ప్రేమకథ – Part 2 249

“నాకు తెల్సుర,నువ్వు నాకు సంజాయిషీ లు చెప్పాల్సిన అవసరం ఎప్పటికి రాదు”అన్నారు ఆయన.”అప్పా , you trust me so much kada ..”అన్నాను నేను…
.”శిశిర తల్లి, నువ్వు నా కూతురివి రా,నిన్ను నమ్మకపోతే నన్ను నేను నమ్మనట్టే “అన్నారు ఆయన.
“appa I am the luckiest daughter in the universe and I love you so much …..”ani స్క్రీన్ పి కనిపిస్తున్న తన పేస్ పయ్ కిస్ చేసాను,బ్రైట్ గా నవ్వుతు.
“నువ్వు ఇలా నవ్వుతు ఉంటె చాలు నాకు,ఈ వరల్డ్ అంతటి నీ గెలిచేసినట్టు ఉంటుంది..నువ్వు ఇంకెప్పుడు డల్ గా ఉండొద్దు,అంతే కాదు ఇలా ఏడిచేటట్టు అయితే కాటుక అస్సలు పెట్టుకోద్దు,అడ్డం లో చూస్కో ఒకసారి ఎలా ఉన్నవో….చంద్రముఖి లా “అన్నారు ఆయన నవ్వుతు……
నేను కూడా ఫక్కుమని నవ్వేస ఆయన మాటలకి.
“శిశిర,anything to share, I am just one call away “అన్నారు ఆయన నవ్వుతు.
“I know Appa .. “అన్నాను నేను .Good night చెప్పి లాప్పి ఆఫ్ చేశాను.
అప్పా తో మాట్లాడక నిజంగా లైఫ్ లో పేరెంట్స్ సపోర్ట్ ప్రతి అడుగు లోను మనకి ఎంత అవసరమో నాకు అర్ధమయ్యింది,నేను చిన్న గా upset అయితే నే నిద్రమానుకుని నన్ను నార్మల్ స్టేజి కి తీస్కు రావడానికి ప్రయత్నించే అప్పా నాకున్నారు,కానీ ఆర్యన్ ఎన్ని సార్లు వాళ్ళ నాన్న సలహాలు కోరుకుని ఉంటాడో కదా అనిపించింది నాకు.అప్పా ఇచ్చిన థెరపీ తర్వాత నేను నార్మల్ స్టేజి కి వచ్చాను…. నెక్స్ట్ డే ఆర్యన్ నీ కలవాలి అనుకుంటూ నిద్రపోయాను…..
నెక్స్ట్ డే ఎర్లీ గా లేచాను,అలారం కాదు అప్పా కాల్ చేసారు..”వెళ్లి ఆర్యన్ నీ కలవాలి కదా ఆల్ ది బెస్ట్ ” అని చెప్పారు.
నేను నవ్వుతు “మీరే నా లక్కీ చార్మ్ అప్పా,థాంక్స్ అండ్ లవ్ యు” అని చెప్పి కాల్ పెట్టేసి,రెడీ అయ్యి ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కి బయలుదేరాను.

