ఆట ప్రారంభమవుతుంది 2 112

“నువ్వెంటి ఇక్కడ….”అంది. “కొంచెం పని ఉంటె వొచ్చాను….ఈ హోటల్ అతను బాగా తెలుసు నాకు…”అన్నాను. “నేను పని చేస్తున్న కంపెనీ ఎండీ ఈ surroundings లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నాడు …..అందుకే ఏరియా చూద్దాము అని వొచ్చాను….”అంది పక్కన ఉన్న ఇంకో తన కోలిగ్ ని పరిచయం చేస్తూ. “గుడ్….. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది …ఈ ఏరియా…”అన్నాను తనతో. ” విగ్నేష్…నెక్స్ట్ వీక్ మా బాస్ పెద్ద పార్టీ ఆరెంజ్ చేసారు….మీరు కూడా రండి….కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు….ఎలాగూ వీకెండ్ నే కదా……”అంటూ ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది బాగ్ లో నుండి తీసి. “సరే….ఐ విల్ ట్రై….వినూత్న..”అంటూ తనకి బాయ్ చెప్పి, జావేద్ ని తీస్కొని ల్యాండ్ వైపు వెళ్ళాను.
“జావేద్….మొత్తం చుట్టూ బేస్మెంట్ కట్టించి ఫెన్సింగ్ వేద్దాము …ఏమంటావు….”అన్నాను. “అన్న….మంచి ఆలోచన…”అన్నాడు. “సరే ….నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి…ఆ పనేదో నువ్వే చుస్కో…నీ ల్యాండ్ కి కూడా అలాగే ఫెన్సింగ్ చేయించు…పనిలో పనిగా…”అన్నాను. “పర్వాలేదు అన్న…..నేను ఇక్కడే ఉంటాను కదా…నా దానికి ఏమి అవసరం లేదు….మీ దానికి వేయిస్తాను….”అన్నాడు. “లేదు..మొత్తానికి వేయించు నీ దానికి కూడా గేట్ పెట్టించుకో……”అన్నాను. నాకు ఎక్కువ ఎదురు మాట్లాడడు. సరే అంటూ తలాడించాడు. అతనికి డబ్బులు ఇచ్చి ఇంటికి బయలు దేరాను.
ఫ్రైడే వరకు ఫుల్ గ బిజీ గా ఉండే షెడ్యూల్. ఫ్రైడే నైట్ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాను. వినూత్న ఫోన్ చేసింది, ఫోన్ లిఫ్ట్ చేసి “హాయ్ వినూత్న..”అన్నాను. “హాయ్..విగ్నేష్…రేపు నైట్ వొస్తున్నారు కదా…”అంది. “ఓ….కార్డు ఇచ్చావు కదా…మర్చిపోయాను…వీకెండ్ నే కదా…. sure గా వొస్తాను….”అన్నాను. “నువ్వు వొస్తున్నావు అని మా బాస్ కి కూడా చెప్పాను…..మిస్ చేయకు..”అంది. “మీ బాస్ కా…..హలో …నేను నువ్వు పిలుస్తున్నావు అని వొస్తున్నాను….మీ బాస్ ఎవరో కూడా నాకు తెలియదు…”అన్నాను. “కూల్…విగ్నేష్….మా బాస్ చాల స్పోర్టివ్ ….డోంట్ వర్రీ…..సరే నాకు పని ఉంది…డోంట్ మిస్…ప్లీజ్…”అంటూ ఫోన్ పెట్టేసింది.

నెక్స్ట్ డే ఈవెనింగ్ మల్లి ఫోన్ చేసింది వినూత్న “గుర్తుంది ….వొస్తాను….”అన్నాను. “షార్ప్ సెవెన్ కల్లా రండి…మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను….”అంటూ ఫోన్ పెట్టేసింది. ఇన్ని సార్లు పిలుస్తుంటే అర్ధం కాలేదు నాకు, అంత స్పెసిఫిక్ గా ఎందుకు పిలుస్తుందో. నేనంటే ఇష్టం అని తెలుసు, బట్ ఆ రోజు తర్వాత ఎక్కువ మేము మాట్లాడుకోలేదు కూడా.
