శ్యామల….! Like

“వేర్ కెన్ ఐ గెట్ సంథింగ్ లైక్ దట్?” అంది ఆ అమ్మాయి

“ఐ…. ఐ డోంట్ నో….ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మై హోం టౌన్ అమలాపురం.” అంది శ్యామల ఇంగ్లీష్ లో మాట్లాడటానికి కొంచం ఇబ్బంది పడుతూ.

“ఓహ్ ఎనీ వే, ఇట్స్ బ్యూటిఫుల్” అంది ఆ అమ్మాయి.

“మీది అమలాపురమా?” అని ఒక మగగొంతు వినపడింది శ్యామల కి తన వెనుక నుండి.

వెంటనే వెనక్కి తిరిగి చూసింది. తన వెనుక ఉన్న సూట్ అబ్బాయిలలో ఒకరు అడిగారు.

“అవును” అంది శ్యామల

“మాది కూడా మీ పక్కన ఊరే” అన్నాడు ఆ అబ్బాయి

శ్యామల ఇంకేం మాట్లాడకుండా ముందుకి తిరిగింది. వెనుక ఉన్న ఇద్దరూ శ్యామల గుద్దలని చీర మీద నుండే చూస్తూ

“మీరు ఈ హోటల్ లోనే ఉంటున్నారా?” అని అడిగాడు అతను మళ్ళీ

“లేదు” అంది శ్యామల వెనక్కి తిరిగి

“ఓహ్ మేం ఇప్పుడే వచ్చాము ఇక్కడ స్టే చేయటానికి, మాది అమలాపురం అయినా మా బిజినెస్ అంతా లండన్ లో ఉంటుంది” అన్నాడు.

“అవునా?” అంది శ్యామల

“హా అవును, మరి ఇక్కడికెందుకు వచ్చారు?” అన్నాడు

“ఒకళ్ళని కలవటానికి” అంది శ్యామల

“ఇక్కడ?” అన్నాడు

“హా అవును” అంది శ్యామల

అతను వెంటనే పక్కనే ఉన్న తన ఫ్రెండ్ చెవిలో ఏదో గొణిగాడు. అమాయకురాలు అయిన శ్యామల కి ఏం అర్ధం కాలేదు. వెంటనే మళ్ళీ ముందుకు తిరిగింది.

“నీ కార్డు కానీ ఏమన్నా ఉంటే ఇవ్వు” అన్నాడు అతను ఆశగా

“కార్డు ఆహ్.. ఎం కార్డు అంది?” శ్యామల, ఇంతలో ముందు ఉన్న జంట వెళ్ళటం తో రెసెప్షన్ లో ఉన్న అమ్మాయి

“చెప్పండి మేడం?” అంది, శ్యామల ఇంక వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి

“నేను పార్వతి గారిని కలవాలి?” అంది శ్యామల

“పార్వతి మేడం నా? మీరు శ్యామల గారేనా” అంది ఆ అమ్మాయి

“అవును” అంది

“ఒక్క నిమిషం మేడం” అంటూ తన డెస్క్ ఓపెన్ చేసి అందులో నుండి కార్డు తీసి “ఇదిగోండి కీ కార్డ్” అంది ఆ అమ్మాయి ఒక కార్డు శ్యామల కి ఇస్తూ.

“కీ కార్డ్ ఎందుకు?” అంది శ్యామల

“మేడం మిమ్మల్ని తన సూట్ లో కలవమని చెప్పారు” అంది ఆ అమ్మాయి

“ఆమె ఇక్కడే ఉంటారా?” అంది శ్యామల ఆశ్చర్యం గా

“హా అవును మేడం, 35th ఫ్లోర్ లో VIP సూట్స్ ఉన్నాయి, అక్కడ ఉంటారు మేడం, సూట్ నెంబర్ 35032” అంది ఆ అమ్మాయి

అది విని శ్యామల ఆశ్చర్యపోయింది. పార్వతి ఆంటీ ఇక్కడ వర్క్ చేస్తుంది అని తెలుసు కానీ ఇదే హోటల్ లో అది కూడా VIP సూట్ లో ఉంటుందా అనుకుంది. ఇప్పటివరకు ఇలాంటి హోటల్ లోనే ఉండలేదు శ్యామల, అలాంటిది ఇప్పుడు VIP సూట్ అంటే ఎలా ఉంటుందో అని సంబరపడింది చూడటానికి.

లిఫ్ట్ 35th ఫ్లోర్ చేరే వరకు అసలు నమ్మబుద్ది కాలేదు శ్యామల కి, లిఫ్ట్ నుండి బయటకు వచ్చి మెల్లగా సూట్ వైపు నడవటం మొదలుపెట్టింది. 35032 అన్న నెంబర్ కనపడగానే ఆగి, అదురుతున్న చేత్తో కాలింగ్ బెల్ కొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *