రీతూ పాల్ – Part 5 89

చైతన్య: అవును …

అమల: హోటల్లో అంత జనం నిన్ను చూడడానికి వచ్చారు. మరి మీరు పబ్ లో ఎలా?

చైతన్య: అవును … మనసులో “దీన్ని ఎలాగైనా….” అది మా సీక్రెట్…
ఇంతలో అమలకు ఫోన్ వచ్చింది.

అమల: హలో

డైరెక్టర్: అమల నేను క్రిష్ణ

అమల: చెప్పండి సార్.

డైరెక్టర్: రేపు షూటింగ్ త్వరగా మొదలవుతుంది. ఒక గంట ముందుగా రావాలి.

అమల: సరే.

డైరెక్టర్: రేపు మధ్యాన్నం నుండి నీకు 2 రోజులు లీవ్.

అమల: సార్, ఒక వారం ఇస్తే ఉరికి వెళ్లి వస్తాను.

డైరెక్టర్: కుదరదు. సరే … రేపు షూటింగులో కలుద్దాం.

అమల: సార్, ఒక వారం ఇస్తే ఉరికి వెళ్లి వస్తాను.

డైరెక్టర్: కుదరదు.

అమల: సార్, ఒక 4 రోజులైనా ఇస్తే….

డైరెక్టర్: కుదరదు. రేపు తొందరగా రా…

అమల: సార్, అంత సడన్ గా లీవ్ ఏమిటి?

డైరెక్టర్: “ఎదో అర్జంటుగా చైతన్య హైదరాబాదు వెళ్లి వస్తాడు. అందుకే నీకు 2 రోజులు లీవ్. ఎక్కడికీ వెళ్ళకుండా తిని పడుకో. తను రాగానే మిగిలిన షూటింగ్ చేస్తాను. రేపు తొందరగా రా…” అని ఫోన్ పెట్టాడు.

అమల: చూడు నీకు అడిగిన వెంటనే సెలవు ఇస్తాడు. నాకు మాత్రం లేదంటాడా.

చైతన్య: “అవును … అంతే… మరి సెలవు రోజులలో ఏం చేయాలో ఆలోచించుకో…. నీ హోటల్ వచ్చింది.” అంటూ కారు ఆపాడు.

అమల: కారు దిగి “చైతన్య చాలా చాలా ధ్యాంక్స్. బాయ్…..” అంటూ హోటల్ లోపలికి వెళ్ళిపోయింది.

చైతన్య: “ బాయ్….. రేపు కలుద్దాం.” అంటూ వెళ్ళిపోయాడు.

తరువాత రోజు తొందరగా షూటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1:00 కు పూర్తి అయ్యింది.

డైరెక్టర్: చైతన్య తొందరగా రా… మూడు రోజుల్లో మిగిలిన వాళ్ళది షూటింగ్ పూర్తవుతుంది. తరువాత నువ్వు ఉంటేనే మిగిలిన షూటింగ్ చెయ్యచ్చు.

చైతన్య: సరే…. నేను తొందరగానే వస్తాను.

అమల: సార్ నాకు 4 రోజులు సెలవు ఇస్తే నేను కూడా ఊరికి వెళ్లి వస్తాను. ఇక్కడ హోటల్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది.

డైరెక్టర్: “చైతన్య ఎదో అర్జెంట్ అని వెళుతున్నాడు. తను రాగానే మిగిలిన షూటింగ్ మొదలు పెడతాను. కాబట్టి నువ్వు వెళ్ళాలనుకుంటే రెండు రోజులలో వెళ్లి రా లేదా ఇక్కడ షూటింగ్ లో వచ్చి కూర్చో.. అంతే….” అని పక్కకు వెళ్లి పోయాడు.

అమల కోపంతో “ఛ…. ఎన్ని సార్లు అడిగినా అదే చెప్పాడు.” తన పక్కన నవ్వు వినపడే సరికి పక్కకు చూసింది. చైతన్య అమలను చూసి నవ్వుతున్నాడు. అమల కోపంతో “నువ్వు వెళ్లి బాగా ఎంజాయ్ చెయ్యి. నేను ఇక్కడే ఉంటాను.” అని వెళ్లిపోతుంటే అమలతో “నువ్వు కుడా రావాలనుకుంటే నేను వద్దనను. కాకపొతే నీ ఇష్టం. ఇక్కడే ఒంటరిగా ఉంటావా? లేక హైదరాబాదులో ఎంజాయ్ చేస్తావా?, బాగా ఆలోచించుకో… నేను ఇంకొక గంట తరువాత బయలుదేరుతాను. తరువాత నువ్వు వస్తానన్నా కష్టం.. బాయ్….” అని వెళ్ళిపోయాడు. చిరాకుతో అమల కూడా హొటల్ కు వెళ్ళిపోయింది.

2 Comments

  1. Where is next episode can you please send the as soon as possible

  2. This continuation stopped. Pl continue.

Comments are closed.