తాను చెప్పినట్టే షార్ప్ 7 కి రిసార్ట్ కి వెళ్ళాను. రిచ్ గా ఆరెంజ్ చేసారు, నేను లోపలి వెళ్తుంటే వినూత్న ఎదురు వొచ్చింది. “థాంక్ యు…..షార్ప్ 7 కి వొచ్చారు…”అంటూ షాక్ హ్యాండ్ ఇచ్చింది. చాల సెక్సీ గా తయారు అయింది, ట్రాన్స్పరెంట్ శారీ, అది కూడా బొడ్డు కిందకి కట్టి. “you are looking hot …”అన్నాను. చిలిపిగా నా వైపు చూసి “థాంక్ యు……”అంది. నాకు ఒక టేబుల్ దెగ్గరకు తీసుకెళ్లి కూర్చోపెట్టి తాను వెళ్ళిపోయింది. జనాలు అందరు హడావిడిగా తిరుగుతున్నారు. అన్ని రకాల ఫుడ్, అన్ని రకాల లిక్కర్, అందంగా అమర్చారు టేబుల్స్ మీద.
అందమైన అమ్మాయిలను అరెంజ్ చేసారు సర్వ్ చేయడానికి. మ్యూజిక్ చాలా లో కీస్ లో అరెంజ్ చేసారు. మొత్తానికి వినూత్న బాస్ మంచి టేస్ట్ ఉన్న వాడిలాగే అనిపించాడు, arrangements చూస్తుంటే. బాస్ పేరు ఎదో చెప్పింది వినూత్న బట్ నాకు గుర్తులేదు. వొచ్చిన గెస్ట్ అందరు టేబుల్ మీద సెటిల్ అవుతున్నారు. వినూత్న హడావిడిగా తిరుగుతుంది అందర్నీ విష్ చేస్తూ, మధ్య మధ్య నన్ను చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తూ.
అంతలో ఒక మిడిల్ ఏజ్ అతను స్టేజి మీదకు వొచ్చి అందరికి విష్ చేసాడు. వినూత్న వెళ్లి పక్కన నిల్చుంది. అతని ఫొటోస్ న్యూస్ పేపర్స్ లో చూసిన గుర్తు. యూస్ లో ఉన్న ఒక కంపెనీ collaboration తో ఇక్కడ ఒక కంపెనీ పెట్టబోతున్నాడంట, దాని గురించే ఈ పార్టీ అరెంజ్ చేసాడని అర్ధం అయ్యింది అతని మాటలబట్టి.

అతను మాట్లాడి ఒక్కొక్కరి దెగ్గరకు వెళ్లి పలకరిస్తున్నారు. నా టేబుల్ మీద నేను ఒక్కడినే ఉన్నాను. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కొంచెం uneasy గానే ఉంది.

వినూత్న నా టేబుల్ దెగ్గరకు తీస్కొని వొచ్చింది. నేను లేచి నిల్చున్నాను. “sit young man ..విన్నూ చెప్పింది నీ గురించి…..i respect self made people …..స్టాక్ మార్కెట్ కింగ్ అంట కదా నువ్వు…..అవును ఎప్పుడైనా నా షేర్స్ కొన్నావా…..”అన్నాడు నవ్వుతు. “ఏ కంపెనీ మీది…..”అన్నాను. అతను కంపెనీ పేరు చెప్పాడు. “ఇప్పుడు ఆ కంపెనీ షేర్స్ delist అయ్యాయి కదా ….”అన్నాను, ఆ కంపెనీ షేర్ కొన్నాను నేను కూడా, బట్ లాస్ వొచ్చింది అందులో నాకు, అదే విషయం అతనితో అన్నాను. అతను గట్టిగ నవ్వుతు “i like your frankness young man …అది నా మొదటి కంపెనీ…..ఎలా రన్ చేయాలో నాకు కూడా అనుభవం లేకుండే….after that i went యూస్, రష్యా, అండ్ some other countries ….i gained lot of knowledge …..so now i stand like this …..”అన్నాడు నవ్వుతు. నేను నవ్వుతు తన వైపు చూసాను. “well young man . you carry on ….”అంటూ తాను వెళ్ళిపోయాడు.
