ప్రేమకథ – Part 2 249

ఇంతలో తను వస్తున్నాడు …….వైట్ coloured కుర్తా…పైజామా…వేస్కుని…..తనని అలానే చూస్తున్నా….ఏంటి ఈ అబ్బాయి ప్రతి పరిచయానికి కొట్టగా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నా…..తను నా దగ్గరికి వచ్చేసాడు…….
“సారీ,లేట్ అయ్యాను కదా……చాలా సేపట్నుంచి వెయిట్ చేస్తున్నావా? “అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ..
“పర్లేదులే,ఏంటి ఈ కొత్త లుక్….. “అన్నాను నేను నవ్వుతు..
“Nothing special,casual గా వేస్కున్నాను……బాలేద “అని అడిగాడు తను.
“హ్మ్మ్మ్…బాగుంది …నీకు ఏదయినా బానే ఉంటుంది……కాని ఏదో తక్కువగా ఉంది…. “అని అనేసి నాలుక కర్చుకున్నాను నేను.
“అవునా….అని తన డ్రెస్ వైపు చెక్ చేస్కుంటూ బానే ఉందిగా…..ఇంకేం తక్కువ అయ్యింది…..నీకు ఏవి ఒక పట్టాన నచ్చవు..అనుకుంటా..ఇందాక షాప్ లోను అంతే “అన్నాడు తను,నవ్వుతు.
“హా……ఇదే …ఇదే….ఈ నవ్వే …..తక్కువగా ఉంది…..ఇప్పుడు బాగున్నావు…..అంటూ……చేతిని సూపర్ సింబల్ చూపిస్తూ …..చిన్నగా తల వంచా…..ఒక కన్ను మూస్తూ ….చెప్పా తనతో……
దానికి తను ఒక వైరాగ్యాపు నవ్వు ….నవ్వి….ఎటో చూస్తున్నాడు…….
“అబ్బా అని నా తల కొట్టుకుంటూ సరేలే ….., ఏదో చెప్పలన్నావు ?ఏంటి ? “అడిగాను నేను “……..
“హా చెప్తాను….నువ్వు ఏదో అడగాలి అన్నావ్ కదా ఏంటో అడుగు…..లేడీస్…ఫస్ట్ కదా…..”అన్నాడు
“ఫస్ట్ నా….నా ఫస్ట్ నువ్వు ఎప్పుడో తీసేస్కున్నావు గా …సో …నువ్వే ముందు చెప్పు ……”అన్నాను
“ఇప్పుడు నేనే ఇచ్చేస్తున్నా నీ ఫస్ట్ నీకే…చెప్పు ” అన్నాడు….
“అబ్బా వద్దు బాబు నాకు ఇలా ….నేనే సాధించుకుంటా……ఇందాకటి నుంచి….వెయిట్ చేస్తున్నా.,,,చెప్పు అన్నా…కొంచం సీరియస్ గా…….
“సరే శిశిరా….నువ్వు నన్ను అడిగావు కదా…ఎందుకు మాటాడవు…ఎలా ఉంటావు నువ్వు మాట్లాడకుండా అని Actually నేను ఒక introvert ని శిశిర, అంత త్వరగా ఎవ్వరితో mingle అవ్వలేను.. ” అన్నాడు తను.
“హ్మ్మ్.. I know .. “అన్నాను నేను.
“శిశిర,నీకు చెప్పను గా , I am jealous of you అని…..ఎందుకో తెలుసా .. నీకు ఒక loving family ఉంది,నా లాగ కాదు.”అంటూ తల దించుకున్నాడు తను.
“అదేంటి,నువ్వు మీ మమ్మీ,డాడీ తోనే ఉంటావు కదా..”అని ఆశ్చర్యంగా అడిగాను.
“లేదు శిశిరా మా మమ్మీ మాత్రమె ఉంటారు,మేము ఇద్దరమే ఇంట్లో”అన్నాడు.
“మరి మీ డాడీ?”అడిగాను నేను.
“మా డాడీ మాకు దూరంగా ఉంటారు……నాకు అన్ని మా మమ్మీనే శిశిర,నాన్నతో నాకు attachement లేదు.చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం…….అప్పుడు కూడా నాన్న నన్ను ఎప్పుడు దగ్గిరకి తీస్కోలేదు……అందరిలా నేను మా నాన్న చేతులు పట్టుకుని పెరగలేదు శిశిర.. “అన్నాడు తను…….
తన మాట బరువెక్కుతోంది…..కళ్ళు చేమరిస్తున్నాయి……ఇవన్ని నేను మౌనంగా గమనిస్తున్నాను…..
