ప్రేమకథ! 481

“నువ్వు చిన్న పిల్లవి కాదు, నాకు రాంక్లు, గ్రేడ్లు అక్కర్లేదు…నువ్వు ఏం చెయ్యాలనుకున్న చేయి, లైఫ్ లో ఎప్పుడు…..అయ్యో ఇది చేయలేకపోయనే అని regret ఫీల్ అవ్వకూడదు నువ్వు అంతే.”అన్నారు నాన్న……
నాన్న మాటలకి ఒక చిరునవ్వు మెరిసింది నా మొహంలో.వేల్లోస్తాను అని చెప్పా ట్రైన్ మూవ్ అవ్తోంది,నాన్న దిగిపోయారు…..అందరు పేరెంట్స్ అన్ని మార్క్స్ రావాలి,ఇంత స్కోర్ కావాలి అనుకుంటారు ఈ రోజుల్లో కాని నేను చాల అదృష్టవంతురాలిని,ఒక్కసారి కూడా ఎప్పుడు నన్ను ఏ విషయంలో ను ప్రెషర్ చెయ్యలేదు వాళ్ళు. నాకు నచ్చిన బ్రాంచ్ నేనే ఆప్ట్ చేస్కున్నాను, నా మార్క్స్ విషయంలో నా పేరెంట్స్ చాల గర్వపడతారు,నాకు ఆ విషయం తెల్సు కాని ఎవ్వరి ముందు నన్ను పొగడరు. వాళ్ళ హప్పినెస్స్ ఎప్పుడు అలానే ఉండేలా నేను మాక్సిమం ట్రై చేస్తా,మా అమ్మ,నాన్న ల గారాల పట్టిని నేను.నేను ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళే నాకు అన్ని,నాన్న ఐతే ఫ్రెండ్ కన్నా ఎక్కువ .తను నా బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్
ఏ విషయమైన ఆయన తోనే షేర్ చేస్కుంటాను.ఆయన సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్.ట్రైన్ స్టేషన్ వదిలే వరకు కిటికీలో నుంచి చెయ్యి ఊపి నాన్నకి “టా టా “చెప్తూనే వున్నాను.

ట్రైన్ స్టేషన్ దాటాక కాని గుర్తు రాలేదు ఆర్యన్ నన్ను గమనిస్తున్నాడని……….
నేను ఏడవటం అంతా చూసేశాడ వీడు…….ఏమనుకున్తూన్నాడో …..అసలెల మాట్లాడాలి ఈ అబ్బాయితో………అని మనసులో అనుకుంటున్నాను ……..ఇంతలో తనే
“నాకు చాల హ్యాపీ గా ఉంది “అన్నాడు ఆర్యన్,నా థాట్స్ నుంచి బయటకి తెస్తూ.
“హ .. ఏంటి .. ఎందుకు? “అని అన్నాను.
“IIT చెన్నై లో internship గురించి……ఏం నువ్వు హ్యాపీగా లేవా?”అడిగాడు తనూ,చిన్నగా నవ్వూతు.
“హా…అదా అవునూ,నేను కూడా హ్యాపీ గా ఉన్నా “అన్నాను నేను.
వీడు,మాములుగా మాట్లాడతాడ?మనసులో నవ్వుకున్నాను నేను.
“నువ్వు మీ అమ్మ,నాన్నతోవుంటావా? “అడిగాడు ఆర్యన్.
“హ..నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావుగా,hostler కాదు గా నువ్వు..”అన్నాను నేను.
“”హా..నేను ఇంట్లోనే ఉంటాను అని.”తను చెప్పాడు.
ఇంతలో నా బాగ్ లో నుంచి head phones తీస్కుని MP 3 ప్లేయర్ లో పాటలు విందామని పెట్టేస్కున్న,తనేదో మాట్లాడబోయి ఆగిపోయాడు.
“ఏదో చెప్పబోయావ్?”అడిగాను నేను.
“ఏం లేదు,you carry on..”అని తను ఒక బుక్ తీసి చదువుకోవడం స్టార్ట్ చేసాడు…….

ట్రైన్ జర్నీ చాల బోరింగ్..చాల పాటలు విన్నాను అయిన టైం కదలడం లేదు.తను కుడా బుక్ మూసేసాడు,కిటికీ లో నుంచి బైటకి చూస్తున్నాడు.
“రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసా?”అడిగాను నేను.”
తెలీదు,google maps and GPS ఉన్నాయిగ..ఆటో ఎక్కుదాం IIT చెన్నై అంటే వాడే తీస్కేల్తాడు”చెప్పాడు తను తాపీగా.” మెయిన్ గేటు రీచ్ ఐతే చాలు,అక్కడనుంచి buses ఉంటాయిటగా అడ్మిన్ ఆఫీసు వరకు”అడిగాను మల్లి నేను.
“హ,ఉంటాయంట…మన internship acceptance letter అండ్ college ID చూపిస్తే security outlet నుంచి వెళ్ళిపో వచ్చు” చెప్పాడు తను.
“హ్మ్మ్.. సరే ” అన్నాను
నేను.మల్లి పాటలు వినడం మొదలు పెట్టాను నేను.తను బుక్ తీసి రాస్తున్నాడు ఏదో..
“ఏం రాస్తున్నావ్ ?”అడిగాను ఇంకా curiosity తట్టుకోలేక.
“హ్మ్మ్.. ఏం లేదు,ఏదో పిచ్చి రాతలు”అన్నాడు తను.
“నువ్వు పిచ్చి రాతలు కూడా రాస్తావ? నేను చూడచ్చా? “అడిగాను నేను.
“హ్మ్మ్..చూడచ్చు కానీ చదివి నవ్వకూడదు మరి ” అన్నాడు.
“నవ్వనులే,ఇవ్వు”అన్నాను,తను రాస్తున్న diary నా చేతిలో పెట్టాడు.
” గమ్యం చేరుకోవాలని గుండె తొందర పడుతోంది .. !!
ఈ రైలు కన్నా వేగంగా నా ఆలోచనలు పరిగెడుతున్నాయి .. !!
కొత్త పరిచయాలు తలుపు తడుతున్నాయి ..!!

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.