ప్రేమకథ – Part 2 249

“ఇదిగో… వాటర్ and ఫ్రూట్స్, వెళ్ళి ఇవ్వు తనకి,” అంది మా అమ్మ ట్రే నా చేతిలో పెడ్తూ…
“స్వీటీ, మాట్లాడవా నువ్వేమీ? ఒక్కసారొచ్చి తనని పలకరించొచ్చుగా..” అన్నాను నేను.
” మీ నాన్న వస్తారుగా.. ఆయన, నువ్వు మాట్లాడుకోండి, నా ఇష్టంతో పనేముంది మీకు,” అంది మా స్వీటీ.
“అదేంటి స్వీటీ… అలా అంటావ్! నీకు నచ్చకుండా నేనేపనైనా చేస్తానా… చెప్పు,” అన్నాను నేను.
“అందుకేగా… నీ లైఫ్* డెసిషన్ గురించి ఒక్కమాటైనా నాతో అనలేదు,” అంది.
నాకేం మాట్లాడాలో అర్ధంకాలేదు, మౌనంగా అలా తల దించుకొని నించున్నాను.
“వెళ్ళు, నాకు పనుంది… ఆ అబ్బాయి ఒక్కడే కూర్చున్నాడు హాల్లో..” అంది తను.
నేను ట్రే తీస్కుని వెళ్ళిపోయాను. ఆర్యన్ కి సెర్వ్ చేసాను. తను వాటర్ తాగాడు… తర్వాత మా అప్పా వచ్చారు. తను అప్పా మాట్లాడుకుంటున్నారు… నేను మాత్రం వాళ్ళ డిస్కషన్ లో పాల్గోలేదు. నా ఆలోచనలన్నీ మా అమ్మ మాటల చుట్టూనే తిరుగుతున్నాయి ఇంకా…
అలా టైం గడిచిపోయింది.
“లంచ్ వడ్డించాను, భోజనానికి రండి,” అని అమ్మ వచ్చి అందరికీ చెప్పింది.
ఆర్యన్ అప్పాకి అయితే నచ్చేసాడు… వాళ్ళిద్దరూ చాల కంఫర్టెబుల్ గా మాట్లాడుకుంటున్నారు. స్వీటీ నా పక్కన కూర్చుంది. అందరం కల్సి లంచ్ స్టార్ట్ చేసాం. స్వీటీ వంటని ఆర్యన్ మెచ్చుకున్నాడు. కానీ, స్వీటీ మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. లంచ్ చేయడం పూర్తయ్యింది… మళ్ళీ అందరం హాల్లో కూర్చున్నాం. ఈసారి స్వీటీ కూడా మాతోపాటు కూర్చుంది.
ఏవో మాటల్లో, “శిశిర చాల మొండి బాబు,” అన్నారు మా అప్పా.
“తెలుసు అంకుల్,” అని నవ్వుతూ అన్నాడు ఆర్యన్.
“తెలిసి కూడా ఎందుకు ఇష్టపడుతున్నావ్ మరి?” అడిగింది స్వీటీ సడన్*గా…
“శిశిర గురించి నాకన్నా మీకు ఎక్కువ తెల్సు ఆంటీ, మీరు ఎందుకు తనని ఇష్టపడుతున్నారో, నేను కూడా అందుకే ఇష్టపడుతున్నాను,” అన్నాడు తను.
స్వీటీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అడిగింది, తను అమ్మ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ మొహమాటపడకుండా సమాధానం చెప్పాడు. కొంచెం సేపయ్యాక,
“నేనిక బయలుదేరతాను అంకుల్,” అంటూ ఆర్యన్ లేచాడు.
“సరే బాబు,” అన్నారు అప్పా.
“వెళ్ళొస్తాను ఆంటీ,” అని స్వీటీకి చెప్పాడు.
స్వీటీ, “ఒక్క నిముషం,” అని లోపలికి వెళ్ళింది. నేను ఏం జరగబోతుందో అని చూస్తున్నాను.
“ఇది తీస్కో…” అంటూ మా అమ్మ లోపల్నుంచి Haldiram’s రసగుల్లా డబ్బా తీసుకొచ్చి ఆర్యన్ చేతికి అందించింది.
“అరే.. వద్దు ఆంటీ..” అన్నాడు తను.
“తీస్కో బాబు, నువ్వు మాకు నచ్చావు. అందుకే, స్వీట్ ఇస్తోంది మీ ఆంటీ,” అన్నారు మా అప్పా.
స్వీటీ కూడా నవ్వుతూ, “తీస్కో బాబు,” అంది.
ఇంక నా ఆనందానికి అవధుల్లేవు… స్వీటీని వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను.
“హడలిపోయాను స్వీటీ… నీకు నిజంగానే ఆర్యన్ నచ్చలేదేమో అనుకున్నాను,” అని కన్నీళ్ళతో అన్నాను.
“మీ అప్పాకి నచ్చింది ఏదైనా నాకు నచ్చకుండా ఉంటుందేంటే.! ఇంత పెద్ద డెసిషన్ నాకు చెప్పకుండా మీ అప్పాకే చెప్పినందుకు ముందు బాధ వేసింది… కానీ, అబ్బాయిని చూసాక, మాట్లాడాక నీ సెలక్షన్ బాగుంది అనిపించింది… పోనీలే, మాకు పెద్ద పని తప్పించావ్… మేరేజ్ బ్యూరోల చూట్టూ తిరక్కుండా, వాళ్ళనీ వీళ్ళనీ సంబంధాల కోసం అడక్కుండా…” అంది అమ్మ నవ్వుతూ నా తలమీద చెయ్యివేసి…
ఆర్యన్ కూడా హ్యాపీగా స్వీట్ తీస్కోని, “రేపు శిశిరని మా ఇంటికి తీసుకెళ్ళచ్చా అంకుల్?” అని అడిగాడు. అప్పా దానికి ‘సరే’ అన్నారు. తర్వాత తను అందరికి నమస్తే చెప్పేసి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే అంతా సాఫీగా జరిగిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయాక ఆర్యన్ కాల్ చేసాడు.
“రేపు మా ఇంటికి వద్దువ్ గానీ, నేను 11 am కి వచ్చి నిన్ను తీస్కెళ్తా..” అన్నాడు. నేను ‘సరే’ అన్నాను.
“నీకేమీ టెన్షన్ లేదా?” అడిగాడు తను.
“నేను నచ్చనివాళ్ళు అసలు ఉంటారా… చెప్పు,” అన్నాను నేను.
తను దానికి చాల గట్టిగా నవ్వాడు.
“మరీ అంత నవ్వాల్సిందేముంది? నిజమే కదా…” అన్నాను నేను.
“నిజంగా… నిజమే… నువ్వు నచ్చనివాళ్ళు ఎవరూ ఉండరు,” అన్నాడు తను.

Next day వెళ్ళి వాళ్ళ మమ్మీని కలిసాను. ఆంటీ చాల ఫ్రెండ్లీ… నన్ను చాల బాగ రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు, ఆవిడ కూడ నాలాగే ఫిల్టర్ కాఫీ fan..
ఇంకాతర్వాత బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం మేము.
నేను ఆర్యన్ రూమ్ చూసాను. చాల క్రియేటివ్ గా డెకరేట్ చేసుంది… తను రాసిన కవితలన్నీ చదివాను, తను గీసిన బొమ్మలు కూడ చూసాను. ఆంటీని అడిగి తన చిన్నప్పటి విశేషాలూ తెలుసుకున్నాను.
ఆంటీ మోర్ దేన్ హ్యాపీ నన్ను చూసి… “వస్తూవుండమ్మా…” అని చెప్పారు. నేను ఆవిడకి నమస్తే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను.
మనం ఇష్టపడే వ్యక్తిని మన వాళ్ళు accept చెయ్యడం, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి మనం నచ్చడం చాల సంతోషాన్నిస్తాయి…
మేము ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లో ఉన్నాము…

Two days off తర్వాత మా కాలేజీకి మేము తిరిగి వెళ్ళిపోయాం… కానీ, ఇంతకుముందులా కాదు, ఇప్పుడు మేం ఒకరికొకరం సపోర్టుగా ఉన్నాం. డౌట్స్, డిస్కషన్స్, గ్రూప్ స్టడీ… అన్నింటిలో చాల హెల్దీ కాంపిటీషన్ ఉండేది మా ఇద్దరి మధ్యలో… అలా, హ్యాపీగా మా బీ. టెక్ కంప్లీట్ చేసాం. ఇద్దరికీ మంచి రెప్యూటెడ్ MNCలో placements కూడ వచ్చాయి…

ఆరోజు మా కాల్ లెటర్స్ వచ్చాయి.. నేను సూపర్ హ్యాపీ… ఇద్దరికీ మా ఊరిలోనే జాబ్, అన్నిటికీ మించి అప్పా, అమ్మ నా దగ్గరే ఉంటారు; నేను వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ హ్యాపీనెస్ ని మా రెండు ఫ్యామిలీస్ వాళ్ళం సెలబ్రేట్ చేసుకోడానికి అందరం మా ఇంట్లోనే కలిసాం… హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నాం… అమ్మా ఇంకా ఆంటీ లంచ్ ప్రిపరేషన్స్ లో పడ్డారు… ఆర్యన్ అప్పాతో తన ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు… నేను కాసేపు వాళ్ళతో మరికాసేపు వీళ్ళతో గడిపాను… తర్వాత అందరం లంచ్ చేయటానికి రెడీ అవుతున్నాం…
ఇంతలో, మా కాలింగ్ బెల్ మోగింది.

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.