Love + Love!లవ్+లవ్! 175

“అఫ్ కోర్స్ వుయ్ ఆల్రెడి వెంట్ దట్ స్టేజ్” అన్నాడతను అదే స్థాయిలో ఆమె పేంటీస్ ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ.
మగవాడికి ఏ అమ్మాయైనా ఒక్కసారి ఛాన్సిస్తే చాలు,తర్వాత ఆమెమీద పూర్తి హక్కులున్నట్లు ఫీలవుతాడు.ఏమన్నా తన చేతలాపడు. అది ఒక్క మగవాళ్లకే వర్తించే విషయం కాదు.అమ్మాయిలుకూడా అంతే.ప్రియుడితో ఒక్కసారి ఇదైతే చాలు అతని మీద సంపూర్ణహక్కులున్నట్టుఫీలవుతారు.
ప్రస్తుత పరిస్థితిలో నివేశ్ ని కంట్రోల్ చేయకపోతే కారునే పడకగదిగామార్చేసేటట్టున్నాడు.అతనికి కొంత బ్రేక్ వేయకపోతే లాభంలేదు అనుకుంది.రోడ్డుపక్కన పార్కింగ్ ఏరియాలోకి పోనిచ్చి సడన్ గా ఇంజెన్ ఆపేసింది.
అతను ఉలిక్కిపాటుగా ముందుకిచూసి “అమ్మయ్య నా ప్రపోజల్ కిఅంగీకరించావన్నమాట”ప్రియుడు బాధపడుతుంటే చూసి తట్టుకోలేవని నాకు తెలుసుస్వీటీ! .. అతని మాటలకి ఫుల్ స్టాప్ లా కారుడోర్ తీసింది నవ్య.నివేశ్ కంగారుగా తనచేతిని వెనక్కి లాగేసుకొని, ఏమిటాపని? డోరెందుకు తీసావ్? అన్నాడు.
“ఎందుకా? సెక్యూరిటీ ఆఫీసర్లు న్యూసెన్స్ కేసుకింద మనల్ని బుక్ చేయకుండావుండటానికి.కమాన్ కారు దిగు”అంది నవ్య పొర్లుకొస్తున్న చిరునవ్వునాపుకుంటూసీరియస్ గా.
అతని నెత్తిమీద చన్నీళ్లు గుమ్మరించినట్లైంది.నీరసంగా కారు దిగాడు.నవ్య తిరిగి డోర్ లాక్ చేసింది.వాడిపోయిన మొహంతో వున్న నివేశ్ ని చూడగానేఆమెకి జాలి వేసింది. ఒకవిధంగా చెప్పాలంటే కారులో అతను చేసిన చిలిపిపనులకిఆమెకి వొళ్లు వేడెక్కిపోయి ఏ క్షణాన్నైనా అదుపుతప్పేట్టుంది.అతనికంటే తనకే ఆత్రంగా వుంది.అతని చేతిని తన చేతిలోకి తీసుకొని నొక్కి వదులుతూ “అంతలోనే ఇలా అయిపోయావేం?”….. అంది.
“ఏం లేదు! మీ అమ్మాయిలను నమ్మడం అంత బుద్దితక్కువ పని ఇంకొకటిలేదు.”అన్నాడు కోపంగా.
“నిన్ను మొద్దూ అని వూరికే పిలవలేదు.దేనికైనా సమయం, సందర్భం వుండాలి.ఓగంటసేపు ఓపికపడితే నువ్వెన్నడూ ఊహించని ఆనందం పొందొచ్చు”అంది నవ్య.
అటూ ఇటూ చూసి ఆ క్షణంలో రోడ్డుమీద అక్కడ తమని చూడటానికి ఎవరూ లేరని నిశ్చయించుకుంది.
అతను ఊహించనంత వేగంగా అతని ముందుకొచ్చి చటుక్కున అతని పెదవులపై ముద్దుపెట్టుకొని అదేవేగంతో దూరంగా జరిగింది.
