ప్రేమకథ – Part 2 250

“చెలియా నా సఖియా….!!
ప్రేమను ఎలా చూపించాలో తెలిసిన నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు…..
కాలంతో పరిగెత్తాలనుకునే నా పాదం ఈ క్షణం నీతో నడవాలని చెబుతోంది…..
ఎన్నడూ లేని విధంగా 72 లో కొట్టుకోవాల్సిన నా గుండె నిన్ను చూడగానే 143 లోకి వెల్తోంది…..
నీ మాట వినగానే నాలో ఏదో తెలియని సంతోషం… నీ పేరు వినబడినా నాలో అలజడి మొదలవుతుంది.
నా కళ్ళెపుడూ నిన్నే చూడాలని,నా మాటలన్నీ నీతోనే చెప్పాలని అనిపిస్తోంది.
నిన్నెంత ప్రేమిస్తున్నా అంటే చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు,గుండెలో దాచేంత తక్కువ కూడా కాదు.కాలాన్ని కొలవడానికి సెకండ్లు ఉన్నాయి…నీపై నా ప్రేమను నా గుండె చప్పుడుతో కొలుస్తాను…..నువు గుర్తొచ్చినపుడే స్పందించమని నా మనసుకి చెప్పా…అమ్మలా ప్రేమిస్తాను నాన్నలా చూసుకుంటాను అని అందరిలా డైలాగులు చెప్పను కానీ నేను చూపించు ప్రేమలో మీ అమ్మా నాన్నల ప్రేమ కనబడుతుంది..నేను అందరి లాంటి అబ్బాయే అయినా అందరిలా కాకుండా నిన్ను నీలా ప్రేమించి నాలా చూసుకుంటా….నా ప్రేమను నీకు ఇవ్వాలని నీతో నా జీవితాన్ని పంచుకోవాలని నా మనసు పదే పదే ప్రతి స్పందనలో నాకు చెబుతోంది….నా ఈ జన్మ నీతోనే ప్రియతమా…..!!”

అది చదివాక వాడిని గట్టిగా పట్టేస్కున్న….
“ఏరా ఇలానే చెప్పాలా…నువ్వు ఎస్ అన్న ఒక్క ముక్క చెప్తే చాలు కదా రా…..జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని చూస్కుంటా ర నిన్ను అన్నా”
“నీకు నేను చెప్పేది నీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అందుకే ఇలా ” అన్నాడు….
“సరే పద ఆకలి వేస్తుంది ఇప్పుడు” అన్నా

సరే పద అని ఇద్దరం నవ్వుతు చేతులు పట్టుకుని అక్షయ కాంటీన్ వైపు నడుస్తున్నాం.
“ఈ రోజు నీ ఫిల్టర్ కాఫీ తో సెలెబ్రేట్ చేస్కుందాం “అన్నాడు తను.
“నువ్వు తాగవ్ గా ..”అన్నాను నేను.
“నువ్వు తాగుతావ్ గా “అన్నాడు తను.
ఇద్దరం నవ్వుకుంటూ నడుస్తున్నాం.
“అవను,నువ్వు బొమ్మలు కూడా వేస్తావా?”అడిగాను నేను..
“హా.. వేస్తాను,ఎప్పుడైనా నేను చెప్పాలి అనుకున్నప్పుడు మాటలు కరువైతే….నేను చెప్పలేని భావాలను ఇలా గీస్తుంటాను,ఏదో పిచ్చి రాతలు రాస్తుంటాను… “అన్నాడు తను.
“నువ్వు మాట్లాడటం అలవాటు చేస్కో,నీ కవితల్లోనూ,బొమ్మల్లోను అర్ధాలు వెతుక్కోడం నాకు కొంచెం కష్టంఅవుతోంది కదా.”అన్నాను నేను నవ్వుతూ.
“ఇప్పుడిప్పుడే మాటలు ఆడడం నేర్చుకుంటున్నాను నీ దగ్గర్నుంచి,ఇంకా బాగా నేర్చుకుంటాను లే “అన్నాడు తను కూడా నవ్వుతూ.
కాంటీన్ దగ్గిరకి వచ్చేసాం…….
“నేను,అప్పా కి కాల్ చేసి వస్తాను,నువ్వెళ్ళి ఆర్డర్ చెప్పు”అన్నాను నేను.
తను లోపలి వెళ్ళాడు,నేను మా నాన్న కి కాల్ చేసి నా ఆనందాన్ని ఆయన తో పంచుకున్నాను.తను చాల హ్యాపీ గా ఉన్నారు…..ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండమన్నారు……
ఫోన్ అయ్యాక లోపలికి వెళ్ళాను..ఆర్యన్ ఆర్డర్ చెప్పుంచాడు…..సో,వెళ్ళిన వెంటనే వేడి వేడి ఫిల్టర్ కాఫీ వచ్చింది.
“నువ్వు తాగవ?”బుంగమూతి పెట్టి అడిగాను నేను.
“ఊహూ.. ” అన్నాడు తను .
“నేను నిన్ను ఇబ్బంది పెట్టానులే ” అంటూ నేనే తాగాను.

