ప్రేమకథ! 486

ఆర్యన్ ..ఆఅహ్హ్హ్హ్ … !! “ఆ పేరు వింటేనే నాకు కోపం కట్టలు దాతేస్తుంది ……
వాడు మా క్లాసు topper….
మా కాలేజీ ఫాకల్టీ ల ముద్దు బిడ్డ …. అన్నిట్లో తనే ఫస్ట్……
అయితే ఏంటి అంట గొప్ప .. వాడిలా ఉండాలంట అందరు……రోజు వాడి పొగడ్తలు మా టీచర్స్ నుంచి వినలేక పోతున్నాను.
ఓహ్…..ముందు నన్నుపరచియం చేస్కోడం మర్చేపోయాను….ఏం చెయ్యను వాడు అంటేనే చాలు చిరాకు…కోపం తప్ప నాకు ఇంకేం గుర్తురావు అసలు…..సరేలెండి నా పేరు శిశిర.నేను బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా…..
నాకు చిన్నపిల్లలు,కుక్క పిల్లలు,మంచి పాటలు,గులాబీలు,కధలు,కవితలు అంటే చాలా ఇష్టం……క్లాసు బుక్స్ తో పాటు ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు చదవటం అంటే నాకు చాల ఇష్టం…..అన్నిరకాల పుస్తకాలు ఫిక్షన్,నాన్ ఫిక్షన్ ఇలా పుస్తకాలూ చదువుతా….ఇంకా …హా …అవును మర్చేపోయా ఫిల్టర్ కాఫీ అంటే పిచ్చినాకు………
చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లో ఫస్ట్ నే కానీ ఇప్పుడు నా ఫస్ట్ వాడు అదేనండి ఆ ఆర్యన్ తీసేస్కున్నాడు…….. అదేంటో అండి వాడిని చూస్తే ఫస్ట్ పోసిషన్ నాది…నీది కాదు అని వాడి collar పట్టుకుని అరవాలి అన్పిస్తుంది……..నాకు వాడి మీద ఇంత కోపం వున్నా వాడితో ఒక్కసారి కూడా ఎప్పుడు గొడవ పడలేదు.ఇప్పటివరకు వాడితో సరిగ్గా మాట్లాడిందే లేదు…….
కానీ ఆ రోజు నాకు పట్టలేని కోపం వచ్చింది……ఇంకా ఎవ్వరు దొరకనట్టు వాడ్ని,నన్ను మాత్రమే internship కి సెలెక్ట్ చేసారు . వాడు ఫస్ట్ ఇంకా నేను సెకండ్ మరి క్లాసు లో ……
IIT చెన్నై,వెళ్ళాలనే ఉంది నాకు కానీ వీడితోన.. వాడి మీద కోపం తో నేను ఇంత మంచి వదులుకోలేను గా ….అందుకే ఇంకా తప్పదు అని బయలుదేరా,ఎలా గడుస్తాయో ఈ రెండు నెలలు అని అన్కుంటూ నా luggage సర్దుకున్నాను .
కాని అదే రెండు నెలలు నా జీవితం లో చెరగని ముద్ర వేస్తాయి అని…….నా ఆశలని,ఆలోచనలని చాల వరకు మార్చేస్తాయి…..అని నా కలలో కూడా ఉహించల…….అన్ని అనుకున్నటు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది…….
మీరు తెల్సుకున్టార ఆ రెండు నెలలలో ఏం జరిగిందో ????????????……..

IIT లో intership వచ్చిందని చాల హ్యాపీగా ఉంది కానీ,అమ్మని… నాన్న ని వదిలేసి వెళ్ళాలి కదా…..అందుకే కొంచెం బాధగా ఉంది…….నాకు ఊహ …తెలిసినప్పటి నుంచి వెళ్ళని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు ……….కావలసినవి అన్ని అమ్మ సర్దుకోవడం లో హెల్ప్ చేసింది ……నాన్న ఏమో కార్డు లో డబ్బులేస,చూస్కుని వాడకో తల్లి …ఇంకా అవసరం అయితే ఫోన్ చేసి చెప్పు వేస్తా అని చెప్తూ డెబిట్ కార్డు చేతిలో పెట్టారు……అప్పటిదాకా IIT కి వెళ్తున్న అని ఒక చిన్న excitement ఉంది కానీ ఇంటి గుమ్మం దాటి బైటకి వచ్చానో లేదో కళ్ళు నీళ్ళ తో నిండి పోయాయి,ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఇన్ని కన్నీళ్ళు నాకు…… “పిచ్చిపిల్లా .. రెండు నెలలు ఎంత సేపు రా,యిట్టె అయిపోతాయి తల్లి ” అని నాన్న నన్ను గట్టిగ పట్టుకుని,తల నిమురుతూ అన్నారు.
“హ్మ్మ్” అని కళ్ళు తుడ్చుకున్నాను.
“నేను రాను రైల్వే స్టేషన్ కి,నేను చూడలేను నువ్ వెళ్తోంటే” అంది అమ్మ నా నుడురుమీద ముద్దు పెడుతూ..
“పిచ్చిపిల్లా..రెండు నెలలు ఎంత సేపు,యిట్టె అయిపోతాయి”అని అచ్చం నాన్నలా అన్నాను అంతే నవ్వేసింది అమ్మ….
“ఎంతైనా నువ్వు మీనాన్నకుతురివే,వెళ్ళు నీకేం బెంగ ఉండదులే నామీద”అంది మా అమ్మ మూతిముడుచుకుంటూ…… .”నువ్వులేకుండా అసలు ఎలా ఉంటాను అనుకుంటున్నావు స్వీటీ అని అమ్మని గట్టిగా పట్టుకుని అమ్మ బుగ్గ మీద ముద్దు పెడ్తూ “అన్నాను నేను.
“ఫోన్ ఉంది గా,మాట్లాడుతూనేవుంటాను రోజు మార్నింగ్….నైట్. జాగ్రత్తగా ఉండు రాకన్నా”అనిఅమ్మఇంకోముద్దుపెట్టింది.
తర్వాత కార్ ఎక్కం …నేను…అప్పా, అప్పా డ్రైవ్ చేస్తూ ఉన్నారు ….విండో లోంచి అమ్మకి టా టా చెప్తూ చూస్తున్న …క్రమంగా కారు వేగాన్ని పుంజుకుని మా అమ్మకి …మా ఇంటికి దూరం గా వెళ్తోంది …….
కళ్ళుతుడుచుకుంటూ అలా ఆలోచిస్తూ ఉన్నా.
“నీతోపాటు సెలెక్ట్ అయిన ఇంకో అబ్బాయి ఎవరుతల్లి? “నాన్నఅడిగారు…….,
నేను ఆయన భుజం మీద తల వాల్చుకుని కూర్చున్న.
” తన పేరు ఆర్యన్” అన్నాను.
హ్మ్మ్..నీ ఫ్రెండ్ నే కదా,మీరిద్దరే ఉంటారు గా మరి ఈ 2 నెలలు ” నాన్నఅడిగారు.
వాడు నాకు ఫ్రెండ్ ఏంటి?! వాడు అంటేనే చిరాకు…..కోపం……..వాడితో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు అని అరవాలి అనిపించింది…….కాని ఆయనని వదిలివెళ్తున్న అనే బాధపడుతున్నారు, నాకు నచ్చని వాడితో ఉండాలి అని తెలిస్తే ఇంకా బాధపడతారేమో అనిపించింది నాకు.
“హా నాన్న, మా క్లాసు ఫస్ట్ tanu,చాల సైలెంట్”అన్నాను.
“నువ్వు వేరేవాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇస్తావు? అందరు సైలెంట్గానే అన్పిస్తారు అందుకే నీకు “అన్నారు నాన్న నవ్వుతు .రైల్వేస్టేషన్కి వచ్చేసాం, నేను ఒక laptaap bag,ఒక పెద్ద trolly తెచ్చుకున్నాను,ఆర్యన్ కోసం చూస్తున్నాం నేను ,నాన్న .ఇంతలో తను నాలానే ఒక laptap bag , ఒకచిన్న trolly తెచ్చుకున్నాడు.
“నాన్న,తిను ఆర్యన్..ఆర్యన్ మై డాడ్ “ఇద్దర్ని ఒకరికిఒకరిని పరిచయం చేసాను….
“నమస్తే అంకుల్” విష్ చేసాడు ఆర్యన్.
“నమస్తేబాబు….. ఒక్కడివే వచ్చావ ?మీవాళ్ళు ఎవరు రాలేదా? “నాన్నఅడిగారు.
“లేదు అంకుల్,అమ్మ బిజీగా ఉన్నారు……. నాన్న అవుట్ ఆఫ్ స్టేషన్.”చెప్పాడు తను.
ఇంతలో ట్రైన్ వచ్చింది.. మేము ఎక్కి కూర్చున్నాం….ఇద్దరిదీ సైడ్ లోయర్ అండ్ అప్పర్ బెర్త్స్.నాన్న నాకు లిట్లే హార్ట్స్ biscuts..” ఇచ్చారు
“థాంక్యు అప్పా” అని గట్టిగ పట్టేస్కున్నాను ఆయనని..మల్లి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి..
“ఏం కావాలన్నా ఒక్క ఫోన్చెయ్యి చాలు, సరేనా “అన్నారు నాన్ననా భుజం మీద తడుతూ.
“హ్మ్మ్..” అని ఊ కొట్టాను…….. అమ్మతో మాట్లాడదాం ఉండు అని ఇంటికి ఫోన్చేసారు నాన్న……అమ్మ ఏడుస్తోంది, నాకు ఆమె గొంతు అర్ధం అయిపొయింది……..
“ఏడుస్తూ పంపకు స్వీటీ నన్ను……ఒక్కసారి నవ్వు ప్లీజ్ అని అన్నాను,నా కళ్ళు నేను తుడుచుకుంటూ.
“ఏడవడం లేదు నేనేమి, బాగా తిను,జాగ్రత్తగా ఉండు,ఎవ్వర్తో గొడవ పడద్దు.. సరేనా ” అంది అమ్మ.
“అలాగే స్వీటీ .. ఇంకా వేల్లోస్తాను, ట్రైన్ మూవ్ అవ్తుంది “అని చెప్పి ఫోన్ నాన్నకి ఇచ్చేసా.
అప్పా , మీరేమి చెప్పరా నాకు,అమ్మ అన్ని చెప్పింది అన్నాను …..

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.