థర్డ్ MISSION 6 37

సో స్వీట్ ఆఫ్ యు అమ్మకూచీ …… , పైగా అమ్మ వచ్చి చూసేది రాత్రి కదా ….. , పడుకున్నాక అమ్మ వచ్చి బుజ్జిదేవకన్యలా అలంకరింపబడిన వారి అమ్మకూచీని ఇలాగనుక చూస్తే ఎంత మురిసిపోతారో ……. , అమ్మ సంతోషాలను కళ్లారా చూడాలని ఉంది ఊహించుకుంటేనే హాయిగా ఉంది .
బుజ్జిజానకి : లవ్ ….. థాంక్యూ థాంక్యూ మహేష్ గుర్తుచేసినందుకు , అమ్మ నిజంగా వస్తుంది అంటావా ? .
తప్పకుండా తప్పకుండా అమ్మకూచీ , వారి అమ్మకూచీని ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తారు – అంతులేని ఆనందానుభూతికి లోనౌతారు .
బుజ్జిజానకి : కళ్ళల్లో ఆనందబాస్పాలు …… ఉమ్మా అంటూ స్క్రీన్ పై గట్టిగా ముద్దుపెట్టారు .
అఅహ్హ్ ……. , అవును అమ్మకూచీ ….. వీడియో కాల్ చేసినప్పటి నుండీ ఎవరో మహేష్ మహేష్ …… అంటూ పిలుస్తున్నట్లు అనిపిస్తోంది , ఇక్కడో అక్కడో తెలియడం లేదు .
బుజ్జిజానకి : నవ్వులు …… , ఆనందబాస్పాలను తుడుచుకుని ఇక్కడే ఇక్కడే మహేష్ అంటూ స్క్రీన్ ను ప్రక్కకు చూయించారు .
అమ్మమ్మ …… నిద్రలో మహేష్ మహేష్ ….. అంటూ కలవరిస్తున్నారు , అమ్మకూచీ …….
బుజ్జిజానకి : అప్పుడు కళ్ళుమూసుకుని హృదయంపై చెయ్యివేసుకున్నప్పుడు ఎలా అయితే అమ్మకు ….. నాకంటే నువ్వంటే ఎలా ఎక్కువ ప్రాణం అయిపోయావో , ఈరోజుతో ముఖ్యంగా దేవతలకు పసుపు కుంకుమ సారె ఇప్పించావో ఆ క్షణం నుండీ నువ్వే ప్రాణం అయిపోయావు , నువ్వు గుర్తుచేసేంతవరకూ ఎలా ఎలా అంటూ కంగారు పడిపోయిందట తెలుసా ….. ? , అమ్మమ్మకు …… బుజ్జిదేవుడివి అయిపోయావు .
మరి అమ్మకు సంతోషం పంచడం కోసం మా అమ్మకూచీని ఆశీర్వదించడానికి వచ్చిన వారిని దేవతలుగా మార్చుకోవడం మన ధర్మం , అందుకేనా అమ్మమ్మా …. దేవతలకు గిఫ్ట్స్ లోపల ఉన్నాయి అనగానే ఒక్కసారిగా సంతోషపు ఆనందబాస్పాలు ……
బుజ్జిజానకి : అవును దేవుడా అవును ఉమ్మా అంటూ చప్పుడొచ్చేలా ముద్దుపెట్టి మురిసిపోతోంది .
ష్ ష్ ష్ ….. అమ్మమ్మ నిద్రపోతోంది , సరే అయితే తనివితీరా అందమైన అమ్మకూచీ బుజ్జి దేవకన్యను హృదయమంతా నింపుకున్నాను , ఇప్పటికే ఆలస్యం అయ్యింది ……
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ ప్చ్ ….. మరికాసేపు మరికాసేపు ……
కాసేపు ఏమిటి జీవితాంతం ఇలానే మాట్లాడుతూ మా అమ్మకూచీ సంతోషాలను చూస్తుండిపోవాలని ఆశగా ఉంది కానీ మా అమ్మకూచీ ఎంత త్వరగా నిద్రపోతే అంత త్వరగా అమ్మ వచ్చి ఆశీర్వధిస్తారు .
