ప్రేమకథ! 481

రూంకి వెళ్ళాక నాన్నకు ఫోన్ చేశా …ఇంకా ఆ రోజు జరిగిన విషయాలు చెప్పి…క్లాస్స్లు టైమింగ్ అవి చెప్పి….గుడ్ నైట్ చెప్పి ….fresh అయ్యాను…..నా నైట్ డ్రెస్ కి చేంజ్ అయ్యా….అలా బెడ్ మీద నిద్రపోవడానికి చూస్తున్న కాని నాకు తను అన్న”You know something shishira, I’m verymuch jealous of you Shishira ” ఆ మాటలే గుర్తొస్తున్నాయి……. తను నన్నుచూసి ఈర్ష్య పడ్తున్నాడ?
ఏ విష్యంలో.. తను అన్నిట్లోనూ నాకన్నా బెటర్గా perform చేస్తాడుకదా…….పైగా వీడు అంటే మా కాలేజీ ప్రోఫ్ఫెసోర్స్ అంతా మెచ్చుకుంటారు….పైగా వేడిని చూపించి మీరంతా ఆర్యన్ ని చూసి నేర్చుకొంది…అంటారు ఎప్పుడూ……మరి వీడు ఎందుకల అన్నాడు……కాని తన మాటలు ఎంతో బాధతో నిండినట్టు ఎందుకనిపిస్తున్నాయి నాకు.. అని ఆలోచిస్తూ……ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు……..

అలారం కొట్టింది,కళ్ళు నలుపుకుంటూ లేచాను.టైం 6am అయ్యింది…. నాన్న గుడ్ మార్నింగ్ కాల్ వచ్చింది,కొంతసేపు మాట్లాడేసి,గబగబా రెడీ అయ్యాను… రూంలాక్ చేస్కుని,1st డే క్లాసు అటెండ్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా బైల్దేరాను.అక్షయ కాంటీన్ దగ్గర ఆర్యన్ వెయిట్ చేస్తుంటాడు అని,అక్కడికి బైల్దేరాను.
నేను వెళ్లి చూసేప్పటికి,తను ఇంకా రాలేదు……సరేలే ఇంకా 15మినిత్స్ టైం ఉందిగా అనుకుని కాంటీన్లో వెయిట్ చేస్తున్నా.చెన్నైఫేమస్ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చెప్పి, మొబైల్లో FM ఆన్ చేశా.తమిళ్ పాటలు వస్తున్నాయి,సంగీతాన్ని ఆస్వాదించడానికి భాషతో పనిలేదుగా,సో అర్ధం కాకపోయినా కొన్ని పాటలు మజాగా ఉన్నాయి ….ఇంతలో నేను ఆర్డర్ చేసిన కాఫీ…ఇంకా ఆర్యన్ ఒకేసారి వచ్చారు.
“good morning Shishira “విష్ చేస్తూ నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు తను.
” Gooooood mooooooorninnnggg Aaaaryyannnnn ” అని FM లో RJ లాగ విష్ చేశా తనని……
తను నా చేష్టలకి ఏమనాలో తెలియక నవ్వాడు……నా కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్న…తను బ్రెడ్…….. జామ్ అండ్ బట్టర్ తెచ్చుకుని తింటున్నాడు……..నేను చపాతీ రోల్స్ ఆర్డర్ చెప్పాను………తను తినేసాక ఇద్దరం స్టార్ట్ అయ్యాం…..అక్కడనుంచి………..

“అదేంటి,రోల్స్ ఆర్డర్ చెప్పవ్గా,తినవా”అడిగాడు ఆర్యన్.
“దార్లో తింటానులే,ఇక్కడే కుర్చుని తింటే బస్సు మిస్ అవుతాం మనం……….నాకు 1st డే నే లేట్ అవ్వడం ఇష్టంలేదు”….ani వెయిటర్ తెచిన రోల్స్లో కెచప్ ఆడ్ చేస్కుని,పేపర్ నాప్కిన్లో ఫోల్డ్ చేసి తింటూ బైటకి వచ్చేసా…..ఇద్దరం bus stop దగ్గర వెయిట్ చేస్తున్నాం……..
“ఏం సాంగ్స్ వింటున్నావ్?”అడిగాడు తను.
“FM వింటున్నా..”రోల్ నముల్తూ చెప్పా నేను.
“తమిళ్ పాటలు కూడా వింటావా నువ్వు? “అడిగాడు తను .
“స్పెసిఫిక్గా ఇవే పాటలు వినాలని ఏముంది,ట్యూన్ నచితే వింటాను.. “అని casual గా చెప్పాను.
“నేను అలా వినలేను తెల్సా” అన్నాడు తను……..ఈ లోపు Bus వచ్చింది..ఇద్దరం ఎక్కాం……”Window నాది…….”అన్నాను నేను.. తను చిన్నగా నవ్వుతూ సరేలే తీస్కో అని విండో సీట్ నాకిచ్చేసి తను నా పక్కన కూర్చున్నాడు.
“హ్మ్మ్..ఏదో చెప్తున్నావ్…చెప్పు”అన్నాను నేను.
“నేనా…..ఏం చెప్తున్నాను? “అడిగాడు తను”…..
అరేయ్,ఇప్పుడే కదా నేను అలా వినలేను పాటలు అన్నావ్……అలా అంటే ఎలా అని ?……..ఇంతలోనే మర్చిపోయావ……….అసలెలా గుర్తు ఉంటాయి బాబు… నీకు చదివినవి, అసలుఎలా వస్తోంది నీకు 1st పోసిషన్…..హా? “అని వెటకారంగా అన్నాను.
“ఓహో……..అదా……నేను పాటలు అర్ధం తెలియకుండా ఆస్వాదించలేను.నాకు ముందు లిరిక్స్ నచ్చాలి…ఆ తర్వాతే పాట నచ్చుతుంది…….అయినా…. గుర్తుపెట్టుకోవలసినవి గుర్తుంటాయి నాకు….అందుకే 1st “అని తను జవాబిచ్చాడు.
“హ్మ్మ్…..parledu,నీకు మాట్లాడం వచ్చే…..నువ్వేదో సైలెంట్ అనుకున్న,మాటకి మాట సమాధానం బాగానే చెప్తున్నావ్ గా ” అన్నాను నేను.
ఇంతలో మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది….ఇద్దరం వెళ్లి మా ప్రోగ్రాం హెడ్ ని కలిసాం.
Mrs. Janaki Raman,మిడిల్ ఏజ్ లేడీ.Cream colour కలంకారి డిజైన్ ఉన్న శారీ కట్టుకున్నారు……….చాలా హుందాగా ఉన్నారు……….
చూస్తేనే చాలా స్ట్రిక్ట్ అని తెలుస్తోంది.మేము నవ్వుతూ విష్ చేసి,మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేస్కున్నం. ఆవిడ మా internship లో చెయ్యాల్సిన project details and related documents…..మాకు ఇచ్చారు…..Attender ని పిల్చి మమ్మల్ని ల్యాబ్ కి తీస్కెళ్ళి అజయ్కి పరచియం చెయ్యమని చెప్పారు.మేము ఆవిడకి థాంక్స్ చెప్పేసి ల్యాబ్కి వెళ్ళాం…….

