అంటీలు : ఆ అల్లరి పిల్లాడు ఎక్కితే మేము ఎక్కము .
అసలు ఆ అల్లరి పిల్లాడు ఆర్రేంజ్ చేసిన కారులోనే ఎక్కలేదు అన్నందుకు చాలా ఆనందమే వేస్తోంది , అంటీలూ ….. నేను ఆటోలో వస్తాను .
అంటీలు : నువ్వెలా వస్తే మాకెందుకు ……
అక్కయ్యలు : ఓనర్ కారులోనుండి ఓనర్ నే తోసేసినట్లు ఉంది , తప్పే ….. తమ్ముడిపై కోపంతో మీరు తప్పు చేయకండి – దేవతలు తప్పు చెయ్యకూడదు , ఏమి మాట్లాడాము ….. ఏదైతే ఏమిలే అమ్ములు ఆలోచనలో పడ్డారు అదిచాలు …….
అంటీలు : బుద్ధిగా కూర్చోవాలి – మనవైపుకు తిరగనేకూడదు ……
అక్కయ్యలు : మీరెలా అంటే అలా అంటూ పెద్ద పెద్ద క్యారెజీలు అందుకుని కిందకువస్తుంటే మెయిన్ గేట్ దగ్గర అందుకుని కారులో వెనుక జాగ్రత్తగా ఉంచి , దేవతలకోసం డోర్స్ తెరిచాను , ఆటో ……
అంటీలు : అహహహ ….. ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , చెవులన్నీ మావైపే ఉంటాయి విన్నావుకదా బుద్ధిగా కూర్చో ……
అక్కయ్యలు : నవ్వుకుని , తమ్ముడూ తమ్ముడూ కూర్చో అంటూ ముందు డోర్ తెరిచి వెనుక దేవతలపై కూర్చున్నారు .
లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా కూర్చున్నాను , పట్టుచీరలలో దేవతల సౌందర్యాలను చూడాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నావల్ల కావడం లేదు .
అంతలో వాసంతి అక్కయ్య ….. we know we know అంటూ ముగ్గురు దేవతలు కనిపించేలా మిర్రర్ ను సెట్ చేసి , ఎంజాయ్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవతలు చూసారేమోనని తెగ కంగారుపడిపోయాను .
దేవతలు ….. నావైపే గమనించకపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను – నో మాటలు నో కిస్సెస్ అంటూ అక్కయ్యల వైపు సైగచేసాను మిర్రర్ లో ……
అక్కయ్యలు : నువ్వు మాట్లాడకూడదు అని ప్రామిస్ చేశావుకానీ , మేము మాట్లాడకూడదు అనికానీ – ముద్దులు పెట్టకూడదు అనికానీ లేదుకదా , పైగా నాన్నలకు ప్రాణంలా చూసుకుంటామని మాటిచ్చేసాము మాఇష్టం మేమేమైనా చేస్తాము , మాకు ….. అమ్మలూ – చెల్లీ – తమ్ముడు అందరి సంతోషం కావాలి అంటూ మెసేజ్ చేసి నవ్వుకుంటున్నారు .
చదివి వెంటనే డిలీట్ చేసేశాను ……
అక్కయ్యలు : డిలీట్ చేస్తే మాత్రం మేము ఆగుతామా ఏంటి అంటూ మిర్రర్ ద్వారా ముద్దులుపెడుతున్నారు .
తలదించుకున్నాను మధ్యమధ్యలో దేవతలవైపు చూస్తూ సిస్టర్ పోనివ్వండి అన్నాను .
అంటీలు : సిస్టర్ ….. మా బుజ్జిజానకి కోసం షాపింగ్ చెయ్యాలి దారిలో ఎక్కడైనా జ్యూవెలరీ షాప్ దగ్గర ఆపండి .
అక్కయ్యలు : చెల్లికి గిఫ్ట్స్ …. యాహూ లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ నావైపు చూస్తూనే దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టారు నీముద్దులు అంటూ సైగలుచేసి …..