బుజ్జిజానకి : నువ్వు నిజంగా దేవుడివే మహేష్ …… , నీ ప్రతీ మాటతో అంతులేని ఆనందం …… , నిన్ను నేరుగా చూడటం కోసం ఉదయం వరకూ వేచిచూడాలి ప్చ్ ప్చ్ ప్చ్ ……
పెదాలపై తియ్యదనం …… , హాయిగా నిద్రపో అమ్మకూచీ ….. అమ్మ ఖచ్చితంగా వస్తుంది గుడ్ నైట్ ……
బుజ్జిజానకి : ప్చ్ …… ( లవ్ యు చెప్పొచ్చుకదా ) .
ఏంటి అమ్మకూచీ ……
బుజ్జిజానకి : ఇది మాత్రం వినిపించదు సరే గుడ్ నైట్ అంటూ నవ్వులతో కట్ చేసింది .
అఅహ్హ్ …… అంటూ ఆ నవ్వులు వెళ్లిపోకుండా కళ్ళు గట్టిగా మూసుకున్నాను .

( పెద్దమ్మా ….. అమ్మకూడానా ….. ? .
పెద్దమ్మ : నీ హృదయస్పందన దగ్గరకు వెళదాము అంటే మొదట నీదగ్గరకే నిన్నే చూడాలని లాక్కొచ్చింది .
థాంక్యూ థాంక్యూ అమ్మా ….. కానీ ప్లీజ్ ప్లీజ్ మీ ప్రాణం దగ్గరకువెళ్లి తనివితీరా చూసుకుని ఆశీర్వదించండి , అదే నాకూ సంతోషం ……
అమ్మ : నాకు తెలియదా మహేష్ …… , ఏ అమ్మాయికీ కలుగని అదృష్టాన్ని కలిగించావు , స్వయానా ఐదుగురు దేవతలచే స్నానం చేయింపబడి ఆశీర్వాదాలు అందించావు , ఆ సంతోషాలన్నీ నీవల్లనే ……
అలాగే కానివ్వండి నావల్లనే ….. , ముందైతే మీ బంగారుతల్లి దగ్గరకువెళ్లండి , ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది .
అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు …… , మహేష్ ….. ఇలా ప్రతీరోజూ భువిపైకి వచ్చేలా ఏ ఒక్కరికీ అవకాశం లేదు కానీ నీవల్లనే కేవలం నీవల్లనే ….. ఖచ్చితంగా వస్తారు అమ్మకూచీ అంటూ మన అమ్మకూచీకి మాటిచ్చావు కదా అందుకే నాకీ అదృష్టం అంటూ ఆనందబాస్పాలు …….
పెద్దమ్మ : అవును కన్నయ్యా …… , దేవలోకం నుండి అనుగ్రహం లభించింది అంటే నీవల్లనే ……
అవునా పెద్దమ్మా – అమ్మా ….. అయితే రోజూ రావచ్చన్నమాట , అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అమ్మకూచీకి అంటూ అంతులేని ఆనందం …… , అమ్మా ….. sorry sorry అమ్మకూచీ అన్నాను .
అమ్మ : నో నో నో …… లవ్స్ ఇట్ .
పెద్దమ్మ : అవును కన్నయ్యా …… , బుజ్జిజానకిని ….. అమ్మకూచీ అంటూ మొబైల్లో ఫస్ట్ టైం పిలిచినప్పుడే మీ అమ్మ పులకించిపోయారు , చాలా చాలా ఇష్టం ……
అమ్మ : నీ హృదయస్పందన ….. అమ్మకూచీనే కాదు మహేష్ కూచీ కూడానూ …..
అమ్మా అదీ అదీ …..
అమ్మ : లవ్స్ ఇట్ లవ్స్ ఇట్ …… , నీ ప్రతీ పిలుపుకూ అక్కడ అమ్మకూచి పొందిన ఆనందాన్ని చూస్తూ ఎంత హాయిగా అనిపించిందో తెలుసా …… , అన్ని సంతోషాలనూ ….. భద్రంగా దాచుకుంటున్నానులే అన్నింటికీ రుణం తీర్చుకుంటాను .