ఫుట్వేర్ తీసి లోపలికి వెళ్ళాం,ల్యాబ్ చాలా పెద్దది……ovel shape లో seperate చాంబర్స్ ఉన్నాయి,ఒక్కో ఛాంబర్లో ఒక్కో ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. మా టీం లీడర్ Mr.Ajay.తను మాకు 2years సీనియర్.చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేస్కున్నాడు మమ్మల్ని. తను ముంబై నుంచి వచ్చాడు అని చెప్పాడు.అక్కడ మేము ఇద్దరం,అజయ్ కాకుండ ఇంకో 2 అబ్బాయిలు సెల్వమణి,కృష్ణన్ ani…వాళ్ళది చెన్నైఅని introduce చేసాడు అజయ్.వాళ్ళు హాయ్ అని చెప్పి వాల్ పన్లో మునిగిపోయారు….టోటల్ 5 మెంబెర్స్ మా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నది.తర్వాత వాళ్ళు కూడా బానే మాట్లాడారు మాతో ……. వర్కింగ్ ambitious అంతా చాలా బావుంది……అందరం వర్క్ చేస్తున్నాం…ఆర్యన్ నా రైట్ సిస్టం అండ్ నా లెఫ్ట్ సిస్టంలో అజయ్ వర్క్ చేస్తున్నాడు.నేను కొంచెంసేపు ప్రోగ్రామింగ్ చేశా,తర్వాత బోర్ కొట్టింది ….సో మొబైల్లో పాటలు ప్లే చేశా……వాల్యూం మీడియంలో పెట్టా……అవి ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతలో మాప్రాజెక్ట్ హెడ్ మా ఛాంబర్కి వచ్చారు,సాంగ్స్ ప్లే అవ్తున్నాయి కదా వెంటనే సీరియస్ అయ్యారు.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ,వర్క్ టైంలో ఎంటర్టైన్మెంట్ నాకు అస్సలు నచ్చదు,మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోతె వెళ్లిపోవచ్చు…… అని కళ్ళు ఎర్రచేసి ఇంగ్లీష్లో అరిచారు ఆవిడ…..ఈలోపు మెల్లగా మొబైల్ తెస్కుని సాంగ్స్ ఆఫ్ చేసేసా.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు …common stand-అప్ అని చాలా కోపంగా అన్నారు……నేను సైలెంట్గ లేవబోతున్నా…ఇంతలో ఆర్యన్ నా చేతిలో ఫోన్ లాక్కుని,నిల్చోపోతున్న నన్ను చెయ్యి పెట్టి ఆపేసి తను నిల్చున్నాడు….. ఆవిడ నువ్వేనా అయితే సాంగ్స్ ప్లే చేసింది?తను ఏమీ మాట్లాడకుండా తల దించుకుని Iam Sorry Madam”అని అన్నాడు.ఆవిడ కోపం బద్దలయ్యి ఆవిడ కోపాన్నంతా ఆర్యన్ మీద చూపించేసి వెళ్ళిపోయారు.ఒక 15మిన్ తర్వాత వచ్చి ఒక 4 డాకుమెంట్స్ ఆర్యన్ కి ఇచ్చి ఈవెనింగ్ లోపు కోడింగ్ చేసెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది.ఆవిడ కోపం ధాటికి మా ఛాంబర్ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది,కొంతసేపటికి అందరు నార్మల్ స్టేజికి వచ్చారు.ఆర్యన్ మొహంలో ఎలాంటి మార్పులేదు, నవ్వుకానీ కోపం కానీ బాధకానీ..అస్సలు ఎలాంటి expression లేదు మౌనంగా కుర్చుని కోడింగ్ చేస్తున్నాడు.మిగతా ముగ్గురు లంచ్కి వెళ్లారు,నేను ఆర్యన్ మాత్రం వెళ్ళలేదు
.”ఐ అం సారీ ఆర్యన్” అని తన దగ్గరగ నా చైర్ జర్పుకున్నానునేను.తను ఏమీ మాట్లాడలేదు.
“కోపమా?”అని అడిగాను నేను..తను ఏమీ మాట్లాడలేదు,
కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు.”నాకు ఆకలేస్తోంది,తినేసి వాడడం రావా ప్లీజ్”అని అన్నాను……
తనలో ఏమాత్రం చలనం లేదు.తన మౌనం నాకు ఏదో తెలీని gulty ఫీలింగ్ ల వచ్చింది…….ఏదో తెలియని బాధ….అంతే,ఇంకా నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి..

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.