నివేశ్ బిత్తరపోయాడు. నవ్య డేరింగ్ గర్ల్ అని, తను చేయదల్చుకున్నది ఎవర్నీ లెక్కచేయకుండా చేస్తుందని తెల్సు.
కానీ ఇలా నడిరోడ్డుమీద , పట్టపగలు ఎవరైనా చూస్తారనే భయం లేకుండా ముద్దు పెట్టేస్తుందనుకోలేదు.
బెల్లంకొట్టిన రాయిలా ఏవిటలా నిలబడిపోయావ్? పదా అంది నవ్య వెక్కిరింతగా.
ఏంటి నువ్విప్పుడు చేసిన పని? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
“పిచ్చిమొద్దూ ఎవరో ఏదో అనుకుంటారని భయపడేవాళ్లు ఏమీ చెయ్యలేరు. చూస్తే ఏమనుకుంటారు? ఆ కుర్రాడి మీద ఈ అమ్మాయికి ఎంత ప్రేమో, లేకపోతే ఇలా నడిరోడ్డుమీద ముద్దు పెట్టేసుకుంటుందా అనుకుంటారు.లేదంటే అలాంటి ఛాన్స్ తమకు రాలేదని భాధపడతారు”. ఆలోచిస్తూ టైం వేస్టుచెయ్యకు.కొనాల్సినవి చాలా వున్నాయి అంది నవ్య.
ఏం కొందామనుకుంటున్నావ్?
తినబోతూ రుచి అడగడందేనికి? చూస్తూ ఉండు అంటూ అతన్ని సూపర్ మార్కెట్ లోనికి లాక్కుపోయింది.
పావుగంటలో ట్రే మొత్తం నిండిపోయింది.కింగ్ సైజ్ మాస్టర్ బెడ్ కి సరిపోయే రెండు బ్లాంకెట్స్, ప్లేయింగ్ కార్డ్స్, ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్….
నివేశ్ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.ఆ సరంజామా అంతా చూస్తుంటే నవ్య మెదడులో ఏదో పెద్ద ప్లానే వున్నట్టుంది.
కౌంటర్ దగ్గరికొచ్చాక బిల్ అవడానికే 10 నిముషాలు పట్టింది.ఈలోపు నివేశ్ ఆవస్తువులన్ని రెండు బాస్కెట్ లో సర్ది చెరో చేత్తో పట్టుకున్నాడు.ఓ బాస్కెట్ నాకివ్వు అంది నవ్య చేయిచాపుతూ.
“చాల్లే.. నీ నడుము అసలే రొమ్ముల భారానికి వంగిపోతుందని నేను దిగులుపడుతుంటే, ఇది కూడా మోస్తే ఇంక అంతే సంగతులు” గుసగుసగా అన్నాడామె చెవిలో.సామాన్లన్ని కారు బాక్ సీటులో సర్దాక కార్ స్టార్ట్ చేసింది నవ్య.ఇప్పుడెక్కడికెళ్తున్నాం? ఆమె నడుం చుట్టూ చెయ్యివేస్తూ అడిగాడతను.
“కొన్ని విషయాలు వింటే థ్రిల్లింగ్ గా వుండవు.వెయిట్ చెయ్యి బాబు!”ఆమె నడుంని మెల్లగా స్క్వీజ్ చేస్తూ చిలిపిపనులు చెయ్యడం స్టార్ట్ చేసాడు నివేశ్.
“ఆ చెయ్యి అలా పైకి వేస్తే మన కారు ఏ చెట్టుకో గుద్దుకుంటుంది నవ్య సీరియస్ గా.ఆ మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు నివేశ్. నవ్యా ఇంకా ఎంత దూరం?
“జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవింగ్”సరిగ్గా పదోనిముషం అవుతుండగా కనబడిందో పెద్ద మామిడితోట.చెట్లు ఏపుగా పెరిగున్నాయి.