ఆ తర్వాత ఇద్దరం మా డిపార్టుమెంటుకి వెళ్ళాం..వర్క్ చేస్కున్నం..ఈవెనింగ్ వరకు చాల వర్క్ లోడ్ ఉంది. నేను మాత్రం మధ్యలో కొంత సేపు మిగతా 3 టీంమెంబెర్స్ తో కల్సి బ్రేక్ తీస్కున్నాను కాని ఆర్యన్ కి వర్క్ ముందు ఇంకేమి కనిపించవు కాబట్టి తను అసలు deviate అవ్వలేదు…..నేను కాఫ్తెరియా నుంచి ఒక కోక్ ఇంకా సమోసా తెచ్చి ఆర్యన్ ముందు పెట్టాను.తను తిరిగి నా వైపు చూసాడు..
“కొంచెం బ్రేక్ నీక్కూడా అవసరం,సమోసా బాగుంది ఇవాళ అందుకే తెచ్చాను…హ్మ్మ్ తిను “అంటూ తన చేతిలోనుంచి మౌస్ పక్కకి పెడ్తూ అన్నాను.
“హ్మ్మ్..థాంక్యు ” అని నవ్వుతూ సమోసా తింటున్నాడు తను.
“బాగుందా?”అడిగాను నేను.
“ఆకలేస్తున్నప్పుడు ఏదైనా tasty గానే ఉంటుంది”అన్నాడు తను.
“మరింత ఆకలేస్తున్నపుడు 2min బ్రేక్ తీస్కోవచ్చుగా “అన్నాను నేను.
“వర్క్ కూడా ఉందిగా”అన్నాడు తను.
“హెల్త్ ఉంటె నే చెయ్యగలవ్ ఏమైనా.. ముందు నీ గురించి నువ్వు కేర్ తీస్కోవాలి”అన్నాను నేను.
“మా అమ్మ తర్వాత నా హెల్త్ జాగ్రత్త అని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే శిశిర..థాంక్యు “అన్నాడు తను.
“మరి నీలా వరల్డ్ తో సంబంధంలేకుండా వర్క్ కి అంకితం అయిపోయేవాళ్ళుంటే మేము అయినా ఎవరకి చెప్తాము,బాబు ఇలా చేస్తే కష్టం సుమ .. హెల్త్ కూడా ఇంపార్టెంట్….ఇంతవరకు ఆంటీ నిన్ను జాగ్రత్త గా చుస్కున్నారు….ఇకపయ్ నిన్ను జాగ్రత్త గా చుస్కోవలసిన భాద్యత నాదే కదా … అని తన తల పయ్ నా తల పెడ్తూ” అన్నాను నేను.
“హ హ హ.. అవను చెప్తావ్ చెప్తావ్ ..” అన్నాడు తను నా కళ్ళలోకి చూస్తూ……
“ఏంటి శిశిరా కళ్ళకి కాటుక పెట్టావా”అన్నాడు
“హ్మ్మ్మ్….నువ్వే గా బాగుంటా అన్నావు…..అందుకే “….
తను నా చేతిని తన చేతిలోకి తీస్కుని ముద్దు పెట్టాడు……
“ఎందుకు శిశిర…నా లిఫ్ లోకి ఇంత లేట్ గా వచ్చావు”……..అన్నాడు
“నువ్వే మాటాడకుండా దూరం గా ఉన్నావు …అయిన ఈ ఇంటర్న్షిప్ ౧స్త్ ఇయర్ లోనే వస్తే బాగుణ్ణు “అన్నాను
“హ్మ్మ్ …పోన్లే ఇప్పటికన్నా దొరికావు నాకు ఇకపయ్ జాగ్రతగా చూస్కుంటా ” అన్నాడు …
తర్వాత మిగిలిన టీం మెంబెర్స్ రావటం తో మల్ల మా వర్క్ లోకి వేల్లిపోయం …….

ఇలా కొంచెం కేరింగ్ గా.. స్వీట్ గా..డే అంతా workload తో ఈవెనింగ్ pleasant గా ఆర్యన్ చెప్పే కవితలతో,నేను చెప్పే బోల్డన్ని కబుర్ల తో మా రెండు నెలల ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ అయిపొయింది.
రేపే ఆఖరి రోజు అక్కడ…..నా డైరీ లో ఈ రెండునెలలు నా జీవితాన్ని ఎంతలా మార్చేసాయో రాస్కుంటున్నాను నేను,ఈవెనింగ్ లాన్ లో కుర్చుని.. ఇంతలో ఆర్యన్ వచ్చాడు…….

“ఏంటి రాస్తున్నావ్ ?”అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ..” హ్మ్మ్….. వచ్చావ.. ఏంలేదు ఈ 2 మంత్స్ ఇంటర్న్షిప్ డేస్ ఎలా గడిచాయో రాస్కుంటున్నాను.”అంటూ పెన్ డైరీలో పెట్టి ముసాను..
“ఓహో..నీ పర్సనల్ డైరీ నా.. సరే “అంటూ తీసిన వాడే మల్లి డైరీ కింద పెట్టేసాడు.
“అరేయ్…. అలా ఏంలేదు.. చూడవచ్చు నువ్వు”అన్నాను నేను.
“వద్దు శిశిర…..ఎవరికీ వాళ్ళకి కొంత ప్రైవసీ ఉండాలి అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ “అన్నాడు తను.

తన మాటలకి నా ప్రైవసీ అండ్ స్పేస్ నాకు ఇస్తున్నాడని నేను హ్యాపీ గా ఫీల్ అవ్వాలో…. లేదంటే నన్ను పరయిదాన్ని అనుకుంటున్నాడు అని బాధ పడాలో నాకు అర్ధం కాలేదు.. చిన్న చిరునవ్వు ఇచ్చాను…. అంతే……

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.