ప్రేమకథ – Part 2 248

“Coffee, అయితే కాంటీన్లో 24×7 దొరుకుతుంది”అని నవ్వుతు చెప్పాను.
“coffee అంటే చాలే,ఎంత కోపమైన కరిగి పోతుంది నీకు..”అన్నాడు తను.
“హ్మ్మ్..హ్మ్మ్…. “అని తలూపాను.
“సరేలే,చెప్పు .. ఏంటో చెప్తా అన్నవ్గా “అని అడిగాడు.
“Naaku, నువ్వు senty గా ఉంటె నచలేదు.. ఇలా నవ్వుతు ఉంటేనే బాగున్నావు ..”అని నేను స్మైల్ చేసి చూపిస్తూ చెప్పాను .. స్మైల్ emotion
“ఏం చేసిన నాకు satisfaction లెదు శిశిర.. ఒన్స్ నా మనసుకి నచ్చే పని చేస్తే అప్పుడు హాయిగా నవ్వుతనేమో “అన్నాడు తను.
“నవ్వడానికి కూడా reasons వెతుకుతావేంటి,మనం dull గా ఉంటె నవ్వు మన మీద అలిగి వెళ్ళిపోతుంది ..మన దగ్గరికి ఎప్పుడూ రాదు,అదే welcome చెప్పి రమ్మంటే , మన పేదలని వదిలి పోనేపోదు .. “అని చెప్తూ…మూడి గా ఉన్న తన పేస్ ని పైకి ఎత్తి బుగ్గలు 2 లాగి smiley సింబల్ చూపించా… .
తను చాలా bright గా నవ్వాడు..
“ఎలాంటి mood లో వున్నా, నువ్వు కంఫర్ట్ చేసేయగాలవు నీ మాటలతో జనాలని తెలుసా “అన్నాడు తను.
“హా నాకు ఆ విషయం బాగా .. తెలుసు,నాలా నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో..ఇంకెవ్వరు ఉండరు,నేనొక antique piece నిలే.. “అని నా చున్నిని collar ల ఎగరేస్తూ చెప్పాను….
తను నా చర్యలకి మాటలకి నవ్వుతూ ఒక పేపర్ తీసి,ఇదిగో చదువుకో అన్నాడు……
“ఏంటిది?”అడిగాను నేను.
“నీ మీద ఏదయినా రాసిమ్మన్నావు గా,రాసి తెచ్చాను,అందుకే లేట్ అయ్యింది.”అన్నాడు.
“అవనా..ఇప్పుడే చదివేడ్డం ఐతే “అని excited గా paper open చేశాను…….
నా బాధని పంచుకోడానికి …….
పోయిన నా చిరునవ్వుని తెచ్చి ఇవ్వడానికి..
అలసిన మనసుకి సేద తీర్చడానికి……
దివినుంచి భువికి దిగి వచ్చిన పసి పాప…..
తేనే మనసున్న చిలిపి మాట……
బంగారు వన్నెలున్న ముద్దుల మూట… ..
ఎప్పుడూవసంతాలు పూయించే నా శిశిర..!!
తను రాసింది చదివాను …అలా ఉండిపోయా సిలలా
“తను నా భుజం పయ్ చెయ్యి వేసి …నన్ను అలా కొంచం ఊపి ..ఎం శిశిరా బాలేదా అన్నాడు …..
“OMG .. ఇంత బాగా నన్ను ఎవ్వరు పొగడలేదు ఇప్పటిదాకా తెలుసా .. …చాల ante చాలాలాలా……చా……….లాఆఅ బాగుంది .. థాంక్యు సో మచ్ ..”అని చెప్పాను… .”ఇందులో పొగడ్త ఏమిలెదు,నీ గురించే నీకు చెప్పాను అంతే .. you are my most trusted Friend so far Shishira “అన్నాడు తను .
” Aina thank you .. ఇంత బాగా రాసావ్ .. నేను దీన్ని భద్రంగా దాచుకుంటాను “అన్నాను .
ఆ తరువాత అలా.. ఇంకా ఏవో కబుర్లు చెప్పుకున్నాం ..

