ప్రాజెక్ట్ 1500

రజియా సుల్తానా ,,, పాక్,ఆఫ్ఘన్ బోర్డర్ లో చిన్న గ్రామం లో పుట్టిన ”.
విద్య కి కాపీ,,,జావేద్ ఆమెని కలిసి విషయం చెప్పినపుడు భయపడింది.
“నాకు చదువు రాదు..నేను హిందూ దేశం లో ఏమి చేయలేను”అంది.
జావేద్ ఆమె తల్లి,తండ్రికి పది లక్షలు ఇచ్చి ఇస్లామాబాద్ తెచ్చాడు రజియా ను.
ఫోటోస్ ,వీడియో లో విద్య ను చూసి “నాలాగే ఉంది”అని రెఢీ అయ్యింది..
సిటీఔటరు ఏరియా లో isi అకాడెమీ లో ట్రైనింగ్ మొదలు పెట్టారు..
చదవడం ,రాయడం నుండి విద్య ల మాట్లాడటం ,నడవడం అన్ని నేర్చు కుంటోంది రజియా సుల్తానా..
ఆమెకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు జావేద్..
+++++
విద్య ఆకర్షణకు జనం తండోపతండాలుగా రావడం,ఆమె ఉపన్యాసం విని జే జే లు పలకడం తో పార్టీ హ్యాపీ గా ఫీల్ అయ్యింది..

జావేద్ మనుశులు ఢిల్లీ ప్రెస్స్ లో చాలామంది ఉన్నారు..
అతను చెప్పాడు”చాలా క్లోజ్ గా విద్య మూవ్మెంట్స్ కావాలి,,”అని..
ప్రతి పబ్లిక్ మీటింగ్ లో విద్య నడవడం,చేతులు ఊపడం, నవ్వడం ఉపన్యాసాలు ఇవ్వడం రికార్డ్ చేస్తున్నారు..ఇస్లామాబాద్ పంపుతున్నారు.
రజియా క్రమం గా విద్య గా మారడం మొదలు అయ్యింది..చీర కట్టడం నుండి బొట్టు కాటుక అన్ని నేర్చుకుంటుంది.
+++
“అన్ని వివరాలు హేర్ కలర్ నుండి అన్ని వీడియో అంటే ఎలా”అంది రజియా..
+++
ఇండియా లో పాక్ ఏజెంట్ లు రామ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు..
ప్రతి ఒక్కరి గురించి ib వెరిఫై చేస్తోంది.
చివరికి విద్య డ్రైవర్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి గెలిచాడు పాక్ ఏజెంట్..అతనొక ప్రెస్స్ ఫోటో జర్నలిస్ట్,,డ్రైవర్ ను హెల్త్ రీజన్స్ మీద రీప్లేస్ చేయించాడు.
“మేడం నేను గ్రామానికి వెళ్తాను,ఆరోగ్యం సెట్ అయ్యాక వస్తాను,,ఈలోగా నా తమ్ముడు వస్తాడు”అన్నాడు విద్య తో వాడు.
“వెళ్ళు ,,డబ్బు తీసుకెళ్ళు సెక్రెటరీ వద్ద”అంది విద్య టిఫిన్ తింటూ.
సాయంత్రానికి అతని తమ్ముడు అంటూ పాక్ ఏజెంట్ డ్రైవర్ గా చేరాడు.పాత డ్రైవర్ పది లక్షలు తీసుకుని గ్రామానికి వెళ్ళాడు..
“నువ్వేనా అతని తమ్ముడివి”అడిగింది విద్య.
“అవును మాడం,,”
“చూడు మూడేళ్ల నుంచి అతను పని చేస్తున్నాడు ,నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తాను”అంది విద్య.
అతని డ్రైవింగ్ లైసెన్స్ ను విద్య సెక్రెటరీ తీసుకుని చెక్ చేసుకుంది.
ఐబీ రొటీన్ గా చెక్ చేసుకుని వదిలేసింది..
&&&&-
మీటింగ్ కి వెళ్తూ “తారిక్ నీ గురించి మి బ్రో ఎప్పుడు చెప్పలేదు”అంది విద్య .
డ్రైవ్ చేస్తూ నే “సొంత వాడిని కాదు,, పరిచయం ఉంది ,, మీకు డ్రైవర్ కావాలి అని చెప్పాడు”అన్నాడు Tariq.
“ఓహో అదా సంగతి “అంది సుమతి.
“నన్ను వింతగా చూడకు నేను మాడం కి సెక్రెటరీ ,నీక్కూడా బాస్ ను”అంది..
Tariq drive చేస్తూనే అద్దం లో విద్య ను చూస్తున్నాడు..
“డబ్బు కోసం ఫోటో జర్నలి స్ట్ చెప్పిన పనికి ఒప్పుకున్నాను,,దీని అందం మామూలుగా లేదు”అనుకున్నాడు.
మీటింగ్ ప్లేస్ కి వెళ్ళాక ,విద్య స్టేజ్ మీద కు వెళ్ళింది .కార్ పార్క్ చేసుకుని కూర్చున్నాడు Tariq.
పక్కనే ఎవరో నిలబడి ఉంటే కార్ దిగాడు.
“మీరా లోపల ఫోటోలు తీసుకుంటున్నారో ఏమో అనుకున్నాను”అన్నాడు .
“తీసుకున్నాను,,విద్య నిన్ను నమ్మిందా”అడిగాడు .
“రెండు రోజులే కదా”అన్నాడు Tariq.
“ఆమె వివరాలు నాకు కావాల్సినవి అడుగుతాను”అంటూ స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు.
“వాట్సప్ కన్న mail better”అని id ఇచ్చాడు.
“సార్ మీరు ఇచ్చే డబ్బు కోసం చాలా నేరాలు చేశాను,,ఇప్పుడు ఈమె వివరాలు ఎందుకు”అడిగాడు Tariq.
“నాకు తెలియదు,,విద్య గురించి నాకు ఏమి కావాలో అడుగుతాను”అని వెళ్ళిపోయాడు.
మీటింగ్ అయ్యాక విద్య వస్తుంటే ఆమె సైడ్ angel,వెనకనుండి విద్య విపు ఫోటోస్ తీసుకున్నాడు ఫోటో జర్నలిస్ట్..

వస్తుంటే చెప్పింది సుమతి “మాడం పార్టీ సెక్రెటరీ చెప్పమన్నారు,,ఈ శత్రువుల్ని ఎదుర్కోవాలంటే రాంకుమార్ గురించి మంచి బుక్ రాయించాలి అని”అంది.
“మంచిదే చిన్న బుక్ రాయవచ్చు ,కానీ రైటర్ కావాలి”అంది విద్య.
“ఫ్రీ లాన్స్ రైటర్ మజుం దార్ నీ అనుకుంటున్నారు”అంది సుమతి.
ఈ వివరాలు Tariq mail చేశాడు..
++++
మజుందార్ 35 ఏళ్ల ఫ్రీలాన్స్ రైటర్..మూవీస్ కి , పేపర్స్ కి రాస్తూ ఉంటాడు..
పార్టీ నుండి పిలుపు రావడంతో సుమతి ను కలిశాడు.
“వాట్ సెక్సీ ఏమంటోంది మి మాడం”అన్నాడు.
“షట్ up మర్యాద “అంది సుమతి.
ఇద్దరు రూం లో ఉన్న విద్య వద్దకు వెళ్లారు.
ఆమె నిలబడి నమస్కారం చేసింది..
“కూర్చోండి”అంది.
“మేడం నేను రామ్ కుమార్ గురించి బుక్ రాస్తాను,,ఆయన ఫ్రెండ్స్ ను , బంధువులను అందరినీ కలుస్తాను..మీకు తెలిసిన వివరాలు మీరు చెప్పండి…బుక్ రఫ్ వర్క్ అయ్యాక మీరు ఒకే అంటే ప్రింట్ చేద్దాం”అన్నాడు.
“Ok మజుందార్,,సుమతి వద్ద టైమ్ table ఉంటుంది..మీరు రామ్ కుమార్ ను కూడా కలవోచు..నిజానికి ఆయన గురించి మిగతా పార్టీ లు తప్పు చెప్తున్నాయి.ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా బుక్ రాయండి”అంది విద్య నవ్వుతూ.
మజుందార్ బయటకు వచ్చాక “విద్య లో గ్రేస్ ఉంది..సరే వీలును బట్టి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను సుమతి”అని వెళ్ళిపోయాడు..
++++