“నాకు కనిపిస్తోంది,” అంటూ ఆ ద్వీపం వైపు తల తిప్పాను. మేము రసఖండం నుండి ఎక్కువ దూరంలో లేము, బహుశా రెండు గంటల కంటే కొంచెం ఎక్కువసేపు ప్రయాణించి ఉంటాము. కామిని మొత్తం సమయం నా పక్కనే కూర్చుని జీవితం గురించి మాట్లాడుతోంది.
“వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు తప్పకుండా షాక్ అవుతారు.”
“ఎందుకు ?” అని అడిగాను.
“ఒకసారి ఒక దొంగ ఏదైనా దొంగిలిస్తే, దానిని తిరిగి పొందడం కష్టం.”
“ఇక్కడ తిరగబడటానికి ఎవరూ బలంగా లేరా ?”
“ఊహూ, ఒక్క నువ్వు మాత్రమే” అంది ఆమె.
మేము పడవని ఆపాము. అక్కడొక పొడవైన అమ్మాయి పనిచేస్తోంది. ఆమె నన్ను చూడగానే కళ్ళు పెద్దవి చేసింది. ఆమె నాతో సరసాలాడటానికి సమయం దొరికేలోపే నేను ఆమె వైపు తాడు విసిరాను. ఆమె తాడుని వెంటనే పట్టుకుని క్లీట్ కి కట్టింది. నేను కామినిని నాతో పాటు రేవుకు తీసుకువెళ్లి తల ఊపి ఆమెకి అభివాదం చేశాను. “ఇక్కడ దోపిడీకి గురైన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా ?”
“ఓహ్ అవును, కొన్ని రోజుల క్రితం భయంకరమైన దొంగలు ఇక్కడికి వచ్చి రెండు నిధుల పెట్టెలని దొంగతనం చేశారు” అని పొడవైన అమ్మాయి సమాధానమిచ్చింది.
నేను కామినితో చూపులు కలిపాను, మేము సరైన ద్వీపానికి వచ్చామని నాకు అర్ధమైంది. “మీరు మమ్మల్ని ఆ యజమాని దగ్గరికి తీసుకెళతారా ?”
“తప్పకుండా,” అంది, ఆమె సందేహంగా నేను ఏమి కోరుకుంటున్నానో అని బహుశా ఆలోచిస్తూ.
“ఇక్కడే ఉండు,” అని కామినికి చెప్పాను. నేను తిరిగి పడవలోకి వెళ్లి రెండు నిధుల పెట్టెలని నా చేతుల మీద పెట్టుకున్నాను. నేను రేవులోకి అడుగు పెట్టి వాటిని రెండు పళ్లాల కంటే ఎక్కువ బరువు లేనట్లుగా మోసాను.
ఆ పొడవైన అమ్మాయి నా వైపు చూసి నోరెళ్లబెట్టి చూసింది. “అయ్యా, అది బంగారమా ?”
“అవును,” అన్నాను, ద్వీపం వైపు తల తిప్పాను. “మాకు దారి చూపించు.”
“తప్పకుండా… నన్ను అనుసరించండి.”
ఆమె మమ్మల్ని కొండ పైకి, మరింత దూరంగా గడ్డితో కప్పుకున్న పైకప్పు పాత, ఎర్రటి రంగు వేసిన ఒక చిన్న పొలంలో వున్న ఇంటి వైపు నడిపించింది. నా కనుబొమ్మలు పైకి లేచాయి, ఒక పేద వ్యక్తి యొక్క జీవితకాలపు పొదుపుని ఎవరైనా ఎందుకు దొంగిలిస్తారని ఆశ్చర్యం వేసింది. మేము తలుపు తట్టాము, కొద్దిసేపటి తర్వాత మధ్య వయస్కురాలు బయటికి వచ్చింది. మమ్మల్ని చూడగానే, ముఖ్యంగా నేను నిధుల పెట్టెలను నేల మీద ఉంచిన తర్వాత ఆమె బిగుసుకుపోయింది. ఆమె నన్ను చూసి భయపడినట్లు కనిపించింది.