నాకు అందరి పిల్లల్లా మా నాన్నతో ఆడుకోవాలని….తనతో కలిసి బయట తిరగాలని….ఉండేది…..కాని నాకు ఎప్పడు ఆ అవకాశం దొరకలేదు…….అన్నింట్లో ఫస్ట్ వస్తే అన్నా ..తను నన్ను ప్రేమగా దగ్గరకు తీస్కుంటారు అనే ఆశతో ఉండేవాడిని…..కాని నా ఆశ ఏరోజు నేరేవేరలేదు……..ఇంకా…నాతొ ఉన్న కొంతమంది నేను ఫస్ట్ వస్తున్నా అని ……టీచర్స్ నన్ను ఎప్పుడూ పొగుడుతుంటారు అని మా నాన్న తో నా మేడే ఏవేవో చెప్పేవారు …….. చిన్నప్పుడు ఎవరేమి చెప్పిన నమ్మేవారు ఆయన ,ఎవరో మీ అబ్బాయి ఇలా చేసాడు,అలా చేసాడు అంటే నన్ను వీపు చిత్లిపొయెల కొట్టేవారు……తర్వాత నిజం తెల్సినా ఊరుకునేవారు తప్ప …. అప్పుడు కూడా నన్ను దగ్గరికి తీస్కునేవారు కారు ……అందుకే నేను అప్పుడే డిసైడ్ అయ్యా…ఎవ్వరితోను ఇంకా మాటడకూడదు…..అని అందుకే నేను పెద్దగా ఎవ్వరితోను కలవను….ఇంకా మా నాన్న,అమ్మ
గోడవపడుతుంటే,ఇల్లు నరకంల అనిపించేది నాకు…… దేవుడు ఉంటాడు,మనం కోరుకుంటే మన కోరికలు తీరుస్తాడు అని,రోజు మా ఇంటి దగ్గరున్న గుడికి వెళ్లి కళ్ళు తిరిగే వరకు ప్రదక్షిణాలు చేసి,ఏడుస్తూ మొక్కుకునేవాడిని ,,,మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా చూడు స్వామి…మా నాన్న నాతో ప్రేమగా ఉండాలి…నన్ను ఎత్తుకోవాలి…ముద్దులాడాలి అని రోజు కోరుకునేవాడిని .. నిజంగా దేవుడనే వాడు ఉండివుంటే,ఆ చిన్న వయసులో కన్నీరుతో నేను కోరుకున్న ఒక్క కోరిక అన్నా తీర్చేవాడు..”” తరవాత
నాకు ఆ బాధని కోపాన్ని ఎవరిమీద చూపించాలో….ఎలా చూపించాలో తెలిసేది కాదు….. నాకు అప్పుడు తెల్సిన్డల్లా చదువుకోవడమే,అప్పటినుంచి నా కసిని దాని మీద చూపించడం మొదలుపెట్టాను……ఎవ్వరయినా సరే…నన్ను వోడించలేని స్థితికి వచ్చాను..కేవలం నేను అన్నిట్లో 1st అని తెలిస్తే ఒక్కసారయినా మా నాన్న నన్ను దగ్గరకి తీస్కుని.. “I’m proud of you ra Aaryan “అని అనకపోతార…ఒక్కసారయిన ప్రేమగా ముద్దు పెడతారని అనేది నా ఆశ ..!”అని అన్నాడు తను……

“నువ్వు చిన్నప్పట్నుంచి,ఇంత బాధని ఎవ్వరికి చెప్పలేద?”అడిగాను నేను తన చేతిని నా చేతిలోకి తీస్కుంటూ.
“లేదు శిశిర ఎవ్వరికి చెప్పలేదు ఎవ్వరయినా,మా నాన్న గురించి అడిగితె ఆయన బిజీగా ఉంటారు అని చెప్పేస్తా అంతే….”చిన్నప్పుడు కొన్నాళ్ళు ఇంట్లో ఉండే చదువ్కునే వాడిని.. తర్వాత బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసారు..అందరిని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచేవారు,కానీ నన్ను మాత్రం మా అమ్మ మాత్రమే వచ్చి కలిసి వెళ్ళిపోయేది….. మిగత వాళ్ళని చూసి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడ్చేవాడిని…. అప్పట్నుంచి దేవుడు లేడు,గుడిలో విగ్రహాలు,మనుషులు చేసిన రాతి బొమ్మలు అని అర్ధమయ్యింది నాకు “అన్నాడు.
“ఇంట pain ఉందా నీలో.. I’m sorry .. నిన్ను నేను చాలా తప్పుగా అర్ధం చేస్కున్నాను” అని అన్నాను ,తన చెయ్యి ని గట్టిగా పట్టుకుంటూ..