సంతోషంతో జిళ్ళుమంది ……
అక్కయ్యలు నవ్వుకున్నారు , అమ్మలూ 7:15 అవుతోంది ఈసమయానికి ఏ షాప్ అయినా ఓపెన్ చేస్తారా ? .
అంటీలు : అవునుకదా ఇప్పుడెలా ? .
తలదించుకునే నేను మాట్లాడొచ్చా అంటీలూ ….. ? .
అంటీలు : అవసరమేలేదు , మా బుజ్జిజానకికి మధ్యాహ్నం వచ్చేటప్పుడు గిఫ్ట్స్ తీసుకెళతాములే …….
అక్కయ్యలు : తమ్ముడి వల్ల అవుతుందేమో అమ్మలూ ……
అంటీలు : ఇప్పుడు హెల్ప్ తీసుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడు .
అక్కయ్యలు : అవునవును అదిమాత్రం నిజం ఎందుకంటే మా అమ్మలూ రెడీ మూవీలో జెనీలియా కంటే అందంగా ఉంటారు ……
అంటీలు : పోండి తల్లులూ సిగ్గేస్తోంది .
నిజమే నిజమే అంటూ మిర్రర్ లో మెలికలుతిరుగుతున్న దేవతలను చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడు …. మన మాటలన్నీ వినేస్తున్నాడు .
ఊహూ ఊహూ అంటూ రెండు చెవులనూ మూసుకున్నాను .
అక్కయ్యలు : హ్యాపీనా అమ్మలూ …… , చెల్లికి గిఫ్ట్స్ తీసుకుని వేళదామే ……
అంటీలు : మా బంగారు బుజ్జిజానకి అర్థం చేసుకుంటుంది , ఈ అల్లరి పిల్లాడి సహాయం మాత్రం తీసుకోము అంతే ……
Sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మిర్రర్ లో తెలియజేసారు .
ఉదయమే కావడం – ట్రాఫిక్ లేకపోవడంతో 15 నిమిషాలలో చేరుకున్నాము .
అదేసమయానికి కారులో పెద్దమ్మ – క్యాబ్ లోనుండి బాబుతో మేడమ్ దిగారు .
అక్కయ్యలు : బాబు బాబు బాబు అంటూ దేవతల బుగ్గలపై మరియు దేవతలు చూడకుండా నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి పరుగునవెళ్లి ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
పెద్దమ్మ – దేవతలు ….. వెళ్లి బాబును ముద్దుచేసి ఎత్తుకుని చివరికి అక్కయ్యలకు ఇచ్చి , ఒకరినొకరు కౌగిలించుకొన్నారు , అందరం ఒకేసారి చేరుకున్నాము అంటూ ఆనందిస్తున్నారు .
అక్కయ్యలు : బాబు ఎంత ముద్దొస్తున్నాడో అచ్చు తమ్ముడిలానే అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేస్తున్నారు .
మేడమ్ : బుజ్జి వయసులో ఇలానే ఉండేవాడేమో మహేష్ ……
అంటీలు : ష్ ష్ ష్ చెల్లీ ….. ఇంత చనువిస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటాడు , ఆ అల్లరి పిల్లాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి .
అక్కయ్యలు : అమ్మలూ ….. మీరు దూరం ఉంచారుకదా అంటీకి ఎందుకు చెబుతున్నారు , తమ్ముడూ …… ఎత్తుకోవాలని ఎంత ఆశపడుతున్నావో తెలుసు నీ చేతులు – కళ్ళు చూస్తే అర్థమైపోతోంది అంటూ అందించారు ……
నా బుగ్గపై ముద్దుపెట్టాడు .
అక్కయ్యలు : అమ్మో ….. ఇంతమందిమి ఎత్తుకున్నాము , మేమందరమూ ముద్దులుపెట్టాము తప్పితే ఎవ్వరికీ ముద్దుపెట్టలేదు , తమ్ముడు ఎత్తుకోగానే ముద్దుపెట్టాడు .
నవ్వుకుని పెద్దమ్మా అంటూ జేబులో చేతినిపెట్టి చాక్లెట్ తీసి బాబుకు అందించాను .
బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దు ……
అక్కయ్యలు : అదిగో ముద్దు …….
అంటీలు : చాక్లెట్ ఇస్తే మనకూ ముద్దుపెట్టేవాడు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
అక్కయ్యలు : లేదులేదమ్మా ….. చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడు , అంటీ – దేవతమ్మా ….. మీరు చూశారుకదా ……
మేడమ్ : అవునవును ……
పెద్దమ్మ : లేదు లేదు మీ అమ్ములు చెప్పినదే నిజం అంటూ నావైపు కన్నుకొట్టారు .
అక్కయ్యలు : నిన్నటి నుండీ మీరు అమ్మలకే సపోర్ట్ చేస్తున్నారు దేవతమ్మా ….. , చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడన్నది వాస్తవం …… , కావాలంటే మేము చాక్లెట్ ఇచ్చినా ముద్దులుపెట్టడు చూడండి , తమ్ముడూ ….. ఒక్కటైనా చాక్లెట్ ఉందా ? .
నాలుగు ఉన్నాయని చెప్పండి మేడమ్ ……
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ …… , ఇవ్వుమరి ……
మూడు ఉన్నాయని చెప్పానుకానీ , మీచేతులతో ఇప్పిస్తానని చెప్పలేదని చెప్పండి మేడమ్ ……
అక్కయ్యలు : మరి ఎవరితో …… , అర్థమైంది అర్థమైంది నీ దేవతల చేతులతోనే ఇప్పించు , దేవతలూ దేవతలూ …… దేవతలే సర్వస్వం అంటూ బుంగమూతితో నాచేతులపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ……
అంటీలు : తల్లులూ ……
అక్కయ్యలు : మేము గిళ్లకూడదని ఎక్కడా ప్రామిస్ చేయించలేదు కావాలంటే గుర్తుచేసుకోండి .
అంటీలు : ఆలోచనలో పడ్డారు .
అక్కయ్యలు : ఎంత ఆలోచించినా అదే నిజం …… , ఇదిగో చాక్లెట్ లు ఇవ్వండి అంటూ నాచేతుల్లోనుండి అందుకుని దేవతలు – పెద్దమ్మకు ఇచ్చారు .
అంటీలు – పెద్దమ్మ : ముద్దులతో అందించారు .
దేవతలు – పెద్దమ్మకు ముద్దులుపెట్టాడు .
అక్కయ్యలు : అవును అమ్ములు చెప్పినట్లు చాక్లెట్ ఇస్తే ముద్దులుపెడుతున్నాడు కానీ తమ్ముడికి మాత్రం ముందే ముద్దుపెట్టాడు అంటీ చెప్పండి .
మేడమ్ : నవ్వే సమాధానం అయ్యింది , మీ అమ్మలకు మరింత కోపం తెప్పించడం అవసరమా తల్లులూ అంటూ అక్కయ్య చెవులలో గుసగుసలాడారు .
అక్కయ్యలు : నవ్వుకుని , అంటీ బాబు పేరు అడగలేదు .
మేడమ్ : మీరే చెప్పేస్తారు , మీకు – మీ చెల్లికి ప్రాణమైన పేరు ……
అంటీలు : మహేష్ అనిమాత్రం చెప్ప ……
అక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ….. అందుకేనా అచ్చు ఒకేలా ఉన్నారు అంటూ అందుకుని నావైపు చూస్తూ సున్నితంగా బాబు బుగ్గలపై కొరికేస్తున్నారు .
అంటీ : అందుకేనేమో ఎత్తుకోగానే ముద్దుపెట్టేసాడు – నా బంగారం ……
అక్కయ్యలు : బంగారం ఎవరు అంటీ ? , బాబా ? లేక తమ్ముడా ? .
మేడమ్ : ఇద్దరూ ఒక్కటే కదా ….. , మహేష్ – మహేష్ బంగారం అంటూ నావైపు సంతోషంతో చూస్తున్నారు .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడిని పొగిడింది చాలు , ముందైతే మన బంగారపు బొమ్మ దగ్గరికి వెళదాము .