అలా కాసేపు మాట్లడ్కున్నాక నేను కొన్ని టాపిక్స్ చెప్తే వాటి మీద అప్పటికి అప్పుడే కవితలు చెప్పాడు…..చీకటి పడేంతవరకు అక్కడే మాట్లాడుకున్నాం…..తర్వాత అక్షయ కాంటీన్ లో భోజనాలు చేసేసి ఎవరి రూం కి వాళ్ళు వెళ్ళిపోయాం……ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేసి ఇంక నిద్రపోవడానికి ఉపక్రమించాను……అలా ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తున్నాయి…..తన కళ్ళలో కన్నీలు,తను ఇన్నాళ్ళు పడ్డ బాధ …..తన మనసులో ఇంత బాధని ఈ అబ్బాయి ఇన్నాళ్ళు ఎలా భరించాడు…..నేను కూడా తనని అనవసరం గా రోజు తిట్టుకున్నా.. .నేనొక స్టుపిడ్ ని…..తను నన్ను నమ్మి..ఒక ఆప్తురాలిగా నన్ను భావించి తన బాధలన్ని షేర్ షేర్ చేస్కున్నాడు….ఇకపైన తన కళ్ళలో నీలు ఉండకూడదు…తన పెదాలపైన చిరునవ్వు చెరిగిపోనివ్వకుండా చుస్కుంటాను…ఇలా ఆలోచిస్తూ ఉన్నాను…సాయంత్రం తను నాకు తినిపించిన పానీపూరి గుర్తొచింది…..చిన్నపుడు మా అమ్మ నాకు తినిపించింది…..ఇప్పటికి మా నాన్న నాకు తినిపిస్తూంటారు అప్పుడప్పడు….తర్వాత నువీ తినిపించావ్…..ఏంటో ఎవరితో నేను రెండు నెలలు భరించాల,ఎలా గడపాల అనుకున్నానో…..వాళ్ళ కోసమే ఇలా ఇపడు ఆలోచిస్తూ ఉన్న……అలా ఆలోచిస్తూ నిద్రపోయాను…అలా ఆ రోజు గడిచిపోయింది తర్వాత ..రోజులు ఇలానే గడచిపోతున్నాయి…..ఇప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది……రోజుకో experince తనతో…కాని ఇది వరకట్ల నేను విసుగు చెందట్ల….చిరాకు పడట్లేదు….కోపం తెచ్చుకోవట్లేదు…తనతో ఉండే ప్రతి నిమిషం…infact every second ఎంజాయ్ చేస్తునా… ప్రతి విషయం ఇద్దరం షేర్ చేస్కునే వాళ్ళం….నేను మాట్లాడటం ఆపి తనకి ఛాన్స్ ఇచ్చేదాన్ని…..తను కూడా కబుర్లు చెప్పేవాడు wink emotion ……మా ఇద్దరికీ కాంపిటీషన్ లేదు కాబట్టి,ఇక్కడ చాలా హాయిగా ఉంటోంది.రోజు మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు వర్క్ చేస్కోడం,సాయంత్రం లైబ్రరీ దగ్గర,ఇప్పుడది మా డైలీ మీటింగ్ స్పాట్ అయిపొయింది లెండి……..బెంచ్ మీద కుర్చుని బోలెడు కబుర్లు చెప్పుకోడం….పాటలు,వీడియోస్ షేర్ చేసుకోడం……అటు ఇటు వెళ్ళే వాళ్ళని చూసి కామెంట్ చేస్కుని నవ్వుకోడం..తర్వాత తినేసి ఎవరి రూంకి వాళ్ళు వేల్లిపోడం…..ఇలా సరిగ్గా ఒక నెల రోజులు గడిచి పోయాయి..ఆర్యన్,నా అల్లరిని మా నాన్నలా contol చేస్తాడు…..అమ్మలా కేర్ తీస్కుంటాడు…..ఒక విధంగా చెప్పాలంటే రోజులో నిద్రపోయేప్పుడు తప్ప మిగతా టైం అంతా almost ఏదోకటి మాట్లాడుకోడం,కల్సుకోడం జర్గుతూనే ఉంటోంది……….
“నేను…చాలాసార్లు చాలా విషయాల్లో అలా వద్దు ఇలా అని మొండిగా నాకు నచినట్టు చేసేదాన్ని కాని తను ఒక్కాసారి కుడా,నన్ను తనకి నచినట్టు ఉండమని అడగలేదు…..నా childish behaviour వళ్ళ చాలా సార్లు ప్రొబ్లెమ్స్ ఎదుర్కున్నం…..ఒక సారి నేను మెస్లో సాంబార్ ఒమ్పేస,కావాలని కాదు,ఆర్యన్ చెప్తూనే వున్నాడు ఒకేసారి 2 plates పట్టుకోవద్దు అని చెప్తూనే ఉన్నాడు,నేను వినలేదు,ఎంతైనా మొండి దాన్నికదా..తన ప్లేట్,నా ప్లేట్ రెండు నేనే పట్టుకుని నడుస్తున్న,పక్కన వాటర్ మెషిన్ లీక్ అవ్తోంది…… “చూస్కో శిశిర వాటర్”అని తను అరిచేలోపే పడిపోబోయాను……లక్కీగా తను పట్టుకున్నాడు కనుక నాకేం తగలలేదు కాని,సాంబార్ మాత్రం ఎదురుగ వస్తున్నఆయన మీద పడిపోయింది..నేను కళ్ళు ముస్కుని,ఆర్యన్ షర్టుని గట్టిగా పట్టేస్కున్న..తను నా వీపు తట్టి ఏంపర్లేదు,lite తీస్కో అన్నాడు,ఇద్దరం,ఆయనకి సారీ చెప్పాం..ఆయన మమ్మల్ని గుర్రుగా చూస్తూ,తిట్టుకుని వెళ్ళిపోయాడు…..
ఇంకోసారి మా మేడం ఒక వర్క్ ఇచ్చి చేయమన్నారు…..తనని మద్యానం అయ్యింది…నాకు ఆకలేస్తుంది…తనని లంచ్ కి రమ్మన్న….తను సీరియస్ గా వర్క్ చేస్కుంటున్నాడు…కాని కదలడు…..రా బాబు…అని ఎంత పిలచిన…వస్తాను నువ్వే వెళ్ళు అంటాడే తప్ప…రావట్లేదు..నాకేమో తను లేకుండా వెల్ల బుడ్డి కాట్లేదు…లాస్ట్ కి వస్తావా రావా అన్న….నువ్వేలు అన్నాడు నేను కోపం తో సిస్టం switches ఆఫ్ చేసేసా….తను చేసిన వర్క్ అంతా పోయింది..అయనా విసుగు చెందలేదు…అబబ్బ…పద అన్నాడు…లంచ్ చేసి వచ్చేసాం…మల్ల సిస్టం ఆన్ అవ్వలేదు…సిస్టం క్రాష్ అయ్యింది…విషయం మదం కి తెల్సి తనపి చాల కోప్పడ్డారు….ఇంత అజాగ్రత్త గా ఉంటె ఎలా అని….పనిష్మెంట్ గా..తనకి డబల్ వర్క్ ఇచ్చారు…నాకు చాల బాధ వేసింది…నా వల్లే 2ndtime మేడం తో తిట్లు తిన్నాడు.నాకు తెలీకుండానే ఏడుపు వచేసింది ..అయినా ఒక్క మాట కూడా నన్ను అనలేదు..తన దగ్గరికి వెళ్లి ఏడుస్తూ సారీ చెప్పా…ఇంత జరిగినా తను నార్మల్ గా ఉన్నాడు…..తన చేతులతో నా మోహాని తీస్కుని…..తన వేళ్ళతో నా కాళ్ళ లో నా చెంపల పయ్ కారుతున్న కన్నీరు తుడుస్తూ..”పిచ్చి శిశిర…నన్ను అలా ఉండొద్దని నువ్వు కన్నీరు పెడ్తే ఎలా….వెళ్ళు వర్క్ చుస్కో అంటూ నా బుగ్గలు లాగాడు….తర్వాత తన పని తను చుస్కున్నాడు….ఇంత జరిగిన,నన్ను తను ఒక్క సరి కూడా కోప్పడలేదు,ఇన్నలు తనకి నవ్వడం రాదేమో అని తిట్టుకునేదాని….అసలు కోపం అనే factor తనేకి తెలీదేమో అనిపించింది నాకు….అలంటి పని చేసినండ్కు నన్ను నేను తిట్టుకున్నా…..
ఇలా మేమిద్దరం,బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం.నాన్నకి రోజు ఫోన్లో చెప్పే కబుర్లలో సెకండ్ కి ఒకసరి ఆర్యన్ పేరే చెప్తున్నాను……ఆర్యన్ అలా….. ఆర్యన్ ఇలా అని నాన్న….అడిగారు “చాల సైలెంట్ అన్నావు తను,నీ అల్లరి అంతా ఆ పిల్లాడికి కూడా నేర్పెస్తున్నావాఅని ” “నేనేమి నేర్పట్లేదు అప్పా…..ఆర్యన్ నే నేర్చుకుంటున్నాడు.”అని నవ్వుతు చెప్పను……
రోజులా నే నా పిల్లోని పట్టుకుని బజ్జున్నాను……ఇంతలో ఫోన్ రింగ్ అయింది ఇంత పొద్దున్నే కాల్ ఎవర్ర బాబు అనుకుంటూ చూసా …..ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడు…వీడేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేశా…….
” ఇంకా నిద్రలోనే ఉన్నావా ?”అడిగాడు ఆర్యన్.
“హ్మ్మ్.ఇంత పొద్దున్నే లేచెం చెయ్యాలి.. పడుకోనివ్వు.” అన్నాను నేను కళ్ళు కూడా తెరవకుండా……..
“లే తల్లి నీ హాస్టల్ బైట వెయిట్ చేస్తున్న……త్వరగా రెడీ అయ్యిరా ఇంక..” అన్నాడు ఆర్యన్…….
“ఇంత పొద్దున్నే ఏం ప్రోగ్రాం అసలు ?!” అడిగాను నేను,నాకసలు లేచే ఉద్దేశ్యం లేదు
“Tv9 anchor లా questions వెయ్యకు.. లేచిరా….I’m waiting “అనేసి ఫోన్ పెట్టేసాడు తను…..
వీడికి నిద్రపట్టదా…….పట్టకపోతే వాడికి నచినట్టు ఏదోకటి రాస్కోచుగా……నన్ను లేపి ఏం సాధిస్తాడు అనుకుంటూ లేచి రెడీ అయ్యి బైటకి వచాను……

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.