రీతూ పాల్ – Part 4 101

అక్కడినుంచి నేను బయటికి వచ్చేశాను కానీ నా మనసంతా పోయిన డబ్బులు గురించి ఆలోచిస్తోంది. షూటింగ్ కూడా ఎలాగోలా చేశాను. డైరెక్టర్ కూడా “ఏంటి అమల ఎందుకిలా సరిగ్గా చేయడంలేదు ఈరోజు” అని అడుగుతున్నాడు. “సార్ నా మనసేమీ బాగాలేదు. నేను ఇంటికి వెళతాను”అని అడిగి ఇంటికి వచ్చాను. నా రూములో తలుపులు వేసుకుని కూర్చొన్నాను. ఎంత వద్దన్నా అవే ఆలోచనలు “ఆ సంతకం నాదే, కానీ ఆ డబ్బు ఎలా మారింది? అసలు అంత మంచిగా నటించి మోసం చేసాడు. అసలు దీన్నుంచి నేను ఎలా బయట పడాలి?” అని ఆలోచిస్తుంటే తల తిరుగుతోంది. “ఇది మా అమ్మకు తెలిస్తే తను ఏం చేస్తుంది? నాన్న ఏమంటాడు? పాపం తమ్ముడు వాడు ఏం చేయలేడు. రాత్రి భోజనం కూడా చేయబుద్ది కాలేదు” అలాగే ఏడిస్తూ పడుకున్నాను.

అమ్మ: అమల …. భోజనానికి రా.

అమల: నాకు వద్దు, మీరు తినండి.

అమ్మ: అదేంటే. ఎప్పుడు చూసినా ఆకలి.. ఆకలి.. అని అరిచేదానివి. అని అంటూ నా గది తలుపు కొట్టింది.

నేను కళ్ళు తుడుచుకుని తలుపు తీశాను. నా ముఖం చూసి

అమ్మ: ఏమందే నీకు. అలా ఉన్నావు.

తమ్ముడు: వచ్చినప్పటి నుండీ తను బయటకే రాలేదు.

అమల: ఏంలేదు.

అమ్మ: వెంటనే తలుపు వేసి మెల్లగా “ఏం జరిగింది? ఎవడైనా వెధవ వేషాలు వేశాడు? చెప్పవే? ఆ ప్రొడ్యూసర్ ఏమైనా బలవంతం చేశాడా?”

నాన్న: గట్టిగా “ఎంతసేపే. నాకు ఆకలిగా ఉంది”

అమ్మ: గట్టిగా “వస్తున్నా”. మెల్లగా “చెప్పవే మీ నాన్నపిలుస్తున్నాడు. వెళ్ళాలి.”

అమల: మనసులో “ఇప్పుడు చెబితే అంతే ఇంట్లో యుద్ధమే” అని అనుకుంటూ “ఏం లేదు. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది”.

అమ్మ: ఇంతోటిదానికి “తొందరగా ముఖం కడుక్కుని రా” అని తలుపుతీసింది.

తమ్ముడు: అక్కా. ఏమైంది?

అమ్మ: వెళ్ళిపోతూ “నువ్వు రా రా” అని తమ్ముణ్ణి తీసుకెళ్లింది.

కొద్దిసేపటికి నేను వెళ్ళాను. నాన్న, తమ్ముడు తింటున్నారు. అమ్మ నాకు అన్నంపెట్టింది. నేను మెల్లగా తింటున్నాను.

నాన్న: ఏంటి? ఏంటి ఎలా ఉంది?

అమ్మ: ఏంలేదు. దానికి కాస్త బాగాలేదు. ముందు మీరు తినండి.

ఇంతలో నాన్న ఫోన్ ట్రింగ్ ….. ట్రింగ్ ….. ట్రింగ్ ….. మని మోగింది. అమ్మ ఆ ఫోన్ నాన్నకు అందించింది.

నాన్న: హలో…… వస్తాను…. తొందరగా కలుస్తాను….. నేనే చెప్పాను కదా ఈ వారంలో డబ్బులు వస్తాయి. వచ్చిన వెంటనే ఇస్తాను…… చెప్పాను…. మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తారు……… నేను కచ్చితంగా ఇస్తాను…….. సరే ………. సరే సార్ ……. అని ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ వెధవ ఫోన్లు. ఈ అప్పల వాళ్లతో తట్టుకోలేకపోతున్నాను. రావలసినవి తొందరగా రావు. వీళ్ళు కాస్త ఆగండి అంటే వినరు. నా వైపు తిరిగి మిగిలిన నాలుగు లక్షలు ఎప్పుడు ఇస్తారు.

అమల: అంతే నా గొంతులో అన్నం అడ్డం పడినట్టు అనిపించి ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఖళ్… ఖళ్.. అని దగ్గాను.

అమ్మ: మీ కోపం దాని మీద ఎందుకు చూపిస్తారు. డబ్బులు వస్తాయి.. అంటూ నా నెత్తిమీద కొడుతూ నీళ్ళు తాగడానికి ఇచ్చింది.

నాన్న: సరే ఏదో తొందరగా చేయండి.

