రాజ్యం 3 265

డోనీ ఇద్దరు చేతిలో చెయ్యి వేసి అందరూ ముందు నిలబడి “guy’s మేము మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము” అని చెప్పి విలియమ్స్, డోనీ ముందు మోకాలి పైన నిలబడి తన చేతికి ఉంగరం పెడుతూ “డోనీ క్రాటేజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా” అని అడిగాడు దానికి డోనీ కూడా yes అని గట్టిగా అరిచి చెప్పింది, దాంతో సిద్ధార్థ కూడా లేచి సంధ్య నీ తన మీదకు లాగి “మేము కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు తమ ఉంగరాలు చూపించారు” దాంతో అందరూ వాళ్ల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ champagne పొంగించారు అలా సాయంత్రం సరదాగా గడిపిన తరువాత సంధ్య ఒకటే రూమ్ లో ఉండగా తనకు private number నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను కంగారు గా ఫోన్ ఎత్తింది “చూడండి మీరు మా నాన్న ట్రీట్మెంట్ కీ డబ్బులు ఇచ్చారు అనే విశ్వాసం తో ఒక సారి మీరు చెప్పినట్టు చేశాను ఇక మీదట అలా చేయలేను” అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంతా సిద్ధార్థ ఫోన్ నుంచి స్పీకర్ లో వింటున్న వినోద్ “నువ్వు చెప్పింది నిజమే రా తను చాలా అమాయకురాలు” అని చెప్పాడు.

అలా రెండు రోజుల తరువాత అందరూ Edinburgh కీ తిరిగి వెళ్లారు అప్పుడు న్యూస్ లో సంధ్య తో ఆ పనులు చేయించిన opposition పార్టీ లీడర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన వార్త విని సంధ్య కొంచెం కుదుట పడింది దాంతో ఆలస్యం చేయకుండా సిద్ధార్థ కీ నిజం చెప్పాలి అని వెళ్లి నిజం చెప్పింది అప్పుడు దానికి సిద్ధార్థ నవ్వి “నాకూ అంతా తెలుసు సంధ్య నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ఇంక భయం వదిలేయి ఈ రోజు సాయంత్రం మనం లండన్ వెళ్లుతున్నాం రెడీ అవ్వు అని చెప్పాడు అప్పుడు సంధ్య సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టి తనని నమ్మినందుకు, అర్థం చేసుకున్నందుకు అలా బహుమతి ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరు లండన్ కీ రెడీ అయ్యారు విలియమ్స్, డోనీ నిశ్చితార్థం కోసం అలా వాళ్లు హెలికాప్టర్ దగ్గరికి వెళ్లగానే అదే helipad పక్కన ఉన్న runway మీద రమేష్ ప్రైవేట్ ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది దాంతో సిద్ధార్థ, సంధ్య నీ తీసుకొని వెళ్లి రమేష్ కీ పరిచయం చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు రమేష్ తన చేతిలో ఉన్న గన్ తో సంధ్య నీ కాల్చి సిద్ధార్థ నీ కూడా కాల్చి వెళ్లిపోయాడు వినోద్, సింగ్ ఇద్దరు అక్కడే ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి దాంతో రమేష్ హెలికాప్టర్ లో లండన్ కీ బయలుదేరాడు దాంతో వినోద్, సిద్ధార్థ నీ సంధ్య నీ ఇద్దరిని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లాడు అప్పటికే సంధ్య ప్రాణం పోయింది సిద్ధార్థ కీ పల్స్ లేక పోవడంతో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని లేచ్చాడు సిద్ధార్థ.

