రెండు గంటల ముందు…
“అక్షరా, జస్వంత్ ఇక్కడికి వచ్చినప్పుడు, యుద్ధం అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదో చెప్పి అతని బుర్ర తినాలని ప్రయత్నించకు. అతను ఇప్పటికే రెండుసార్లు కాశ్మీరులో దాదాపు యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కున్నాడు. నువ్వు యుద్దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అతనికి ఇష్టం ఉండదని నేను అనుకుంటున్నాను.”
నా అన్నయ్య మహేష్ మళ్లీ నన్ను చిన్న పిల్లలాగా అనుకుని, చిన్న పిల్లని మందలించినట్లు మాట్లాడుతున్నాడు. అది నాకు చిరాకుగా ఉంది, కానీ నాకు అది అలవాటైపోయింది. అతని కంటే ఎనిమిది సంవత్సరాలు చిన్నదానిని కావడం వల్ల, నా జీవితంలో ఎక్కువ భాగం ఉపన్యాసాలు వినడం, చిన్న పిల్లలాగా చూడబడటం జరిగింది. కొన్నిసార్లు చిన్న చెల్లెల్ని కావడం బాధగా అనిపించేది.
“సరే, అన్నయ్యా, నీ క్లోజ్ సైనిక స్నేహితుడితో నేను అలాంటి టాపిక్ మాట్లాడనులే” అని నేను వ్యంగ్యంగా అన్నాను.
మహేష్ ఇంకా జస్వంత్ నాకు వూహ తెలిసిన దగ్గరనుండి మంచి స్నేహితులు. నేను యవ్వనం లోకి అడుగుపెడుతున్నప్పుడు జస్వంత్ మీద ఒక రకమైన ప్రేమని, ఇష్టాన్ని ఏర్పరుచుకున్నాను, అయితే నేను అతన్ని చాలా సంవత్సరాలుగా చూడలేదు. వాస్తవానికి, అతను ఇంకా నా అన్నయ్య కాలేజీ పూర్తి చేసిన తర్వాత అతను సైన్యంలో చేరడానికి వెళ్లేముందు చివరిసారిగా నేను అతనిని చూశాను.
మా అమ్మానాన్నలు అతనికి వీడ్కోలు చెప్పేటప్పుడు పార్టీ ఇచ్చారు. దాని గురించి నాకు ఎక్కువగా గుర్తులేదు, ఎందుకంటే నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, అయితే అతను వెళ్ళిపోయాక మా అమ్మానాన్నలు ఇంకా మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారని నాకు గుర్తుంది. అతను యుద్ధం నుండి తిరిగి రాడనుకుని వాళ్ళు భయపడ్డారు, నేను విన్న దాన్నిబట్టి , దాదాపు అదే నిజమైంది.
మహేష్ చెప్పినదాన్ని బట్టి, జస్వంత్ యుద్ధంలో అనేక ప్రమాదాల బారి నుండి తప్పించుకున్నాడని నాకు తెలిసింది. అయితే, నేను దానినంతా “పెద్ద కట్టుకథలా” కొట్టిపారేశాను. జస్వంత్ కి గొప్పలు చెప్పుకునే అలవాటు ఉందని నాకు కొంచెం గుర్తుంది, అందుకే అతను మహేష్ కి అబద్ధాలు చెబుతున్నాడని, అతడిముందు తన హీరోయిజం చూపిస్తున్నాడని నేను అనుకున్నాను.
అయినాసరే, జస్వంత్ లో కొన్ని చెడ్డ విషయాలు వున్నా, అతను మళ్లీ ఇంటికి వస్తున్నాడని తెలిసి నాకు సంతోషం కలిగింది. నాకు యుద్ధం అన్నా, సైనికులన్నా మంచి అభిప్రాయం లేదు, అయినా అతనితో మాట్లాడటం చాలా బాగుంటుందని నేను అనుకున్నాను.
“జస్వంత్ ఎప్పుడు వస్తున్నావని చెప్పావు ?” అని ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా ఉన్న మహేష్ ని నేను అడిగాను.
మహేష్ నిట్టూర్చి తల ఊపాడు, అతనికి విసుగు తెప్పించానని అర్ధమైంది.
“నేను నీకు ఇంతకుముందే చెప్పాను, అతను ఇంకొక గంటలో ఇక్కడ ఉంటాడు, ఇప్పుడు నాకు ఇంటి పనిలో సహాయం చెయ్యి” అని చెప్పాడు.
వెర్రి వెధవ…
నేను కళ్ళు తిప్పుకుని లివింగ్ రూమ్ శుభ్రం చేయడం మొదలు పెట్టాను. మొదట కాఫీ టేబుల్ మీద నాన్నగారి మ్యాగజైన్లను సర్దాను, తర్వాత వాక్యూమ్ క్లీనర్ ని తీసుకున్నాను. దాన్ని ప్లగ్ లో పెడుతూ, మహేష్ తో చిన్నగా మాటలు కలిపాను.
“జస్వంత్ చెప్పే యుద్ధ విషయాలన్నీ బహుశా అబద్ధాలే అనుకుంటా. నువ్వు తనని మెచ్చుకుంటావని అలా చెబుతున్నాడు, అది నీకు అర్ధమవుతుందా ?” అని నేను అన్నాను.
మహేష్ కోపంగా నా వైపు చూశాడు.
“నోరు మూసుకో, అక్షరా, నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. నీకు అమ్మానాన్నలు అన్నీ సమకూర్చి గారాబంగా పెంచారు. అయినా 18 ఏళ్ల చిన్న పిల్లవి, యుద్ధం గురించి నీకు ఏమి తెలుస్తుంది, అసలు జీవితంలో దేని గురించైనా నీకేం తెలుస్తుంది ?” అని అతను అరిచాడు.
నేను కూడా కోపంగా అతని వైపు చూశాను. తర్వాత అతను ఇంకేమీ మాట్లాడకుండా చేయడానికి వాక్యూమ్ ఆన్ చేశాను.
ఎంత దుర్మార్గుడు…
మహేష్ ఎప్పుడూ నన్ను ఒక తెలివితక్కువ పిల్లలాగే చూసేవాడు. అతను అనుకున్నదానికంటే జీవితం గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు. అతను నాకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి, అతనికి నిజంగా అంత జీవిత అనుభవం ఉందని కాదు. అతను ఒక ఆఫీస్ సప్లై స్టోర్లో పనిచేశాడుల. అక్కడ పనిచేయడం వల్ల అతనికి జీవితం గురించి ఎంత తెలుస్తుంది ?
“ఏమి జరిగినా…” అని నేను గుసగుసలాడాను.
తర్వాత నా వాక్యూమింగ్ మొదలుపెట్టాను.
“జస్వంత్ రాజు గారిని సంతోషపెట్టడానికి నేను ఇంటిని శుభ్రం చేయాలి,” అని వాక్యూమ్ శబ్దంలో నాలో నేను నవ్వుకున్నాను.
జస్వంత్ రావడానికి కేవలం ఒక గంట మాత్రమే ఉంది, మా అమ్మానాన్నలు సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వస్తారు. మాకు చాలా పని ఉంది.
***