నో నో నో అమ్మా …… , మీ పెదాలపై ఈ ఆనందపు నవ్వులు చాలు – అంతకుమించి ఇంకేమి కావాలి ……
అమ్మ : నీకు లేకపోవచ్చు నాకు ఉంది అంటూ సిగ్గుపడుతున్నారు పెద్దమ్మ గుండెలపై …….
అమ్మా ….. సిగ్గుపడుతున్నారా ? , ముచ్చటేస్తోంది తెలుసా ….. ? , ఇలాగే వెళ్లి మీ అమ్మకూచీని ఆశీర్వదించండి .
అమ్మ : మన అమ్మకూచీ …… , నువ్వెలా అంటే అలా ….. ముందైతే మా దేవుడికి థాంక్స్ చెప్పుకోనివ్వు అంటూ నా బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
థాంక్యూ అమ్మా ….. , అమ్మ ముద్దు అమ్మ ముద్దే …… , ప్రక్కనే ఒకరున్నారు ముద్దులుపెట్టడమే గగనమైపోయింది – టైం వచ్చినప్పుడు రోజులైనా వదలను …..
పెద్దమ్మ నవ్వులు …… , ఐదుగురు దేవతలలో ఎవరిని ఎక్కువగా తలుచుకుంటున్నావో అందరికీ తెలుసులే ……
అదీ అదీ ……
పెద్దమ్మ : తలుచుకునేది ఏమో ఒకరిని ముద్దులు అడిగేది మరొకరిని ……
సిగ్గుపడ్డాను ……
పెద్దమ్మ : లవ్ టు లవ్ టు కన్నయ్యా ….. , నీ దేవతల అంతులేని ప్రేమ పొందే క్షణం అతి తొందరలోనే ఉందిలే అంటూ నా పెదాలపై ముద్దుపెట్టారు .
మ్మ్ …… నిజమా పెద్దమ్మా అంటూ దిండును గట్టిగా చుట్టేసి సైడ్ కు తిరిగిపడుకున్నాను ) .

కొద్దిసేపటికే ….. ( నేనిచ్చిన టెడ్డీ బేర్ ను హత్తుకుని హాయిగా నిద్రపోతున్న అమ్మకూచీ ముందు ప్రత్యక్షం అయ్యారు అమ్మ – పెద్దమ్మ ……
పెద్దమ్మ : ఫ్రెండ్ ….. ఆ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసుకదా ? .
అమ్మ : తెలుసు తెలుసు ….. , మన ….. కాదు కాదు తన దేవుడు అంటే ఎంత ప్రేమనో చూస్తేనే అర్థమైపోతోంది .
పెద్దమ్మ : నీకోసమే ఎలా ఎదురుచూస్తోందో చూడు ……
అమ్మ : తల్లి పెదాలపై చిరునవ్వులు చూసి చెప్పండి .
పెద్దమ్మ : 50% అమ్మకోసం – 50 % మహేష్ కోసం ……
అమ్మ : కరెక్ట్ గా చెప్పారు …… , తల్లీ …… ఇన్ని సంవత్సరాలూ అమ్మకోసం ఎంత బాధపడ్డావో చూస్తూ నరకాన్ని అనుభవించాను , ఎప్పుడైతే మహేష్ …… నీ జీవితంలోకి వచ్చాడో ఆ క్షణం నుండీ పొందిన ఆనందాలు ముఖ్యంగా ఈరోజు పొందిన ఆనందం …… అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువగా ముద్దుపెట్టారు – అమ్మ ప్రేమను మించిన దేవతల దీవెనలు అందించాడు – అంతకంటే ఒక తల్లికి సంతోషం ఏముంటుంది చెప్పు , బెడ్ పై కూర్చుని పెద్దమ్మను ప్రక్కనే కూర్చోబెట్టుకుని బుజ్జిజానకిని ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చారు – ఆశీర్వదించారు , తనివితీరా బుజ్జిజానకి ఆనందాలను చూసి పరవశించి , పెద్దమ్మా ….. ఇక మహేష్ దగ్గరికి వెళదాము .
