థర్డ్ MISSION 5 33

అలా చిటికె వేశానో లేదో ఒక వ్యక్తి లోపలికివచ్చి సూట్ కేస్ ఇచ్చి వెళ్ళిపోయాడు .
కానిస్టేబుల్స్ భయపడిపోయి సర్ సర్ అంటూ లోపలికివెళ్లారు .
కానిస్టేబుల్స్ జరిగినదంతా వివరించినట్లు , CI అనుకుంటాను వచ్చి పిల్లాడితో మాటలేంటి బయటకు తోసేయ్యండి అంటూ లాఠీ అందుకున్నాడు .
విశ్వ సర్ : ప్రూఫ్స్ ఉన్నాయట సర్ …..
CI : ఆఫ్ట్రాల్ SI వి నీస్థాయిలో నువ్వు ఉండు .
విశ్వ సర్ : నన్ను నమ్మినట్లు , నాస్థాయి నిజాయితీ దానిని నమ్ముకునే ఇక్కడిదాకా చేరుకున్నాను .
విశ్వ సర్ కు సెల్యూట్ చేసి , సూట్ కేస్ లోనుండి ఫైల్ మరియు పెన్ డ్రైవ్ ఇచ్చాను .
పెన్ డ్రైవ్ తీసుకెళ్లి గోడకు ఉన్న టీవీ కి కనెక్ట్ చేశారు , మోసం చేసిన పార్ట్నర్స్ – CI తోపాటు సేట్ …… ముగ్గురూ కలిసి ఎలా తప్పుడు కేసులలో ఇరికించాలో మాట్లాడుకుంటున్నారు .
స్టేషన్ మొత్తం షాక్ లో చూస్తున్నారు .

CI కోపంతో టీవీ లాగెయ్యబోతే …….
CI సర్ …… టీవీకి ఏమైనా అయ్యిందో మరుక్షణంలో మీడియా మొత్తం ఇక్కడ ఉంటుంది .
అంతే గప్ చుప్ గా అక్కడే ఆగిపోయాడు .
విశ్వ సర్ : CI గారూ ….. ఏంటో స్థాయి అన్నారు , మీస్థాయి ఏమిటో అందరూ చూస్తున్నారు .
కొట్టడానికి లాఠీ ఎత్తిన CI మరియు కానిస్టేబుల్స్ …… కాళ్ళ బేరానికి వచ్చారు .
నాకు కాదు అంకుల్ వాళ్లకు క్షమాపణ చెప్పి వెంటనే ఆ వీడియో లో ఉన్నవారందరినీ పిలిపించి అంకుల్ వాళ్లకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వండి .
CI సైగచెయ్యడంతో కానిస్టేబుల్స్ పరుగులుతీశారు .
కానిస్టేబుల్స్ ….. నేను ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను ఆలస్యం కాకూడదు .
కానిస్టేబుల్స్ : ఏమాత్రం ఆలస్యం కాదు బాబూ ….. , ప్రక్కనే ఉన్న హోటల్లో జల్సాగా గడుపుతున్నారు లాక్కోస్తాము .
CI …… అంకుల్ వాళ్ళ దగ్గరికివెళ్లి క్షమాపణలు చెప్పి స్వయంగా కుర్చీలు వేసి కూర్చోమన్నారు .
అంకుల్స్ దర్జాగా కూర్చోండి .
అలా చూస్తుండిపోయారు అంకుల్స్ ……

కానిస్టేబుల్స్ 10 నిమిషాలలో లాక్కొచ్చారు .
కానిస్టేబుల్స్ చెప్పినది నిజమే అన్నమాట బాత్ సూట్ లో ఉన్నారంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు , అంకుల్ వాళ్ళను మోసం చేశారుకదా ఇకనుండీ చిప్పకూడు తిందురుగానీ …… , అవును పార్ట్నర్స్ మోసం చేస్తే మా అంకుల్ వాళ్ళ కష్ట ఫలితాన్ని పొందుతారు కానీ నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు సేట్ ….. , చెప్పవా …… ఏంటి CI గారూ సైలెంట్ గా నిలబడిపోయారు .
CI ….. కానిస్టేబుల్స్ వైపు సైగచేశారు .
నో నో నో మీరే స్వయంగా శిక్షించాలి .
CI లాఠీ అందుకుని రెండు దెబ్బలు వేశాడో లేదో తట్టుకోలేక చెబుతాను చెబుతాను అన్నాడు .
సేట్ : వారి ఇంటి ఆస్తి విలువ ఒక్కసారిగా పదింతలు అయ్యింది , ఆ ఇళ్లను కూల్చి మాల్ నిర్మించడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను .
ఏమిటీ నాదేవతలు – అక్కయ్యలు ఉంటున్న ఇల్లు దేవాలయంతో సమానం – ఆ దేవాలయాన్నే కూల్చాలనుకున్నారా అంటూ CI చేతిలోని లాఠీ అందుకుని కోపం తగ్గేవరకూ కొట్టాను , మరి నగలు ……
సేట్ : దెబ్బలకు కేకలతో చిందులువేస్తూనే నేను తాకట్టు పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ మూడింతలు పెరిగింది .
ఆ నగలు జాగ్రత్తగా ఉన్నాయికదా …… , అమ్మేసాను అన్నావో నువ్వు చచ్చావే .
సేట్ : లేదు లేదు నా లాకార్లో జాగ్రత్తగా ఉన్నాయి .
హమ్మయ్యా …… అంటూ సంతోషంగా గుండెలపై చేతినివేసుకున్నాను .
సేట్ : లాభాల్లో 50% CI గారే తీసుకున్నారు , మమ్మల్ని మాత్రమే శిక్షించడం అదికూడా CI తోనే , సగం తప్పు అతడితే బాబూ ……
CI గారూ తప్పుకదా , విశ్వ సర్ ఏమిచేద్దాము .
విశ్వ సర్ : నిన్ను చూస్తుంటే నాకే షాకింగ్ గా ఉంది , నీ ఇష్టం బాబూ …..
విశ్వ సర్ …… నా పేరు మహేష్ .
విశ్వ సర్ : రియల్ హీరో అన్నమాట …..

సేట్ – పార్టనర్స్ …… మీ మాటల్లో న్యాయం ఉంది అదిగో అక్కడ లాఠీలు ఉన్నాయి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు .
దెబ్బల నొప్పి రుచిచూసినట్లు తిక్కరేగి లాఠీలు అందుకుని CI తోపాటు సహాయం చేసిన కానిస్టేబుళ్లకు లాఠీ దెబ్బల రుచి చూయించారు .
అంకుల్ వాళ్ళ పెదాలపై నవ్వులు ……

అలసిపోయి ఆగిపోయారు .
CI సర్ ….. మీడియాను …..
CI : బాబూ బాబూ వద్దు వద్దు అంటూ వేడుకుంటున్నారు .
మీవలన మీ భార్యాబిడ్డలు అవమానం చెందడం నాకిష్టం లేదు – మరొక్కసారి ఇలా జరిగితే ఊరుకోను – ఇప్పటివరకూ మీరు మోసం చేసిన వారందరికీ క్షమాపణ చెప్పి న్యాయం చెయ్యాలి , నిజాయితీగా ఉండే విశ్వ సర్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి .
CI : తప్పకుండా బాబూ ……
పార్ట్నర్స్ ……. అంకుల్ వాళ్ళు ఈరోజు బెంగళూరులో ఏదైతే వారి కష్టానికి ప్రతిఫలాన్ని పొందేవారో అది రేపు ఉదయానికల్లా వారి చెంతకే చేరాలి , మీరు చేసిన మోసాన్ని అక్కడ తెలియజేసి వారి స్థాయిని వారికి ఇవ్వాలి , లేదంటే తెలుసుగా ……. మీ హిస్టరీ అంతా మాదగ్గర ఉంది .
పార్ట్నర్స్ : నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము బాబూ ….. అబ్బా అయ్యా నొప్పి .
ఇక సేట్ నువ్వు …… నీకు రావాల్సిన డబ్బు వడ్డీతోసహా నీ అకౌంట్ లోకి పడిపోయింది , ఏమిచెయ్యాలో తెలుసుకదా ……
సేట్ : రేపటి లోపు ఆస్తిపత్రాలు – నగలు ……
రేపటి లోపు కాదు నిమిషాలలో ఇంటికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పి అందివ్వాలి .
సేట్ : నిమిషాలలో అంటే కుదరదు బాబూ …… బ్యాంకు లాకార్లో ఉన్నాయి అందుకే ….
సరే వీలైనంత తొందరగా ఈరోజే , నీ చేతులు తాకి మలినం అయి ఉంటాయి కాబట్టి కొత్త నగలలా క్లీన్ చేసి జ్యూవెలరీ బాక్సస్ లో ఉంచి తీసుకురావాలి .
సేట్ : తప్పకుండా తప్పకుండా బాబూ …..
ఇంకా ఇక్కడే ఉన్నారే , మరొక కోటింగ్ ఏమైనా కావాలా …… ? .
PT ఉషలా బయటకు పరుగులుతీశారు దెబ్బలను రుద్దుకుంటూ …….

అంకుల్ వాళ్లకు వారి లగేజీ – మొబైల్ – పర్సులను ఇచ్చారు సెక్యూరిటీ ఆఫీసర్లు , మీపై ఎటువంటి కేసులూ లేవు మీరు వెళ్ళవచ్చు అనిచెప్పారు .
అంకుల్ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు …… , ముగ్గురూ నాదగ్గరకు చేరుకుని బాబూ …… నువ్వు ఎవరోకూడా తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చి పెద్ద గండం నుండి కాపాడావు – మా కుటుంబాల గురించి ఆలోచిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి – మాకోసం వారు అన్నీ వదులుకున్నారు – మాతప్పు కూడా ఉంది కుటుంబం గురించి పట్టించుకోకుండా బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం మొత్తం ఇలా తిరుగుతూనే వాళ్ళనూ బాధపెట్టాము – మా బిజినెస్ ఆశల వలన వాళ్లకు చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసాము – ఇక జైలు పాలయ్యాము అని తెలిస్తే ……. , ఇదిగో ఉదయం నుండీ చాలాసార్లు కాల్స్ చేశారు .
నో నో నో అంకుల్స్ ఈ విషయం ఎప్పటికీ అంటీ వాళ్లకు తెలియకూడదు – వాళ్ళు బాధపడితే అక్కయ్యలు ( నేను ) తట్టుకోలేను , అనాధగా ఉన్న నాకు అంటీ వాళ్లే కదా కుటుంబం ఉందనేలా చేశారు .
అంకుల్స్ : మా బిడ్డలు కూడా తెలుసా ….. ? .
తెలుసా అంటారు ఏంటి అంకుల్స్ …… అక్కయ్యలే కదా రోజూ కాలేజ్ వరకూ వదిలేది , ( నాకు …… అంటీలు అంటే ఎంతప్రాణమో – అక్కయ్యలకు ….. నేనంటే అంత ఇష్టం అంటూ నవ్వుకున్నాను ) .
అంకుల్స్ : సంతోషించి , నీ ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియదు బాబూ …….
అదిగో మళ్లీ …… , నేనే ….. అంటీవాళ్లకు ఋణపడిపోయాను , మీరు మాత్రం ఈ విషయం అంటీ వాళ్లకు తెలియనివ్వకూడదు , ఎవరికి కాల్ చేస్తున్నారు ? అంటీ వాళ్లకేనా ……. నో నో నో సరే సరే చెయ్యండి కానీ బెంగళూరు నుండి మాట్లాడుతున్నట్లు మాట్లాడండి , ఈ బాధపెట్టే విషయం అంటీ వాళ్లకు ఎప్పటికీ తెలియకూడదు అంటే – నారుణం తీర్చుకోవాలి అంటే మీరు వెంటనే బెంగళూరుకువెళ్లి మీ బిజినెస్ స్టార్టప్ ప్రయత్నాలు మొదలుపెట్టండి – బయట కారు రెడీగా ఉంది కారులో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్లైట్ కు బెంగళూరు వెళ్లిపోండి .
అంకుల్స్ : మళ్లీ మాగురించే ఆలోచిస్తున్నావు నిజంగా మాకోసం వచ్చిన దేవుడివి బాబూ ….. , దాదాపు కోటికిపైగా అప్పు చేసాము …..
తీర్చేసాము అంకుల్స్ ……
అంకుల్స్ : ఇప్పట్లో తిరిగి ఇవ్వగలమో లేదో మళ్లీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ …….
బిజినెస్ స్టార్టప్ సక్సస్ అయ్యింది కదా అంకుల్స్ తీర్చడం ఎంతసేపు …..
అంకుల్స్ : ఖచ్చితంగా ఖచ్చితంగా బాబూ ….. ప్రతీ రూపాయీ తీర్చేస్తాము .
మళ్లీ ఆ టెన్షన్ పెట్టుకోకండి – మీ ఆరోగ్యాలు జాగ్రత్త ……
అంకుల్స్ : బాబూ బాబూ బాబూ …… అంటూ రెండుచేతులూ జోడించారు .
అంకుల్స్ ఆపండి ఆపండి , మిమ్మల్ని వైజాగ్ లో ఎవరైనా గమనించకముందే వెళ్లిపోవాలి , అంటీ వాళ్ళ గురించి ఏమీ కంగారుపడకండి , ఎదురింటిలోనే నేనుంటాను .
అంకుల్స్ : దేవుడే తోడు ఉన్నాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసి లగేజీ అందుకున్నారు .
అంకుల్స్ …… వస్తున్నప్పుడు చూసాను దగ్గరలోనే క్లినిక్ ఉంది ట్రీట్మెంట్ తీసుకుని బయలుదేరండి , అంటీ వాళ్లకు విషయం తెలియకూడదు మరొక ముఖ్య విషయం దెబ్బలు మానిపోయేంతవరకూ వీడియో కాల్ మాత్రం చేయకండి .
అంకుల్స్ : మా కుటుంబాలు అంటే అంత ఇష్టమా మహేష్ …..
ఇష్టం అన్నది చాలా చాలా చాలా చిన్నది అంకుల్స్ …… అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , వారి సంతోషం కోసం ఏమైనా చేస్తాను ఎంతదూరం అయినా వెళతాను , హ్యాపీ జర్నీ అంకుల్స్ ……
అంకుల్స్ : థాంక్యూ మహేష్ అనిచెప్పి సంతోషంగా బయలుదేరారు .

విశ్వ సర్ వైపుకు తిరిగి సెల్యూట్ చేసాను .
విశ్వ సర్ : నో నో నో ….. నేనే నీకు సెల్యూట్ చెయ్యాలి మహేష్ , CI గారినే గడగడలాడించావు , ఇంతవరకూ షాక్ లో ఉన్నానంటే నమ్ము , ఇంతచిన్న వయసులో ….. నీ ధైర్యం నీ కాన్ఫిడెన్స్ …… సెల్యూట్ మహేష్ .
సర్ సర్ ….. నన్ను నమ్మి నాప్రక్కన నిలబడ్డారు , మీలాంటి సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నంతకాలం న్యాయం ధర్మం బ్రతికే ఉంటాయి .
విశ్వ సర్ : నా డ్యూటీ నేను చేసాను , నువ్వు ఉన్నావుకాబట్టి చెయ్యగలిగాను లేకపోతే తప్పుడు కేసులు పెట్టారని తెలిసినా ఏమీచెయ్యలేకపోయేవాడిని ……
సంతోషించాను , సర్ ….. అతి ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను got to go …….
విశ్వ సర్ : మహేష్ ….. ఎలాగైనా మళ్లీ కలుస్తాను , వెళ్లు వెళ్లు ……
సర్ కు బై చెప్పేసి పరుగునవెళ్లి కారులో కూర్చుని , సిస్టర్ 2:30 త్వరగా పోనివ్వండి పోనివ్వండి .

