ప్రేమకథ! 489

నేను వేల్లెప్పటికే ఆర్యన్ వున్నాడు,మరు నిమిషంలో నా కాఫీ అండ్ రోల్స్ వచాయి…………
“ఆర్డర్ నువ్వే చెప్పావ?థాంక్యు”అంటూ కాఫీ ఒక గుటక వేసాను నేను…..
“నిన్నటిలా రోల్స్ తింటూ వస్తావేమో అని ఆర్డర్ చెప్పెసుంచాను”అన్నాడు తను.
“హ్మ్మ్ .. మంచిపని చేసావ్….”అన్నాను నేను……..
తర్వాత ఇద్దరం క్లాసుకి వేల్లిపోయం.. asusual గా వర్క్ చేస్కున్నం..నిన్న లేట్ నైట్ వరకు వర్క్ చేసాం కాబట్టి ఈరోజు మధ్యానం ఆఫ్ తీస్కోమని మా టీం లీడర్ అజయ్ అన్నాడు…….సో,మేము after noon లంచ్ చేసేసి బయటకి వచ్చాం………
“ఎక్కడికైనా వెళ్దామా ? ఇప్పుడే రూంకి వెళ్లిపోయి ఏంచేస్తాం ?”అని annanu నేను……
“”సరే నువ్వే చెప్పు ఎక్కడికి veladamo”అన్నడు తను ..
“సరే పద, టి-నగర్ వెళ్దాం…..అక్కడ షాపింగ్ చేద్దాం”అన్నాను నేను.
మాకు పెద్దగ చెన్నై తెలీదు కాబట్టి……అలా ఆటోలోనే T-నగర్ వెళ్ళాం .. చాలా రద్దీగా ఉంది ఆ బజార్ అంతా……..ఎటు చూసినా చిన్న చిన్న చీమల్లగా హడావిడిగా వేల్పోతున్న జనమే కనిపించారు……
ఆ రోడ్లో ఎటు చుసిన శరవనా స్టోర్స్ నే కనిపించాయి నాకు..ఎన్నిబ్రాంచ్లు ఉన్నాయో వీళ్ళకి ఎటు చూసినా అదే పేరు కన్పిస్తోంది అనుకున్నాను నేను……..
“ఇద్దరం ఒక శరవణ స్టోర్స్లోకి వెళ్ళాం..పెద్ద షాపింగ్ మాల్ ,5 ఫ్లోర్స్ ఉంది……ఒక్కో ఫ్లోర్ చూస్తూ వస్తున్నాం మేము……. నాకు టాప్స్ తీస్కోవాలని ఉంది “అన్నాను నేను,బట్టల దగ్గరకి వచ్చి.
“వెళ్ళు.. తీస్కో.. I’ll wait here”అన్నాడు తను బిల్లింగ్ కౌంటర్ దగ్గరే నించుని …….
“నాకు మా అప్పా సెలెక్ట్ చేస్తారు,నాకు నేను ఎప్పుడూ ఏం కొనుక్కోను….కాని ఇంకెవరికైనా అయితే మాత్రం చాల బాగా సెలెక్ట్ చేస్తా”అన్నాను నేను………
“సరే,పద అయితే నేను హెల్ప్ చేస్తా “అన్నాడు తను.
ఇద్దరం వెళ్లి కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసాం…..నేను trail చూద్దామని వెళ్లి ఒక్కో టాప్ వేస్కుని వచ్చి ఏది బాగుందో చెప్పు అన్నాను..
తను ఒక బ్లూ కలర్…ఇంకో బ్లాకు కలర్ tops బాగున్నాయి అన్నాడు….నాకు,రెడ్ కలర్ టాప్ కుడా నచ్చింది,సో మొత్తం 3 తీస్కున్నాం……
“నువ్వేమి కొనావా?ఏవైనా షర్ట్స్ చూడు ,నువ్వు నాకు హెల్ప్ చేసావ్గా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా”అన్నాను నేను.నేను కూడా నాన్న కు తీసుకుంటా అన్నాను…….
సరే అని Men’sshirts వైపు వెళ్ళాం..తన షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాం..నాకు ఒక్కటి కూడా నచ్చలేదు……తను చాలా ట్రై చేసాడు కానీ నేను anni “NO” అన్నాను……..తనకి ఏవి కరెక్ట్ గా శుఇతె కావట్ల…..
“ఇంకా నా వాళ్ళ కాదు శిశిర.. నా ఓపిక మొత్తం అయిపొయింది…….ఆడవాళ్ళ తో షాపింగ్ అంటే ఎందుకు మగాళ్ళు జడుచుకుంటారో అర్ధమయింది నాకు ..నీకు ఏవి నచ్చవు…కాని బైల్దేరదాం ఇంకా “అన్నాడు తను నా దగ్గరికి వచ్చి….. ..నేను అలా ఇంకా షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్న అప్పటికి …..”హ్మ్మ్ .. పర్ఫెక్ట్ ..!! ఇది ట్రై చేయి.. నీకు చాలా బాగా సెట్ అవ్తుంది” అని బ్లాకు coloured ఫార్మల్ షర్టు తీసిచ్చాను….
“నో వే..ఇంకా నావల్ల కాదు తల్లి.. “అని చేతులు జోడించి బుంగ మూతి పెట్టి అనేసాడు…….
“నాకు తనని చుస్తే నవ్వు వచ్చింది.. తనని ఎప్పుడూ అలా చూడలేదు…ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాడు…….నేను అదే చెప్పా తనతో …అబ్బా చల్ల బాగున్నావ్ ….ఎంత క్యూట్ గా ఉన్నవో ఇలా అని తన బుగ్గలు లాగాను..తను నా వైపు అదోలా చూస్తూ ప్లీజ్ శిశిరా అన్నడు….అబ్బ..పద పద అంటూ తన గడ్డం పట్టుకును చేతిలో ఆ షర్టు పెట్టి …తనని అలా trail room వరకు తన వీపు మీద నా చేతులు పెట్టి నెట్టుకుంటూ వెళ్ళాను “తను ఏమనలేదు, నా వైపు అలానే బుంగ మూతి తో కొంచం కోపం గా చూస్తూ trail room లోకి వెళ్ళిపోయాడు..
కొంచెం సేపటికి ఆ షర్టు వేస్కుని బైటకి వచ్చాడు……. “చాలా బాగుంది తనకి ఆ షర్టు …..
“హబ్బ సూపర్….బాగుంది …….ఇది ఫైనల్ ఇంకా.. తీసేస్కో..”అన్నాను నేను……
“హమ్మయ్య…..ఫైనల్లీ ఒక్కటి నచ్చింది నీకు ….. ఇంకా పదా “అన్నాడు తను……
తర్వాత నేను అమ్మకి 2 చీరలు, అప్పాకి 3 షర్ట్స్ కూడా కొన్నాను నేను…….మీ పేరెంట్స్ కి తెస్స్కోవా అని అడిగాను తనని…
“లేదు ఇప్పుడు కాదు తర్వాత తెస్కుంటా నేను”అన్నాడు …..
ఇంకా కొన్నవాటికి బిల్ ఇచ్చేసి,అన్ని పాకెట్స్ తీస్కుని బైటకి వచ్చేసాం..

ఇంత తిరిగాక…….ఆకలేస్తుంది కదా..సో ఇద్దరం ఏదన్న తిందామని అల చూస్తున్నాం….
“పానీ పూరి తిందాం….నా ఫేవరెట్ “అన్నాను నేను.
సరే పద అని ఇద్దరం అలా చాట్ బండి దగ్గరికి వెళ్ళాం….2 ప్లేట్స్ పానీ పూరి చెప్పాడు తను……….
ఇద్దరి చేతుల్లోను మేము షాపింగ్ చేసిన తాలూకు బాగ్స్ ఉన్నాయి……నిన్చోడానికి కూడా చోటులేనంత రద్దీగా ఉంది అక్కడ……మేము బాగ్స్ ఎక్కడ పెట్టాలో అని చుస్కుంటుంటే..చాట్ బండి అతను,ప్లేట్ తీస్కోమని సైగ చేసాడు……..
చేసేదేంలేక,ఆర్యన్ బాగ్ నేను తీస్కున్నాను…..
ఇంతాలో చాట్ బండి వాడు ఆర్యన్ కి ఒక ప్లేట్ ఇచ్చి ….ఒక పూరి పెట్టాడు……
“మరి నువ్వో ? “అన్నాడు తను ఒక పూరి నోట్లో పెట్టుకుంటూ…….
“నువ్వు తినేయిలే,తర్వాత ఈ బాగ్స్ నీకిచ్చి నేను తింటాను”అన్నాను నేను……..
తను ఏం మాట్లాడలేదు,రెండో పూరి షాప్ అతను ఇవ్వగానే,ఆర్యన్ తీస్కుని,నా నోట్లో పెట్టేసాడు……..
నోట్లో పూరి ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక పోయాను……కాని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్న తన వైపు…..
“ఇప్పుడు నువ్వు క్యూట్గా ఉన్నావు “అని తను నవ్వాడు……..గబగబా నోట్లో ఉన్న పూరి తినేసి……
“నేను తింటాను,నువ్వు పెట్టకు”అనేస…..
మాట అయితే అనేసాను కాని,తను ఏమయినా అనుకున్నాడు ఏమో అన్పించింది వెంటనే నాకు………
“నేను తింటుంటే అలా కళ్ళు అప్పగించి చూస్తున్నావుగా,నాకు దిష్టి తగుల్తుంది,అందుకే నీకు పెట్టాను..ఇంకా పెట్టను,నీ టర్న్ వచ్చేవరకు ఆగు”అని పూరి సగం నవుల్తూ గజిబిజిగా అన్నాడు తను………
తను సరదాగానే జవాబిచ్చాడు కాబట్టి,హమ్మయ్య అనిపించింది నాకు……తను తిందాం పూర్తయ్యాక,నేను నా పానీ పూరి తిన్నాను……..తను బుద్దిగా షాపింగ్ బాగ్స్ అన్ని పుచ్చుకుని నించున్నాడు……….
అక్కడ బిల్ సెటిల్ చేసేసి…..నద్చుకున్తూ side-lane లోకి వచ్చాం…..
“ఇక్కడేదో గుడి వుంది,వెళ్దాం పద “అన్నాను నేను………
“నువ్వెళ్ళు,నేను బైట నిన్చుంటాను “అన్నాడు తను…….
“అదేంటి,నువ్వు రావా,ఎందుకు? “అడిగాను నేను………
“నేను దేవుడిని నమ్మను….. “జవాబిచ్చాడు తను…..
“నువ్వు నాస్తికుడివా?”అడిగాను నేను………

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.