పెద్దమ్మ : నవ్వుకుని , అప్పుడేనా అన్నారు .
అమ్మ : ఈ అమ్మకూచీని కంటికి రెప్పలా చూసుకోవడానికి దేవుడు మహేష్ ఉన్నాడు , మరి మహేష్ ను చూసుకోవాల్సింది మనమేకదా ….. అదే అదే దేవతలు కారుణించేంతవరకెలే …….
పెద్దమ్మ : సరిగ్గా చెప్పావు , అప్పుడు మనమేవరో కూడా గుర్తుండమేమో అంటూ నవ్వుకున్నారు .
అమ్మ : అమ్మకూచీ …… ఇలానే సంతోషంగా ఉండాలి .
పెద్దమ్మ : ఫ్రెండ్ …… విరహం తప్పదు .
అమ్మ : పెద్దమ్మా ……
పెద్దమ్మ : చాలా సంవత్సరాలే ఉంటుంది తప్పదు ఫ్రెండ్ …….
అమ్మ : నా మొగుడి వల్లనేనా ? .
పెద్దమ్మ : అవును ఫ్రెండ్ …… , అమ్మకూచీ – మహేష్ ఇద్దరూ వారి వారి గమ్యాలను చేరుకున్నాక కలుస్తారు ఇక అప్పుడు వారిని వేరుచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు , అంతవరకూ కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను కదా ……
అమ్మ : అమ్మకూచీని గుండెల్లో గూడు కట్టుకున్నాడు మహేష్ ……
పెద్దమ్మ : నేనేమీ చేయలేను ఫ్రెండ్ మన్నించు ……
అమ్మ : బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా ….. వెంటనే తీసుకెళ్లండి .

మరుక్షణంలో నాముందు ఉన్నారు , మహేష్ అంటూ ప్రక్కన కూర్చుని నుదుటిపై – కురులపై ప్రాణం కంటే ఎక్కువగా స్పృశిస్తూ ముద్దులతో జోకొడుతున్నారు ) .
*******************

అమ్మా – పెద్దమ్మా …… మళ్లీ వచ్చారా ? అంటూ సడెన్ గా బెడ్ పై లేచి కూర్చుని చుట్టూ చూసాను , అమ్మా – పెద్దమ్మా ….. మీరు మళ్లీ వచ్చారని తెలుసు , ఇదిగో నా నుదుటిపై – బుగ్గలపై అమ్మ ముద్దులు …… , పెదాలపై పెద్దమ్మ ముద్దులు …… ఇప్పటికీ తియ్యదనాన్ని పంచుతూనే ఉన్నాయి , అఅహ్హ్ ….. అంటూ దిండును ఘాడంగా హత్తుకుని ఫీల్ అవుతున్నాను .
బయట అటూ ఇటూ వెళుతున్న వెహికల్ సౌండ్స్ వినిపిస్తుండటంతో టైం ఎంత అయ్యిందబ్బా అంటూ మొబైల్ అందుకుని చూస్తే అప్పుడే 5:30 …… , అవునులే అమ్మ – పెద్దమ్మ ముద్దులలో అలా గడిచిపోయి ఉంటుంది .
అక్కయ్యల నుండి మెసేజస్ ….. ” తమ్ముడూ ….. నీ దేవతలు లేచి రెడీ అయ్యి చెల్లికోసం అన్నిరకాల టిఫిన్స్ రెడీ చేస్తున్నారు ” .
అవునా …… అయితే నేనూ రెడీ అయిపోతాను అంటూ నైట్ డ్రెస్ విప్పేసాను , బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలను తీర్చుకుని ఫ్రెష్ గా స్నానం చేసి కొత్త ప్యాంటు – షర్ట్ మాత్రం నిన్న చక్కగా హ్యాంగర్ కు తగిలించిన బుజ్జిజానకి గిఫ్ట్ నే వేసుకున్నాను , లవ్లీ షర్ట్ అమ్మకూచీ లవ్ యు సో మచ్ ……

మొబైల్ అందుకుని చూస్తే రాత్రే బోలెడన్ని ఫోటోలు వచ్చేసాయి , పరికిణీలో ముద్దొచ్చేస్తున్న బుజ్జిజానకిని మొబైల్ wallpaper గా ఉంచుకుని లవ్ యు అంటూ ముద్దుపెట్టాను .
లవ్ యు అమ్మకూచీ …. నీ అనుమతి – అమ్మ అనుమతి లేకుండా ముద్దుపెట్టాను , ఇంత ముద్దొచ్చేస్తుంటే ఏమి చెయ్యమంటావు మరి ……
బుగ్గపై ముద్దు మరియు పెద్దమ్మ నవ్వులు …… , wait wait …. నవ్వులూ పెద్దమ్మవి కావు – ముద్దూ పెద్దమ్మది కాదు ….. కానీ ఎక్కడో ఆస్వాదించినట్లు తెలిసిపోతోంది , అమ్మ అమ్మ ….. అమ్మ ముద్దు – అమ్మ నవ్వులు ….. అంటే అమ్మ హ్యాపీ అన్నమాట , లవ్ ….. థాంక్యూ థాంక్యూ అమ్మా అంటూ మురిసిపోయాను , మీ సాక్షిగా అంటూ మొబైల్ స్క్రీన్ బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టాను .
పెద్దమ్మా ….. డ్రాయింగ్ ఫైల్ & కలర్స్ …….
బెడ్ పై ప్రత్యక్షం అవ్వడంతో లవ్ యు అంటూ అందుకుని బయటకువెళ్ళాను .

దేవతల దర్శనం …… , బుజ్జిజానకి దగ్గరకు త్వరగా వెళ్లడం కోసం అనుకుంటాను పైకీ కిందకూ – అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు , దేవతల ముఖాలలో అందమైన ఉత్సాహం …… అఅహ్హ్ రెండు కళ్ళూ చాలడం లేదనుకో , అమ్మకూచీ చూసుంటే ఎంత ఆనందించేదో ……
అంతలో ముగ్గురు దేవతలూ ….. త్వరగా త్వరగా అంటూ బయటకు రావడం , పట్టుచీర – నగలలో దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉండటంతో …… సంతోషంలో ప్రామిస్ కూడా మరిచిపోయి గుడ్ మార్నింగ్ దేవతలూ బ్యూటిఫుల్ అంటూ విష్ చేసాను .
నీగురించి తెలుసు ….. నువ్వు మాటమీద నిలబడలేవు అన్నట్లు కోపాలతో చూస్తున్నారు దేవతలు ……

తమ్ముడు తమ్ముడు తమ్ముడు వచ్చాడా అంటూ అక్కయ్యలు వారి వారి ఇంటి బయటకువచ్చారు చిరునవ్వులు చిందిస్తూ …… , గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడూ …… అంటూ చేతులు ఊపుతూ విష్ చేస్తూనే దేవతల దగ్గరకు చేరుకున్నారు .
దేవతల కోపం మరింత పెరిగింది .
అప్పటికిగానీ గుర్తురాలేదు , లవ్ …… sorry sorry sorry దేవ ….. అంటీలూ మిమ్మల్ని దేవతలుగా చూడగానే ప్రామిస్ ఏమిటి నన్ను నేనే మరిచిపోయాను గుర్తుంది గుర్తుంది మన్నించండి అంటూ లెంపలేసుకుని తలదించి గుంజీలు తీస్తున్నాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… నీ దేవతలు నవ్వుతున్నారు నవ్వుతున్నారు …….
ఆశతో చూడగానే దేవతలు అటువైపుకు తిరిగారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ….. ఇంకా నవ్వుతూనే ఉన్నారు .
అంటీలు : కోప్పడుతుంటే నవ్వుతాము అంటున్నారేమిటి ? , నిన్న రాత్రి అంత జరిగాక అల్లరి పిల్లాడిని చూడనైనా చూస్తామా ? .
అక్కయ్యలు : అమ్మలూ ….. అసలు ఏమి జరిగిందంటే …..
నో నో నో అక్కయ్యలూ అంటూ వారించడంతో ఆగిపోయారు – ఫీల్ అవుతున్నారు .
అంటీలు : మాటిచ్చాడు – ప్రామిస్ చేసాడు …… నిలబెట్టుకోమను లేకపోతే ఏమిజరుగుతుందో తెలుసులే ఆ అల్లరి పిల్లాడికి ……
అక్కయ్యలు : ఏమీ చెయ్యలేరు తమ్ముడూ ఎందుకంటే చెల్లి అంటే మాతో సమానం అయిపోయింది నీ దేవతలకు , చెల్లి దగ్గరకు వెళ్లకుండా చెల్లిని చూడకుండా చెల్లిని స్నానం చేయించి రెడీ చెయ్యకుండా ఉండలేరు ……
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ ….. , ఈ విషయం తెలిసిందంటే ఆ అల్లరి పిల్లాడి అల్లరికి అంతే ఉండదు , ఆ మాటతోనే కాస్త కంట్రోల్ లో ఉంటాడు .
అఅహ్హ్ …… ( లవ్ యు లవ్ యు లవ్ యు దేవతలూ అంటూ వెనక్కు తలుపుపైకి వాలిపోయాను ) .
అంటీలు : ఫీల్ అవుతున్నాడు అంటే మన మాటలు విన్నాడా ….. ? , వింటే మాత్రం డేంజర్ …… అమ్మో స్టవ్ పై వంటలు మీరూ లోపలికి రండి అంటూ నావైపుకు చూస్తున్న అక్కయ్యలను లాక్కుని లోపలికివెళ్లిపోయారు .

నా దేవతలకు …… అక్కయ్యలతో సమానం అయిపోయిందన్నమాట అమ్మకూచీ , ఇంతకుమించిన ఆనందం మరొకటి ఏముంటుంది , అమ్మ ఎంత సంతోషిస్తున్నారో , పెద్దమ్మా ….. అమ్మ చూసారా ? .
చెరొక బుగ్గపై చెరొక ముద్దు …… , అమ్మ చూసారు చూసారు అంటూ ఆనందించాను , తలుపు బయట చైర్ వేసుకుని కూర్చున్నాను , దేవతల దర్శనం కోసం పదేపదే చూస్తూ డ్రాయింగ్ ఫైల్ అందుకుని , పరికిణీలోని అమ్మకూచీ ఫోటోలను చూస్తూనే రాత్రి అమ్మ – పెద్దమ్మ ….. వారి అమ్మకూచీని ఆశీర్వదించిన – ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టుట – ప్రాణంలా ముద్దులుపెట్టే అందమైన డ్రాయింగ్స్ ను గీస్తున్నాను , మధ్యమధ్యలో బయటకు వస్తున్న అక్కయ్యలను లోపలికి లాక్కెళ్లిపోతున్న దేవతలను చూసి మురిసిపోతూ నవ్వుకుంటున్నాను .

డ్రాయింగ్స్ బ్యూటిఫుల్ – కలర్ఫుల్ గా పూర్తవ్వడంతో పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
అమ్మ గమనిస్తూనే ఉన్నట్లు నా బుగ్గపై ముద్దు ……
థాంక్యూ అమ్మా ……
సమయం 7 గంటలు అవుతుండగా …… తల్లులూ అన్నీ రెడీ క్యారెజీ కూడా కట్టేసాము , ఆటోలను పిలిస్తే బుజ్జిజానకి దగ్గరకు వెళదాము , మీ కాలేజ్ బ్యాగ్స్ తీసుకోండి .
అక్కయ్యలు : తమ్ముడు ఏర్పాటుచేసిన రేంజ్ రోవర్ ఉండగా ఆటోలు ఎందుకమ్మలూ …….