ప్రేమకథ – Part 2 249

వాడికి కావల్సినవి అన్నీ అందించాలని ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడ్ని… అందుకే, హై శాలరీ జాబ్స్ కోసం వెదుకుతూ ఆ ప్రయత్నంలో వాళ్ళకు దూరముగా ఉండేవాడ్ని… నా వైఫ్ కి నేనంటే ఎంతో ఇష్టమమ్మా.. అయినా, నేను వాడి మంచి కోసం వాడ్ని హాస్టల్లో జాయిన్ చేసి తనని నాతో ఉండమని అడిగినప్పుడు తను కూడా వాడి కోసం నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తనతో గొడవపడి కోపంతో అక్కడికి వెళ్ళడం మానేసాను. అదే మమ్మల్ని ఇలా దూరం చేసేసిందమ్మా…’ అన్నారు అతను.
‘అదేంటి అంకుల్ అలా అంటారు… మీరు చేసిందంతా తన మంచి కోసమే కదా…’ అని, ‘ ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చుగా…!’ అన్నా..
‘గతంలో నేను వాళ్ళతో ఎంత కఠినంగా ఉన్నానో తల్చుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తోంది… ఇప్పుడు వాళ్ళ దగ్గరకి వెళ్ళటానికి నాకు మొహం చెల్లట్లేదు. అందుకే, ఇలా ఫొటోస్ తో కాలక్షేపం చేస్తూ వాటిలోనే వాళ్ళని చూస్కుంటున్నా…’ అన్నారు.
అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత, ‘మిమ్మల్ని ఎలా కలపాలి?’ అని అనుకున్నా… మామూలుగా అంకుల్ తో ‘వెళ్ళి ఓసారి వాళ్ళని కలవండి…’ అంటే అతను వెళ్ళి కలుస్తారో లేక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక ఎక్కడికైనా వెళ్ళిపోతారో అని భయమేసింది. అందుకే, మిమ్మల్ని సడన్*గా కలిపేద్దామని అనుకుని ఇంటర్వ్యూలో సెలక్ట్ అయినందుకు అన్నట్టుగా కావాలనే పార్టీ ఎరేంజ్ చేసి మా ఇంట్లో అందరం కలుసుకునేలా ప్లాన్ చేసా…” అన్నా..
“నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్..” అంటూ ఆర్యన్ ఇంకా ఆ షాక్ లోనే ఏదేదో మాట్లాడేస్తూ ఏడుస్తున్నాడు..
నేను తన ముఖాన్ని నా దగ్గరికి తీసుకుని తన పెదాలపై ఓ ముద్దుపెట్టాను. కాసేపు అలా ఉన్నాక తనతో, “నా పెదాలపై ఎప్పుడూ ఉండే చిరునవ్వుని నీ పెదాలపై సంతకం చేసా.. ఇక ఎప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉండాలి.. అస్సలు ఏడ్వకూడదు..” అన్నా…
తను నవ్వాడు… నేను కూడా నవ్వుతూ తనని గట్టిగా పట్టేస్కున్నాను.
★★★
ఆర్యన్ కోరుకున్నట్టే వాళ్ళ డాడీ తనని దగ్గరికి తీస్కున్నారు… నేను ఎంతో ఇష్టపడ్డ వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసుండే అవకాశం నాకు దొరికింది.
లైఫ్ ఇంత పెర్ఫెక్ట్ గా ఉంటుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నిజంగా.. I am a gifted soul… ఈ క్రెడిట్ అంతా నేను మా అప్పాకి and బాబాజీకి ఇస్తాను… ప్రతీ సెకండ్ నాకు వెన్నంటే ఉండి నా లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ world గా మార్చుకోడంలో వాళ్ళే కీ రోల్ ప్లే చేసారు…
నా ఫస్ట్ లవ్ ఎప్పటికి మా అప్పానే అవుతారని ఆర్యన్ కి కూడా చెప్పేసా… తను కొంచెం కూడా insecure అవ్వలేదు.. ‘Aaryan is the best son and the best boyfriend..!!’
తెలుసా…?
ఆర్యన్ ఇప్పుడు నాతో లైఫ్ షేర్ చేస్కోడమే కాదు… నాతోపాటు ఫిల్టర్ కాఫీ షేర్ చేస్కోడానికి కూడా రెడీ అయ్యాడు.
“అంత కష్టపడి అలవాటు చేస్కో వద్దు…” అని నేను అంటే, “నీకు నచ్చినవి ఏవైనా అవి నాకూ నచ్చుతాయి…” అని చెప్పాడు…!!
So, altogether నా లైఫ్ సూపర్బ్!!
ఆ internship రెండు నెలలు నా లైఫ్ ని ఎంతలా మార్చేసాయో కదా అని ఈ రోజుకీ అనుకుంటాను నేను.
మనకి suitable కారు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఎంత బాగా సెట్ అవుతారో తెల్సుకున్నాను.
మనకి కనిపించినట్టుగా అందరూ ఉండరనీ… లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ లా ఉండదని తెలుస్కున్నాను.
నా లైఫ్ ని ‘ఒక’ అందమైన ‘ప్రేమ కధ’గా మల్చిన నా ఫేవరేట్ దేవుడు వినాయకునికి ఎప్పుడూ thanks చెప్పుకుంటూ ఉంటాను.
So, ఫ్రెండ్స్…. ఇది…. నా లవ్ స్టోరీ. మీకు నచ్చుతుందని అనుకుంటూ…

మీ శిశిర ఆర్యన్.

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.