్ను కొట్టడం మేటర్ కాదు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కొడితే మాత్రం హీరో అయిపోతాను. నన్ను ఇలాగే ఉంచండి. హీరోని చెయ్యొద్దు. నన్ను కొట్టారు అనుకోండి ర్యాగింగ్ లో బుక్ అవుతారు. అదే నేను కొట్టాను అనుకోండి మీ క్లాస్ గర్ల్స్ ముందు ఫూల్స్ అవుతారు. కాబట్టి ముందు నా కాలర్ వదిలేయడం మంచిది” అన్నాను.
మరుక్షణం మా క్లాస్ ఖాళీ అయింది. బయట సీనియర్స్ ర్యాగింగ్ చేయడం నేను ఉప్మాలో కరేపాకులా పక్కన పెట్టేయడం సర్వ సాధారణం అయిపోయింది.
2 నెలలకి మమ్మల్ని సెక్షన్ల కింద విడదీసి పడేసారు. క్లాస్ మొత్తం ఫుల్ స్త్రెంగ్థ్ వచ్చేసింది. సీనియర్స్ తో అప్పుడప్పుడు గొడవలు సాధారణం అయిపోయాయి. నాకు క్లాస్ లో చాలా మంది ఫిదా అయిపోయారు.. మగవాళ్ళే లెండి.
ఏదో మేమందరం కలిసి చైన్ బ్యాచ్ లా తయారయ్యాము. ఇవన్నీ పక్కకి పెట్టేస్తే మా క్లాస్ లో ఇద్దరు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను లవ్ చెయ్యడానికి. వాళ్ళు రాజీవి, సంతోషీ..
కానీ రాజీవి కి లైన్ వేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. కానీ అప్పటికి నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్ పృథ్వీ గాడు “బావా అది నాది రా” అన్నాడు.
“అలా ఎలా దెంగుతుంది బే.. ఇద్దరిలో ఎవరికి పడితే వాళ్ళకి” అన్నాను నాకు వదులుకోవడం ఇష్టం లేక.
కానీ వాడికి నేనంటే ప్రాణం, బయటకి మొత్తం వాడితోనే తిరుగుతాను. ఇంకా నాకు స్పాన్సర్ కూడా వాడే. అకేషన్ కానీ వెకేషన్ కానీ మై ఎంప్టీ హాండ్స్ ఆన్ హిస్ బౌంసీ హెడ్.. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ వాడి నెత్తి మీద చెయ్యి పెట్టేస్తానన్నమాట..
వాడు ఇంక కాళ్ళు పట్టుకునే స్టేజికి వచ్చేసాడు. సర్లే మన అగ్గిపెట్టెలో ఇంకొక పుల్ల ఉంది కదా అని నా మైండ్ లో దానిని చెల్లిలా ఫీడ్ చేసేసుకున్నాను.
కొన్నాళ్ళు సంతోషీ వెనకాల తిరిగాను.