రీతూ పాల్ – Part 5 89

చైతన్య: నేను రెండు రోజులలో తిరిగి వస్తా….అంతవరకూ మిగిలిన షూటింగ్ జరుగుతుంది. మరి నీ ప్లాన్ ఏమిటి?

అమల: ఏమీ లేదు. డైరెక్టర్ ఒక్క రోజు సెలవు ఇస్తే తిని పడుకుంటా?

చైతన్య: మరి హైదరాబాదు వస్తావా? నీకు కాస్తంత రిలీఫ్ గా ఉంటుంది.

అమల: డైరెక్టర్ లీవ్ ఇస్తే అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిస్తాను ……

చైతన్య: నువ్వు వస్తానంటే నీకు వారం రోజులు కావాలన్నా సెలవు దొరుకుతుంది.

అమల: అయినా వారం రోజుల సెలవు దొరికితే కేరళ వెళతా? …..

చైతన్య: మనసులో “దీన్ని ఎలాగైనా హైదరాబాదు తీసుకు వెళ్ళాలి.” అని అనుకుంటూ ఫోన్ తీసి డైరెక్టర్ కు ఫోన్ చేశాడు.

డైరెక్టర్: హలో, బాబు

చైతన్య: క్రిష్ణ గారు భోజనం అయ్యిందా?

డైరెక్టర్: ఇంకా లేటు, మీది?

చైతన్య: నాది అయ్యింది. నేను రేపు హైదరాబాదు వెదామనుకున్నాను. రెండు రోజులలో తిరిగి వస్తాను.

డైరెక్టర్: మీరు లేకపోతే …… షూటింగ్…. ఏదైనా అర్జెంటా?

చైతన్య: నాన్నను చూద్దామని …

డైరెక్టర్: రేపు ఎప్పుడు బయలుదేరుతారు?

చైతన్య: ఉదయమే …

డైరెక్టర్: రేపు మధ్యాహ్నం బయలుదేరితే అంత లోపల కొన్ని సీన్లు తీస్తాను. మూడు రోజుల తరువాత వచ్చినా నేను ఇబ్బంది లేకుండా చూసుకుంటా.

చైతన్య: మరి మూడు రోజులు అందరికీ సెలవా?

డైరెక్టర్: విలన్ సీన్లు తీస్తా..

చైతన్య: మరి అమల?

డైరెక్టర్: మీరు లేకపొతే తనకు సెలవే…

చైతన్య: మరి రేపు ఉదయమే నేను వస్తాను. తొందరగా సీన్లు ముగించండి.

డైరెక్టర్: “సరే… ఉంటాను” అని ఫోన్ పెట్టాడు.

అమల: మీ నాన్నను చూద్దామని వెళుతున్నారా?

చైతన్య: అలా చెబితే తొందరగా నేను వెళ్ళచ్చు.

అమల: మరి మూడు రోజులు ఏం చేస్తారు.

చైతన్య: చరణ్ తో పబ్…. మా తాత తో తిరగడం…. ఇంకా తినడం… పడుకోవడం … ఇంకా చాలా…..

అమల: చరణ్ అంటే… రాంచరణ్ ….

2 Comments

  1. Where is next episode can you please send the as soon as possible

  2. This continuation stopped. Pl continue.

Comments are closed.