ప్రేమకథ – Part 2 249

“ఆర్యన్… ఎవరో వెళ్ళి చూడవా..!” అని చెప్పాను నేను.
తను డోర్ తీయడానికి వెళ్ళాడు… మా స్వీటీ నా తలమీద ఓ మొట్టికాయ వేసి, “తనకి పనులు చెప్తావేంటే..!” అంది.
“అబ్బా.. స్వీటీ! ఏం కాదు, ఆర్యన్ కి ఓ గిఫ్ట్ ఇస్తున్నా… ప్లీజ్… సైలెంట్!” అని సిగ్నల్ ఇస్తూ అన్నా…
ఆర్యన్ డోర్ ఓపెన్ చేసాడు…
“డాడీ…..!” అంటూ అలా చూస్తూ ఉండిపోయాడు తను.
నేను వెళ్ళి ఆర్యన్ పక్కన నిలబడి, “రండి అంకుల్… లోపలికి రండి…” అన్నా…
ఆయన ఆశ్చర్యంగా మా వంక చూస్తూ లోపలికి వచ్చారు.
“నేనూ ఆర్యన్ క్లాస్ మేట్స్, అంకుల్,” అని అతనికి క్లారిఫై చేసాను.
ఆయన ఒక నవ్వు నవ్వి, “కంగ్రాచ్యులేషన్స్ అమ్మా…” అంటూ ఫ్లవర్ బొకే నా చేతికి ఇచ్చారు.
“నాకేనా అంకుల్…. తను కూడా సెలెక్ట్ అయ్యాడు,” అన్నాను.
అంకుల్ ఆర్యన్ వైపు తిరిగి, “కంగ్రాచ్యులేషన్స్…” అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇచ్చారు…
ఆర్యన్ ఇంకా ఏం జరుగుతుందో అర్ధంకాక షాక్ లో ఉన్నాడు… వాళ్ళ నాన్నని చూసిన ఆనందంలో తనకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి…
అప్పుడే ఆంటీ కూడా వంటింట్లో నించి వచ్చారు. అంకుల్ ని చూసి షాకై అలా చూస్తూ ఉన్నారు…
అంకుల్ కూడా ఆర్యన్ వైపు ఇంకా ఆంటీ వైపు అలా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా…
అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టా… స్వీటీ అంకుల్ కోసం వాటర్ పట్టుకొచ్చింది… నేను అప్పా, అమ్మ మధ్యన చేరి, వాళ్ళ భుజాలమీద చేతులు వేసి, “అంకుల్… మా అమ్మా, నాన్నా..” అని చెప్పాను.
అమ్మ అతనికి వాటర్ ఇచ్చింది… అంకుల్ దాన్ని తాగకుండా అలా మా అందరి వైపు చూస్తున్నారు…
నేను అతని దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళపై కూచుని, “Sorry, అంకుల్… మనఫ్యామిలీ అంతా కలుసుకోవాలనే ఇలా చేసా.. అంతే తప్ప ఇంకే ఉద్దేశ్యం నాకు లేదు,” అన్నా…
ఆయన నా తలపై చెయ్యివేసి నిమిరి నించున్నారు… ఆర్యన్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నారు.
“కంగ్రాట్యులేషన్స్… my dear son…” అన్నారు.
ఆర్యన్ కూడా ఆయన్ని గట్టిగా పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. తర్వాత, అంకుల్ ఆర్యన్ని ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతులని పట్టుకుని, “నన్ను క్షమించండి, ఇకపై మనం అందరం కలిసే ఉందాం… ఓకేనా..!” అన్నారు.
ఆంటీ కూడా ఏడుస్తూ అంకుల్ ని పట్టేస్కున్నారు… అప్పా, అమ్మా ఆశ్చర్యంగా జరిగేదంతా చూస్తున్నారు.
ఆంటీ నన్ను దగ్గరికి తీసుకుని ఆర్యన్ పక్కన నించోబెట్టి, “వీళ్ళిద్దరినీ ఆశీర్వదించండి… ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు…” అని చెప్పింది.
