ప్రేమకథ! 489

“చూడు నేకు నా మీద కోపముంటే తిట్టు కానీ ఇలా ఒక మాట కూడా మాట్లాడకపోతే నావల్ల కాదు,అయినా నేనేమి నిన్ను హెల్ప్ చెయ్యమని అడగ లేదుకదా,ఎందుకు పెద్ద నువ్వు హీరోల nee పేరు చెప్పావ్? తిడితే తిట్టేది నన్ను..నీకేంటి మధ్యలో”అని ఏడుస్తూ అన్నాను.నా కన్నీళ్లు చూసిగాని కరగలేదు తను..
“హే, చిన్నపిల్లలా ఏడుస్తున్నావ్ ఏంటి………. నేను కోడింగ్ చేస్తున్న కదా,నాకేం నీ మీద కోపం లేదు..”అన్నాడు తను.
“అబద్దాలు చెప్పకు,నీకు నన్ను కొట్టేయాలి అన్నంత కోపంగా ఉంది కదా “అన్నాను నేను.
“ఛ..ఛా……..పిచ్చి పిల్ల అదేమీ లేదు…..,ముందు నువ్వు కళ్ళు తుడుచుకో నిన్ను ఇలా చూడకూడదు అనే నేను అలా చేశా…మల్ల నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు” అంటూ తన రుమాలు నా చేతికిచ్చాడు.
“నాకేం అక్కర్లేదు……నేను మార్గదర్శిలో చేరాను,ఒక రుమాలు కొనుక్కున్నాను”అన్నాను నేను నా కళ్ళు తుడ్చుకుంటూ…….అప్పటిదాక చెట్టు లా చలనం లేని ఆర్యన్ ఫక్కుమని నవ్వేసాడు.
“హమ్మయ……. నవ్వేసావ…!!ఇంకా పద…తినేసి వద్దాం…. “అని తన చెయ్యి పట్టుకుని లాగాను నేను.”నాకు పనుంది శిశిర,నువ్వెళ్ళు”అన్నాడు ……
తను నా చెయ్యి వదిలించుకుంటూ…..
“మల్లి మొదటికి రాకు మహానుభావ,ప్లీజ్…..కొంచెం తినేసి వచ్చి వర్క్ చేస్కుందాం…”అని బుంగమూతి పెట్టి అడిగాను……ఏమనుకున్నాడో ఏమోమరి లేచి వచ్చాడు…………..నాతొ …………………………

ఇద్దరం వెళ్లి Cafteria లో లంచ్ తినేసి మళ్లీ వెనక్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేశాం.ఈవెనింగ్ 6 అయ్యింది……నా వర్క్ కంప్లీట్ అయింది కాని ఆర్యన్ తన చైర్ లోంచి ఇంచ్ కూడా కదలకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు,మిగతా వాళ్ళు అయిన అజయ్,సెల్వమణి,కృష్ణన్ అందరూ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయారు.ఆర్యన్ నన్ను కూడా ఆ ఇద్దరు తమిళ్ తంబిలతో పాటు వేల్లిపోమన్నాడు కాని నేను మాత్రం వెళ్లనని ఉండిపోయాను.
“శిశిర నాకు చాలా వర్క్ ఉంది చూసావుగా…..నువ్వు హాస్టల్కి వెళ్ళిపో,నీకు లేట్ అవుతోంది…”అన్నాడు తను తల కూడా నా వైపు తిప్పకుండా.
“పర్వాలేదు,నేను కూడా ఉంటాను..అయినా నీకు ఈ పనిష్మెంట్ నా వల్లనేగా.. నువ్వు వర్క్ చేస్కుంటుంటే నేను ఎలా వెళ్లిపోతాను చెప్పు,నాకు చాలా గిల్టీగ ఉంటుంది”అని చెప్పను.
“మొండిదానివి శిశిర,సరే నీ ఇష్టం ఉండు….”అన్నాడు తను.”
నేను కూడా తన పనిష్మెంట్ వర్క్లో షేర్ తీస్కున్న,ఎంతైనా నా మూలంగానే కదా పాపం మొదటిరోజే తిట్లు తిన్నాడు….కాలేజీ లో ఎవ్వరి చేతా ఒక్క మాట కూడా అన్పించుకోలేదు ఇంతవరకు…కానీ ఇక్కడ నేను బాడ్ అవ్వకూడదు…ఏడవకూడదు అని తిట్లు కాసాడు….అని బాధేసింది నాకు.”
ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ చేశాం,ల్యాబ్ లాక్ చేసి attender కి కీస్ ఇద్దామని వచేప్పటికి atender కూడా వెల్పోయాడు.ఇంకా చేసేదేం లేక డైరెక్ట్ గా మేడం రూమ్కి వెళ్ళాం……
మేము వెళ్లేసరికి ఆవిడ ఏదో ఫైల్ చూస్తున్నారు.
“May we get in Madam “అన్నాం ఇద్దరం…..ఆవిడ తలెత్తి మమ్మల్ని చూశారు..లోపలికి రండి అన్నట్టు చేత్తో సైగ చేశారు. ఆవిడ మొహంలో కోపం ఇంకా తగ్గినట్టు నాకు అనిపించలేదు..అలా గుండెని అరిచేతుల్లో పెట్టుకుని ఇద్దరం మేడం రూంలోకి అడుగుపెట్టాం.
” Good evening madam ..!! “అని విష్ చేశాం.
“Keys madam .. attender already left , so we came to give the lab keys..”అని ఆర్యన్ కీస్ ఆవిడ టేబుల్ మీద పెడుతూ అన్నాడు.
“Hmm…..okay , so, you completed all the work then “అంది ఆవిడ.
“Yes, mam “అని ఆర్యన్ అని తల దించుకున్నాడు.
“Good .. don’t repeat the mistake again . It’s your 1st mistake so I’m sparing you . You may leave now “అంది ఆవిడ.
“sorry mam “అనేసి బైటకి వచ్చేసాం మేము.
“ఆవిడ అసలు నవ్వాదా?! ఎందుకు మూతి ములక్కాడలా పెట్టుకుంది…..అయ్యో పాపం ఇంతసేపు ఉండి వర్క్ చేసారుఅని కూడా లేదు..ఃఉహ్హ్..!!” అన్నాను నేను తన పక్కన నడుస్తూ….
“శిశిర..తప్పు మనది,వర్క్ టైంలో పాటలు పెట్టాం…అందుకే ఆవిడ కోప్పడ్డారు,ఇంకా వదెలెయ్.. అయిపొయింది కదా “అన్నాడు తను.
“హ్మ్మ్.. సరేలే బాబు పదా..!!నువ్వు చాల స్ట్రైన్ అయ్యావ్కదా..అంత వర్క్ చేసావ్,1minute కూడా రెస్ట్ లేకుండా..సారీ “అన్నాను నేను.
“అరేయ్ బాబా,it’s okay..అయినా నాకు వర్క్ చేస్తుంటే స్ట్రైన్ అనిపించదు…..అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం నాకు నా చిన్ననాటి నుంచి అలవాటు అయ్పోయింది”అన్నాడు తను.
“సరే పద,నేను ట్రీట్ ఇస్తా.. వేడి వేడి కాఫీ అండ్ దోస.. సరేనా?”అడిగా నేను.
“హ్మ్మ్.. దోస సరే కానీ,కాఫీ నాట్ ఒకే …చెప్పానుగా నాకు కాఫీ నచదు..”అన్నాడు తను .
“అరేయ్,ఒక్కసారి తాగిచూడు……ఒక hectic day of work తర్వాత ఒక వేడి వేడి కప్ కాఫీ స్ట్రెస్ బస్టర్ తెలుసా..”అన్నాను .
అప్పటికి బయటకు వచ్చేసాం మేము…అక్కడ ఒక్క వెహికల్ లేదు ……
“ట్రీట్ సంగతి తర్వాత …..ముందు ఇక్కడ్నుంచి ఎలా వేళ్ళలో చూదు..బస్సు టైం ఎప్పుడో దాటిపోయింది.. ఇక్కడ్నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఎలా ..”అంటూ అటు ఇటు చూస్తున్నాడు ఆర్యన్…

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.