“మరి పింకీ వయసు” అంది పార్వతి
“7 సంవత్సరాలు” అంది శ్యామల
“అంటే టైం వేస్ట్ చేయలేదన్నమాట అమర్” అంది పార్వతి.
అది విని శ్యామల సిగ్గు పడింది.
“పింకీ చాలా తెలివైన పిల్లలే” అంది పార్వతి
“అవును ఆంటీ, అందుకే తనని ఇంటర్నేషనల్ కాలేజ్ లో జాయిన్ చేసాం. ఎంత చెప్తున్నా అమర్ వినలేదు, అందుకే మాకు ఇంట్లో ఈ ఆర్థిక బాధలు” అంది శ్యామల
“అర్ధం అవుతుంది” అంది పార్వతి
“సరే ఆంటీ ఇంక వెళ్తాను, పింకీ వచ్చే టైం అయింది” అంది శ్యామల
“సరే ఎప్పుడు రావాలి అనిపించినా మొహమాట పడకుండా వచ్చేయ్” అంది పార్వతి
“తప్పకుండా ఆంటీ” అంది శ్యామల
“ఆగు మా హోటల్ వాళ్లకి చెప్తాను, కార్ లో డ్రాప్ చేస్తారు” అంది పార్వతి
“అయ్యో వద్దు ఆంటీ ఆటో లో వెళ్ళిపోతాను” అంది శ్యామల
ఇద్దరు నడుచుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న మగాళ్లలో కొంతమంది శ్యామల ని కసిగా కింద నుండి పై వరకు చూసారు. ఆ చూపులు పార్వతి కి అర్ధం అయ్యాయి కానీ అమాయకురాలు అయిన శ్యామల కి అర్ధం కాలేదు.
“థాంక్స్ ఆంటీ” అంది శ్యామల మళ్ళీ
“అది ఇంక వదిలేయ్” అంటూ తన ఫోన్ బయటకు తీసి “సునీల్ ఒకసారి ఇలా రా నన్ను, తనని కలిపి ఫోటో తియ్యి” అంది పార్వతి పక్కనే ఉన్న సెక్యూరిటీ అతనిని పిలిచి
“హాహా ఆంటీ అవసరమా” అంది శ్యామల
“అవసరమే మళ్ళీ నువ్వు వస్తావో రావో, గుర్తుగా ఉంటాయి గా” అంది పార్వతి
“తప్పకుండా వస్తాను ఆంటీ” అంది శ్యామల
సునీల్ వచ్చి పార్వతి చేతిలోని ఫోన్ తీసుకుని డజన్ కి పైగా ఫోటోలు తీసాడు. శ్యామల బాయ్ చెప్పి వెళ్ళిపోయింది.
పార్వతి తిరిగి హోటల్ లోకి వచ్చి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుని ఫోన్ తీసి శ్యామల ఫోటో లని చూడసాగింది.
కోల మొహం, ఒద్దికగా ఉన్న అందాలు, పిరుదులు తాకే నల్ల త్రాచు పాములాంటి జడ, ఎర్రటి పెదాలు. సాదాసీదా చీర కడితేనే అంత మంది మొగాళ్ళు కసిగా చూసారు మంచి కసి ఫిగర్ యే అనుకుంది. మరోసారి పిక్స్ అన్నీ చూసి మంచిగా ఉన్న పిక్స్ ఒక మూడు సెలెక్ట్ చేసి తన కాంటాక్ట్ లిస్ట్ లోని ఒక నెంబర్ కి సెండ్ చేసి
“ఎలా ఉంది?” అని మెసేజ్ పెట్టింది.
శ్యామల ఆటో ఎక్కి నాంపల్లికి వెళ్ళాలి అని ఆటో డ్రైవర్ తో చెప్పి పార్వతి ఆంటీ చూపించిన ప్రేమని, తను పెట్టించిన కాస్ట్లీ భోజనాన్ని గుర్తు చేసుకోసాగింది.
ఆ మెనూ కార్డు లో చైనీస్, ఇటాలియన్ ఇలా చాలా రకాల వంటలు ఉన్నాయి. శ్యామల కి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక జీరా రైస్ ఆర్డర్ పెడితే పార్వతి మెనూ కార్డు తీసుకుని చికెన్ ఐటమ్స్ చెప్పింది. ముఖ్యం గా ఆ చాక్లెట్ కేక్ అబ్బా ఎంత రుచిగా ఉందొ అనుకుంది.
కొంతసేపటికి తను దిగాల్సిన చోటు రావటం తో ఆటో అతనికి డబ్బులు ఇచ్చి మెల్లగా తన ఇంటి వైపు అడుగులు పెట్టింది. పక్కనే ఉన్న చిన్న కూరగాయల కొట్టు చూసి రాత్రికి చేయాల్సిన వంట గుర్తు వచ్చి కొన్ని కూరగాయలు, ఉల్లిపాయలు కొనుక్కుని తన ఇంటికి చేరుకుంది.
ఆ రోజు రాత్రి అందరూ తినేసారు. శ్యామల తిన్నవి మొత్తం క్లీన్ చేసుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి పింకీ నిద్రపోతూ కనిపించింది. పింకీ పక్కనే అమర్ చోళ సామ్రాజ్యం అనే బుక్ చదువుతూ కనిపించాడు.
“అమర్?”
“హ్మ్మ్” అన్నాడు