కాసేపటికి వినూత్న నా దెగ్గరకు వొచ్చింది. “సారీ విగ్నేష్…నీకు కంపెనీ ఇవ్వలేకపోతున్నాను…..ఏమి అనుకోకు….మా బాస్ చాలా ఇంప్రెస్స్ అయ్యాడు నీ frankness కి….”అంటూ చొరవగా నా గ్లాస్ తీస్కొని ఒక సిప్ చేసి, “పద…”అంది నా వైపు చూసి, ఎక్కడికి అన్నట్టుగా చూసాను తన వైపు. “లోపల ఓన్లీ ఫర్ బిగ్ షాట్స్ వేరే పార్టీ ఉంది….అక్కడికి…”అంది నవ్వుతు. “అక్కడికి నేనెందుకు…..నాకు ఇక్కడే ఎవరు తెలియదు…ఇంకా అక్కడ ఎవరు తెలుస్తారు…..”అన్నాను అర్ధం కాక. “పర్లేదు….రా…..నేను ఉన్నాను కదా….”అంటూ నా చేయి పట్టుకుంది. ఇంకా తప్పదన్నట్టుగా తనను అనుసరించాను అయిష్టంగానే.
స్పెషల్ పార్టీ జరుగుతన్న ప్లేస్ కి వెళ్ళగానే అక్కడి richness చూసి నేను నోరెళ్లపెట్టాను. ఒక పాతిక మంది ఉంటారు అనుకుంటాను మొత్తం కలిపి గెస్ట్స్. దూర దూరంగా టేబుల్స్ అరెంజ్ చేసారు, ఎంత దూరం అంటే ఒకరి మాటలు ఇంకో టేబుల్ వరకు వినిపించనంత దూరం. low dim లైట్లో ఉంది మొత్తం ప్లేస్. ప్రతి టేబుల్ మీద ఫుడ్, లిక్కర్ అరెంజ్ చేసి పెట్టారు. నన్ను ఒక కార్నెర్ టేబుల్ దెగ్గరకు తీసుకెళ్ళి కూర్చోపెట్టింది వినూత్న.
“విగ్నేష్….ఎంజాయ్ చేయి…..ఏమి ఆలోచించకుండా….నేను తర్వాత వొస్తాను” అంటూ వెళ్ళిపోయింది వినూత్న.
ఇంకా చేసేది ఏమి లేక గ్లాస్ లో లిక్కర్ వెస్కొని మెల్లిగా సిప్ చేస్తున్నాను. అసలు నన్ను ఎందుకు పిలిచింది ఇక్కడికి ఎంత ఆలోచించిన అర్ధం కావడంలేదు.
అలా ఆలోచనలలో ఉండగానే “హాయ్….”అన్న పిలుపు వినపడగానే తలఎత్తి, stun అయ్యాను ఆమెను చూసి……
&%$#88888888888888
నోరెళ్లపెట్టి చూస్తున్న తనవైపు, “హలో….”అని మళ్ళి పిలిచేసరికి, ప్రస్తుతంలోకి వొచ్చి “హాయ్ ….”అన్నాను కొంచెం సిగ్గుపడుతూ. తాను రష్యన్ అనుకుంట, సుమారుగా 35 ఉండొచ్చు ఏజ్ , చూస్తూ ఉంటె చూడాలి అనిపించేంతటి అందగత్తె. అందులో మళ్ళి చీరకట్టులో ఉంది. అందుకే కాసేపు నోరెళ్ళబెట్టాను తనను చూసి. “can i sit ….” అంది తనను చూసి నాకు మతి పోయింది అని అర్ధం అయినట్టుగా ఉంది కొంచెం చిలిపిగా చూస్తూ. “ya ….with pleasure …..”అన్నాను polite గా.
