ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ 204

“ఎండీ గారు ఈ అసైన్మెంట్ నాకు ఇచ్చారు. అక్కడకి వెళ్లే స్టాఫ్ ను కూడా నేను సెలెక్ట్ చేయాలి ”
“ఎంత మందిని మేడం ”
“ముగ్గురు ఒక త్రీ మంత్స్ వెళ్తే మరో ముగ్గురు త్రీ మంత్స్ వెళ్తారు ”
” నాకు రాజుకు కూడా ఛాన్స్ ఇవ్వండి మేడం”
“అక్కడ ఫ్రీ గా దుకాణం తెరవవచ్చా ”
“సారీ మేడం ”
“సారీ. లల్లి సరదాగా అన్నాను. ఇక్కడ ఇంకో విషయం ఉంది ”
“అక్కడ ఉన్న స్టాఫ్ వల్ల సెక్సువాల్ హర్రస్మెంట్ అప్పుడప్పుడు ఉంటుంది ”
“అంత దారుణంగా ఉంటారా మేడం ”
“నాకు పూర్తి స్థాయిలో మందు అక్కడే అలవాటు అయ్యింది. అలాగే నాకు సెక్సువాల్ హర్రస్మెంట్ జరిగింది ”
“అవునా మేడం ”
“అవును. అక్కడ ఉన్న రేలషన్శిప్ మేనేజర్ కు మన ఇండియన్స్ అంటే మక్కువ ఎక్కువ. వాళ్ళని మనం తట్టుకోలేం. చాల వైల్డ్ గా బెహవె చేస్తారు ”
“ఎంత బెనిఫిట్ ఉందొ అంత కష్టం కూడా ఉంది మేడం ”
ఇక్కడ ఒక పాత్ర పరిచయం అవుతుంది. ఆ పాత్ర పేరు హరి ఇతను శిరీష బాయ్ ఫ్రెండ్. అన్ని మంచిగా జరిగితే ఈ స్టోరీ ఇలా ముందుకుపోదు.
ఇంతలో సడన్ గా ఒక బైక్ అడ్డంగా వస్తుంది. శిరీష సడన్ బ్రేక్ వేస్తుంది. ఒక వ్యక్తి కొంచం గెడ్డంతో ఉండి కింద పడ్డ బైక్ ను పైకి లేపుతాడు
శిరీష ఆ వ్యక్తితో
” ఏరా కళ్ళు కనపడట లేదా ? అడ్డంగా వచ్చావు”
“చూడండి మేడం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు ”
“ఏమి మాట్లాడ కూడదు . కార్ సొట్ట పడితే ఎవరు బాగు చేస్తారు ”
“నేను సిగ్నల్ ఇచ్చిన మీరు చూసికోకొండా వచ్చి అరుస్తున్నారు ”
“నువ్వు … నువ్వు ”
“మీరు …. నువ్వు ”
“హాయ్ నువ్వు తణుకు హరి కదా ”
“అవును నువ్వు మన రాజమండ్రి లో ఉండే శిరీష కదూ ”
“గుద్దటానికి నా కార్ దొరికిందా హరి … ”
“లేదు సిరి … నేను సిగ్నల్ ఇస్తే నువ్వు ఆగుతావు అనుకున్న”
ఇంతలో లల్లి వస్తుంది శిరీష లల్లి తో
” లల్లి ఈయన నా ఫ్రెండ్ హరి ”
లల్లి హరి తో
“నమస్తే సర్ ”
“నమస్తే అమ్మ”
శిరీష హరితో
” నీకు సురేష్ గుర్తు ఉన్నాడా ”
“ఎవరు కోటీశ్వరుడు సురేష్ … ”
“అవును. ”
” కోటీశ్వరుడు అవ్వాలి అంటే చిట్కాలు చెప్పేవాడు ”
“అవునా ”
“వాడి చెప్పే సోదాతో స్రవంతి ప్రేమ లో పడిపోయింది ”
“స్రవంతి పోయింది. స్రవంతి చెల్లెలు లలిత . ఈమె సురేష్ భార్య ”
“అవునా ”
హరి లలిత తో
“హాయ్ లలిత ”
“హాయ్ బావ ”
“నేను వాగినట్టు సురేష్ ఏమి చెప్పకు ”
“బయపడకండి నేను ఏమి చెప్పను ”
“థాంక్స్ అమ్మ ”
శిరీష హరితో
“ట్రాఫిక్ అడ్డం. మనం ఈ హోటల్ లో మాట్లాడుకుందాం ”
“శిరీష నేను వెళ్ళాలి మా ఆవిడా నా కోసం వెయిట్ చేస్తుంది. మరల కలుద్దాం. ”
“సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు ”
శిరీష హరి ఫోన్ నంబర్స్ మార్చుకొంటారు
శిరీష కళ్ళలో ఆనందం భాష్పాలు ఉంటాయి హరి కళ్ళలో ఒక కొత్త వ్యక్తి ని పలకరించి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు
శిరీష లల్లి కారులో ఆఫీస్ కి బయలు దేరుతారు