అమల: మనసులో “హమ్మయ్య. గండం గడిచింది.” అనుకుంటూ నీళ్ళు తాగాను. ఏదో నాలుగు మెతుకులు తిని నా రూములోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకున్నాను. కొద్దిసేపటికి అమ్మ వచ్చి ఒక మాత్ర ఇచ్చి వేసుకొని పడుకొమ్మని చెప్పి వెళ్ళిపోయింది. ఎంతసేపు గడిచినా నిద్ర పట్టడం లేదు. ఇంట్లో చెప్పలేను. రేపటి గురించి తలచుకుని భయం వేసింది. అలాంటి స్ధితిలో ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలియదు. “అమలా….. అమలా… లెగు…… కారు వచ్చేస్తుంది……. షూంటింగుకు వెళ్ళాలి……” అన్న అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను.

అమల: ఇంకా కొంత సేపు… నిద్ర వస్తోంది….

అమ్మ: అంత మొద్దు నిద్ర ఏంటే. తొందరగా తెములు…. ఆని అంటూ వెళ్ళిపోయింది.

నేను లేచి రెడీ అయ్యి టిఫిన్ తింటుండగా

అమ్మ: నిన్న మీ నాన్న చెప్పింది విన్నావుగా తొందరగా మిగిలిన డబ్బులు అడుగు.

నేను జరిగింది తలచుకుని అమ్మకు జరిగింది చెప్పలేక ఇంకొకసారి క్యాషియరును అడుగుదామనుకుని తొందరగా తిన్నాను. అప్పుడే కారు హారన్ వినిపించింది. నేను తొందరగా వెళ్లబోతుంటే అమ్మ ఇంకొక్కసారి “మర్చిపోకు తొందరగా డబ్బులు అడుగు” అని చెబుతుంటే నేను తొందరగా కారు ఎక్కి షూటింగుకు వెళ్ళిపోయాను. మధ్యలో లంచ్ బ్రేక్ తరువాత క్యాషియరును కనపడ్డాడు. నేను తన దగ్గరకి వెళ్ళి

అమల: సార్…. సార్…

క్యాషియర్: ఎందుకొచ్చావ్.

అమల: సార్ దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి. మా ఇంటిలో విషయం తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు.

క్యాషియర్: నేను చెప్పాల్సింది అప్పుడే చెప్పాను. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడుకో.

అమల: మీకు అక్కా చెల్లెళ్లు లేరా? వాళ్ళకు ఇలా ఎవరైనా మోసం చేస్తే ఎలా ఉంటుంది.
దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి.

క్యాషియర్: నీకు మళ్ళీ చెబుతున్నాను. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడుకో.

అమల: మీరు ఇలా మోసం చేస్తే మీకు దేవుడు మేలు చేస్తాడా?

అంతలో దూరం నుండి క్యాషియర్ అన్నా… అంటూ ఇక సెక్యూరిటీ ఆఫీసర్ వస్తున్నాడు.

క్యాషియర్: నువ్వు ప్రొడ్యూసరుతో మాట్లాడుకో. వెళ్ళు. వెళ్ళు.

నేను అక్కడే నిలబడ్డాను.

సెక్యూరిటీ ఆఫీసర్: మాకు ఇక్కడ సెక్యూరిటీ డ్యూటీ. మీ ప్రొడ్యూసరు నీ దగ్గర డబ్బులు తీసుకోమని పంపాడు.

క్యాషియర్: నీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను.

సెక్యూరిటీ ఆఫీసర్: ఏమిటి అన్నా?

క్యాషియర్: ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టుగా వోచర్లో, రిజిస్టర్లో సంతకం పెట్టి తర్వాత వచ్చి నేను డబ్బులు తీసుకోలేదు. నన్ను మోసం చేశారు. నేను సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి వెళతాను అని అంటే ఏం చేస్తారు.

సెక్యూరిటీ ఆఫీసర్: ఎవడు ….. ఎవడు ఆ కూత కూసింది. స్టేషనుకి ఈడ్చుకెళ్ళి జైలులో తోసి లాఠీలో ఒక రేవు పెట్టానంటే వాడే కాదు, వాడి బాబు అయినా మన దెబ్బకు డబ్బులు తీసుకున్నట్టుగా ఒప్పుకోవాల్సిందే.

క్యాషియర్: అమల వైపు చూస్తూ “ఇక వేళ మగాడు కాకుండా అది ఆడపిల్ల అయితే”

సెక్యూరిటీ ఆఫీసర్: ఆడపిల్ల అయితే ఏంటి మా స్టేషనుకు ఒక్క ఫోన్ కొడితే ఆడ సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తారు. స్టేషనుకి ఈడ్చుకెళ్ళి జైలులో తోసి లాఠీలు విరిగేలా రేవు పెడతారు. పొరపాటున ఈ అమ్మాయి కానీ అలా అనిందా? ఏ అమ్మాయి నిన్నే? ఏంటి అని అమల వైపు చూస్తూ గద్దించి ఆడిగాడు.

అమల: ఒక్కసారి అలా నా వైపు చూసి మాట్లాడేసరికి భయంతో నాకు నోట మాట రాలేదు. నా కాళ్ళు చేతులూ వణుకుతున్నాయి.

2 Comments

  1. Post more pages. You’re cresting anxiety in the readers. Next update don’t take much time.

  2. Worst stories are posted quickly but good stories will be delayed for posting.

Comments are closed.