“నేను ఇంకా నా ప్రేమికురాలు పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు, కొంతమంది దొంగలు నా పడవని దోచుకోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళని పట్టుకుని వాళ్ళు దొంగిలించిన సొత్తుని స్వాధీనం చేసుకున్నాను. మేము దానిని ఇక్కడినుండే దొంగిలించినట్లు కనుక్కున్నాము, రేవులోని అమ్మాయి కూడా దానిని ధృవీకరించింది.”
“గహన,” అని ఆమె గుండె మీద చేయి వేసుకుని అంది. “నా కష్టార్జితమైన జీవితకాలపు పొదుపుని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు.” కానీ ఆమె నిధుల పెట్టెల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆమె నా వైపు పెద్ద కళ్ళతో చూస్తూ, నా శరీరం యొక్క ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తోంది. “మీరు పొడవుగా ఉన్నారు… కండలు తిరిగిన శరీరం.” ఇక్కడి చాలా మంది అమ్మాయిల లాగే ఆమె కూడా నా విషయంలో అలాంటి స్పందననే చూపించింది.
“నా పేరు రేవంత్,” అని చెప్పాను.
“నేను సలోని, లోపలికి రండి, నా కృతజ్ఞతకు చిహ్నంగా మీకు ఏదైనా తినిపిస్తాను” అంది ఆమె.
ఆమె మమ్మల్ని లోపలికి ఆహ్వానించింది. మేము వరండాలో మా బూట్లు ఇంకా కోట్ లని విప్పాము. అది పాతకాలపు కలప ఇల్లు, నడిస్తే శబ్దం చేసే చెక్క నేలతో ఉంది. లోపల కలప యొక్క సహజమైన వాసన, స్వచ్ఛమైన, పూల సువాసన ఉన్నాయి. కిటికీ అంచున, సోఫా పక్కన ఉంచిన అనేక పూల కుండీలని నేను గమనించాను. ఇద్దరు చిన్న అమ్మాయిల చిత్రాలు గోడ మీద వేలాడుతున్నాయి. వాళ్ళు ఆమె కూతుళ్లు అయి ఉంటారని నేను అనుకున్నాను.
“ఈ ఇల్లు నాకు నచ్చింది,” అని కామిని చెబుతూ లోతుగా ఊపిరి పీల్చుకుంది. “నా పాత ఇంటిని గుర్తు చేస్తుంది.”
“నువ్వు అందమైన వ్యక్తితో కలిసి వెళ్ళావు, కదూ ?” అని సలోని నవ్వుతూ అంది.
“దాన్ని ఊహించడం పెద్ద కష్టం కాదు, మేము చాలా త్వరగా ప్రేమికులం అయ్యాము” అని కామిని నవ్వుతూ అంది.
నేను సలోని సంపద వైపు తిరిగి నా చూపుని మరల్చే ముందు కామినితో చిరునవ్వులు పంచుకున్నాను. “పెట్టెలు మోయడానికి మీకు సహాయం కావాలా ?” అని అడిగాను.
“మీరు సహాయం చేస్తే నా అదృష్టం,” అని సలోని అంది.
నేను నిధుల పెట్టెలని పైకి ఎత్తాను, ఆమె ఆశ్చర్యంగా నా చేతులని పరిశీలించింది. “ఆ కండలు చూడండి,” అని సలోని నవ్వుతూ అంది.
“అతను చాలా బలవంతుడు,” అని కామిని అంది.
“దారి చూపించండి,” అన్నాను. సలోని, కామినీలు అలా అనకపోతే అక్కడే నిలబడి నా వైపు అలా చూస్తూ ఉంటారని నాకు అనిపించింది.
సలోని నేల మీది నుండి తివాచీని తీసివేసి, నేలమాళిగకి రహస్య ద్వారం తెరిచింది. ఆమె ముందు మెట్లు దిగి లైట్ వేసింది. “జాగ్రత్తగా ఉండండి,” అని హెచ్చరించింది, “మెట్లు నిటారుగా ఉన్నాయి.”
నేను పెట్టెలని పట్టుకుని జాగ్రత్తగా మెట్లు దిగాను. “నేను వీటిని ఎక్కడ పెట్టాలి ?”
“పర్వాలేదు, మీరు వాటిని తిరిగి తెచ్చారు. అందుకు నేను కృతజ్ఞురాలిని” అని సలోని అంది.