నేనూ, ఆర్యన్ అంకుల్ కాళ్ళపై పడ్డాం.. అంకుల్ తన చేతిని మా తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంచారు… తర్వాత మమ్మల్ని లేపి, ఆర్యన్ వైపు చూస్తూ, “ఆర్యన్… ఇప్పటి వరకూ నువ్వు సాధించింది ఒకెత్తు… కానీ, శిశిరలాంటి మంచి పిల్లని మన ఫ్యామిలీ లోకి తీసుకొస్తున్నావ్… I am proud of you, my son…” అంటూ ఆర్యన్ని దగ్గరికి తీసుకుని తన నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
“మీకు అసలు శిశిర ఎలా తెలుసండీ!” అని మా స్వీటీ అంకుల్ ని అడిగింది.
అందుకు అంకుల్ సమాధానం చెప్పబోతుండగా, “తర్వాత అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం.. ముందు పదండి, ఆకలేస్తుంది నాకు,” అన్నా…
అందరం కలసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసాం…
వాళ్ళు బయల్దేరేముందు ఆంటీ నా రూమ్ కి వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని, “ఇన్నాళ్ళ మా బాధనీ ఒక్కరోజులో తీర్చేసావమ్మా…” అని మెచ్చుకుని నా నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి అప్పా, స్వీటీ నా దగ్గరికి వచ్చారు. “ఇంకా నువ్వు చిన్నపిల్లవే అనుకున్నా.. పెద్దదానివి అయిపోయావురా..!” అన్నారు అప్పా.
“నీలో ఇంత మెట్యూరిటీ ఉందని ఇప్పుడే తెలిసింది,” అంది స్వీటీ.
ఆర్యన్ని హ్యాపీగా ఉంచుదామని నేను చేసిన పని ఇంతమందిని హ్యాపీగా ఉంచుతుందని అస్సలు అనుకోలేదు నేను!!
నేనలా ఆలోచిస్తుండగా నా మొబైల్ మోగింది… ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడు
అమ్మక్రమశిక్షణ

ఫోన్ లిఫ్ట్ చేయగానే, “నిన్ను కలవాలి..” అన్నాడు.
“ఎక్కడికి రావాలి..?” అన్నా.
తను, “మా ఇంటికి రా..” అన్నాడు.
నేను రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళా… అంకుల్, ఆంటీ నన్ను బాగా రిసీవ్ చేస్కున్నారు. వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాక ఆర్యన్ వచ్చి నన్ను తన రూమ్*కి పట్టుకెళ్ళాడు… రూమ్లోకి అడుగుపెట్టగానే తను నన్ను గట్టిగా పట్టుకుని, “నా లైఫ్ లో జరుగుతుందో లేదో అనుకున్న విషయాన్ని ఇంత త్వరగా ఎలా చేయగలిగావు..?” అని కళ్ళలో నీళ్ళతో అడిగాడు.
“సారీ ఆర్యన్… ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను,” అని ముందుగా తనకి సారీ చెప్పి, “అయినా… నీకేనా సర్ప్రైజులు ఇవ్వడం తెలుసు, నాకు తెలుసు…” అని నవ్వుతూ అన్నాను.
“అసలు… ఇదంతా… ఎప్పుడు… ఎలా… జరిగింది?” అని తను అడిగాడు.
“అసలిదంతా మా వినాయకుని చలవ… ఆయన మహిమ వల్లనే అంకుల్ ని కలుసుకోగలిగాను… తర్వాత మిమ్మల్ని అందరినీ కలపగలిగాను…”
“అసలు ఏం జరిగింది?” అన్నాడు తను మళ్ళీ…
“రెండు నెలల క్రితం మనిద్దరినీ internship కోసం సెలక్ట్ చేసారు కదా… అది చెప్పిన రోజు నేను చాల కోపంతో ఉన్నాను… అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదుగా… సారీ!” అన్నాను నేను.
“హ్మ్… చెప్పు,” అన్నాడు తను.
“ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ వినాయకుడి గుడి ముందు ఆగి, ‘ఏంటి ఇలా చేసావు, స్వామీ!’ అని మనసులో అనుకున్నా… అప్పుడే రోడ్ సైడ్ ఒక యాక్సిడెంట్ అయ్యింది… దగ్గరికి వెళ్తూ ఆంబ్యులెన్స్ కి ఫోన్ చేసా… అక్కడ రక్తంతో తడిసి ఉన్న ఒకతన్ని పట్టుకుని లేపి హాస్పిటల్ కి తీస్కెళ్ళి అడ్మిట్ చేసాను. అప్పాకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పా… అవసరమైతే బ్లడ్ కూడా డొనేట్ చేసాను… కాసేపట్లో అప్పా వచ్చారు, దేవుడి దయవల్ల ఆయన ‘ఔట్ ఆఫ్ డేంజర్’ అని డాక్టర్ చెప్పారు. అప్పా కూడా ‘I am proud of you రా… తల్లీ!’ అని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
మళ్ళీ మన ఇంటర్వ్యూకి అని నేను డ్రెసెస్ తీసుకుందామని షాపింగ్ కి వెళ్ళానా… ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆయన ఉన్నారు అక్కడ… తనే వచ్చి నన్ను పలకరించారు.. ఆరోజు తనకి హెల్ప్ చేసినందుకు thanks చెప్పారు… నేనూ casual గా అతని హెల్త్ డిటెయిల్స్* అడిగా… అలాగే నా ఇంటర్వ్యూ సంగతి కూడా చెప్పాను అతనికి.
తర్వాత ఆయన నన్ను తన ఇంటికి పిలిచారు… నేను ‘తర్వాత వస్తాను’ అన్నా నన్ను తన ఇంటికి పట్కెళ్ళారు…
అక్కడికి వెళ్ళాక నువ్వు ఆంటీ ఉన్న pics చూసాక అర్ధమయ్యింది, అతను మీ ఫాదర్ అని…
అయినా, ఏమీ తెలీనట్టు, ‘ఈ ఫొటోలో ఉంది ఎవరు అంకుల్?’ అని… ‘my wife and my son’ అని చెప్పారు… అలా చెప్తున్నప్పుడు ఆయన గొంతులో గర్వం తొణికిసలాడింది.
‘వాళ్ళు ఎక్కడ అంకుల్… బయటకు వెళ్ళారా?’ అని అడిగాను నేను. ‘లేదమ్మా.. నేను…. వాళ్ళకి దూరంగా ఉంటున్నా…’ అని ఆయన చెప్పారు. ‘ఎందుకు అంకుల్… వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా..?’ అన్నాను నేను..
‘నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం’ అన్నారు ఆయన.
‘మరి… మీకు వాళ్ళంటే ఇష్టం లేదా?’ అని, ‘అయినా… ఇష్టం లేకపోతే వాళ్ళ ఫొటోస్ ఉంచుకోరుగా…!’ అన్నాను నేను.
ఆయన నావైపు చూస్తూ, ‘ఇష్టమా…! ప్రాణం అమ్మా… వాళ్ళు నాకు. కానీ, అంతా నా ఖర్మ… నేను చేసిన తప్పుల వల్లే నాకీ గతి పట్టింది…’ అని, ‘చిన్నప్పుడు వాడు గొప్పవాడు కావాలని ఎన్నో కలలు కనేవాడ్ని… వాడు కూడా అలానే ఉండేవాడు. కానీ, వాడిమీద అతి ప్రేమతో.. అతి జాగ్రత్తతో… ఉండే నాతో ఎవరైనా వాడి గురించి చెడుగా చెప్తే తట్టుకోలేకపోయేవాడ్ని.. వాడు ఎక్కడ చెడిపోతాడో అనే భయంతో వాడిని కొట్టేసేవాడ్ని… తర్వాత అవన్నీ అబద్ధాలు అని తెల్సినా.. నేను వాడితో తప్పుగా ప్రవర్తించాననే గిల్టీతో వాడిని దగ్గరికి తీసుకోలేకపోయేవాడ్ని… అదే మా ఇద్దరి మధ్యా దూరం పెంచేసింది. వాడు ఫస్ట్ వచ్చాడని మెచ్చుకుంటే దానివల్ల వాడికి గర్వం పెరిగి ఎక్కడ చదువుమీద ఏకాగ్రతని కోల్పోతాడేమో అని మెచ్చుకొనేవాడ్ని కాదు… కానీ, మనసులోనే ఎంతో మురిసిపోయేవాడ్ని…

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.