టెస్టులు అన్ని అయిపోయాక డాక్టర్ దెగ్గర సెలవు తీసుకుని బైటికి వచ్చేసరికి వరుస మిస్డ్ కాల్స్ తో ఫోను నిండిపోయింది. మణి ఆపకుండా కాల్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ మొగుతుంటే కోపంగానే ఎత్తింది.
మణి గొంతులో భయం తెలుస్తూనే ఉంది, “శశి..”
శశికి కోపంతో “చెప్పు” అని అరిచింది
మణి గొంతు లేవలేదు, “మాట్లాడాలి” అని మాత్రమే అన్నాడు
“మాట్లాడదాం” అని కట్ చేసి ఫోను హ్యాండ్ బ్యాగులో తోసింది.
ఇంత జరిగినా శశి ధైర్యం కోల్పోలేదు దానికి కారణం తనకి కూడా అర్ధంకాలేదు. తన ముందున్న కల ముందు ఇవన్నీ చిన్నవిగా అనిపించాయా, లేదంటే ఎవరికైనా తెలిసినా భయంతో ఊరు వదిలి వెళ్ళిపోయినా తన కల కలగానే మిగిలిపోతుందేమో అన్న భయమా ??
సమాధానం శశికళకి కూడా తెలియదు
పిల్లలు ఊగే ఉయ్యాలలో కూర్చుని ఉంది శశి. కాసేపటికి మణి రానే వచ్చాడు. ఎప్పుడు మణి వంక చూసినా కొంచెం గౌరవంగా ఉండేది. తను కనపడగానే నవ్వడం, కూర్చుని ఉంటే లేచి నిలుచొవడం లాంటివి చేసేది, కానీ ఈసారి తన మొహం కూడా చూడలేదు. మణి నేరుగా శశి దెగ్గరికి వచ్చి ఉయ్యాల రాడ్డుని పట్టుకుని నిలుచున్నాడు.
శశి కోపంగానే “మాట్లాడాలన్నావ్, మాట్లాడు” అని కసిరింది. మణి చాలాసేపు మౌనంగానే ఉన్నాడు, ఏమని మాట్లాడాలి.. అందుకే “సారీ” అని మాత్రమే అనగలిగాడు.
శశి కోపంతో పిచ్చి దానిలా ఏడ్చేసింది.. “సారీ.. సారీ.. ఎంత నమ్మక ద్రోహం చేసావ్, సారీ.. సారీ.. అని ఏడుస్తూనే నిప్పులు చెలరేగే కళ్ళతో మణి వంక చూసింది.
మణి మొహంలో అస్సలు పశ్చతాపం లేదు, శశి ఏడుస్తుంటే చూస్తున్నాడు. వాడి మనసులో ఈ సోది అంతా ఎప్పుడు అయిపోతుందా అన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి శశి నోరు మూయించాలి. ఆలోచిస్తున్నాడు. వెంటనే, “శశి, మన మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందన్న భయంతోనే అలా చేసాను, రాజు, గుణ ఇద్దరు ఇంట్లో చెప్తాము అనేసరికి..” అని ఆగిపోయాడు.
శశి కోపంగా లేచి మణిని ఈడ్చి కొట్టింది, “సిగ్గులేదు, ఇంకా కధలు చెపుతున్నావ్” అని మళ్ళీ కొట్టబోతే మణి కోపంగా శశి చెయ్యి పట్టుకుని విధిలించాడు. “అవునే, వాడుకున్నాం. అయినా నేనేమి నిన్ను వేరే వాళ్ళతో పడుకోబెట్టలేదు, నిన్ను ముట్టుకుంది నా రక్తం పంచుకున్న వాళ్ళే. వాళ్ళతో రక్తమే పంచుకున్నాను, నిన్ను వాళ్ళతో పంచుకోవడం నాకు తప్పనిపించలేదు” అని కోపంగా చూస్తూ “ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలేస్తే బెటర్” అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి చూసి “నీకు ఇష్టం అయితే ఉండు లేదంటే బ్రేకప్” అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఐదు దాటి ఆరు అవుతుండగా చిన్నగా వెలుతురు తగ్గుతుంది. శశి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంటే దూరం నుంచి సెక్యూరిటీ వేసే విజిల్ వినిపించి లేచింది.
