సరిగ్గా 12 గంటలకి డోర్ కొడుతున్న సౌండ్ వచ్చి లేచింది కళ్ళు తెరిచింది మేఘన.
“మేఘన మేఘన…..బయటకి త్వరగా” అంటూ ప్రియా కంగారుగా పిలుస్తున్న అరుపులు వినిపించాయి.
మేఘన వెంటనే పైకి లేచి ఏమైందో అని కంగారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. అంతా చీకటిగా ఉంది.
“ప్రియా…. ఎక్కడ ఉన్నావ్?” అంది మేఘన కంగారు గా
ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. ఎదురుగా బలూన్స్ అవి ఇవి కట్టి డెకరెట్ చేసి ఉన్నాయి.
“హ్యాపీ బర్త్డే బేబీ డాల్” అంది ప్రియా, మేఘన ని గట్టిగా వాటేసుకుని.
మేఘన కి ఒక్కక్షణం అర్ధం కాలేదు. వెంటనే తేరుకొని
“థాంక్స్ ప్రియా” అంది సంతోషం గా.
తన కోసం వాళ్లిద్దరూ చేసిన ఆ డెకరేషన్ చూసి చాలా మురిసిపోయింది. ఇప్పటి వరకు లైఫ్ లో ఇలా ఎప్పుడు తన బర్త్డే జరగలేదు. ప్రియా, కిషన్ చూపిస్తున్న ప్రేమకి తన కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి.
“ఓయ్ నా క్రష్ ని ఏం చేసావ్? ఏడుస్తుంది” అన్నాడు కిషన్ ఇద్దరి దగ్గరికి వచ్చి
“నేనేం అనలేదు రా” అంది ప్రియా
“ఏమైంది మేఘన?” అన్నాడు కిషన్
“ఏం లేదు ఇలా ఎప్పుడు నాకు బర్త్డే జరగలేదు. థాంక్యూ సో మచ్, నా లైఫ్ లో ఇదే బెస్ట్ బర్త్డే” అంది హ్యాపీగా
కిషన్ వెంటనే మేఘన ని దగ్గరికి తీసుకొని కౌగిలించుకుని “హాహా దీనికే ఇలా అయిపోవాలా? హ్యాపీ బర్త్డే” అన్నాడు
“థాంక్స్ కిషన్” అంది మేఘన కూడా హత్తుకుని
“మాటల్లో పెట్టి నీ క్రష్ దగ్గర నుండి హగ్ కొట్టేశావ్ కదరా” అంది ప్రియా వచ్చి కిషన్ చెవి పట్టుకుని తిప్పుతూ
“ఆఆఆహ్.. నొప్పి” అన్నాడు కిషన్ నవ్వుతూ
మేఘన కూడా నవ్వేసింది. ప్రియా, కిషన్ ని వదిలి సోఫాలో పెట్టిన కేక్ తీసుకొని డెకరెట్ చేసిన చోట టేబుల్ మీద పెట్టింది.
“మేఘన రా” అంది నవ్వుతూ
మేఘన మొహమాటం గా అక్కడికి వెళ్ళింది. కిషన్ తన చేతిలో ప్లాస్టిక్ కత్తి పెట్టాడు. మేఘన కేక్ కట్ చేస్తుంటే ఇద్దరు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. ముందుగా ప్రియా మేఘన కి కేక్ తినిపించింది. ఆ తరువాత కిషన్ కూడా వచ్చి తినిపిస్తున్నట్టు నటించి మేఘన మొహానికి ఆ కేక్ రాసాడు.
“నిన్ను……” అంటూ మేఘన కూడా కేక్ తీసుకొని కిషన్ మొహానికి రాసింది. అదంతా చూసి ప్రియా గట్టిగా నవ్వుకుంది.
“సరే రండి పిక్ దిగుదాం” అంది ప్రియా
ఇద్దరు ప్రియా దగ్గరికి వచ్చారు. తన లేటెస్ట్ ఐ ఫోన్ తీసి సెల్ఫీ తీసింది ప్రియా. పిక్స్ చాలా బాగా వచ్చాయి. కిషన్ కూడా మేఘన ని డెకరేషన్ దగ్గర నిలబెట్టి ఫొటోస్ తీసాడు. అన్నీ నచ్చేసాయి మేఘన కి. నిజంగా కిషన్ చాలా టాలెంటెడ్ అనుకుంది.
ఇద్దరు వెళ్లి మొహం కడుక్కుకుని వచ్చారు తరువాత కూడా కిషన్ కొన్ని ఫొటోస్ తీసాడు. మేఘన ఇద్దరికీ థాంక్స్ చెప్తూనే ఉంది సంతోషంగా.
“మేఘన కళ్ళు మూసుకో” అంది ప్రియా
“ఎందుకు?” అంది మేఘన
“చెప్తా మూసుకో” అంది ప్రియా
మేఘన కళ్ళు మూసుకుంది.
“ఇప్పుడు కళ్ళు తెరువు” అంది ప్రియా
మేఘన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక గోల్డ్ చైన్ ప్రియా చేతుల్లో వెళ్లాడుతూ ఉంది. వెంటనే ముందుకి జరిగి మేఘన మేడలో ఆ చైన్ వేసింది ప్రియా. దానిని చూసి షాక్ అయింది మేఘన
