ప్రేమకథ! 487

అప్పటిదాకా గమనించలేదు కాని,టైం చుస్తే 9:30దాతుతొన్ది….ఇంచుమించు అందరు వేల్పోయారు,మేము మా డిపార్టుమెంటు బిల్డింగ్ దగ్గర నించుని ఏదయినా వెహికల్ లిఫ్ట్ దోర్కుతుందేమో అని చూస్తున్నాం…….
ఒక పావుగంట చూసామ్…ఏది కన్పించ్లా…ఇంకా అల్లా నడుస్తూ వెళ్ళడమే అని అంకున్తూ…ఉన్నాం..ఇన్తలో మా మేడం బైటకి వచ్చారు,మేము వెయిట్ చెయ్యడం చూసారు.ఆవిడ ఫోన్ లో మాట్లాడతూ మమ్మల్ని రండి అన్నటు సైగ చేసారు…మేము ఆవిడా దగ్గరకు వెళ్ళాం…ఆవిడ ఫోన్ మాట్లాడడం అయ్యేసరికి ఒక కార్ మా దగ్గర వచ్చి ఆగింది.. ఆవిడ కార్లో ఎక్కి కూర్చున్నారు.
“హమ్మయా”అనుకుంటూ మేము వెళ్లి ఆవిడ కార్లో కూర్చున్నాం.ఆర్యన్ ఫ్రంట్ సీట్లో,నేను మేడం బ్యాక్ సీట్లో….బ్లాకు కలర్ మెర్సిడెస్ బెంజ్.. ఆవిడ లాగే చాల డాంబికంగా ఉండి……
“Where do you want me to drop you ? “అంది ఆవిడ.
“Akshaya canteen Madam “అని ఇద్దరం ఒకేసరి జవాబిచ్చం….ఆవిడ దానికి నవ్వుతు…
“Ramana..drop them at Akshaya canteen and take off for today “అని…మాతో మాములుగా మాటాడ్డం మొదలుపెట్టారు …నవ్వుతూ….మాకోసం అడిగారు..తర్వాత మాకు కొన్ని టిప్స్ చెప్పారు….మంచి బుక్స్ సజెస్ట్ చేశారు….కొంత దూరం వచ్చాక,స్టాఫ్ రెసిడెన్స్ దగ్గర దిగిపోయారు.
“Thank you madam “అన్నాంమేము.ఆవిడ నవ్వుతు…”aaryan tommorrow bring some good songs for me bur dont play at your work time okey good night kids” అనేసి వెళ్ళిపోయారు.

మేడం కార్ లోనుంచి దిగిపోయాక అనుకున్నమనస్సులో ఈవిడ మాతో..ఇలా కూడా ఉంటారా అని
“మేడం అంత చెడ్డవారు ఏమికాదు కదా..”అన్నాను నేను ఆర్యన్ తో.
“హ్మ్మ్….”అన్నాడు తను.
“మీరు తెలుగు వాళ్ళ?”అడిగాడు డ్రైవర్.
“అవను..మీరు కూడా తెలుగేన?”అడిగా నేను ఉత్సాహంగా.
“హా..అవను.. కాని 15years అయిపొయింది చెన్నైకి వచేసి”అన్నారు రమణ.
“మేడం చాల మంచివారు…..ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం..కొంచెం కటువుగా మాట్లాడినా వెంటనే కరిగిపోతారు “అని చెప్పారు ఆయన.తర్వాత ఆయన కోసం చెప్తున్నారు..వాళ్ళ ఉరు ఇక్కడ సంగతులు అలా చెప్తునారు….మేము ఆయన మాటలు వింటూ “ఊ”కొడుతున్నాం……
కొంచెంసేపటికి మమ్మల్ని అక్షయ కాంటీన్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు ఆయన.
“పద ట్రీట్ ఇస్తాను”అన్నాను నేను ………ఆర్యన్ “సరే పద,నాక్కూడా చాలా ఆకలేస్తోంది”అన్నాడు.ఇద్దరం వెళ్లి కూర్చున్నాం.దోస అండ్ కాఫీ ఆర్డర్ చెప్పను.
“మనం అనుకున్నట్టుగా జనాలుండరు కదా “…..అన్నాను నేను.
“అదేం అలా అన్నావ్?”అడిగాడు ఆర్యన్.
“ఊహూ…..లెదూ..జనరల్ గా అన్నాను.మేడం చాలా కోపిస్టి అనుకున్న కాని అంత చెడ్డవారేమి కాదు అనిపించింది”అన్నాను నేను.
“ఓహో….అదా….అందరు మనం అనుకునేట్టుగా ఉండరు శిశిర”అన్నాడుతను.
“అవను……నాకది ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవ్తునాది”అన్నాను.
“అవనా..అదేంటి?”అడిగాడు తను…….
“తెలుసా…..నువ్వంటే నాకు చాలా చిరాకు,కోపం…..నిన్ను తిట్టుకొని రోజుండేది కాదు….కాని ఇప్పుడు మంచివాడివే అనిపిస్తున్నావ్ నాకు”అన్నాను.
నేను అల చెప్తుంటే తను నా వైపే వింతగా చూస్తున్నాడు…
“అవునా….నేనేం చేశాను నిన్ను,నన్ను రోజు తిట్టుకునేంతగా?”ఆశ్చర్యంగా అడిగాడు తను.
ఇంతలో ఆర్డర్ వచ్చింది….ఇద్దరం ఇంకా తినడం స్టార్ట్ చేశాం……
“కోపం గా అరేయ్,ఏమ్చేసావా….నువ్వు అన్నిట్లోనూ 1st మరి…. చిన్నపట్నుంచి నేను అన్నిట్లో 1st కాని ఇప్పుడు naa 1st నువ్వు తీసేస్కున్నావ్..నేను నా 1st మల్లా నీ నుంచి తీస్కోడానికి ఎంత ట్రై చేసిన ఒక్కసారి కూడా నిన్ను ఓడించాలేకపోయాను… అందుకే నాకు నీ మీద కోపం..ఇంకా కాలేజీ లో ఫాకల్టీ అంటా నిన్ను మేచ్చుకోడమే…నిన్ను చూసి మమ్మల్ని నీల ఉండమనేవర్రు…అందుకే నాకు నువ్వంటే చాల చిరాకు..”అన్నాను నేను దోస కంప్లీట్ చేస్తూ……
తనేమి మాట్లాడలేదు..దోస తినేసాడు..నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు..నా కాఫీ నేను తాగేసి బిల్ ఇచ్చా….తను మౌనంగా కుర్చుని అటుఇటు చూస్తున్నాడు…….
తన మొహంలో కోపంఅయితే కనిపించలేదు కాని….మౌనంగా ఉన్నాడుకదా సో నాకు కొంచెం awkward గా అనిపించింది…….ఇద్దరం బయటికి వచ్చాం కాంటీన్ నుంచి,అల నడుస్తునాం…తను మాత్రం తన మౌనాన్ని వీడలేదు…..నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధంకావట్ల…..అలా సైలెంట్ గానే మా నడక సాగిస్తున్నాం……నా హాస్టల్ కి కొంచెం ముందున్న లాన్ దగ్గరకి వచ్చాం…..
“కొంచెంసేపు ఇక్కడ కుర్చున్దామా”అన్నాడు తను……..
“సరే “అని జవాబిచ్చాను…..
ఇద్దరం వెళ్లి లాన్లో కూర్చున్నాం…….కానీ మా మద్య ఎలాంటి సంభాషనా లేదు…….ఇంకా నేను అలా ఉండలేకపోయ….
“నేను అన్న మాటలు నిన్నుహర్ట్ చేసుంటే సారీ”అన్నాను నేను.
“Shishira I admire you “అన్నాడు తను….
“నాకేం అర్ధం కాలేదు…..You admire me?but,why?”అన్నాను నేను…..
“శిశిర….నీలా చాలా తక్కువమంది ఉంటారు తెలుసా..ఏం అనాలంటే అది అంటావ్….ఎలా ఉండాలంటే అలా ఉంటావ్….నువ్వు జెలసి కూడా తెలియనంత నిర్మలంగా పెరిగావు…..నీకు నామీద ఉన్నది కోపంకాదు తెలుసా……ఒక విదంగా చెప్పాలంటే అది ఈర్ష్య,కాని నీకు అది కూడా తెలియలేదు……ఈరోజుల్లో అసలెవరు నాకు నువ్వంటే చాలా కోపం,ఎప్పుడు తిట్టుకునేదాన్ని అని డైరెక్ట్ గా ఆ తిట్టే వ్యక్తి కే చెప్తారు చెప్పు?మనసులో వాళ్ళని తిటుకున్న..పైకి మాత్రం నవ్వుతూ సంమధానం చెప్తారు ” అన్నాడు తను నావైపు చూస్తూ …………..
నాకు తను అన్నదానికి ఎలా react అవ్వాలో తెలియలేదు…అలా సైలెంట్గా కూర్చున్నాను……..
“నువ్వు నవ్వలంటేనే నవ్తావు,ఏడుపు వస్తే చిన్న పిల్లలా ఏడుస్తావు..అసలెల ఇంత pure hearted గా ఉన్నావు?”అడిగాడు తను.
“నువ్వు చెప్పేదంతా ఫిలాసఫీలా ఉంది,మరీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవు “అనేసి కాళ్ళు చాపుకుని ఆకాశంలోకి చూస్తున్నాను నేను.
“నాకు నీలా ఉండాలని ఉంది శిశిర…..లైఫ్ లో ఏమాత్రం regrets లేకుండా..”అని తను కూడా నాలా కాళ్ళుచాపుకుని పైకి చూస్తూ అన్నాడు……

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.