అంతలో ఇంటినుండి ఇరుగుపొరుగు ఆడవారు అనుకుంటాము ఇంట్లోనుండి బయటకువచ్చారు – మహిని పలకరిద్దామని వస్తే సోఫాలో కూర్చుంది కానీ కళ్ళే తెరవడం లేదు , తన ప్రాణమైన అంటీ – దేవతల్లాంటి అత్తయ్యలు – దేవతమ్మ – అక్కయ్యలు మరియు మరియు ఎవరో అబ్బాయి పేరు ఆ ఆ హీరో పేరు మహేష్ బాబు ….. వారు వస్తేనేకానీ కళ్ళుతెరిచి వాళ్లనే చూడాలని ఆశతో ఎదురుచూస్తోంది , 15 నిమిషాలు అయ్యింది వచ్చి వాళ్లెప్పుడు వస్తారో ఏమిటో తరువాత వద్దాము రండి అంటూ గుసగుసలాడుకుంటూ ఇరువైపులకూ వెళ్లిపోయారు .
అంటీ – దేవతలు – పెద్దమ్మ – అక్కయ్యలు …… ఒక్కసారిగా నవ్వేశారు , sorry లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ – బుజ్జితల్లీ …… అంటూ లోపలికి పరుగులుతీశారు , చివరన అక్కయ్యలు నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి చెల్లీ చెల్లీ చెల్లీ ….. అంటూ బాబును ఎత్తుకుని వెళ్లారు .
అంటీ – అత్తయ్యలూ – దేవతమ్మా – అక్కయ్యలూ …… వచ్చేసారా అంటూ కళ్ళుమూసుకునే గుమ్మం వరకూ వచ్చి , కళ్ళుతెరుస్తున్నాను అంటూ తెరిచి చిరునవ్వులు చిందిస్తూ అందరినీ మనసారా చూసుకుని గుండెలపైకి చేరింది .
లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ – బుజ్జితల్లీ …… ఆలస్యమయ్యింది అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దుచేస్తున్నారు .
బుజ్జిజానకి : ఏమీ పర్లేదు , నా దేవతలకోసం ఎంతసేపైనా కళ్ళుమూసుకునే ఎదురుచూసేదానిని , ఎంత సంతోషంగా ఉందో తెలుసా దేవతలూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ రండి రండి లోపలికి , అక్కయ్యలూ ….. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ……
అమ్మమ్మ : దేవతలూ వచ్చేసారా ….. ? , రండి రండి లోపలికి అంటూ పిలుచుకునివెళ్లారు .
అక్కయ్యలు : గుడ్ మార్నింగ్ చెల్లీ ……
బుజ్జిజానకి : రేయ్ మహేష్ ….. వారం రోజులయ్యింది నిన్నుచూసి అంటూ మెయిన్ గేట్ దగ్గర ఉన్న నావైపుకు ప్రేమతో చూస్తోంది , నేనంటే ఇష్టమేలేదు నీకు రోజూ వస్తానని చెప్పి ఇలాచేస్తావా అంటూ ఆప్యాయంగా మొట్టికాయవేసి ఎత్తుకుని ముద్దుచేస్తోంది నావైపే చూస్తూ ……. , రేయ్ ….. ఐదు చాక్లెట్ లు ……
బుజ్జిజానకితోపాటు అక్కయ్యలకు ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాడు .
బుజ్జిజానకి : మన ఐదుగురికి ఐదు చాక్లెట్ లు అన్నమాట లవ్ యు అంటూ ముద్దుపెట్టింది .
అక్కయ్యలు : అక్కయ్యలూ ….. బాబుకు ముద్దులుపెట్టి , రేయ్ అన్నది ఎవరినో – మొట్టికాయ వేసినది ఎవరినో – ముద్దులు ఎవరికో – లవ్ యు ఎవరికో అర్థంవుతోందిలే చెల్లీ …… మేమెల్లి అమ్మమ్మను పలకరిస్తామమ్మా అంటూ మూసిముసినవ్వులతో లోపలికివెళ్లారు .
