ముందైతే మహేష్ కు – తమ్ముడికి వడ్డించండి అంటూ ఒకేసారి అని నవ్వుకున్నారు బుజ్జిజానకి – అక్కయ్యలు …….
తప్పకుండా తల్లులూ ….. , మాబుజ్జిజానకి కోరడమూ మేము కాదనడమూనా రండి మరి బయట కారులో ఉన్న ఆ బుజ్జిహీరోకు మీరే స్వయంగా తీసుకెళ్లండి అంటూ అన్నం – పప్పు – వెజిటబుల్ కూర – ఊరగాయ – వడియాలు …… అంటూ ఐదుగురు దేవతలు వడ్డించి అందించారు .
లవ్ యు దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిజానకి – అక్కయ్యలు కారు దగ్గరకు చేరుకున్నారు .
తల్లులూ …. అక్కడే ఉండిపోతారేమో ఇచ్చి వచ్చెయ్యండి అంటూ నవ్వుకున్నారు .
కారులో చూస్తే లేను – ఎక్కడకు వెళ్ళాడు …… ? అంటూ చుట్టూ చూస్తున్నారు .
నాకోసమేనా బుజ్జిజానకీ …….
బుజ్జిజానకి : ఎక్కడికి వెళ్ళావు అంటూ దగ్గరికివచ్చి ఇష్టమైనకోపంతో కొడుతోంది .
ఇదిగో మా బుజ్జిజానకి మరియు తన దేవతలకు కూల్ డ్రింక్స్ తీసుకురావడం కోసం వెళ్ళాను అంటూ వెనుక దాచిన నాలుగు కూల్ డ్రింక్స్ బాటిల్స్ చూయించాను .
బుజ్జిజానకి : లవ్ …… థాంక్యూ సో మచ్ మహేష్ కొట్టాను sorry …..
నో నో నో …… మా బుజ్జిజానకి దెబ్బలుకూడా హాయిగా ఉంటాయని చెప్పానుకదా ……
బుజ్జిజానకి మురిసిపోతోంది .
అఅహ్హ్హ్ …… ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి అంటూ వెనకున్న అక్కయ్యల గురించి పట్టించుకోకుండా నాలుగింటినీ బుజ్జిజానకికే అందిస్తున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలకు ఇవ్వచ్చుకదా …..
అక్కయ్యలు : అవును మేమూ ఇక్కడే ఉన్నాము .
కూల్ తగ్గకముందే త్రాగాలి , వెళ్ళండి అదే అదే వెళ్లు లోపలికివెళ్లు నీ దేవతలతో కలిసి ఎంజాయ్ చెయ్యండి ….. చెయ్యి …..
అక్కయ్యలు : తమ్ముడూ నీకోసం భోజనం తీసుకొచ్చాము .
అవునా బుజ్జిజానకీ ….. , దేవతల చేతి వంట ఇవ్వుమరి కారులో కూర్చుని తృప్తిగా తింటాను .
అక్కయ్యలు : ఇదిగో తమ్ముడూ ……
అంతే తలదించుకుని చేతులుకట్టుకుని మౌనంగా ఉండిపోయాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు అంటే ఇష్టం కదా మహేష్ ……
అక్కయ్యలు : తమ్ముడికి కేవలం అమ్మలంటేనే ఇష్టం ప్రాణం – వాళ్ళ సంతోషమే మన సంతోషం అని సంతోషపెడతాడు , అయినా ఇందులో తమ్ముడి తప్పేమీ ఉండదు అమ్మలే ఏమో చేశారు వాళ్ళనే అడుగుతాము అయిపోయారు అమ్ములు …….
నో నో నో ……
అక్కయ్యలు : అమ్మలను ఒక్కమాట అంటే చాలు రోషం పొడుచుకువచ్చేస్తుంది అంత ప్రాణం అంటూ చేతులపై గిల్లేసారు , మాతో కనీసం మాట్లాడటం లేదు మాకెంత కోపం రావాలి …….
స్స్స్ స్స్స్ స్స్స్ అంతే మళ్లీ మౌనంగా ఉండిపోయాను .
బుజ్జిజానకి ముసిముసినవ్వులు నవ్వుతోంది .
బుజ్జిజానకీ వెళ్లు లోపల దేవతలు మీ ….. నీకోసం ఎదురుచూస్తుంటారు , నేను కారులో తింటానులే అంటూ బుజ్జిజానకి చేతితోనే అందుకుని వెళ్లు వెళ్లు ….. వెనక్కు తిరిగితిరిగి చూస్తున్న బుజ్జిజానకి వైపు నవ్వి – అక్కయ్యల చూపు నుండి తప్పించుకుని తిన్నాను .
వచ్చారా కూర్చోండి అంటూ బుజ్జిజానకి – అక్కయ్యలను డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి , వడ్డించుకుని మొదట బుజ్జిజానకికి అక్కయ్యలకు తినిపించారు .
బుజ్జిజానకి – అక్కయ్యలు : మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ….. దేవతలంతా కలిసి వంటచేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట అంటూ ఆస్వాధిస్తున్నారు .
మెసేజ్ సౌండ్ ……
బుజ్జిజానకి చూసుకుని , దేవతలూ …… మహేష్ నుండి ” భోజనం అద్భుతం ” అని పంపాడు అంటూ లేచి దేవతలు – అమ్మమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చోబెట్టి , అక్కయ్యలూ రండి వడ్డీద్దాము ……
తల్లులూ ……
బుజ్జిజానకి – అక్కయ్యలు : ఈ అదృష్టాన్ని వధులుకుంటామా అంటూ వడ్డించి ముద్దులుపెట్టి కూర్చున్నారు .
దేవతలు : తల్లులు వడ్డించినందుకేమో …… అద్భుతం .
లవ్ యు దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ డిన్నర్ చేశారు .
ఏంటి అత్తయ్యగారూ …… రోజంతా ఇలా నవ్వుతూనే ఉంటారా లేక నాకేమైనా భోజనం పెట్టేది ఉందా అంటూ నిద్ర – తాగిన మత్తులో హాల్లోకి వచ్చాడు బుజ్జిజానకి నాన్న , అయినా వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్లు ఉండాలికానీ ఇలా భోజనాలు చేస్తూ ఉండిపోతారా ఎవరైనా …….
అమ్మమ్మ : బుజ్జిజానకిని ఆశీర్వదించడం కోసం వచ్చినవారిని ఏమైనా అంటే నేను ఊరుకోను అల్లుడూ …… , నీ భోజనం గదిలోకే వస్తుంది వెళ్ళండి .
తాతయ్య : నేను తీసుకెళతాను , పట్టించుకోకండి ……
అమ్మమ్మ : దేవతలూ ……
పెద్దమ్మ : అతడి గురించి ఒక్క పరిచయంలోనే తెలిసిపోయింది , అయ్యో బుజ్జిజానకీ …… మేము బాధపడితేనే కదా నువ్వు కళ్ళల్లో చెమ్మ తెచ్చుకోవాలి , మాలో ఎవ్వరైనా బాధపడినట్లు కనిపిస్తోందా ? అటూ ముద్దుచేశారు .
బుజ్జిజానకి : చూసి లేదు అంది .
అంటీలు : మరి ఎందుకా చెమ్మ ….. , మేము వచ్చినది మా కుందనపు బొమ్మైన బుజ్జితల్లికోసం , తను వెల్లమంటేనే వెళతాము .
బుజ్జిజానకి : నేనైతే అనను …..
పెద్దమ్మ : అయితే ఇక్కడే ఉండిపోవాలా ….. ? .
బుజ్జిజానకి : అవునవును దేవతమ్మా – దేవతలూ …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఇరువైపులా సోఫాలో కూర్చున్న అంటీల చేతులను పట్టేసుకుంది .
అంటీలు : మాకూ ఇక్కడే ఉండాలని ఉంది కానీ ఆచారాల ప్రకారం రేపటినుండి ఐదురోజులు అంటే ఫంక్షన్ వరకూ బంధువులు – ఇరుగుపొరుగువారి ఇంటి నుండి ప్రేమతో తీసుకొచ్చిన ఫుడ్ తినాలి కాబట్టి ఇప్పుడు ఇంటికివెలితేనేకదా రేపు ఉదయం మా బుజ్జితల్లికోసం ఒక్కొక్కరం ఒక్కొక్క టిఫిన్ చేసుకొచ్చి ఇలానే స్నానం చేయించి కుందనపు బొమ్మలా రెడీ చేసి మురిసిపోవాలి .
