ప్రేమకథ! 486

“హా..అయినా నీ నమ్మకాన్ని నేను తప్పు పట్టను..నువ్వెళ్ళు లోపలికి,నేను ఇక్కడే వెయిట్ చేస్తా “అన్నాడు తను.
“తనని ఎన్నో ప్రశ్నలు అడగాలని అనిపించింది…….కానీ ,అది సమయం కాదులే అనుకుని,గుడిలోకి వెళ్లి ,కాళ్ళు కడుక్కుని,దర్శనం చేస్కుంటున్నా……
“కశ్యప గోత్రం……శ్రీ రామ్,సీత…అని అమ్మ ,నాన్నల పేర్లు చెప్పి అర్చన చేయిస్తున్నాను……”
“భారద్వజ గోత్రం……ఈశ్వర్,శైలజ అన్నాడు తను నా పక్కన నించుని…….”
“ఆర్యన్..!! దేవుడిని నమ్మను అన్నావు ?”అడిగాను నా పక్కన నించున్న ఆర్యన్ ని చూసి………
“హా….అవును……నమ్మను”అన్నాడు తను…….
“మరి అర్చన ఎవరి పేరు మీద చేయిస్తున్నావ్ ? “అడిగాను నేను…….
“ఓహో…. అదా.. పొంగళి ప్రసాదం పెడ్తున్నారు,ఇందాకే ఒకావిడ బైటకి వస్తుంటే,ఆవిడ చేతిలో చూసా…..నాకు పొంగళి చాల ఇష్టం……..
కొనుక్కుందామని లోపలకి వచ్చా……కానీ అర్చన చేయించిన వాళ్ళకే పొంగళి ప్రసాదం అన్నారు.. సరేలే అని అమ్మ,నాన్న పేర్లతో అర్చన చేయిస్తున్నా.. అంతే.. “వివరించి చెప్పాడు తను………
ఇష్టం లేకపోయినా,గుడిలోకి రాకతప్ప లేదు,దేవుడు ఊరుకుంటాడ అనుకుని నేను నవ్వుకున్నా..ఇద్దరం దర్శనం చేస్కుని,ప్రసాదం తీస్కున్నాం….. ఇంకా వెళ్దాం పద అన్నాడు తను వెంటనే…….
“అరేయ్,ఉండు..గుడికి వచ్చినప్పుడు కొంచెంసేపు కుర్చుని వెళ్ళాలి”అంటూ కూర్చున్నాను నేను …..
“అబ్బా ఏంటి శిశిరా…పద అంటూ కదలబోయాడు . “అన్నాడు….
ఇంతలో నేను తన చేయి పట్టుకుని లాగుతూ కూర్చో దా అంటూ లాగాను…..తను చేసేది లేక ….నా పక్కన కుర్చుని
“కూర్చుంటేనే పుణ్యం వస్తుందా ఏంటి “అన్నాడు……….
“అరేయ్…… కాదు.. మనం కుర్చుని కళ్ళు మూస్కుని,చిత్రగుప్తుడికి చెప్పాలి అంటా”నేను గుడికి వచ్చాను స్వామి”, అని అప్పుడు ఆయన మనం చేసిన మంచి పనుల లిస్టులో ఎంటర్ చేస్తాడుఅంట.”అన్నాను నేను……..
“ఓహో…..నువ్వు చెప్పకపొతే రాయడా?తప్పులు చేసినప్పుడు ఎంటర్ చేస్తాడుగా అప్పుడు కూడా.. “కళ్ళు మూస్కుని దేవడా..నేను తప్పు చేసాను,ఇది కూడా ఎంటర్ చేస్కో అని చెప్తారా? “”అని వెటకారంగా అడిగాడు పొంగళి తింటూ ……..
“నకదంతా తెలీదు..మా బామ్మా చెప్పింది ఇలా చెప్పాలి అని అంతే…….అంత వెటకారం ఏం అక్కర్లేదు……నీకు నేనేమి చెప్పట్లేదు అలా చేయి….ఇలా చేయి అని…..”అన్నాను నేను కొంచం సీరియస్గా……….
తను కళ్ళు మూస్కుని ఏదో తల్చుకున్నాడు……….తర్వాత “వెళ్దామా ? “అని అడిగాడు………
“ఏం కోరుకున్నావు ? “అడిగాను నేను…….
“నాకేం కావాలన్న నేను achieve చెస్కొగలను,ఎవరో ఏదో ఇవ్వాలి అని నేనేమి కోరుకోను….. ” అన్నాడు.
“మరి కళ్ళు మూస్కుని ఏం చేసావ్ ఇంతకు ముందు ? “అడిగాను నేను……..
“ఓహో…….అదా.. !!ఇంకా నువ్వు ఉన్నావు అంకుని నిన్ను నమ్మే వాళ్ళు వున్నారు,కొంచెం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకో అని దేవుడికి చెప్పనులే “అన్నాడు తను…….
నేను అప్పుడు,తన మాటలకి react ఐతే,అక్కడే డిబేట్ మొదలవుతుంది అని,సైలెంట్ గా ఊరుకున్నాను…….
ఇద్దరం బైల్దేరాం..తన ప్రవర్తన,మాటలు అన్నిట్లో ఏవో కారణాలు ఉన్నాయి అనిపించింది నాకు,అవి ఏంటో తెల్సుకోవాలని……నా మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలని ఇంకా తనని అడిగేద్దామని నిర్ణయించుకున్నాను …….ఇలా ఆలోచిస్తూ ఉన్న మా ప్రయాణం కొంచంసేపటికి కాంపస్కి వచ్చేసాం ……. ..
అక్కడ ఆటో దిగి అలా నడుస్తూ ఉన్నాం ……మా హాస్టల్ కి వెళ్ళటానికి…..
“లైబ్రరీ దగ్గర లాన్ లో కొంచెం సేపట్లో కలుద్దాం,త్వరగా రా ……నీతో చాలా మాట్లాడాలి “అన్నాను నేను నా హాస్టల్ లోకి వెళ్తూ……….
“నేను కూడా నీకు కొన్ని చెప్పాలి శిశిర “అన్నాడు తను…..
“ఏం చెప్పాలి “అడిగాను నేను వెంటనే……….
తను అలా అనేప్పటికి నా గుండె వేల మైళ్ళ వేగంతో కొట్టుకోడం మొదలు పెట్టింది,ఎందుకో తెలియలేదు మరి………
“కలుస్తాంగా.. మాట్లాడుకుందాంలే “అనేసి వెళ్ళిపోయాడు తను..
తను వెళ్ళిపోయాక నేను నా హాస్టల్ లోపలి వెళ్ళిపోయా ……..నా గుండె మాత్రం మామూలు స్థాయికి రాలేదు…….అదే వేగంతో నా చెవులకి వినిపించే అంత గట్టిగ కొట్టుకుంటోంది……. మారుతున్న పరిణామాలకు కారణాలు తెలియబోతున్నాయిలే అన్కుంటూ నా రూంలోకి వెళ్ళిపోయాను నేను……..
రూంకి వెళ్ళాను …..బాగా తిరిగి తిరిగి అలసిపోయ…….అందుకే స్నానం చేయ్యానికి వెళ్ళ…స్నానం చేస్తున్నా….షవర్ ఆన్ చేసి…….నా చేతలు అయితే యాంత్రికంగా పనిచేస్తున్నాయి కాని…నా మనసంతా ఆర్యన్ నాతొ మాట్లాడాలి అన్న విషయాల మీదనే ఉంది…….షవర్ హోరు లోకూడా నా గుండె చప్పుడే నాకు వినిపిస్తూ ఉంది…..అల ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యాను……పింక్ కలర్ చుడిదార్ వేస్కున్నాను…..ఆర్యన్ ఏం చెప్పాలని అనుకున్తున్నాడో అని అనుకుంటూ రెడీ అయ్యాను……..త్వరగా రెడీ అయ్యి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను ,అక్కడ ఉన్న రౌండ్ బెంచ్ మీద కుర్చుని వెయిట్ చేస్తున్నాను…….తను ఇంకా రాలేదు…….చాలా సేపు వెయిట్ చేశాను…… అల 1 గంట వెయిట్ చేశా…..తను రాలేదు ఇంకా… అబ్బా …..ఏంటి ఈ మనిషి మాములుగా ఎప్పుడు టైం కి వస్తాడే ఇప్పుడేంటి,ఇంత లేట్ చేస్తున్నాడు అనుకున్నాను…..ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నాను .. ఫోన్ తీసి తన నెంబర్ డయల్ చేస్తున్నాను……………..

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.