ప్రేమకథ – Part 2 249

తనని ఎత్తుకున్నా…….తనని నీ పేరేంటి అని అడిగాను……తను అలా చూస్తుంది కాని ఏమి మాటాడదు….
తను మాట్లాడలేదు,కానీ విన గలదు…తన పేరు అబిలాష అన్నారు అక్కడున్న మేడం……
ఇంత బాగుంది పాప…..తన కి మాటలు రావు అనేసరికి నాకు ఎంతో బాధ వేసింది…నాకు తెలీకుండానే పాప ని గట్టిగా హత్తుకున్నా…….
తనని “నీకు నచ్చాయ… ఈ biscuits n chocolates ? “అని అడిగాను.. తనకి నేను చెప్పింది అర్ధంకాలేదు అనుకుంటా ఆ మేడం వైపు చూస్తుంది ….నేను అన్నది తమిళ్ లో translate చేసి చెప్పారు….
అప్పుడు తను రెండు బుల్లి చేతులు చాపి నచ్చాయి అన్నట్టు తన చిన్ని తలను ఊపుతూ చెప్పింది……తర్వాత తను నాకు ఒక ముద్దు పెట్టింది…… నాకు తన చిన్ని పెదాలు నా బుగ్గని తాకగానే కళ్ళలో నుంచి నీళ్ళు కరిపోయాయి……..
“థాంక్స్ అని చెప్తోంది” అన్నాడు ఆర్యన్ నా భుజం మీద చేయి వేసి…….వెంటనే తనని గట్టిగ పట్టేస్కున్నాను……
రెండు నిముషాలు నా చుట్టూ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు నాకు………
“శిశిర….చూడు.. “అన్నాడు తను…….
వెంటనే తన్ని వదిలేసి కళ్ళు తుడుచుకుని ” థాంక్యు ఆర్యన్ ” అన్నాను నేను………
ఆ పాపకి నేను ఒక ముద్దు పెట్టాను.. ఇంకో chocolate ఇచ్చాను తనని కిందకి దిమ్పుతూ…..
నాకు మా అమ్మ…నాన్న చిన్నపాటి నుంచి చాల సార్లు నన్ను ప్రేమ గా ముద్దు పెట్టారు….కాని ఈ పసి పాపా ముద్దు నా మదిలో ఏదో చెరిగిపోని గుర్తుని…..మనసులో తెలియని ఆనందాన్ని కలిగించింది ……….
కొంచెంసేపు వాళ్లతో గడిపాము మేము.తర్వాత బయట ఉన్న వరండా లో కూర్చున్నాం ఇద్దరం….. ఆ పిల్లలు ఎదురుగ ఉన్న గ్రౌండ్లో ఆడుకుంటున్నారు…….
“థాంక్ యు శిశిర” అన్నాడు తను……
నేను ఏం మాట్లాడలేదు…..ఎప్పుడు కట్టుబడని నా నోరు లైఫ్ లో మొదటిసారి మూగబోయింది……ఏం చెప్పిన వ్యక్తపరచలేనిది మౌనం తెలియజేస్తుంది అనే మాటకి అప్పుడే నాకు అర్ధంతెలిసింది……..
“శిశిర.. ” అని కదిపాడు తను నన్ను……
“థాంక్యు అని నేను చెప్పాలి నీకు….. తెలుసా ఆ పాపా నాకు ముద్దుపెట్టినప్పుడు ఏదో తెలియని భావం….పైకి చెప్పలేని ఇక ఆనందం….డివైన్ ఫీలింగ్ అంటారే…..అది ఇదేనేమో అనిపించింది నాకు…….ఎంతమంది ఉన్నారో కదా ఇలా,మనం చూపించే ఈ కొంచెం ప్రేమ కోసం తపించేవాళ్ళు…..” అన్నాను నేను……
“హ్మ్మ్……నువ్వు అడిగావే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతావు అని.. వీళ్ళని కలిసినప్పుడు,కొంచెం సమయం గడిపినప్పుడు నవ్వుతాను హ్యాపీగా…చిన్నపుడు మా నాన్న ప్రేమ కోసం ఎంతో తపించేవాడిని……కానీ నాకు అది అందని ద్రాక్ష లానే ఉండిపోయింది…చాల బాధపదేవాడిని…కాని ఏం చేయలేను…నా లానే ఇలా చాలమంది ఉన్నారు….వాళ్ళని కలిసి నా బాధ లో కొంత తీర్చుకునేవాడిని…నా ప్రేమని వాళ్లకి పంచి నా ఆనందాన్ని వాళ్ళ నవ్వులలో వెతుకునేవాడిని ..అందుకే ప్రతి బర్త్ డే కి ఇలాంటి చోటుకి వెళ్తా….. ఇంకా నాకు వీలు కుదిరినప్డు వీళ్ళతో గడుపుతా…… “అన్నాడు తను…..