అమ్మమ్మ : నేనే ఆడిగేలోపు మీరే చెప్పారు దేవతలూ ……. , ఇక ఐదురోజులూ పండగే ……
అంటీలు : అది మా అదృష్టం అమ్మా …… , మీరు రావద్దని తోసేసినా వస్తాము అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
పెద్దమ్మ : అంతేమరి చక్కగా చెప్పారు దేవతలూ …… , అయితే ఇక వెళ్ళిరామా …… బుజ్జిజానకీ అంటూ గుండెలపైకి తీసుకున్నారు , మేము వెలితేనేకదా నువ్వు తొందరగా నిద్రపోవచ్చు నిద్రపోతేనేకదా నీ ఊహల్లోకి ….. , సిగ్గుపడకు నేను మాట్లాడేది అమ్మ గురించి ……
బుజ్జిజానకి : దేవతమ్మా…… అంటూ నడుముమడతపై గిల్లేసింది .
పెద్దమ్మ : స్స్స్ ….. నువ్వుకూడానా ? .
బుజ్జిజానకి : ఇంకెవరు దేవతమ్మా ……
పెద్దమ్మ : అదో పెద్ద కథలే మొదలుపెడితే రోజులైనా సరిపోవు , నీ ఊహాలలోకి నీకు ఇష్టమైన అమ్మ మరియు మహేష్ రావాలని దీవిస్తున్నాను , ఏమిచేసారో ఉదయం చెప్పాలి సరేనా అంటూ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి , మేడమ్ గుండెలపైకి చేర్చారు .
మేడమ్ : బుజ్జిజానకి బుగ్గలను అందుకుని , మీ అమ్మ ఎక్కడ ఉన్నా చాలా చాలా సంతోషిస్తూ ఉంటుంది .
బుజ్జిజానకి : అమ్మలేని లోటును తీర్చేశారు మీరంతా అంటూ అందరినీ పిలిచి ఆనందబాస్పాలతో చుట్టేసింది .
ఐదుగురు దేవతలు – అక్కయ్యలు …. ఒకేసారి ముద్దులుపెట్టడంతో అంతులేని ఆనందాలతో పరవశించిపోతోంది .
మేడమ్ : బుజ్జిజానకీ ….. మన ఈ సంతోషాలకు ముఖ్యమైన కారణం ……
అక్కయ్యలు : తమ్ముడనే కదా అదే అదే మీ స్టూడెంట్ అనేకదా చెప్పబోతున్నారు .
మేడమ్ : అవును తల్లులూ …… , మహేష్ వల్లనే ….. , కానీ తను మాత్రం బయటే ఉండిపోవాల్సివచ్చినది .
పెద్దమ్మ : రేపు ఇలా జరగకుండా చేసేస్తుందిలే మన బుజ్జిజానకి , ఏమంటావు బుజ్జిజానకీ …… ? .
బుజ్జిజానకి : రేపు చూస్తారుకదా దేవతలూ ….. అంటూ బయటివైపుకు ఆశతో చూస్తోంది .
అక్కయ్యలు : దేవతమ్మా ….. ఇందాక భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఉలుకూ పలుకూ లేదు తమ్ముడి నుండి , దేవతమ్మకు విన్నవించుకుంటుంటే మీరెందుకు కంగారుపడుతున్నారు అమ్మలూ ……
అంటీలు : తల్లులూ ఉదయమే రావాలంటే ఇప్పుడు తొందరగా వెళ్ళాలి పైగా ఇంటితాళాలు కానిస్టేబుల్స్ కు ఇచ్చాము .
అక్కయ్యలు : కానిస్టేబుల్స్ కు ఎందుకు అమ్మలూ ……
అంటీలు : కానిస్టేబుల్స్ కు అన్నామా లేదే లేదే , ఒకరినొకరు చూసుకుని ఆ ఆ …. సంక్రాంతి పండుగ రాబోతోంది ఇప్పుడేమో బుజ్జిజానకి ఫంక్షన్ కదా ఇంటిని చక్కగా సర్దుకోవాలికదా పనివాళ్ళు ఆ పనిమీద ఉన్నారు .
పెద్దమ్మ : తల్లులూ …… మళ్లీ కంగారుపడుతున్నారు .