సిద్ధార్థ కళ్లు తెరిచి చూస్తే తనకి వినోద్ కీ ఇద్దరికి కరెంట్ వైర్ లు కట్టి షాక్ ఇచ్చి వాళ్ళని స్ప్రుహ లోకి తెచ్చారు అప్పుడు ఇలియాజ్ విజిల్ వేస్తూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి “ఎలా ఉన్నారు సార్ అని అంటూ వినోద్ వైపు చూసి అరే మేజర్ సాబ్ చెప్పా కదా మీ ఫ్రెండ్ నీ జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా నా గుప్పెట్లో ఉన్నారో” అని చెప్పి నవ్వాడు “మీ తాలిబన్లు ఆడింగి జాతి కీ చెందినోళ్లూ అని మళ్ళీ నిరూపించావ్ రా ఇలియాజ్ దమ్ముంటే కట్లు విప్పు రా నీ తల నరికి నీ చేతుల్లోనే పెడతా” అన్నాడు వినోద్ దానికి ఇలియాజ్ కీ కోపం వచ్చి వినోద్, సిద్ధార్థ ఉన్న ఛైర్ కీ కాలి తో కొట్టాడు “మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా” అన్నాడు అప్పుడే సలీం వచ్చి అందరి ముందు కాల్పులు జరిపి ఇలియాజ్ మోకాలి పైన కాల్చి అందరినీ చంపి వినోద్, సిద్ధార్థ నీ విడిపించాడు అప్పుడు సిద్ధార్థ, సలీం చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇలియాజ్ భుజాల పైన కాల్చి నుదుటి పైన గన్ పెట్టి “ఒకటే question ఆ రోజు మా మీద ఎలా ఎటాక్ చేశావ్ మా నాన్న వస్తున్నాడు అని నాకే తెలియదు నీకు ఎలా తెలుసు ఎవరూ నీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది” అని అడిగాడు దానికి ఇలియాజ్ నవ్వుతూ “నీ బాబే రా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది” అని అన్నాడు అది విని సిద్ధార్థ, వినోద్ షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు.

ఇలియాజ్ చెప్పింది విన్న తరువాత వినోద్, సిద్ధార్థ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు “ఏంట్రా షాక్ అయ్యరా ఏమీ అనుకున్నావ్ మీ బాబు గురించి వాడు ఏమైనా దేవుడా నీతి తో గెలవడానికి మీ బాబు చాలా పెద్ద స్కెచ్ వేశాడు గెలవడం కోసం మీకు గుర్తు ఉందో లేదో నాలుగు సంవత్సరాల క్రితం elections కీ రెండు నెలల ముందు ఇండియా లో దసరా పండుగ తో పాటు మొహరం కూడా కలిసి వచ్చింది అప్పుడు తమిళనాడు లోని మధురై లో దేవి ఊరేగింపు లో కొంతమంది ముస్లిమ్స్ ఊరేగింపు లో వచ్చే భక్తుల మీద beef మాంసం పోశారు దాంతో అక్కడ పెద్ద గొడవలు జరిగాయి దాంతో పాటు కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ లో మత ఘర్షణలు జరిగాయి ఆ గొడవలు చేయించింది మీ నాన్న రమేష్ ఠాకూర్ ఎందుకంటే మీ నాన్న పార్టీ నాయకులు ”ల పైన చాలా వ్యతిరేకత చూపించడం తో ”లు అంతా మీ నాన్న opposition పార్టీకి మద్దతు తెలిపారు దాంతో జనం లో వాళ్ల పార్టీ image పెంచడం కోసం మీ బాబు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా కీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సైన్యం నీ వెనకు తరలిస్తాను అని మాట ఇచ్చాడు దాంతో యూసఫ్ రజా మా భాయ్జాన్ మూసాఫ్ తో మీ నాన్న కీ డీల్ కుదుర్చాడు దాంతో నను సోఫియా కీ బాడి గార్డ్ గా పంపి మీ నాన్న అక్కడికి వచ్చినప్పుడు తన మీద తనే ఎటాక్ చేయించుకుని నా పేరు బయటకు తెచ్చి ఇండియా లో ”లకు terrorists లకు సంబంధం లేదని ఇండియా లోని ”లు ఎప్పుడు దేశ భక్తి తో ఉంటారు అని పత్తితి కబుర్లు చెప్పి వాళ్ల అభిమానం గెలుచుకున్నాడు దాంతో పాటు ఈ మత ఘర్షణలు రేపి హిందూ ”లు ఎప్పుడు సోదర భావంతో ఉండాలి అని చెప్పి గొడవకు కారణమైన మా సంస్థ కీ చెందిన ఇద్దరు terrorist లను మిలిటరీ తో చంపించి ఆ sympathy తో గెలిచాడు మీ బాబు దాంతో పాటు ఈ సారి గెలవడం కోసం చాలా పెద్ద స్కెచ్ వేశాడు కాకపోతే ఎవడు చేశాడో తెలియదు ఆ బాంబ్ బ్లాస్ట్ చేశాడు చా ఈ సారి మాకు 1500 వందల కోట్లు వచ్చేవి ” అని అన్నాడు దాంతో సిద్ధార్థ ఇంకో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇలియాజ్ నీ కాల్చి చంపాడు.

1 Comment

  1. There is nonew posts

Comments are closed.