“నాకు ఎవ్వరి సింపతీ అక్కర్లేదు,నాకేమి బాధ లెదు……ఇన్ఫచ్త్ మొదట్లో బాగా బాధ గా ఉండేది….ఒక్కడినే కూచుని ఎన్ని రాత్రు లు నిద్ర లేకుండా ఏడ్చేవాడిని…నాలో నేనే కుమిలిపోఎవాడిని ఇప్పుడైతే అలవాటు అయిపొయింది.నాకు relationships మీద నమ్మకం అయితే పోయింది…. ఇద్దరు వ్యక్తులు life long ఎప్పటికి కలిసి ఉండలేరు అనేది నా గట్టి నమ్మకం.”అన్నాడు తను .
“ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నావు? “అడిగాను నేను.
“నాకు friends కూడా చాలా తక్కువమంది చిన్నప్డు నేను ఫస్ట్ రావడం తో కొంతమంది నా పి కోపం పెంచుకుని మా నాన్నతో ఏదో చెప్పి నన్ను కొట్టించి వాలు ఆనందించే వాళ్ళు …..అందుకే అప్పటి నుంచి ఎవారితోను పెద్దగా కలిసేవాడిని కాను..వాలు పైకి ఒకలా మనసులో ఒకలా ఉండేవారు..కాని నువ్వు అలా కాదు…..చెప్పగా నీకు ఇంతకూ ముందే …ఏది అన్పిసే అది చెప్తావ్…అదే చేస్తావ్ …ఇంకా ఇప్పుడు నువ్వు నాకు ఎన్దుకో చాలా close అనిపిస్తున్నావు కాబట్టి నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెల్స్కోవాలి అనిపించింది ..అందుకే చెప్తున్నాను .”అన్నాడు.
తన మాటలకి ….ఒక విధంగా నేను చాలా బాధ పడ్డాను,కాని తను నన్ను ఇంతగా నమ్మాడు అని same time లో హ్యాపీ గా కూడా అనిపించింది నాకు.
“ఇదే శిశిర నేను చెప్పాల్సింది….నీకు చెప్తాను అన్నది,చెప్పాను..ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో చెప్పు “అన్నాడు తను.
“నేను అడగాలి అనుకున్నవి అన్ని నువ్వే చెప్పేసావ్ “అన్నాను నేను .
” హ్మ్మ్ .. “అన్నాడు తను…ఒక్కసారి కూడా మా నాన్న నన్ను తన దగ్గరగా తెస్కుని ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు శిశిరా …స్టేషన్ లో మీ నాన్న నిన్ను అలా ముద్దు పెట్టుకుంటుంటే…ఇంకా ఇదే ప్లేస్ లో నీకు మీ నాన్నకు ఉన్న బాండింగ్ నువ్వు గర్వం గా చెప్పుకుంటుంటే …ఎంత అదృష్టవంతురాలివి అనుకున్న ….అందుకే అన్నా అలా …నువ్వంటే నాకు jealosy అని..సారీ చెప్పాడు.
“సారీ ఎందుకు నేనే నీకు చెప్పాలి sorry….నీకోసం తెలీక నిన్ను రోజు నానా రకాలుగా తిట్టులునేద్దాన్ని”…..మీ డాడీ నిన్ను చూసి proud గా ఫీల్ అయ్యే రోజు…నిన్ను ప్రేమగా తన దగ్గరకి తెస్కునే రోజు తప్పకుండా వస్తుంది ఆర్యన్ చూడు .. “అన్నాను నేను నవ్వుతు..
“నువ్వు నవ్వుతు చెప్తోంటే వస్తుంది అనే అనిపిస్తోంది నాక్కూడా “అన్నాడు తను,చిన్నగా నవ్వుతు.
“సరే,నువ్వు నీ గురించి ఇన్ని విషయాలు చెప్పావ్ కదా,నేను ఒక్కటి చెప్పాన.. “అని అడిగాను.
“నువ్వు permission తీస్కుని ఎప్పట్నుంచి మాట్లాడుతున్నావ్ ? చెప్పు “అన్నాడు తను .
“అయితే ,నేనేం చెప్పాను.. పో “అని బుంగమూతి పెట్టుకుని ఇంకో వైపు తిరిగి కూర్చున్నాను.
తను నేను తిరిగున్న వైపుకి వచ్చి ..తన చెవులు పట్టుకుని .. “సారీ తల్లి.. అలగకు,ఈ టైంలో నీ అలక తీర్చడానికి Filter Coffee కూడా దొరకదేమో “అన్నాడు తను.

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.