రివెంజ్! Like

కళ్ళు చెందిరే వేగంతో పరిగెడుతూ ఆటో దెగ్గరికి వెళ్లి ఆటోని భుజంతో గుద్దగానే ఆటో కింద పడింది. వెంటనే వెళ్లి లోపల ఉన్న శశి చెయ్యి పట్టుకుని బైటికి లాగాడు. శశి ఒంట్లో స్పృహ లేదు. కింద పడిపోతునే శశి కళ్ళు తెరిచి చూస్తూ చేతులు ఎత్తి దణ్ణం పెడుతుంటే ఏం చెయ్యాలో తెలీక శశి తల మీద చూపుడు వేలుతో కొట్టాడు, వెంటనే స్పృహ కోల్పోయింది శశి. ఎలా వచ్చాడో అంతే వేగంగా శశిని ఎత్తుకువచ్చి కారు డిక్కీలో శశిని పెట్టి ఏం తెలీనట్టు గుళ్ళోకి వెళ్ళాడు. లోపల కోపంగా చూస్తుంది పిల్లనిచ్చిన అత్త

“ఎక్కడికి వెళ్ళావ్”

# “అదీ మంచినీళ్లు..”

“ఏవి”

మౌనంగా నిలుచున్నాడు శివ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *