గులాబీ రంగు చనుమొనలతో 5 1

నేను కామినితో చూపులు కలిపాను, ఆమె ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించలేదు. “అది సమస్య కాదు,” అని అన్నాను.

రైతు ఆవు వీపు తట్టింది, అది గడ్డి మేస్తూ తన పని తాను చేసుకుపోతోంది. “ఈ జంతువు కోసం మీరు ఎంత చెల్లించడానికి రెడీగా ఉన్నారు ? మీరు ఒక విదేశీయుడిలా కనిపిస్తున్నారు, కానీ అందమైన వ్యక్తి. మాకు మా స్వంత ధరలు ఉన్నాయి.”

కామిని గొంతు సవరించుకుంది. “నేను అతనితో ఉన్నాను.”

రైతు కామిని వైపు వినయంగా చూసి, ఆపై నా వైపు తిరిగి, తన స్వరం తగ్గించి, “ఆమె మీ ప్రేమికురాళ్లలో ఒకరా ?” అని అడిగింది.

“హ్మ్మ్,” అని నేను మెడ గోక్కున్నాను. మీరు ఇంతకుముందే ఎవరితోనైనా డేటింగ్ మొదలుపెట్టి, మిమ్మల్ని ఎవరైనా, మీరు స్నేహితురాళ్ళా లేదా ప్రేమికులా అని అడిగితె అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఊహించుకోండి. “మేము ఇప్పుడే ఒకరినొకరు కలుసుకోవడం మొదలుపెట్టాము.”

“మీరిద్దరూ ఇప్పటికే చాలా సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుంది,” అని తల్లి అంటూ మరింత లోతుగా కనుక్కోవాలని అనుకుంది.

“కొద్దిగా,” అని అన్నాను. దీనికి పశువులతో ఏమి సంబంధం ఉందో నాకు సరిగ్గా తెలియదు.

“అయితే నేను మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఆమె మీకు సపోర్ట్ చేస్తుందా ?” అని తల్లి సరదాగా అడిగింది.

“అమ్మా ?” అని కూతురు అంటూ కోపంగా ఆమె చేయి లాగింది.

“కొంతవరకు అలాంటిదే… కానీ మీరు అలా చేస్తారని నేను అనుకోను,” అని ఆమెని నిశితంగా చూస్తూ అన్నాను.

“ఎందుకు ?”

“మీరు అలా చేయని మనిషిలా కనిపిస్తున్నారు.”

“మీరు చెప్పేది నిజమే, అయినా మీరు ఇంకా ధర పెంచుతారని ఎదురు చూస్తున్నాను” అని తల్లి నవ్వింది.

“పాడి ఆవుకి ఒక ఔన్సు బంగారం. ఇంకా ఒక డజను గొర్రె పిల్లలకి ఒకటిన్నర ఇస్తాను.”

“అది మంచి ధర, పాడి ఆవు చిన్నది, మీ ఇద్దరికీ చాలా పాలు ఇస్తుంది, మీరు కావాలని అనుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది” అని తల్లి చెప్పింది. ఆమె తన కూతురు వీపు తట్టింది, ఆమె కూతురు కళ్ళు మెరిశాయి.

“సరే,” అని అన్నాను, ఆమె ఏమి సైగ చేస్తుందో నాకు అర్థమైంది. ఇప్పుడే కలిసిన మగాడితో తమ కూతుళ్ళని వెళ్ళమని తల్లులు ప్రోత్సహించడం చూసి నేను మళ్ళీ షాక్ అయ్యాను. వాళ్ళ మగాళ్ల కొరత నేను అనుకున్న దానికన్నా దారుణంగా ఉండాలి.

“అయితే ఏమంటారో చెప్పండి ?” అని తల్లి అడిగింది.

“నేను ఆలోచించాలి, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, ఇంకా కొన్ని వస్తువులు కొనాలి” అని నేను మెడ గోక్కున్నాను. ఆ అమ్మాయి మనోభావాల్ని నేను బాధపెట్టలేదని అనుకున్నాను.

“సరే, మీరు డిసైడ్ అయినప్పుడు, మమ్మల్ని ఎక్కడ కలవాలో మీకు తెలుసు కదా.”

“తప్పకుండా,” అని అన్నాను. నేను నా వాలెట్ మీద దృష్టి పెట్టి, అడ్వాన్స్ చెల్లించడానికి తగినంత డబ్బుని ఎంచుకున్నాను. ఆమె నవ్వుతూ బంగారాన్ని తీసుకుంది, అయితే ఆమె కూతురు కొంచెం నిరాశగా కనిపించింది. ఆమె అందమైన ఎర్రటి జుట్టు, అరుదైన మచ్చలతో నిండిన ఆమె ముఖం నుండి నా కళ్ళు తిప్పడం నాకు కష్టంగా అనిపించింది. ఆమె ఒక అరుదైన రత్నంలా, పరిపూర్ణమైన గృహిణిలా కనిపించింది.

“మీ మ్యాప్ మళ్ళీ చూపించండి, మేము ఎల్లుండి సాయంత్రానికి అక్కడ ఉంటాము” అని ఆ రైతు అంది. నేను ఆమెకి నా మ్యాప్ చూపించాను, ఆమె తన మ్యాప్ మీద నా ద్వీపానికి ఉన్న దూరాన్ని గీయడానికి ముందు తన పొలాన్ని రహస్యంగా మార్క్ చేసింది.

“ఏ సమస్యా ఉండకూడదు,” అని అన్నాను. అప్పుడు నాకు ఒక విధమైన ఉపశమనం కలిగింది, నా బ్లూ రింగ్ అకస్మాత్తుగా మెరిసింది.

“ఒప్పందం కుదిరింది,” అని కామిని గుసగుసలాడింది.

నేను తల ఊపాను, నేను తెలివిలేని విదేశీయుడిలా కనిపించడంలేదని ఆమె అనుకోవడం, ఆమె గొప్ప మనసుని తెలియజేస్తుందని అనుకున్నాను. రైతు యొక్క బ్లూ రింగ్ కూడా మెరవడం నేను గమనించాను, అయితే ఉపశమనం బదులు, ఆమె భుజాల మీద బరువు పడినట్లు అనిపించింది.

“నేను ఇంకా నా చెల్లి కలిసి అతనికి జంతువులని డెలివరీ చేయడానికి వెళ్ళొచ్చా ?” అని ఆమె ఆత్రుతగా తన తల్లిని అడిగింది.

“మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, బంగారం.”

“ప్లీజ్,” అని ఆమె విసిగించింది.

“నేను చెబుతున్నాను కదా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం” అని ఆమె గట్టిగా చెప్పింది.

ఆమె కూతురు నోరు మూసుకుని ఏదో గొణిగింది.

నేను ఆ మహిళకి హ్యాండ్ షేక్ ఇచ్చాను. “నా పేరు రేవంత్.”

“నా పేరు ఝాన్సీ,” అని ఆమె సంతోషంగా నా చేయి అందుకుంది.

ఆమె కూతురు త్వరగా తన చేయి నాకు చాచింది. “లలిత,” అని ఆమె చెప్పింది, ఆమె చేతిని తాకిన వెంటనే, ఆమె బుగ్గలు ఒక ట్యూలిప్ లాగా ఎర్రబడ్డాయి, ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా మెరిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *