ప్రేమకథ – Part 2 249

ఇలా నాకు entertaining గా…పాపం ఆర్యన్ కు బోరింగ్ గా మూవీ ఎండ్ అయ్యింది……….
మూవీ నుంచి బయటకు వచ్చేసాం…..
“హ్మ్మ్మ్ ఇప్పుడు ఏంటి ప్లాన్” అన్నాను నేను
“ఈసారి బీచ్…..నా ఛాన్స్..మూవీ నీకు నచ్చింది చూసాం కాబట్టి.”అన్నాడు ఆర్యన్…..నేను ఒకే అన్నట్టుగా స్మైల్ ఇచ్చాను……
ఇద్దరం బీచ్ కి వెళ్ళాం…..సైలెంట్ గా లేదు..చాల సందడిగా ఉంది….కొంచెంసేపు బీచ్ లో అలా తిరిగాం……తర్వాత నేను వెళ్లి అలలలో తడిసి ఆడుకున్నాను…..తను ఎక్కువ దూరం వెళ్ళకు,ఇక్కడే ఎంజాయ్ చెయ్యి అంటూ వడ్డున నించుని నన్ను గమనిస్తున్నాడు……ఒక్కదాన్నే ఎంతసేపు ఆడుకుంటాను……ఇంకా ఇలా కాదులే అని ఆర్యన్ దగ్గరకి వెళ్లి తన చెయ్యి పట్టుకుని లాక్కొచ్చాను….తను వద్దు వద్దు అంటూనే నీళ్ళలోకి వచ్చాడు…ఒకరి మీద ఒకరం నీళ్ళు చిమ్ముకున్తూ చాలాసేపు గడిపేసాం…….తర్వాత పీచు మిఠాయి కొనుకున్నం…..ఇంకా బుడగల పైప్ కూడా కొనుకున్నాను….పెద్ద పెద్ద బుడగలు ఊది అవి ఎంత దూరం వేల్తాయో అని చూస్తున్నాను నేను,ఒడ్డు మీద తను సీ షెల్ల్స్ తో చేసిన ఐటమ్స్ చూస్తున్నాడు పక్కనే ఉన్న షాప్ లో……..
తర్వాత నేను కూడా వెళ్లి షాపింగ్ లో జాయిన్ అయ్యాను…..తను చూడకుండా ఒక సాండ్ టైమర్ అండ్ గ్లాస్ మీద శిశిర,ఆర్యన్ అని చెరోవైపు చెక్కించిన కీ చైన్ తీస్కున్నాను………
ఇంకా చీకటిపడుతోంది కాబట్టి బైల్దేరి మా కాంపస్ కి మేము వేల్లిపోయం…

ఎవరి హాస్టల్ వాళ్ళు బయలుదేరాం….నేను నా హాస్టల్ కి వెళ్తూ…
“ఆర్యన్ ఫ్రెష్ అయ్యాక మన రెగ్యులర్ ప్లేస్ కి వచ్చేయ్”…అన్నాను….తను సరే అని చెప్పి…..వెళ్ళిపోయాడు
కాసేపట్లో ఫ్రెష్ అప్ అయి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను………ఆర్యన్ వచ్చాడు……..
“This is for you” అని చిన్న గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో పెట్టాను.
“ఏంటిది ? ” అని అడిగాడు తను.
“A happy birthday gift,నా నుంచి..ఓపెన్ చేసి చూడు”అన్నాను నేను……
తను ఓపెన్ చేసాడు………
సాండ్ టైమర్ అండ్ దానికి నేను రాసి పెట్టిన స్టిక్కీ నోట్ తీసి చదివాడు..
## ఈ నిమిషం నుంచి నీ లైఫ్ లో అంతా happyness నే ఉండాలి.. సో,యువర్ happiness starts from now .. !! ##
నెక్స్ట్ గిఫ్ట్ కీ చైన్ ..దానికి పెట్టిన స్టిక్కీ నోట్లో
## ఇక్కడ నుంచి నీ ప్రయాణం లో అంతా సక్సెస్ నే ఉండాలి,సో నీ కీ అఫ్ సక్సెస్ నీ దగ్గరకి చేరాలి అందులో నేను కూడా నీతో ఉండాలి కాబట్టి మనిద్దరి పేర్లున్న కీ చైన్ ## అని రాసిపెట్టాను.
లాస్ట్ గా ఒక రోజ్ అండ్ లెటర్ ..
## లెటర్ ##
నాకు నీలా కవితలు రాయడం…..పెద్ద పెద్ద మాటలు చెప్పడం తెలీదు..నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇంకెవరు నీఅంత గా నచ్చలేదు ఇప్పటిదాకా.ఒక్కసారి కూడా నన్ను నీకు నచినట్టుగా ఉండమని నువ్వు అడగలేదు……నేను చాల తెల్సుకున్నాను నీనుంచి….జీవితానికి అర్ధం మనం ఎదుటివాళ్ళకి పంచె ప్రేమ లో ఉంటుందని తెల్సుకున్నాను…..నా లైఫ్ లాంగ్ నీతో కలిసుండాలి అనేది పెద్ద డెసిషన్ అయినా కాని నీతో ప్రతి అడుగు వేసే అవకాసం నాకు ఇస్తే,అంతకన్నా నేను కోరుకునేది ఏమి ఉండదు.నీ birthday కి నా మనసు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను ఆర్యన్……..
నీ శిశిర……
తను చదివాడు,ఏం మాట్లాడలేదు..మౌనం గా ఉన్నాడు……..

“ఏం మాట్లాడవా ?”అని అడిగాను నేను.
“నీకోసం కాఫీ తెచ్చాను,చల్లారిపోతుంది,తాగు.. “అన్నాడు తను,గిఫ్త్స్ అన్ని కవర్ లో సద్దుకుంటూ.
“నేను అడిగినదానికి సమాధానం చెప్పు ముందు”అన్నాను నేను.
“టైర్డ్ గా ఉంది శిశిర,వెళ్తాను…..రేపు మాట్లాడుకుందాం”అంటూ లేచి కొంత దూరం నడిచాడు.
“డిన్నర్ చేసి వెళ్ళు..”అని వెనక్కి తిరిగి చెప్పాడు.
“కడుపు నిండిపోయింది” అనేసి పరిగెత్తుకుంటూ నా హాస్టల్ కి వెళ్ళిపోయాను….తను ఆగమని అనలేదు….ఆగమంటాడు ఏమో అని ఆశ పడ్డాను …. నాకు..కళ్ళనిండా నీళ్ళు..ఆగట్లేదు..రూంలో కి వెళ్ళిపోయాను……తలుపెస్కుని అక్కడే కుర్చుని ఏడుస్తున్నాను…….
తను నో అనలేదు….అలా అని ఎస్ అని కూడా అనలేదు.. మరెందుకు ఏడుస్తున్నాను…..ఏంటి ఈ ఫీలింగ్ అసలు………తన మీద కోపమా…..నా మీద నాకు జాల……మాముల్గా మేము మల్లి ఉండలేమనే బాధ.. అసలేన్టిది ?! .. ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది…….
ఇంతలో నా ఫోన్ మోగింది……..నేను లిఫ్ట్ చెయ్యలేదు..అది మోగుతూనే ఉంది……అప్పుడు నేను వెళ్లిపోతుంటే ఆపలేదు కాని,ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు ఆర్యన్ అనుకున్నాను…….మల్లి మల్లి సెల్ మోగుతూనే ఉంది.వెళ్లి బాగ్లో నుంచి సెల్ తీశాను….అప్పా కాలింగ్ అని వచ్చింది……ఇంత సేపు కాల్ చేస్తుంది అప్పా naa,ఆర్యన్ అనుకుంటున్నానే అనుకుంటూ,కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేసాను.
“శిశిర తల్లి నువ్వు బానే ఉన్నావా?ఎంత సేపట్నుంచి కాల్ చేస్తున్నాను రా నీకు నేను…..ఎందుకు కాల్ లిఫ్ట్ చెయ్యలేదు?”అని కంగారుగా మాట్లాడుతున్నఅప్పా గొంతు విన్నాను.
“అబ్బీ…..ఏంలేదు అప్పా..!! I am fine “అన్నాను నేను,నా ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడుతూ.
“ఓహో..నువ్వు నా కాల్ లిఫ్ట్ చెయ్యలేదు,ఇప్పుడేమో బానే ఉన్నాను అంటున్నావు,నువ్వు నా కూతురివి raa,నువ్వు దాచాలనుకున్న నా దగ్గర ఏం దాచాలేవు,కళ్ళు తుడుచుకుని ఏమయ్యిందో చెప్పు “అన్నారు ఆయన…….
నేను ఎక్కడున్నా,నా గొంతు విని నా మూడ్నీ చెప్పెయ్యగలరు ఆయన.అప్పటిదాకా చాల కష్టం మీద కంట్రోల్ చేస్కున్న,కన్నీళ్లు ఒక్కసారి గట్టు తెగిన గోదారి లా బైటకి వచేసాయి…….
“అప్పా,నాకేం అర్ధం కావట్లేదు……..నేను చేసింది కరెక్ట్నో కాదో కూడా తెలీటంలేదు.. అసలు నా లైఫ్ లో నేనే ప్రాబ్లం కొని తెచుకున్నాను..”అని వెక్కుతూ చెప్పాను…
“ష్హ్ ..ష్హ్ .. అన్ని మాట్లాడుకుందాం రా,ముందు ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగు.”అన్నారు ఆయన.
“హ్మ్మ్.. సరే,ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి “అనేసి,వెళ్లి నీళ్ళు తాగి,
“హ్మ్మ్.. తాగేశాను,అప్పా నేను మీ దగ్గరికి వచేస్తాను,నాకు బాధ గా ఉంది “అన్నాను.
“వాటర్ తాగావ,that’s like my Darling శిశిర,స్క్యపే కాల్ కి రా ఇప్పుడు,మాట్లాడుకుందాం ” అనేసి కాల్ కట్ చేసేసారు ఆయన…..
వెంటనే లాప్పి ఆన్ చేసి,స్క్యపే కి కనెక్ట్ చేశా,అప్పా నుంచి స్కయ్పే కాల్ వచ్చింది.ఆయన స్క్రీన్ మీద కనిపించగానే,నా ఏడుపు మరింత ఎక్కువయ్యింది…
“అరె,రాంగ్ కాల్ కనెక్ట్ అయిందనుకుంటా,సారీ నేను నా బంగారి పాప శిశిర కి కాల్ చేద్దాం అనుకున్నాను “అన్నారు ఆయన.
“అప్పా..నేనే శిశిరనీ.. “అని అన్నాను చిరాకుగా….
“శిశిర..!!నువ్వా?! ఛీ….ఛీ.. అలా ఏడుస్తుంటే ఎవరో అనుకున్నా,నా బంగారం ఎప్పుడు నవ్వుతు ఉంటుంది మరి..”అన్నారు ఆయన……
ఆయన మాటకి,చిన్న చిరు నవ్వు మెరిసింది నా మొహం లో……
“హ్మ్మ్…..ఇప్పుడు బాగున్నావ్ ,కళ్ళు తుడుచుకో..”అన్నారు అప్పా.
“హ్మ్మ్..”అని ఊ కొడుతూ,కళ్ళు తుడుచుకున్నాను.
“చెప్పరా,ఏమయ్యింది ?ఆర్యన్ తో గొడవ పడ్డావ? “అడిగారు ఆయన…….
నేను ఆ రోజు,జరిగినది అంతా చెప్పాను.ఆయన కాలం గా నేను చెప్పేదంతా విన్నారు……..
“హ్మ్మ్.. సో నువ్వు తనతో లైఫ్ లాంగ్ కలిసుండే ఛాన్స్ ఇవ్వమని అడిగావ్”అన్నారు ఆయన.
“హ్మ్మ్……”అని తల దించుకుంటు చెప్పాను.
“తను,నో అనలేదు కదా రా “అన్నారు ఆయన….
“ఎస్,కూడా చెప్పలేదుగా…… అసలేమనుకుంటూన్నాడో నా గురించి,ఒక వేళ తనకి నేను నచ్చకపోతే,మేము ఇంతకూ ముందులా ఫ్రెండ్స్ లా కూడా ఉండలేము కదా “అని బిక్కమొహం వేసి చెప్పాను.”
“నువ్వు నచ్చని వాళ్ళంటూ ఉంటారా అసలు చెప్పు.. “అన్నారు ఆయన.
“మరి ఎందుకు వెంటనే ఎస్ చెప్పలేదు”అడిగాను నేను….
“శిశిర,నువ్వు నీ పాయింట్ అఫ్ వ్యూ లో నే ఆలోచించి బాధ పడుతున్నావు……ఒకసారి తన సైడ్ నుంచి ఆలోచించి చూడు “అన్నారు ఆయన.
“ఏం ఆలోచించాలి అప్పా,నేనేమి తన attention కావాలి అనుకోట్లేదు,నేను తనకి సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను.”అన్నాను నేను.
“నువ్వు తన గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనకి లైఫ్ లో గోల్స్ ఉన్నాయి రా,తను achieve చేయాల్సింది చాల ఉంది…..మోర్ ఓవర్ లైఫ్ డెసిషన్ తీస్కునేంత స్టేజి కి మీరు ఇంకా రాలేదు…… నువ్వు తన కి లైఫ్ లో సపోర్ట్ అవ్వాలి అనుకోడం లో తప్పు లేదు,కానీ ఇప్పుడు నిన్ను accept చేస్తే అది తనకి deviation అవ్తుంది కాని సపోర్ట్ కాదు అనుకుంటూ ఉంటాడు తను”అని అన్నారు ఆయన…….
నేను ఏం మాట్లాడలేదు..”నేను ఎప్పటిలాగే childish గా behave చేసాను కదా అప్పా .”అన్నాను నేను.
“లేదు రా,ఈసారి నీ behaviour childish కాదు..నువ్వు చాల ఆలోచించే డిసైడ్ చేస్కుని ఉంటావు gaa “అన్నారు ఆయన.
“ఇప్పుడు నేనేం చెయ్యను ? మల్లి ఆర్యన్ నీ ఎలా పేస్ చెయ్యను ? “అడిగాను నేను .
“నీ intention తప్పుకాదు రా,ఒకటి చూడు నీ గిఫ్త్స్ తను తీస్కున్నాడు…..రిటర్న్ చెయ్యలేదు……నువ్వు ఎంత ఆలోచించి ఈ డెసిషన్ తీస్కున్నావ్……తనని ఆలోచించటానికి టైం ఇవ్వు…..రేపు మార్నింగ్ తనని కలిసి చెప్పు,నాకు నీ కమిట్మెంట్ కానీ attention కాని ఇవ్వల్సినావసరం లేదు,I want to be your support till you reach all your goals అని “అన్నారు ఆయన.
“అలా చెప్తే వింటాడ?ముందు లా నాతో ఫ్రెండ్లీ గా ఉంటాడ?”అడిగాను నేను.
“నువ్వు చెప్పేది నిజం అయితే నీ కళ్ళలో ఆ నిజాయితీ కనిపిస్తుంది రా,తప్పకుండా నిన్ను అర్ధం చేస్కుంటాడు తను “అన్నారు అప్పా.
“నాకు మూవీ లో చూపించే ప్రేమ గురించేమి తెలీదు అప్పా,నాకు తెలసినది మీరు పంచే ప్రేమ,అది తను మిస్ అవ్తున్నాడు,అది నేను తనకి పంచాలి అనుకుంటున్నాను అంతే “అన్నాను నేను…..

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.