అంటీలు : అక్కయ్యా …… ప్లీజ్ ప్లీజ్ కాస్త సహాయం చెయ్యొచ్చుకదా అంటూ కళ్ళతోనే బ్రతిమాలుకుంటున్నారు .
పెద్దమ్మ : ఏమిచెయ్యమంటారు మీకంటే నాకు బుజ్జిజానకి – తల్లులు అంటేనే ఇష్టం మరి ……
అంటీలు : తల్లులూ …… తాళాలు వదిలివచ్చాము , లోపలేమో మిగతా నగలు – మీ నగలు ఉన్నాయి .
అక్కయ్యలు : నగలు అంటే గుర్తుకువచ్చింది , మీ ఒంటిపై మన నగలు ఎలా ? .
అంటీలు : మన బుజ్జితల్లి వేళా విశేషం , సుమారు 3 గంటల సమయం అనుకుంటాను సేట్ స్వయంగా వచ్చి మీ నాన్నలు అప్పులన్నీ తీర్చేశారు అంటూ మన ఇంటి పత్రాలను మరియు నగలను తీసుకొచ్చి ఇచ్చేసాడు , తప్పుచేశానని క్షమాపణలు కూడా చెప్పాడు .
అక్కయ్యలు : నాన్నలతో నిన్ననే మాట్లాడాము , స్టార్టప్ సక్సెస్ అయ్యింది రెండు మూడేళ్ళలో మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నారు కానీ కొన్ని గంటల్లో ఎలా సాధ్యం అయ్యింది ? .
అంటీలు : మాకూ ఆ అనుమానం వచ్చింది తల్లులూ …… , ఏది ఏమైతే కానీ బుజ్జితల్లి వేళావిశేషం అంతా సంతోషమే అంటూ మొక్కుకున్నారు .
అక్కయ్యలు : ఇంటికివెళ్లాక నాన్నలకు కాల్ చేస్తాము , మాకైతే చెల్లితోనే ఉండాలని ఉంది కానీ ఇప్పుడే exams ఊడిపడ్డాయి .
బుజ్జిజానకి : ఇక్కడే ఉంటే మాత్రం ఏమాత్రం చదువుకోలేరు , మా అక్కయ్యల ప్రేమ ఎంతైనా సరిపోదు .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ అంటూ ఒకేసారి చుట్టూ హత్తుకుని ముద్దులుకురిపించారు , నువ్వు మళ్లీ కాలేజ్ మొదలుపెట్టాక ఇంటర్వెల్ లో – లంచ్ టైం లలో పండగే పండగ ……
బుజ్జిజానకి : అయ్యో …… ఐదురోజులు వేచిచూడాలా ? .
అందరూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
దేవతలు : వెళ్ళిరామా …… బుజ్జిజానకీ ……
అమ్మమ్మ : అంతలోనే కాదు దేవతలూ , దేవతల్లా వచ్చి దివ్యమైన ఆశీస్సులు ఇచ్చారు , పసుపు కుంకుమ ఇచ్చుకుని కాస్తయినా రుణం తీర్చుకొనివ్వండి , బుజ్జిజానకీ ….. నీదేవతలకు అందివ్వు అంటూ పళ్లెంలలో పట్టుచీర – జ్యూవెలరీ – పసుపు కుంకుమ అందించారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా అంటూ సైడ్ నుండి హత్తుకుంది .
అమ్మమ్మ : నాకుకాదు మహేష్ కు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : మహేష్ మహేష్ …… అంటూ ఆనందబాస్పాలతో అందుకుని , అంటీ – దేవతలు – దేవతమ్మ అంటూ అందించింది , అమ్మమ్మా ….. అక్కయ్యలకు ? .
అక్కయ్యలు : మాకు మా బుజ్జిజానకి ముద్దులు ……
అమ్మమ్మ : మీ అక్కయ్యలకు కూడానూ ……
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ( లవ్ యు సో మచ్ మహేష్ ) ముద్దులతోపాటు అంటూ డ్రెస్ – జ్యూవెలరీ అందించి ముద్దులుపెట్టి మురిసిపోతోంది .
అక్కయ్యలు : మనం వెళ్ళాక అంకుల్ ….. చెల్లి బాధపడేలా మాట్లాడితేనూ …..
పెద్దమ్మ : అలా జరగనే జరగదు మాయ చేసేసాను , ఉదయం లేచి వెళ్ళిపోతాడు మళ్లీ ఫంక్షన్ కు వస్తాడన్నాడుగా అలానే జరుగుతుంది .
అక్కయ్యలు : దేవతమ్మ చెబితే జరిగినట్లే అంటూ బుజ్జిజానకితోపాటు కారువరకూ చేరుకున్నారు .
బుజ్జిజానకి – దేవతల సంతోషాలను చూస్తుండిపోయాను .
అంటీలు : ఇంకా వెనుకే ఉన్నావే దిగితే కూర్చుంటాము .
లవ్ ….. sorry sorry అంటీలూ అంటూ కిందకుదిగాను .
బుజ్జిజానకి : మీరంటే ఎంత భక్తినో అత్తయ్యలూ ……
అంటీలు : భయం ……
అక్కయ్యలు : భయమా అమ్మలూ ….. , ఎవరు భయపడతారో ……
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ …….
బుజ్జిజానకి : అవును భయమే భయమే అత్తయ్యలూ అంటూ నవ్వుకుంటోంది , అత్తయ్యలూ ఎక్కండి అంటూ ఒక్కొక్కరి చేతిని అందుకుని ముద్దులుపెట్టి ఎక్కించింది , అక్కయ్యలూ ….. మీరెక్కడ కూర్చుంటారు ముందా వెనుకనా ? .
అక్కయ్యలు : ముందు తమ్ముడు – వెనుక మేము కదా తమ్ముడూ ……
అంతే చేతులుకట్టుకుని నిలబడిపోయాను .
అక్కయ్యలు : దేవతమ్మా ఇదిగో ఇలా ……
దేవతమ్మ : మళ్లీ నన్ను అడుగుతారే ……
అంటీలు : అక్కయ్యా ……
అక్కయ్యలు : ఎవరిని గట్టిగా అడిగితే తెలుస్తుందో అర్థం అయ్యింది అర్థం అయ్యింది , తమ్ముడూ ….. నువ్వు ముందు కూర్చో మేము అమ్మలపై కూర్చుంటాము , గుడ్ నైట్ చెల్లీ ఉదయం వచ్చేస్తాము అంటూ ముద్దులుపెట్టి ఎక్కారు .
పెద్దమ్మా ….. ఎక్కండి ? .
బుజ్జిజానకి : పెద్దమ్మనా ? ….. ఇప్పుడు గుర్తొచ్చింది ఎక్కడో ఎక్కడో చూసాను అని చార్ట్ చార్ట్ ….
మేడమ్ : పెద్దమ్మనా ….. ? .
పెద్దమ్మ వెంటనే ఇద్దరి భుజాలపై చేతులువెయ్యడంతో ……
మరిచిపోయినట్లు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పారు .
చూసావా ఎలా మాయచేసానో అంటూ నావైపు కన్నుకొట్టారు .
నవ్వుకుని , దేవతమ్మా ….. ముందు కూర్చోండి వెళదాము .
పెద్దమ్మ : ( నీతోపాటు వస్తే నలిపేస్తావని తెలుసు – నీ అసలు కర్తవ్యం అంటీలు …. ఎలానో అది ఆలోచించు ) .
అంతేనా పెద్దమ్మా …..
పెద్దమ్మ : ( విధిని మార్చలేను కన్నయ్యా ….. , నాకు మాత్రం నీతో గడపాలని లేదా ? , మళ్లీ ఆ క్షణం కోసం ఆశతోఎదురుచూస్తూ ఉంటాను ) .
బుజ్జిజానకి : ఏంటి ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడేస్తున్నారు ? .
పెద్దమ్మ : నీ సంతోషం కోసం ఇంకేమి సర్ప్రైజస్ ఇవ్వబోతున్నాడో తెలుస్తుందేమోనని నీ మహేష్ కళ్ళల్లోకే చూస్తున్నాను బుజ్జిజానకీ ….. , సరే అయితే వెళ్ళిరానా హాయిగా నిద్రపో నిద్రపోతేనే కదా ……
బుజ్జిజానకి : దేవతమ్మా ….. అంటూ సిగ్గుపడుతోంది .
పెద్దమ్మ : గుడ్ నైట్ అంటూ ముద్దుపెట్టి , ప్రక్కనే పార్క్ చేసిన కారులో వెళ్లిపోయారు .