ట్రాఫిక్ దాటుకుని ఇంటికి చేరుకునేసరికి అర గంట పట్టింది , అంటీ ఇంటిముందు రోడ్డుపై పెద్దమొత్తంలో జనాలు గుమికూడి ఉండటం – JCB లు కూడా ఉండటం చూసి , సిస్టర్ సిస్టర్ స్టాప్ స్టాప్ అంటూ ఆగకముందే డోర్ తీసుకుని దిగి పరుగునవెళ్ళాను .
జనాలను దాటుకునివెళ్ళిచూస్తే ఇంట్లోని సామానులన్నీ బయటపడేశారు – JCB ఏక్షణమైనా కాంపౌండ్ గోడను కూల్చడానికి రెడీగా ఉంది .
అంటీ అంటీలు అంటీలు ఎక్కడ అని చుట్టూ చూస్తే , మెయిన్ డోర్ దగ్గర లేడీ కానిస్టేబుళ్లు …… మేడమ్ మేడమ్ డోర్ తెరిచి బయటకు రండి లేకపోతే మీరు ఉండగానే కూల్చేస్తారు .
సరిగ్గా చెప్పారు కానిస్టేబుల్స్ …. , ప్రజలారా …… మాతప్పేమీ లేదు – ఈ ఇంటి యజమానులు అడ్వాన్స్ తీసుకుని మా పేరున రాశారు – కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ బిల్డింగ్ కూల్చివేసి మాల్ నిర్మించబోతున్నాము , మీరే చూశారుకదా ఇంతవరకూ ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాము , ఇక wait చేయలేము , కానిస్టేబుల్స్ ….. డోర్ బద్ధలుకొట్టి బయటకు లాగేయ్యండి రాకపోతే వాళ్ళుండగానే కూల్చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ JCB వైపు సైగచేశాడు .

అంటీ వాళ్ళ గురించి అలా మాట్లాడగానే కోపం కట్టలు తెంచుకుంది – అంటీలు ఉండగానే కూల్చేస్తావా అంటూ వాడిని అక్కడికక్కడే పాతేయాలని అనిపించినా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను , JCB కు అడ్డంగా వెళ్లి ఆపమని సైగచేసాను .
ఆపకుండా నామీదకు దూసుకురావడంతో రాయి అందుకుని JCB అద్దం పగిలేలా విసిరాను – జేసీబీ ఆగింది .
ఇంతమంది ఊరికే నిలబడి చూస్తుంటే నువ్వేవాడివిరా బచ్చా అంటూ ఒకడు వచ్చి కాలర్ పట్టుకున్నాడు .
ఈ సామానులు బయటపారేసింది ……
మేమే …… , మామూలుగా అయితే డ్యామేజ్ కాకుండా బయట ఉంచాలి కానీ కావాలనే సామానులన్నింటినీ పైనుండి విసిరేసాము అంటూ నవ్వుకుంటున్నారు .
ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేదు , జై పెద్దమ్మ అంటూ నా షర్ట్ పై ఉన్న చేతిని పట్టి తిప్పేసి నొప్పితో కేకలువేస్తున్న వాడి చేతిని విరిచేసాను – ఇవే చేతులతో కదా సామానులు పగిలిపోయేలా విసిరినది .
వాడి అరుపులకు అక్కడున్నవాళ్ళంతా బెదిరిపోయారు .