నేను వెళ్లేసరికి తను వాళ్ళ హాస్టల్ దగ్గరున్న లాన్ లో కుర్చుని బొమ్మ గీస్తున్నాడు,నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను….తను నన్ను చూసి నవ్వాడు…..
“Good morning “అని విష్ చేసాడు …..
“Good morning Aaryan “అన్నాను నేను.ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు… సైలెంట్ గా తను వేసే బొమ్మ నీ చూస్తున్నాను.
“ఏంటి,ఇవాళ సైలెంట్ గా ఉంది శిశిర? “అన్నాడు తను నా వైపు చూస్తూ .
“ఆర్యన్ నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు “అన్నాను నేను తల దించుకుంటు…..
“శిశిర,నిన్న జరిగినదాని గురించా ? నువ్వు నా మీద జాలి పడుతున్నావ్ శిశిర,అది ప్రేమ కాదు “అన్నాడు తను.
తను అలా అనేసరికి నాకు కోపం వచ్చింది తనని నా వైపుకి కోపం గా లాగి వాడి collar పట్టుకుని ”
“నీకు అలా ఎందుకు అనిపించింది రా అసలు,ప్రేమకి,జాలికి తేడా తెలీదా రా నాకు…నాకు నిన్న పాప మాటాడలేదు అని తెలిసినప్పుడు తన పయ్ నాకు కలిగింది జాలి……తను నాకు ముద్దు పెట్టినప్పుడు వచ్చింది ప్రేమ…నేను తనని ముద్దు పెటింది ప్రేమతో……
నీతో ఉన్నప్డు నన్ను నేను మర్చిపోయేలా చేస్తావు రా నన్ను…..
మా అప్పా తో ఉన్నప్డు ఎంత secure గా ఉంటానో..ఎంత ఆనందం గా ఉంటానో మల్ల నీతోనే అంతా ఆనందం గా ఉంటార్ర….
ఏరా.. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావ్ రా నా మనసులోని ఆ ఫీలింగ్ ను..
నా మది మాటున దాగున్న ప్రేమను చెప్పాగా ముందు నువ్వంటే నాకు కోపం…నువ్వు కన్పిస్తే చిరాకు పడేదాన్ని…
కాని నీతో గడిపాక,నువ్వంటే ఏంటో తెలిసాక…ఒక్క క్షణం నువ్వు కనబడకపోతే
నీ జాడ కోసమే వెతుకుతాయి తెలుసా నా కళ్లు….నిన్ని నా నుంచి దూరం చేసే రాత్రి అంతే కోపం నాకు……
రోజు పడుకునే అప్పుడు నీతో గడిపిన క్షణాలే గుర్తొస్తాయి రా….
మార్నింగ్ నీతో గడిపే క్షణాల కోసమే ఎదురు చూస్తుంటా రా……
కొద్దిసేపు నువు మాట్లాడకపోతే ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని నీ పిలుపు కోసమే ఎదురుచూస్తుంది తెలుసా నా
మనసు.. ఆ సమయాల్లో నా కంట కన్నీరుని నువ్వు ఎప్పుడన్నా గమనించావా.. లేదు కదా.
నీ కోసం నేను పడే ఆరాటం, తపన నీకెప్పుడు అర్థమౌతాయిరా…నీకు తెలుసో లేదో
ఒక్కోసారి నువ్వు ఎదురు పడినప్పుడు ఎప్పడు గల గల మాటాడే నేను నీ పక్క నుండే మౌనంగా తలదించుకుని
ఎందుకు మౌనం గా ఉంటానో తెలుసా ?.ఆ క్షణాన నాకు ఊపిరి ఆడదురా.. నీ నీడలా
నిరంతరం నీ వెంటే తిరుగుతున్నా.. నీ తలపులతోనే పొద్దు గడుపుతున్నా..
నువ్వే శ్వాసగా నీ కోసం నిరీక్షిస్తూ బతుకుతున్నా…ఒరేయ్.. నేన్నిన్ను
బాగానే అర్థం చేసుకుంటున్నా .. కానీ నువ్వే నాలో నీ మీద ఉన్న ప్రేమను
కాస్తైనా గుర్తించావా?.లేదు…ఇంకెప్పుడు గుర్తిస్తావో నాకు
తెలీట్లేదు..అసలు ఈ జన్మకు గుర్తిస్తావా?ఏమో… నా ప్రేమ నీకు
అర్థమవ్వాలంటే నా జీవితకాలం సరిపోతుందో లేదో.. నా ఈ ఫీలింగ్స్ అన్నీ
నీకింకెప్పుడు అర్థమౌతాయో ఏంటో?.నా ప్రేమను ఇంకెలా నీకు తెలిజెప్పేది…ఇంతకన్నా చెప్పటం రాదు రా…నీల కవితలు రాయటం నాకు రాదు…నా మనుసులో ఉన్నది చెప్పటం ఒక్కటే తెలుసు ర .
నాకు తెలీట్లేదురా.. ఆడపిల్లను రా పెదవి విప్పి నీకు ఈ విషయం చెప్పటానికి చాల మదన పడ్డాను రా . ఇంకేం చేయలేనురా నువు
నా ప్రేమను అర్థం చేసుకునే ఆ సమయం కోసం వేయి కళ్లతో వేచి చూడటం తప్ప!!” అని ఏడుస్తూ చెప్పాను,,,తర్వాత అర్ధం అయింది..కోపం లో నేను ఏం చేస్తున్నానో…వాడి collar వదిలి …..
“నిన్న అప్పా తో మాట్లాడి అంతా చెప్పాను,ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను చాల లక్కీ అనిపించింది,నీకు నీ లైఫ్ గోల్ achieve చేయిడం ఎంత important ఓ నాకు అర్ధం అయింది,నేను నీకు సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను ఆర్యన్ అంతే.నాకు నీ కమిట్మెంట్ కానీ attention కానీ అవసరం లేదు “అన్నాను నేను అలా నేల పయ్ మోకాళ్ళ మీద కుర్చుని కంటి నిండా నీళ్ళ తో.
“నాకు తెలుసు శిశిర, అందుకే చెప్తున్నాను.నువ్వు చాల మంచి అమ్మాయివి,you are like a flawless pearl, నాకన్నా బెటర్ పర్సన్ నీకు దొరుకుతాడు “అన్నాడు తను.
“నేను కోరుకునేది నిన్ను ఆర్యన్.”అన్నాను నేను.తను గీసిన బొమ్మని నా చేతి లో పెట్టి హాస్టల్ లోపలి వెళ్ళిపోయాడు..ఆ బొమ్మని చూస్తున్నాను.. ఆ కాగితం నా కన్నీటి బొట్లతో తడుస్తోంది .. అలా అక్కడే కూర్చున్నాను

అలా ఏడుస్తూ కూచున్న……తర్వాత నా భుజం మీద ఎవరో చేయి వేసారు……నేను వెనక్కి తిరిగి చూసాను,ఆర్యన్ నించున్నాడు……..

“Thank you so much for coming into my life Shishira .. “అంటూ చేతులు చాపి నించున్నాడు …..నా ఆనందానికి అవధులు లేవు వెంటనే తనని గట్టిగా పట్టేస్కున్నాను,నా కన్నీళ్ళు తన భుజాన్ని తడుపుతున్నాయి..
“నిన్ను ఏడిపించాను కదా.. I am sorry,నీ లెటర్ చదివిన వెంటనే ఎస్ అనాలి అనుకున్నాను కానీ, నేను ఉన్న situation లో ఆ మూడు అక్షరాలూ చాల expensive అనిపించాయి నాకు”అని నా తల నిమురుతూ అన్నాడు తను.

“నాకు నీలా పెద్ద పెద్ద మాటల్లో చెప్పడం రాదనీ చెప్పను గా “అన్నాను నేను కళ్ళు తుడుచుకుంటూ.
“నువ్వు ఇలా చిన్న పిల్లలా ఉంటేనే నాకు ఇష్టం”అన్నాడు తను నా నుదుటి మెడ ముద్దు పెట్టుకుంటూ….
“కాని ఇంతలా ఏడిపించాలా నన్ను…ఇది ఇందాకే చెప్పొచు కదా” అన్నాను నేను….
“నేను నీకు చెప్పాను…నువ్వే చూడలేదు” అన్నాడు
“చెప్పావ….ఎప్పుడు బాబు” అన్నాను
నా చేతిలో ఉన్న తను వేసిన బొమ్మ పేపర్ తెస్కుని విడదీసి చూపించాడు…..అందులో ఒక అమ్మాయి అబ్బాయి కలసి ఉన్న బొమ్మ ఉన్నది….అందులో ఇలా రాసి ఉంది……..

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.