ప్రాజెక్ట్ 1516

ఐఎస్ఐ చీఫ్ ఇంతియాజ్ ఖాన్ ,,లెఫ్టినెంట్ గా జీవితం మొదలుపెట్టి అంచాలంచెలుగా ఎదిగిన వ్యక్తి..
ప్రస్తుతం బోర్డర్స్ లో ఉన్న ఆర్మీ పోస్ట్ లు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు..
ఇన్స్పెక్షన్ తర్వాత టెంట్ లో రాసుకుంటుంటే అక్కడి కమాండర్ వచ్చి సెలుట్ చేశాడు..
“సాబ్ మి గౌరవం కోసం చిన్న ప్రోగ్రాం”అన్నాడు.
నిజానికి ఇంతియాజ్ కి ఓపిక లేదు కానీ వాళ్ళు బాగా పని చేస్తున్నారు,,అందుకే సరే అన్నాడు..
దగ్గర్లో ఉన్న టౌన్ నుండి కళాకారులు వచ్చి పాటలు,నృత్యాలు చేస్తూ హుషారు చేశారు..
ఇంటియాజ్ గంట తర్వాత లెద్దాం అనుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి పాడటం మొదలు పెట్టింది.
ఇంతియాజ్ షాక్ తగిలినట్టు ఉండిపోయాడు..
పాట తర్వాత ఆమె ఉన్న టెంట్ లోకి వెళ్ళాడు..
“బెటి నువ్వు అద్భుతం గా పాడావు”అని డబ్బు ఇచ్చాడు.
“మీలాంటి పెద్ద వారి అభిమానం దొరకడం నా అదృష్టం.”అంది వినయం గా.
“నువ్వు ఎపుడైనా హిందూ దేశానికి వెళ్ళావ”అడిగాడు ఇంతియాజ్
“లేదు సాబ్”అంది అర్థం కాక.
+++
మర్నాడు ఇస్లామాబాద్ వస్తూనే “ఏజెంట్ జావేద్ ను పిలవండి “అన్నాడు.
అరగంటలో అతను వచ్చి సెలుట్ చేశాడు.
“చూడు జావేద్ ఇండియా తో యుద్దం చేసి గెలిస్తే ఎలా ఉంటుంది”అన్నాడు టీ ఇస్తు.
“రీసెంట్ గా కార్గిల్ లో ముడ్డి పగిలింది ,,కానీ గెలిస్తే మంచిదే”అన్నాడు జావేద్.
“ఇప్పటిదాకా మనం ఫెయిల్ అవడానికి కారణం ఇండియా ఆర్మీ కపాసిటీ తెలియక పోవడం..”అన్నాడు ఇంతియాజ్.
“అది ఎప్పటికీ తెలియదు”అన్నాడు జావేద్.
“కొన్ని పాయింట్స్ లో ఏరియా ల్లో ఇండియా వీక్..అవి తెలిస్తే యుద్దం ప్రకటిద్దాం”అన్నాడు ఇంతియాజ్.
“ఎందుకు సార్ లేనిపోని గోల,,అయిన ఇండియా పీఎం కి తప్ప ఎవరికీ ఆ రహస్యాలు తెలియవు”అన్నాడు జావేద్.
“రైట్,పీఎం బెడ్ మీద మన ఏజెం ట్ ఉంటే,, ఇన్ఫో ఫస్ట్ హండ్ ది అవుతుంది”అన్నాడు ఇంతియాజ్.
“ఎలా”
“చూడు జావేద్ ,,కొన్నేళ్ల ముందు ఇండియా పీఎం మరణించడం తో అతని కొడుకు పీఎం అయ్యాడు..కానీ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు..
కిచిడీ పార్టీ లు పీఎం గా ఒకడిని ఎన్నుకున్నయి..కానీ అది అంతర్గత గొడవలతో పడిపోయెల ఉంది..సో ఎలక్షన్స్ వస్తాయి,,నా అభిప్రాయం లో రామ్ కుమార్ మళ్లీ పీఎం అవుతాడు.”అన్నాడు ఇంతియాజ్ సిగరెట్ వెలిగించి..
“ఆఫ్ కోర్స్,,,బట్ అతనికి సామర్ధ్యం కన్న అతని భార్య విద్యా శర్మ ప్లానింగ్ ఎక్కువ అంటారు”అన్నాడు జావేద్.
“నో విద్యా శర్మ అందగత్తె,,అది జనాన్ని మీటింగ్ లకి తెస్తుంది..అందుకే పార్టీ వాడుకుంటుంది”అన్నాడు ఇంతియాజ్..
ముందు రోజు కళాకారులు ,ఇంతియాజ్ తో దిగిన ఫోటో లు చూపాడు.
“గుడ్ గాడ్ “అన్నాడు ఒక ఫోటో చూసి జావేద్ వింతగా.
“యస్ ,,నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను.ఈమె అచ్చు విద్యా శర్మ ల ఉంది”అన్నాడు ఇంతియాజ్.
“Ok ఈమెకి ట్రైనింగ్ ఇచ్చి రీప్లేస్ చేయాలి”అన్నాడు జావేద్.
“యస్”
“ట్రై చేయగలం,కానీ ఖర్చు ఎక్కువ”అన్నాడు జావేద్.
“నేను చూసుకుంటాను”అన్నాడు ఇంతియాజ్.
“Ok project name”అన్నాడు జావేద్.
“Bomb shell”

ఇండియా లో ,,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో బ్రహ్మిన్ కుటుంబం లో పుట్టింది విద్య .
చదువులో చురుకు కావడం వల్ల ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో pg చేసింది..
రామ్ కుమార్ తండ్రి pm అయ్యాక ,,సెక్యూరిటీ చికాకులు వచ్చినా రామ్ కుమార్ నార్మల్ గానే ఉండేవాడు..
అతను ఐఐఎం నుండి ఎంబీఏ చేశాడు..
సెమినార్స్ కోసం వెళ్ళినపుడు డిగ్రీ చదువుతున్న విద్య ను ఇష్టపడ్డా డు..
ఇద్దరు ఏదైనా బిజినెస్స్ చేసుకుందాం అనుకున్నారు..
కానీ సడన్ గా రామ్ కుమార్ డాడ్ చనిపోవడం తో పార్టీ అతన్ని పీఎం చైర్ లోకి పంపింది బలవంతం గా..
“రాజకీయాలు వద్దు అనుకున్నాము కదా”అంది విద్య.
“పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు”అన్నాడు రామ్ కుమార్.
ముందు అర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని మూడు రోజుల తర్వాత పీఎం చైర్ ఎక్కాడు రామ్ కుమార్.
ఆరు నెలల్లో ఎంపీ గా గెలిచాడు…కానీ పార్టీ మీద గ్రిప్ లేక పోవడం,,మంచి పనులు చేసిన కు డా విపక్షాాల ప్రచారం తో రెండేళ్ల తర్వతా ఒడిపోయాడు.
ప్రతి పక్ష నేత గా అతని ఉపన్యాసాలు జనాన్ని ఆకర్షించాయి..ప్రస్తుత కిచిడి సర్కార్ పడి పోవడం వల్ల మళ్లీ ఎన్నికలు వచ్చాయి..
“ఈ సారి మళ్లీ రామ్ కుమార్ pm అవుతాడు”అని అన్ని సర్వే లు చెపుతున్నాయి..
&&&
“పార్టీ తరుఫున అన్ని చొట్లకి నేను వెళ్ళలేను నువ్వు కూడా వెళ్ళాలి”అన్నాడు రామ్ కుమార్.
ఇష్టం లేకపోయినా ఆమె వెళ్ళింది..
ప్రతి మీటింగ్ వీడియో అన్ని అంగెల్స్ లో ఇస్లామాబాద్ కి చేరుకుంటున్నాయి..
++++