చూస్తారే ఆ బచ్చా గాడిని కొట్టి ఈడ్చి పడేయ్యండి .
చెరొకవైపునుండి ఇద్దరు వచ్చారు – ఆగండి ఆగండి మిమ్మల్ని కొట్టడం చాలా అంటే చాలా ఈజీ – బచ్చా గాడే అనుకున్నారో మీకంటే దున్నపోతులా ఉన్నవాడి ఒకచేతిని మాత్రమే విరిచేసాను మీరెండు చేతులూ విరిచేస్తాను మీఇష్టం ……
చెయ్యి విరిగినవాడు నొప్పితో విలవిలలాడిపోతూనే వచ్చి వద్దురా వద్దురా అంటూ ఇద్దరినీ ఆపాడు .
రేయ్ బచ్చాగాడికి భయపడుతారేంటి ……
ఎప్పుడూ పనివాళ్లే దెబ్బలు తినాలా ….. ఈసారికి నువ్వు వచ్చెయ్యి ……
అంత పోటుగాడివా ….. ? .
పోటుగాడే సర్ అంటూ చెయ్యి విరిగినవాడు చెప్పాడు .
మనగురించి మనం కాకుండా వేరేవాడు భయపడుతూ చెబితే కలిగే కిక్కే వేరబ్బా ……. నవ్వుకున్నాను .
ఏంటి బెదిరిస్తున్నావా …… ? , ఈ ఇల్లు ……. నాది నాకు రాసిచ్చారు – కోర్ట్ కూడా కూల్చడానికి అనుమతి ఇచ్చింది – చూశావుకదా స్వయంగా సెక్యూరిటీ ఆఫీసర్లే వచ్చారు .
ఏదీ చూయించు ……
ఏమి చూయించాలి ? .
రాసిచ్చిన పత్రాలు మరియు కోర్ట్ ఆర్డర్ …….
అవీ అవీ అంటూ నసుగుతున్నాడు , నావెనుక రౌడీలే కాదు CI ఉన్నాడు , ఒక్క కాల్ చేశానంటే ……
చెయ్యి చూస్తాను ……
ఒక్క కాల్ తో పిల్లల జైల్లో పడతావు అంటూ మొబైల్ తీసి కాల్ చేసాడు .

అవసరం లేదు ఇక్కడే ఉన్నాను అంటూ ఏకంగా సేట్ తోపాటు వచ్చాడు CI …..
సర్ సర్ చూడండి మనకే అడ్డువస్తున్నాడు .
CI : మనకు ఏంటి మనకు అంటూ చెంప చెల్లుమనిపించాడు , మేము న్యాయం వైపు అంటూ నా వెనుకకు చేరారు , సేట్ ఈ విషయం కాల్ చేసి చెప్పగానే పరుగున విచ్చేసాము బాబూ …… , నువ్వు అన్నట్లుగా నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే నేనెంత పెద్ద తప్పుచేసానో తెలిసొచ్చింది , నావలన వారు …… తలుచుకుంటేనే భయం వేసింది నన్ను మన్నించు బాబూ , కానిస్టేబుల్స్ వచ్చెయ్యండి అంటూ పిలిచాడు .
సేట్ ….. అడ్వాన్స్ తీసుకున్నావు కదా …..
సేట్ : వడ్డీతోసహా అడ్వాన్స్ అమౌంట్ ను కొద్దిసేపు ముందే నీ అకౌంట్ లోకి వేసేసాను , ఈ బిల్డింగ్ ఎప్పటికీ నీకు దక్కదు ఇక వెళ్లిపో , బాబూ ….. ఆస్తిపత్రాలు .
మరి నగలు …… ? .
సేట్ : నా బెస్ట్ వర్కర్స్ చేత కొత్తగా మారిపోతున్నాయి బాబూ – క్లీనింగ్ పూర్తవగానే నేనే స్వయంగా తీసుకొస్తాను – ఈ విషయం గుర్తుకురాగానే సర్ ను వెంటబెట్టుకుని వచ్చేసాను .
మంచిది సేట్ జీ ……