రీతూ పాల్ – Part 5 89

అమల: నాకు ఏమీ కాలేదు. ఆరోజు హోటల్ లో నువ్వు చేసిన పనికి.

చైతన్య: నేను ఏమి చేశాను?

అమల: నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని…… ఛి… నేను చెప్పలేను. నువ్వు అలా చేయనంటేనే నేను నీతో వస్తాను.

చైతన్య: నేను ఏన్ని సార్లు పిలిచినా నువ్వు రాను అనే సరికి కోపంతో అలా జరిగిపోయింది. నేను అలా చెయ్యను. సరేనా?

అమల: సరే జరిగింది జరిగి పోయింది. ఇప్పటి నుండి మనం స్నేహితుల్లా ఉందాం. నేను నీ మాట నమ్మి వస్తున్నాను.

అమల కారులో ఎక్కి కూర్చున్న తరువాత

చైతన్య: నవ్వుతూ “ఎక్కడికి వెళదాం?”

అమల: అరే ఇక్కడ ఏమున్నాయో నాకేం తెలుసు.

చైతన్య: నవ్వుతూ “నువ్వు ఏం తినాలనుకుంటున్నావో చెబితే నేను తీసుకువెళతాను.”

అమల: ఇక్కడ అంధ్ర స్పెషల్ ఏం బాగుంటుంది అంటే అది…

చైతన్య: మరి ఇవాళ రాత్రికి బాగా తినేలా ఉన్నావు….

అమల: నాకు ఇక్కడ షూటింగ్ వాళ్ళు పెట్టే భోజనం అంతగా నచ్చట్లేదు. అందుకే అడిగాను.

చైతన్య: “సరే అంధ్ర భోజనం చెయ్యి”. అంటూ కారును కదిలించాడు.

20 నిమిషాల్లో హోటల్లోకి చేరుకున్నారు. వీరిద్దరిని చూడగానే మేనేజర్ స్పెషల్ గా ఏసీ లో ఒక టేబుల్ అరేంజ్ చేయమన్నాడు. హొటల్ మొత్తం నాగ చైతన్య వచ్చాడని తెలిసిపోయింది. ఒక పది నిమిషాలు వాళ్లందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఫోటోలు తీసుకుంటూ గడిచింది. తనని చూడాలని వచ్చే వాళ్ళని అదుపుచేయడం వాళ్లకు చాలా కష్టంగా ఉంది. అంతలో మేనేజర్ మిమ్మల్ని లోపలి తీసుకు వెళ్ళాడు.

లోపల చాలా బాగా అందంగా ఉంది. మేనేజర్ మాకు ఏమి కావాలి అని అడగకుండా ఇక్కడ ఉన్న అన్ని స్పెషల్ మీకు సర్వ్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. మాకు భోజనం వడ్డించారు. మొత్తం 28 రకాలు కలిపి వడ్డించారు. నేను చైతన్యతో పోటీ పడి తిన్నానో లేక అడిగి మరీ వడ్డిస్తూ ఉంటే తిన్నానో తెలియనంతగా తిన్నాము. తరువాత బిల్లు అని చైతన్య అడగగానే “సార్ మా ఓనర్ గారు మీ దగ్గర తీసుకోవద్దని చెప్పారు. వారు తాతగారికి, నాన్నగారికి పెద్ద అభిమానులు. మీరు వచ్చారని చెప్పగానే వారు వచ్చినంత ఆనందపడ్డారు. మీరు భోజనం చేస్తుండగా వాళ్ళ అబ్బాయి ఇక్కడకు వచ్చారు. మీ భోజనం తరువాత మాట్లాడతామన్నారు. వాళ్ళను లోపలి రమ్మని చెప్పనా?” అడిగాడు.

“మా తాతగారు చెప్పేవారు. మన అభిమానులు మనకు మొదట ప్రాముఖ్యత. వారి సంతోషమే మన సంతోషం అని” వారిని లోపలి తీసుకురండి అని చైతన్య అనగానే వెంటనే వెళ్లి ఒక కుర్రాడిని తీసుకు వచ్చారు. లోపలి వచ్చి చాలా ఆనందంగా కొద్దిసేపు మాట్లాడి సినిమా గురించి అడిగాడు. తరువాత మేనేజర్, ఓనర్, వంటవాళ్లు, హొటల్ పనివాళ్లు అందరితో ఫోటోలు తీసుకున్నారు. మీరు భోజనం పెట్టి బిల్లు తిసుకోనంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ నాన్నగారికి బట్టలు కొనిపెట్టు అని బలవంతంగా డబ్బును తన జేబులో పెట్టాడు. తరువాత మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఇక్కసారి వచ్చి వెళ్ళండి అని మమ్మల్లి సాగనంపారు. అంత అభిమానమా? ఇదంతా చూస్తే కలా? నిజామా? అని నాకు అనిపించింది.

చైతన్య: అమల భోజనం ఎలా ఉంది?

అమల: చాలా బాగుంది. నేను ఏరోజూ ఇంత తినలేదు, అంతలా తిన్నాను. పొట్ట పగిలిపోయేలా తిన్నాను. రోజూ ఇలా తింటే నేను ఒక్క నెలలోనే లావయిపోతాను.

చైతన్య: సరే, నేను రేపు హైదరాబాదు వెళుతున్నాను.

అమల: డైరెక్టర్ షూటింగ్ లేదన్నారా?

చైతన్య: లేదు..

అమల: మరి ….

2 Comments

  1. Where is next episode can you please send the as soon as possible

  2. This continuation stopped. Pl continue.

Comments are closed.