Love + Love!లవ్+లవ్! 175

హాయ్ అంటూ పలకరించింది ఎర్రజీరలు నిండిన కళ్ళతో.ఏంటి గురూగారు ఆరోజు ఎంతో బుధ్దిమంతుడ్లా కనిపించారు.ఇక్కడ ఈ సర్ప్రైజ్ మీట్ ఏంటీ?
ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాడు నివేశ్.
ఇద్దరూ ధియేటర్ లోంచి బయటకొచ్చారు.
బైదిబై మన పరిచయం ఇంతవరకూ వచ్చాక కనీసం మీ పేరయినా చెబుతారా కాస్త చనువుగా అడిగాడు.
ఆ రోజు మోహిని అని పిలిచారు కదా.అదే నా పేరనుకుంటే నష్టం ఏంటి కొంటెగా బదులిచ్చింది నవ్య.
ఆమెకు తన అసలు పేరు చెప్పడం ఇష్టం లేదని గ్రహించాడు నివేశ్.ఇంతవరకూ వచ్చిన పరిచయం ముందుకు కొనసాగాలనుకుంటే ఆమె తన పేరు ఎందుకు చెప్పదు?
తనని టీజ్ చెయ్యడానికే ఆమె అలా అనివుంటుంది.అతని ఆలోచనలు చెదరగొడుతూ ఆమె ప్రశ్నించింది
“ఇంతకూ మీరేం చేస్తుంటారు?”
జవాబుగా తన విజిటింగ్ కార్డ్ తీసి నవ్యకి అందించాడు. అందులో అతను పని చేస్తున్న కంపెనీ పేరు, ఫోన్ నెంబరూ ఉన్నాయి.
కార్డు అందుకొని చెయ్యి వూపి కారువైపు అడుగులేసింది నవ్య.
ఆమె వెళ్ళిపోతోందని గమనించి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? ఆశగా అడిగాడు నివేశ్.
కలుసుకోవడం దేనికి? అతని తహ తహ గమనించనట్టు అడిగింది. ఏం జవాబు చెప్పాలో తోచక తడబడ్డాడు. పెదాల వెనక నవ్వుని దాచుకొని బయటపడకుండా అందామె…చాలా చిన్న ప్రశ్న ఇది ‘కలుసుకోవడం ఎందుకనేది తెలుసుకోకుండా కల్సుకోవాలనుకోవడం’… ప్చ్! ఐ పిటీ ఆన్ యు షార్ప్ గా చెప్పి కార్ స్టార్ట్ చేసింది.
మీరెక్కడుంటారు?
మా ఇంట్లో..
అదే మీ ఇల్లు ఎక్కడా అని… నసిగాడు నివేశ్..
ఈ సిటీలోనే…! చెబుతూ కారుని ముందుకు పోనిచ్చింది..
ధియేటర్ లో తననంత ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఇచ్చి బయటకొచ్చాక ఏమీ జరగనట్టు వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతేనేమో! ఏకాంతంలో వున్నప్పుడు ఎంతవరకూ అయినా వెళ్ళనిస్తారు.కొంచెం వెలుతురు మీద పడితే చాలు ఫ్రీజ్ అయిపోతారు ఆమెను తిట్టుకుంటూ తన రూం వైపు నడక స్టార్ట్ చేసాడు.

సార్ మీకు ఫోన్ వచ్చింది.మేనేజర్ గారు పిలుస్తున్నారు ఎటెండర్ పిలవడంతో బాస్ గదిలోకెళ్ళాడు నివేశ్.
తనకీ టైంలో ఫోన్ చేసిందెవరబ్బా? ఆఫీసుకి ఫోన్ చేసేంత పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా ఈ ఊర్లో…
హలో నివేశ్ హియర్…
“ఇట్స్ మీ నివేశ్” హస్కీగా వినిపించింది లేడీ వాయిస్.
ఎవరూ??
నువ్వు ముద్దుగా పిల్చుకున్న మోహినిని.. అప్పుడే మరిచిపోయావా?
మరిచిపోవడమా? కంగారు పడ్డాడు నివేశ్.మీ గురించే ఆలోచిస్తున్నాను.
నా గురించే ఆలోచిస్తున్నావా? ఏమని?
మీరెక్కడుంటారో తెలుసుకోవటమెలా అని?
ఎందుకు?
వెంటనే జవాబు చెప్పలేక పోయాడతను.
పోనీ ఎందుకో నేను చెప్పనా? అందామె.
చెప్పండి చూద్దాం..
నన్ను నీ కౌగిలిలో నలిపేయాలని… బరువుగా కదిలే నా గుండెలని కుమ్మేయాలని…. యామై రైట్?
నివేశ్ కి నోట మాట రాలేదు. ఓ ఆడపిల్ల నోటినుండి అలాంటి మాటలు వస్తాయని అతనూహించలేదు. ఆమె కంఠంలో ధ్వనించిన కోరికకి స్టన్ ఐపోయాడు.
నివేశ్ నిన్ను వెంటనే చూడాలనిపిస్తోది.ఇప్పుడు నువ్వేం చేస్తున్నావ్?
“ఆఫీసులో వర్క్ చేస్తున్నాను” చెప్పాడు నివేశ్
అవును కదూ! ఆఫీసయ్యాక ఏం చేస్తావ్?
ఏం చేస్తాను?హొటెల్ లో భోంచేసి రూంకి పోతాను జవాబిచ్చాడు.
ఆఫీసయ్యాక ఇక్కడకు రాకూడదూ? హాయిగా భోజనం చేసి ఇక్కడే ఉండొచ్చు” ఆమె గొంతులో కవ్వింపు..
మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదుగా?
నేను చెప్తా కదా….ఎడ్రస్ చెప్పింది నవ్య. నీకోసమే ఎదురు చూస్తుంటాను. నువ్వు రాకపోతే నా కళ్ళు కాయలైపోతాయి.
“దోరగా వున్న కాయలైతే తినడానికి రుచిగా వుంటాయి”
నువ్వు తొందరగా వస్తే, దోర కాయలేం ఖర్మ …అరమగ్గిన పళ్ళే నీకిస్తాను.”నీ ఇష్టం తింటావో, రసం తాగుతావో” కవ్వింపుగా తియ్యని నవ్వు.
వెయిట్ చేస్తుంటాను!అంటూ “ప్చ్” మౌత్ పీస్ లో ముద్దుని ముద్రించింది.
ఆ ముద్దు తన పెదవులనే తాకినట్టు టెంప్ట్ అయ్యాడు నివేశ్.
తప్పకుండా అంటూ రిసీవర్ పెట్టేసాడూ. అతని మనసు గాల్లో తేలిపోతున్నట్టుంది.
తలతిప్పి మేనేజర్ ని చూసాడు. మేనేజర్ అదేమీ పట్టించుకోనట్టుగా ముందున్న ఫైల్ లో తలదూర్చి వున్నాడు. దొంగ వెధవ..! అలా వుండి తన మాటలన్నీ వినే వుంటాడనుకుంటూ బయటకొచ్చేసాడు నివేశ్.