అప్పుడు ఆర్యన్ కళ్ళలో నాకు మెరుపులు కనిపించాయి……తన పెదాలలో పరిపూర్ణమైన నవ్వు కనిపించింది……చుట్టూ ఉన్న ప్రపంచం అంతా blured gaa అనిపించింది నాకు కేవలం తన నవ్వుతున్న మొహమే కనిపించింది…..
“శిశిర నాకు ఈ కల్మషం లేని నిర్మలమైన మనసు ఉన్న వీళ్ళతో ఉన్దేప్డు కలిగిన ఆనందం …అనుభూతి మల్ల నీతో ఉన్నప్డు నాకు అనిపించాయి…”అని అక్కడనుంచి లేచి బైటకి నడుస్తున్నాడు …….నేను అల తననే చూస్తూ ఉన్న…తను వెనక్కి తిరిగి రమ్మన్నట్టు …సైగ చేసాడు….అల సైలెంట్ గా తనని ఫాలో అవ్తూ…వేళ్ళ…..తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ……బరువైన హృదయం తో …..తెఇల్యని ఫీలింగ్ తో ….నా లైఫ్ లో నేను ఎప్పుడు పొందని ఆననడం తో ఆ గేటు దాటి బయటకు వచ్చాను ఆర్యన్ తో………

