ఆటో నడుపుతున్న వాడు, ఆటోలో కూర్చున్నవాడు ఇద్దరు శశిని చూసి పిచ్చిగా నవ్వారు. ఇద్దరు తాగేసి ఉన్నారు. రింగుల జుట్టు, పిచ్చి గడ్డం, మట్టి కొట్టిన బట్టలు. వాళ్ళ నవ్వులు వినపడగానే భయంతో శశి అడుగులు ఆటోకి దూరంగా పడ్డాయి. అప్పటికే శశి చిందరవందరగా ఉన్నా ఇంత అందం మళ్ళీ దొరుకుతుందో లేదో అన్న ఉత్సాహం, వెంటనే ఇద్దరు కలిసి శశిని పట్టుకుని బలవంతంగా ఆటోలో ఎక్కించారు.
గింజకునేంత బలం కూడా లేక ఏడుస్తూ వదిలేయ్యమని కేకలు పెడుతుంటే వెనక కూర్చున్న వాడు మాత్రం గుట్కా నమిలిన వాడి పెదాలతో సుకుమారి శశి పెదవులని అందుకోవాలని చూస్తున్నాడు. ఆటో మాత్రం వేగంగా వెళుతుంది. వెనక కూర్చున్నవాడు “రేయి, ఇది మాట వినట్లేదు, ఇటుకల బట్టీ దెగ్గరికి పోనీ” అనగానే ఆటో వాడు వెంటనే ముందుకు వెళ్లి మలుపు తిప్పి హైవే వెళ్లే రూట్లో ఆటోని తిప్పాడు.
###
###
సిటీ దాటి హైవే ఎక్కకముందే మలుపుని ఆనుకుంది శివాలయం, దాని ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి. అటుగా వెళుతున్న ఆటోలో శశికళ ఓపిక మొత్తం కూడతెచ్చుకుని ఒక్కసారి ఒళ్లు విధిల్చి ముందుకు వంగి ఆటో డ్రైవర్ ని నెట్టేసింది.
గుళ్లో ఉన్న వాళ్లకి “డ్డాం” అని శబ్దం రాగానే అందరూ బైటికి వచ్చారు. చూస్తే ఆటో వాడు కారుని గుద్దేసాడు. అందరూ ఆటోని చుట్టు ముట్టేసరికి ఆటో వాడు భయపడి ఆపకుండా లాగించేసాడు. అందరూ ఆటో వాడిని పట్టుకోబోతుంటే గుడి గేటు దెగ్గర వీళ్ళకి సంబంధం లేనట్టుగా నిలుచున్న ఇరవై నాలుగేళ్ల వాడు మాత్రం కదలకుండా చూస్తున్నాడు. చూస్తే పనివాడిలా ఉన్నాడు. అందరూ ఆటో వాడిని తిట్టుకుంటుంటే వాడు మాత్రం ఆటో వైపే చూస్తున్నాడు. తల తిప్పేస్తుండగా శశి కళ్ళు అతని కళ్ళు కలుసుకున్నాయి.
ఆటో లోపల అమ్మాయి అరవకుండా గట్టిగా మూతి కప్పేసారు, ఆమె కళ్ళ వెంట నీళ్లు కనిపించాయి, కళ్ళు చాలా నీరసంగా ఉన్నాయి. అందరూ లోపలికి వెళుతుంటే వాడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు.
“రేయి శివా.. ఎక్కడ చచ్చావ్” కోపంగా అరుస్తుంది ఒకావిడ “ఈ పనికిమాలోడిని అంటగట్టారు నా కూతురికి” అంటుంటే లోపలికి వచ్చిన వాడు “ఇక్కడే ఉన్నా అత్తయ్యా” అని లోపలికి వెళ్ళాడు. ఆమె తన అల్లుడి వంక కోపంగా చూస్తూ “వెళ్లి కొన్ని మంచినీళ్లు తీసుకురా” అని కసరింది. “అలాగే అత్తయ్యా, రెండు నిమిషాలు” అని తనని అస్సలు పట్టించుకోని భార్య వంక కూడా చూసి గుడి బైటికి వచ్చాడు. ఎవ్వరు చూడట్లేదుగా అని అటు ఇటు చూసి రివ్వున ఆటో వైపు పరిగెత్తాడు.