“ఒంటరిగా కూర్చున్నారు….ఎవరు లేరా కంపెనీ…”అంది తాను కూర్చుంటూ. అంత స్పష్టంగా తెలుగు లో మాట్లాడేసరికి, ఇంకా stun అయ్యాను. నేను అలా ఆశ్చర్యపోతూ ఉంటె ఏమనుకుందో ఏమో చిరునవ్వుతో “నాకు తెలుగు స్పష్టంగా వొచ్చు….infact మీ కంటే కూడా స్పష్టంగా …”అలా తెలుగు లో స్పష్టంగా అనేసరికి, తెలుగు మాతృబాష అయ్యి ఉండి వొంకరగా మాట్లాడే hi -fi సొసైటీ మనుసులు గుర్తొచ్చి నవ్వు వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టుగా నా వైపు చూసింది. “సారీ….మీరు ఇలా ఇంత స్పష్టంగా తెలుగులో మాట్లాడేసరికి …..మా వాళ్లంతా గుర్తొచ్చారులే…..”అన్నాను నవ్వుతు. “ఎలా వుంది….పార్టీ…..ఎంజాయ్ చేస్తున్నావా…”అంది పక్కన ఉన్న గ్లాస్ లో విస్కీ పోసుకుంటూ. “నిజం చెప్పాలి అంటే బోరింగ్ గా వుంది….నాకు ఎవరు తెలియదు ఇక్కడ….”అన్నాను. “ఇప్పుడు నేను తెలుసు కదా….”అంది విస్కీ గ్లాస్ నా వైపు చీర్స్ అన్నట్టుగా చూపి, ఒక సిప్ చేసింది. అంత నాకు మాయ గా వుంది, ఈ పార్టీ కి రావడం, ఇలా ఈమె కలవడం ఇలా ఆలోచిస్తుంటే “ఏంటి నువ్వు ఎప్పుడు ఊహల్లో ఉంటావా…”అంది నా వైపు నవ్వుతు చూస్తూ. “నో..నో…ఐ అం వెరీ మచ్ ప్రాక్టికల్….అనుకోకుండా నేను ఇక్కడకి రావడం…ఈ పార్టీ…మీరు కలవడం…ఇవన్నీ గుర్తొచ్చి…..”అంటూ ఉండగానే, “ఎం చేస్తావు …నువ్వు….”అంది విస్కీ ఇంకో సిప్ చేసి. “నథింగ్ మచ్….ఎక్కువ కాళీ నే…”అన్నాను నేను కూడా తనకు మందులో కంపెనీ ఇస్తూ. నిజమా అన్నట్టుగా చూసింది నా వైపు. నేను నవ్వుతు ” స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను…”అన్నాను సెకండ్ రౌండ్ మందు ఫిక్స్ చేస్తూ ఇద్దరికి. థాంక్స్ అన్నట్టుగా నా వైపు చూసి, ఒక సిప్ చేసి “నేనెవరో నీకు తెలుసా…..”అంది నా వైపు చూసి. “ఏముంది….మీరు నాలాంటి గెస్ట్ నే అయి ఉంటారు…..అవును మీరూ ఒంటరిగానే వొచ్చారా …..”అన్నాను. తాను నవ్వి “జంటగానే…..”అంది ఇంకో సిప్ మెల్లి గా తీసుకుంటూ. “పార్టీ ఎలా వుంది…..”అంది. “when money speaks ……ఇలాగె ఉంటుంది పార్టీ….”అన్నాను నేను కూడా మందు సిప్ చేస్తూ. ఇంకో సిప్ చేసి “ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నాకు తెలుసు….”అంది, నేను అర్ధం కానట్టుగా చూసాను నా కెందుకు చెప్తుందో.
“చూడబోతే నీకు ఇలాంటి పార్టీస్ కొత్తలా ఉంది….”అంది నన్ను observe చేస్తూ. నేను మెల్లిగ నవ్వి “పార్టీస్ కొత్త ఏమి కాదు…బట్ ఇలా ఒంటరిగా ఉండడం ఫ్రెండ్స్ ఎవరు లేకుండా, కొత్తగా అనిపిస్తుంది…..”అన్నాను ఒక సిప్ చేసి నిట్టూర్చుతూ. “ఐతే నువ్వు నన్ను ఫ్రెండ్ గా accept చేయడం లేదు అన్నమాట…..”అంది గ్లాస్ లో మిగిలిన విస్కీ మొత్తం ఒకేసారి గొంతులో పోసుకొని. అలా స్ట్రెయిట్ గా అనే సరికి ఏమనాలో అర్థంకాలేదు ఇమ్మీడియేటగా.