ఆంధ్రా భోజనం తిందాం అన్నాడు తను……..సరే అని వెతికి ఒక రెస్టారంట్ కి వెళ్ళాం……….
అంతా మనవాళ్ళే ఉన్నారు అక్కడ……
పచ్చని పైర్లు…….. ఏటిగట్టు దగ్గర కుండలతో నీళ్ళు మోస్కేల్తున్న అమ్మాయిలు………
కట్టెలపొయ్యి దగ్గర వంట చేస్తున్న ముసలి అవ్వ…..ఇలా తెలుగుతనం ఉట్టిపడుతున్న పెయింటింగ్స్ తో నిండిన గోడలతో చాలా లైవ్లీగా ఉంది ఆ చోటు……..
పంచ కండువా వెస్కున్నవెయిటర్ ఆర్డర్ తీస్కోడానికి వచ్చాడు……..
ఆంధ్రా మీల్స్ రెండు చెప్పాం…….
“మావూరు ఇలాగే ఉంటుంది…..ఇంకా చాల బాగుంటుంది” అన్నాడు ఆర్యన్ అక్కడున్న పెయింటింగ్స్ చూస్తూ ……..
“నాకు పల్లెటూర్ల తో పెద్దగా పరిచయం లేదు……నేను పుట్టేప్పటికే మా వాళ్ళు సిటీలో సెటిల్ అయిపోయారు” అని చెప్పాను తనకి….
“అవునా.. అయితే నువ్వు ఒకసారి మా వూరు వద్దువుగాని…..నేను తీస్కేలత..ఒక్కసారి చుసావంటే ఇంకా తిరిగి ఎక్కడికి పోను అంటావ్” అన్నాడు తను……
నేను నవ్వాను…….
తర్వాత వచ్చిన అచ్చమయిన ఆంధ్రాభోజనం చేసేసి బైల్దరుతున్నాం
“కిల్లీ తినవా?”అడిగాడు తను…
“ఉహూ…..నాకు అలవాటు లేదు……”అన్నాను నేను…….
“పెళ్లిలో కూడా ఎప్పుడు తినలేదా నువ్వు ?”అడిగాడు తను…….
“లేదు…..కొంచం awkward గా ఉండదు పాన్ తింటుంటే” అన్నాను నేను.
“హ హ హ హ హా..పాన్ కాదు కిల్లీ అను……చిన్నప్పుడు దొంగ చాటుగా పెళ్ళిలలో కిల్లీలు దొంగలించి తినేసే వాడిని…….అమ్మకి దొరికితే తంతుంది అని జాగ్రత్త పడే వాడిని…..”అన్నాడుతను.
“ఓహో….నువ్వు గుడ్ బాయ్ అనుకున్నా..తమరు ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు చేసేవదివన్న మాట”అన్నాను నేను….తను దానికి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమిరుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు…….
నాకు అంతగా ఏం తెలీవులే” అన్నాను నేను.
“ఇప్పుడు తిను…..నీక్కూడా నచ్చుతుంది.” అంటూ ఒక కిల్లీ చేతికిచ్చాడు నాకు…….నేను సందేహిస్తూనే నోట్లో పెట్టుకుని నముల్తున్నాను……….
“బాగుంది…..తీయగా ఉంది.. జూసీ కూడా” అన్నాను నేను.
“చెప్పాను గా.. “అన్నాడు తను.
“నీ నోరు ఎంత ఎర్రగా పండితే నీ వైఫ్ కి నువ్వంటే అంత ప్రేమ ఉన్నట్టు”అన్నాను నేను.
“కిల్లీ తినవ్ కాని ఇలాంటివి మాత్రం బా తెలుస్తాయిగా”అన్నాడు తను నవ్వుతూ…..నేను నవ్వేసా……….
అక్కడనుంచి బయటకి వచ్చాం..
“So, what next ?”అడిగాడు తను..
“Movie .. ఎలాగు matniee movie టైం అవ్తోంది..వెళ్దాం..”అన్నాను.
“Book my show లో చెక్ చేస్కున్నాం..
హమారీ అధూరి కహాని కి వెళ్దాం.. Please .. Please .. Please.. “అన్నాను నేను…….
తను ABCD2 కి వెళ్దాం అన్నాడు…..
కానీ నేను కళ్ళు చిన్నవి చేసి తనని క్యూట్ గా please please అని request చేసేప్పటికి నా మాటే నెగ్గించాడు……సో ఇద్దరం వెళ్లి మూవీ లో కూర్చున్నాం…..
నేను టైటిల్స్ దగ్గర్నుంచి రెప్ప వెయ్యకుండా చూస్తున్నాను……తను మాత్రం నన్నొకసారి స్క్రీన్ని ఒకసారి చూస్తున్నాడు……..
“ఫ్చ్ఛ్హ్..!!ఓయ్ ఏంటిఅలా చూస్తున్నావ్…..మూవీ చూడు ఆర్యన్..”అన్నాను నేను తన భుజం మీద చిన్నగా కొట్టి……..
“ఎంత స్లో గా ఉందో ఈ మూవీ….అసలు..ఎలా చూస్తున్నావా అంత interesting గా అని చూస్తున్నాను”అన్నాడు తను…..
“ఫీల్ తో కనెక్ట్ అవ్వరా బాబు.. అప్పుడు నచ్చుతుంది నీకు”అన్నాను నేను…….
“రా నా ?!గాస్ప్ ఎమోషన్ నన్నురా అన్నావ” అన్నాడు తను…..
“ఓహో..సారీ ఏదో ఫ్లో లో వచ్చేసింది……ఏమనుకోకు..”అన్నాను నేను.
“సరేలే అనేసవ్గా ఇంకేం చేస్తాం”అన్నాడు తను….
“నేను కాం గా ఉండు.. చూడనీ నన్ను”అన్నాను……

6 Comments

  1. Best story I’ve ever read.

  2. Super Love story ?

  3. actually vere stories chdvdmni vcha but mi story chdvtu aa thoughts ani poyi involve aypoya…tq u sisira nd aryan for sharing ur great love story

  4. Super love స్టోరీ

  5. Adbhutamaina prema allukonna emotional story

  6. Great and nice love story. I am eagerly waited for second part. Small request please post this story in love story sites. Best narration

Comments are closed.